వికార-నిర్మూలన కొరకు ఖాళీ పెట్టెల ఉపచారము1

రాబోయే ప్రపంచ యుద్ధంలో, అణు వికిరణం కారణంగా లక్షలాది మంది చనిపోతారని  ద్రష్టలైన సంత్‌మహాత్మ్యలు అంచనా వేశారు. భవిష్యత్తులో, ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి మరియు ఆపత్కాలంలో సమాజం అనేక విపత్తులను ఎదుర్కొంటుంది. మనతో సహా కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించడం అత్యవసర పరిస్థితుల్లో పెద్ద సవాలు. ఆపత్కాలంలో, సమాచార మాధ్యమాలు విచ్ఛిన్నమవుతాయి. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లడం,  వైద్యుడిని సంప్రదించడం మరియు మందులు కొనడం కష్టం అఉతుంది. అత్యవసర పరిస్థితులను  ఎదుర్కోవడంలో సహాయపడే  గ్రంథాలను   సనాతన సంస్థ సిద్ధం చేసింది. ఈ గ్రంథాల నుండి నేర్చుకున్న  ఉపచారపద్ధతులు అత్యవసర సమయాల్లో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా సహాయపడుతుంది; ఎందుకంటే, వారు ప్రతి ఒక్కరినీ స్వయం సమృద్ధిగా మరియు ఆత్మ విశ్వాసంతో  ఉండేటట్లు చేయటం వారి ద్యేయం. ప్రస్తుతానికి, ఈ శ్రేణిలో 13 పవిత్ర గ్రంథాలు ఉ న్నాయి. ’ఖాళీ పెట్టెల ఉపచారము’ అనే పుస్తకాన్ని రెండు భాగాలుగా పరిచయం చేస్తున్నారు. ఈ గ్రంథాలలో వివరంగా సమాచారం అందించబడింది.

అనేది పవిత్రమైన గ్రంథము , ఇది ఆపత్కాలంలో మాత్రమే కాకుండా సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది.

 

భూమిపై నిరంతరం వినూత్నమైన ఉపచారా
పద్ధతులను అందించే, ఏకైక పరాత్పర గురువులు డాక్టర్‌ ఆఠవలె !

మనుష్యుడు తరచుగా అనుభవించే శారీరక మరియు మానసిక క్షోభకు కారణం ఆధ్యాత్మిక బాధలు; దీనికి ప్రధాన కారణం దుష్ట శక్తుల వల్ల కలిగే బాధ. ఈ సమస్యను అధిగమించడానికి పరాత్పర గురువులు డాక్టర్‌ ఆఠవలె అనేక వినూత్నమైన ఉపచారపద్ధతులను అందించారు, ఉదా.  పరిస్థితులకు అనుగుణంగా దేవతల పేర్లను మార్చిమార్చి జపించడం, ప్రాణశక్తి ప్రవాహ ఉపచారము అనేక కొత్త ఆధ్యాత్మిక చికిత్సలను రూపొందించారు. ఈ ఉపచారపద్ధతుల నుండి వందలాది మంది సాధకులు ప్రయోజనం పొందారు; ఫలితంగా, పరాత్పర గురువులు డాక్టర్‌ అఠవలె ఖాళీ పెట్టెలను ఉపయోగించి ఆధ్యాత్మిక నివారణలకు సంబంధించిన అనేక ప్రయోగాలు చేసారు, మరియు వ్యక్తిగతానుభవములో తెలుసుకొన్నారు. వందలాది మంది  సాధకులు కూడా ఈ నివారణపై ప్రయోగాలు చేశారు మరియు వారు కూడా ప్రయోజనం పొందారు. ఈ పద్ధతుల నుండి వ్యక్తులు పొందిన ప్రయోజనాలను గ్రహించి, అన్ని అంశాలను వరుస క్రమముగా అందించబడ్డాయి.

ఈ పద్ధతులను విదేశీయులు కూడా అనుసరిస్తున్నారు !

‘బాక్స్‌ థెరపీ’  (రెమెడీ యూసింగ్‌ ఎంప్టీ బాక్సస్‌) వ్యాసం  ‘www.ssrf.org’ – స్పిరిచువల్‌ సైన్స్‌ రిసెర్చ్‌  ఫౌండేషన్‌ ‘ వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా, వివిధ దేశాల్లోని ప్రజలు ఖాళీ పెట్టెల ఉపచారము గురించి తెలుసుకున్నారు మరియు ప్రయోజనం పొందారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఒక పాఠకుడు పొందిన అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాము.

‘ఖాళీ పెట్టెల ఉపచారము చేసిన తరువాత, నా వెనుక నుండి ఏదో బహిష్కరించబడినట్లు నాకు అనిపించింది. ఆ తరువాత, నా తలపై కణితి ఉన్న ప్రదేశంలో పెట్టెను ఉంచి ఉపచారము చేయుట ద్వారా ఆ కణితి తొలగించబడింది.  అలా చేయు సమయంలో, నేను చెఉల దగ్గర నొప్పిని అనుభవించాను మరియు నా శరీరం మొత్తం వణికింది. ఏదేమైనా, మరుసటి రోజు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు అనిపించింది. అందువల్ల, ఈ ఖాళీ పెట్టెల ఉపచారము మార్గదర్శకమైనది అని నేను భావిస్తున్నాను. ’- మిస్టర్‌ సెబాస్టియన్‌ అల్జాండ్రో ఓర్టిజ్‌ (‘ www.ssrf.org ’యొక్క‘ స్పానిష్‌ ఫేస్‌బుక్‌ పేజీ ’నుండి వ్యాఖ్యలు)

ఖాళీ పెట్టెల యొక్క ఈ సులభమైన, కానీ చాలా ప్రభావవంతమైన ఔషధాన్ని  అందించడం ద్వారా మొత్తం మానవాళికి  సహాయం చేసినందుకు పరాత్పర గురుఉలు డాక్టర్‌ అఠవలె గారికి మనము ఋణపడి ఉన్నాము. ఇటువంటి ఋణాలు ఎప్పటికీ తిరిగి చెల్లించలేనివి. ఈ పరిహారంతో మొత్తం మానవాళిని  ఆశీర్వదించినందుకు ఆయన పవిత్ర పాదాలకు కోటి కోటి కృతజ్ఞతలు.

– పూజ్య. శ్రీ . సందీప్‌ ఆళశీ, సనాతన గ్రంథాల సంకలనకర్తలు

ముందుమాట

ఖాళీ పెట్టెలో శూన్యత్వం ఉంటుంది. ఇది  ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. ఆకాశతత్వము  వల్ల ఆధ్యాత్మిక చికిత్స జరుగుతుంది. ఆధ్యాత్మిక నివారణల కోసం ఖాళీ పెట్టెలను ఉపయోగించినప్పుడు, మనిషీ  యొక్క శరీరం, మనస్సు మరియు తెలివితేటలపై ఉన్న నల్లటి వలయం  తొలగించబడుతుంది అదే విధంగా వ్యక్తిని బాధకు గురిచేస్తున్న దుష్ట శక్తిని కూడా శూన్యంలోకి లాగి నాశనం చేస్తుంది . వ్యాధి యొక్క  మూలకారణం నిర్మూలించబడుతున్నందున, వ్యాధిని త్వరగా తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

ఖాళీ పెట్టెల ఉపచారపద్ధతులు చేయడం చాలా సులభం మరియు ఎటువంటి పరిమితులు లేఉ. ఈ పవిత్ర గ్రంథం యొక్క మొదటి భాగంలో ఖాళీ పెట్టెల యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యత,  ఆకారం, కొలతలు, పరిమాణం, రంగు మరియు  పెట్టెలను ఎలా తయారు చేయాలి మొదలైన వాటి గురించి ప్రస్తావించబడింది. రెండవ భాగంలో శరీరంలో ఏ ఏ స్థానాలలో ఉపచారము చేయాలో ప్రస్తావించబడింది.

‘ఈ ఖాళీ పెట్టెల ఉపచారపద్ధతులు చేయడం ద్వారా ఎక్కువ మందికి  వీలైనంత త్వరగా వ్యాధిని నిర్మూలించబడాలని ’. – విశ్వం యొక్క రక్షకుడైన శ్రీ గురువులు మరియు శ్రీ నారాయణుల పవిత్ర పాదాలకు మేము ప్రార్థిస్తున్నాము.

 

1. ఖాళీ పెట్టెలను గురించి ప్రధానమైన వివరణ

1 అ. ఖాళీ పెట్టెల యొక్క కొలతలు ఎలా ఉండాలి ?

1 అ 1. పెట్టె యొక్క కొలతలపై దృష్టికోణం

మానవ శరీరం పంచతత్వంతో తయారైంది – భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. శరీరంలో పంచతత్వ అసమతుల్యత వల్ల అనారోగ్యాలకు దారితీస్తుంది. పంచతత్వము  ప్రకారం పెట్టె యొక్క కొలతలు మారుతూ ఉంటాయి. అనారోగ్యంతో సంబంధం ఉన్న పంచతత్వ మూలకానికి  సంబంధించిన కొలతల పెట్టెను ఉపయోగించడం వల్ల  వ్యాధిని నయం చేయడంలో 100% ప్రభావవంతంగా ఉంటుంది; అయితే, సాధారణ కొలతలు కలిగిన ఖాళీ పెట్టె మరియు ఏదైనా ప్రయోజనం కోసం ఉపయోగించే పెట్టె వల్ల  వ్యాధిని నయం చేయడంలో 70% ప్రభావవంతంగా ఉంటుంది.  నిర్దిష్ట పంచతత్వంతో అనుబంధించబడిన పెట్టె యొక్క పరిమాణం ఎలా ఉండాలి  అనే వివరణ, పవిత్ర గ్రంథంలో పేర్కొనబడింది. ఈ లేఖనములో  సాధారణ ప్రయోజనం కోసం ఉపయోగించ గల పెట్టె యొక్క కొలతలు ఇవ్వబడ్డాయి.

అయినప్పటికీ, వివిధ రుగ్మతలకు అనుగుణంగా వేర్వేరు పరిమాణాల పెట్టెలను తయారు చేయడం సాధ్యం కాకపోతే, అందుబాటులో ఉన్న ఏదైనా పరిమాణాన్ని, ఎలాంటి ప్రయోజనం కోసమైన ఉపయోగించవచ్చు.

1 అ 2. ఏదైనా ప్రయోజనం కోసం సాధారణంగా ఉపయోగించే పెట్ట యొక్క కొలతలు
1 అ 2 అ. పొడఉ, వెడల్పు మరియు లోతు (ఎత్తు) 10: 7: 6 నిష్పత్తిలో ఉండాలి .
1 అ 2 ఆ. పెట్టె యొక్క సాధారణ కొలతలు 25 సెం.మీ. పొడఉ XX 17.5 సెం.మీ. వెడల్పు xx 15 సెం.మీ. లోతు (చిత్రం1 చూడండి) ఉండాలి .

కొలతలలో 10% వైవిధ్యంతో సిద్ధంగా ఉన్న పెట్టె ఆమోదయోగ్యమైనది

(గ్రంథములో చిత్రాలతో పాటు, పెట్టెలను తయారుచేసే విధానం కూడా వివరించబడింది)

1 అ 3. పెద్ద మరియు చిన్న పెట్టెల యొక్క ఉపయోగం

అ. పెద్ద పెట్టె : ఉపచారపద్ధతులు చేసేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు పరుపు చుట్టూ, మీ చుట్టూ పెద్ద పెట్టెలను (సగటు కొలతలు లేదా పెద్దవి) ఉపయోగించాలి.

ఆ. చిన్న పెట్టె : ప్రయాణ సమయంలో ఉపచారపద్ధతులు చేయడానికి, చిన్న పెట్టెలను ఉపయోగించి తలచుట్టూ పెట్టుకోవడానికి తలపాగా లాగా తయారుచేసుకోవాలి.

1 అ 4. పెట్టె పరిమాణం కంటే ’పెట్టెను ఉపయోగించేటప్పుడు ముఖ్యమైనది ఆధ్యాత్మిక భావం’!

పెట్టె పరిమాణంతో సంబంధం లేకుండా, ఖాళీ పెట్టెలను ఉపయోగించి ఉపచారపద్ధతులు చేసేటప్పుడు మనకు ఆధ్యాత్మిక భావం ఉంటే, ఆధ్యాత్మిక చికిత్స జరుగుతుంది. అయినప్పటికీ, సరైన పరిమాణం కలిగిన పెట్టెను ఆధ్యాత్మిక భావంతో ఉపయోగిస్తే, నివారణల ఫలితం ఎక్కువ.

1 ఆ.  సాధ్యమైనంతవరకు, పెట్టె తెల్లగా ఉండాలి.

1 ఇ. పెట్టె యొక్క శూన్యత(ఖాళీ) అది తయారు చేసిన పదార్థం కంటే చాలా ముఖ్యమైనది

ఆపత్కాలంలో, పెట్టెలు అందుబాటులో లేకపోతే, ఇంట్లో ఏది సులభంగా లభిస్తుందో అది, ఒక బక్కెట్‌, పాత్ర, గిన్నె మొదలైనవి, ఆధ్యాత్మిక నివారణలు చేయటానికి ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక చికిత్స కోసం ఏ ఏ శరీర భాగాలలో ఖాళీ పెట్టెలను ఉపయోగించాలి.

 

2 అ. ఆధ్యాత్మిక చికిత్స కోసం శరీరం యొక్క
కుండలినీ చక్రాలపై  ఖాళీ పెట్టెలను ఉపయోగించుట

మానవ శరీరములో కుండలినిచక్రము యొక్క స్థానములు

2 అ 1. శరీరం యొక్క కుండలిని-చక్రాలపై ఖాళీ పెట్టెలను
ఉపయోగించి ఆధ్యాత్మిక ఉపచార చేయుటలో అంతర్లీనంగా ఉన్న శాస్త్రం

విశ్వంలో ఉన్న ప్రాణశక్తి మానవ శరీరంలో కుండలిని-చక్రాల ద్వారా నింపబడి, మరియు చక్రాల మాధ్యమం ద్వారా సంబంధిత అవయవాలకు పంపిణీ చేయబడుతుంది. ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాలు వ్యాధులకు కారణమఉతాయి. అందువల్ల దుష్ట శక్తులు ప్రధానంగా కుండలిని చక్రాలపై దాడి చేసి సమస్యాత్మకమైన శక్తిని అక్కడ నిల్వ చేస్తాయి. కుండలినిచక్రాల స్థానంలో పెట్టెలను నివారణగా ఉంచడం చాలా ముఖ్యం. (కుండలినీచక్రాల స్థానాలతో పాటు, మీరు అనారోగ్య సమస్యలున్న అవయవాల స్థానంలో పెట్టెలను ఉపయోగించి కూడా ఉపచారపద్ధతులు చేయవచ్చు.)

ఖాళీ పెట్టెలను ఉపయోగించి ఆధ్యాత్మిక ఉపచార చేయుట -2

ఖాళీ పెట్టెలను ఉపయోగించి ఆధ్యాత్మిక ఉపచార చేయుట -3

Leave a Comment