వరద బాధితులకు ముఖ్యమైన హెచ్చరిక
భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాలు వరదలకు గురి అయ్యాయి. వేలాది ప్రజల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. వారి నిత్య జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు తగ్గు ముఖం పట్టడంతో వీరు ఇళ్లకు చేరుకుంటున్నారు.
వీరు ఇళ్లకి చేరే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? వారి ఇళ్లను క్రిమి సంహారము ఎలా చేసుకోవాలి ? ఆరోగ్యమును ఎలా కాపాడుకోవాలి ? ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు ఈ దిగువనివ్వబడ్డాయి.
1. ఇల్లు చేరుకునే ముందు ఇది చేయండి !
అ. మీరు మీ గ్రామాలకు వెళ్లడం సురక్షితం అని ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే వెళ్ళండి.
ఆ. మట్టి ఇల్లయితే సురక్షితమూ కాదో తెలుసుకోడానికి నిపుణులని సంప్రదించండి.
ఇ. ఇంటిలో కానీ, చుట్టుపక్కల కానీ తెగిన కరెంటు వైర్లు ముట్టుకోకండి.
2. ఇంటికి వెళ్ళాకా చేయవలసిన పనులు
2 అ. ఇల్లు మరియు వస్తువులు దెబ్బతింటే ఇన్సూరెన్స్ ద్వారా పొందే వివరాలు
1. సామాన్లు శుభ్రం చేసుకునే ముందూ, ఇల్లు మరమ్మతు చేసుకునే ముందుగా ఫొటోలు తీసుకోండి. దీని వల్ల
ఇన్సూరెన్స్ వారి ద్వారా తిరిగి డబ్బు లేదా ప్రభుత్వ సహాయం పొందే అవకాశం ఉంటుంది.
2. ప్రకృతి సిద్ధంగా జరిగిన ఉపద్రవాలకి దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు మరియు కొత్త వస్తువులకు ఇన్సూరెన్స్ కవరు ఉంటే మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ ని సంప్రదించండి.
2 ఆ. విద్యుత్తు మరియు విద్యుత్ పరికరాలకి ఏమి చేయాలి?
1. విద్యుత్ పరికరాలు అనగా ఫానులూ, బట్టలు ఉతికే మిషనులు, స్విచ్ బోర్డులు తడిగా ఉన్నప్పుడు స్విచ్ వేయడం అతి ప్రమాదకరం. విద్యుత్ ఘాతం తగిలే ప్రమాదం ఉంది. ఇల్లు పూర్తిగా ఆరిపోయాకా విద్యుత్ వైర్లు మరియు పరికరాలు ఎలక్ట్రీషియన్ వచ్చి తనిఖీ చేసిన తరవాత సురక్షితం అయితేనే స్విచ్ వేయండి, వాడండి.
2. మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు తడి అయి స్విచ్ ఆఫ్ చేసి ఉంటే బ్యాటరీ లు తీసి విడిగా పెట్టండి.
3. తడిగా ఉన్నాయని ఏ పరికరాలు చెత్త కుండీలో విసిరేయకండి. మరమ్మతు చేయగలరేమో చూడండి.
2 ఇ. ఇంటిని శుభ్రపరుచుట మరియు క్రిమి సంహారము చేసుకోవటం
1. నీరు నిలవ ఉంటే బాక్టీరియా వైరస్ మరియు క్రిమి కీటకాలు చేరతాయి. నేలని సబ్బు నీళ్లతో గాని, లైసోల్ వంటి క్రిమిసంహారక ద్రవం తో గాని ముంచిన తడి గుడ్డ తో శుభ్రం చేసి ఆర పెట్టండి.
2. వేపాకు కర్పూరం తో అని గదుల్లోనూ ధూపం వెయ్యండి. దీని వల్ల రోగాలు రాకుండా ఇల్లు, పరిసరాలు శుభ్రపడతాయి
3. కిటికీలు ద్వారాలు తీసి ఉంచండి. దీనివల్ల గాలి వెలుతురూ ప్రసరించి తడి గోడలు ఆరాతాయి .
2 ఈ. ఇంట్లో సామాన్లు రవాణా చేసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
1. గ్యాస్ సిలెండర్ నుండి గ్యాస్ వెలువడుతోంటే కరెంటు మెయిన్ స్విచ్ ఆపేయండి. సిలెండర్ ని బయట గాలి తగిలేలా ఉంచండి. ఉదాహరణకు డాబా పైన. ఇల్లు ఇంకా గ్యాస్ వాసనా వేస్తుంటే తలుపులు తీసి ఉంచండి. మెయిన్ స్విచ్ వేయకండి.
2. వరద నీటి వల్ల పాములు, తేళ్లు, ఎలుకలు ఇంట్లో చొరబడే అవకాశం ఉంది. చీకటి మరియు చెత్తసామానులు ఉండే ప్రదేశంలో సామాన్లని జాగ్రత్తగా తీయండి. పాములనిను, తేల్లను బయటకు తీయడానికి ప్రాణి మిత్ర అనే వ్యవస్థని సంప్రదించండి.
3. నాచు బారిన ప్రాంతాలనుండి సామానులను తరలించే ముందు బూట్లు చేతికి మోజలను(గ్లోవ్‌జులు) వేసుకోండి. ఎందుకంటే కత్తెర లాంటి పదునైన వస్తువులు నాచులో ఉంటే ప్రమాదం.
4. వరదనీటిలో తడిచి పోయిన చెక్క సామానులు బట్టలు గిన్నెలు శుభ్రంగా కడిగి ఎండబెట్టి వాడుకోండి.
ఇనుపసామానులు, మంచాలూ కుర్చీలనూ శుభ్రం గా తుడిచి తుప్పు పట్టకుండా ఆరపెట్టుకోండి. వేసవి వచ్చాక రంగులు వేయించుకోవచ్చు.
2 ఉ. ఆహరం మరియు నీటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
1. వరదలు వచ్చిన ప్రాంతములోని బావి నీరు త్రాగకండి. అది వ్యాధి పూరితం కావచ్చు
2. ఇంట్లో నిలువ ఉంచిన స్తబ్దత నీరు త్రాగకండి
3. ఏ పాత్రలలో త్రాగే నీరు ఉంచుతారో అవి సబ్బు మరియు శుభ్రమైన నీటితో కడిగి శుభ్రం చేసుకొని పరిశుభ్రమైన వస్త్రముతో తుడుచుకొని అందులో నీరు నింపుకోండి.
4 వంటకి, ముఖం కడుక్కోవడానికి, పళ్ళు తోముకోవడానికి మరియు పుక్కిలించడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. త్రాగు నీరు 10 నిముషాలు మరిగించండి
5. ఆహరం తినే ముందు సబ్బు మరియు నీటితో చేతులు బాగా కడగండి.
6. వరదనీటిలో తడిచిన ఆహరం కానీ వరదనీరు కలిసిన నీళ్లు కానీ తీసుకోకండి. రెఫ్రిజిరేటర్‌లో పెట్టిన ఆహరం తినేముందు అది సురక్షితమా కదా అని నిర్ధారించండి.
3. మీ ఆరోగ్యం మరియు పరుల ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అ. వరదల వల్ల సమాజంలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశం చాలా ఉంది . కలుషితమైన నీరు తాగడం వల్ల పచ్చ కామెర్లు . టైఫాయిడ్, విరేచనాలు లాంటి వ్యాధులు వ్యాపిస్తాయి.
ఆ. దోమలు ఎక్కువవడం చేత డెంగు, మలేరియాలు వ్యాపిస్తాయి . మీ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉంటే దోమతెరలు, మస్కిటో కోయల్సు, అగరవత్తులు వాడండి.
ఇ. మురికి నీటిలో పిల్లలని ఆడనీయకండి.
ఈ. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న మందులు వాడాలంటే అల్లోపతి వైద్య సలహాతీసుకొనండి.
ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగా చూసుకోవటం ఈ పరిస్థితుల్లో ఎంతో అవసరం. ఆరోగ్యం విషయంలో ఏ సలహాయైనా వైద్యులని కానీ గవర్నమెంట్ ఆసుపత్రిని కానీ సంప్రదించండి.
వరదనీరు తగ్గిపోయాక ఇంటిని ఈ క్రింద వివరించిన విధంగా శుద్ధి చేయండి !
సాధకులు వరద నీరు తగ్గాక, ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోండి. ఆ తరువాతనే ఇంటి బయట నిలబడి అన్ని గదులకు జిష్టి తీయండి.
1. కొబ్బరికాయ లేదా నిమ్మకాయ తో జిష్టి తీయడం
వీలైతే వరసగా మూడు రోజులు ఇంటికి కొబ్బరికాయతో జిష్టి తీయండి. కొబ్బరి కాయను రెండు చేతులతో పీచు ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉండే లాగా పట్టుకోండి. ఈ కొబ్బరికాయను ఏంటి క్లాక్ అనగా గడియారానికి వ్యతిరేకంగా ప్రతి గదిలోనూ తిప్పండి. తరవాత ఇంటి బయటకి వెళ్లి కొబ్బరికాయను కొట్టండి లేదా కొబ్బరికాయను నీటిలో వదిలేయండి.
కొబ్బరికాయ తో జిష్టి తీయడం కుదరకపోతే నిమ్మకాయతో తీయండి. ప్రతి గది ముందూ నిలబడి మూడు సార్లు క్లాక్ వైస్ ( గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో ఆ దిశగా ) తరవాత మూడు సార్లు ఏంటి క్లాక్ వైస్ దిశగా తిప్పండి. తరవాత నిమ్మకాయని పాడ వేయండి. నిమ్మకాయ తో జిష్టి తీసేటప్పుడు గది లోపలికి వెళ్లనవసరం లేదు. గది ద్వారం ముందు నిలబడి తీయవచ్చును.
2. జిష్టి తీసాక ఇంటిలో గోమూత్రం చల్లి మరియు
సాత్వికమైన అగరువత్తిని త్రిప్పి ఇంటి శుద్ధి చేయండి.
ముందు వచ్చే విపరీత పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.