ప్రపంచంలో 157 క్రైస్తవ దేశాలు, 52 ముస్లిం దేశాలు, 12 బౌద్ధ దేశాలు, యూదులకు1 దేశం ఉన్నాయి. కాని హిందువులకు ఒక్క దేశం కూడా లేదు. ప్రాచీన కాలంలో హిందువుల ఒక సనాతన దేశం (భారతం) పృథ్వి పై ఉండేది. కాని ఇప్పుడున్న లౌకికవాద (ధర్మనిరపేక్ష) వ్యవస్థలో ధర్మం లేనందువల్ల సమాజం, దేశం మరియు హిందూ ధర్మముల అధఃపతనం చాలా వేగంగా జరుగుతోంది. అన్ని చోట్లలో అధర్మాచరణ, ధర్మద్వేషం, స్వార్థం, అనైతికత, అవినీతి, కులబేధాలు, నేరాలు, నక్సలవాదం మొదలైన సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నిటి వల్ల భారత దేశం అనేది ఒక సమస్య పీడిత, అసురక్షిత దేశంగా తయారయినది. వీటన్నింటికి ఒకటే తరుణోపాయం ‘ధర్మాధిష్ఠిత హిందూ దేశ (సనాతన ధర్మ రాజ్యం) స్థాపన’ మాత్రమే.
హిందూ దేశం: హిందూ ధర్మాధిష్ఠిత రాజ్య వ్యవస్థ !
- ఆదర్శమైన సమాజ వ్యవస్థ ! : ‘హిందూ దేశం’ అఖిల మానవ జాతి యొక్క వ్యావహారిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించే ఒక ఆదర్శ సమాజ వ్యవస్థగా ఉండును.
- ధర్మనిరపేక్షత కాదు ధర్మనిష్ఠ రాజ్య వ్యవస్థ ! : ధర్మం దేశానికి ప్రాణం. ధర్మనిరపేక్ష (లౌకికవాది) రాజ్యవ్యవస్థలో ధర్మం యొక్క అధిష్ఠానం లేకపోవడం వల్ల ప్రజలు నైతికంగా దిగజారుతారు. సనాతన ధర్మం నీతిశాస్త్రం పై ఆధారపడి ఉన్నది. కాబట్టి జీవన శైలిలో ప్రజల నైతికత వర్ధిల్లడానికి ‘హిందూ దేశం’లో సనాతన ధర్మం పై ఆధారపడిన రాజ్య వ్యవస్థ ఉండును.
హిందూ దేశం (సనాతన ధర్మ రాజ్యం) ఇలా ఉంటుంది !
- రాజకీయ నాయకులు : ధర్మపరాయణులు, నీతిమంతులు మరియు సదాచారులై ఉంటారు !
- సమానత్వం : అల్పసంఖ్యాకులను మెప్పించడానికి చేష్టలు ఉండవు. అందరికి ‘సమాన నాగరిక చట్టం’ ఉంటుంది !
- దండనీతి : దొంగలు, అవినీతిపరులకు తక్షణంగా కఠిన శిక్ష ఇవ్వడం వల్ల సమాజ వ్యవస్థ ఉత్తమంగా ఉంటుంది !
- సంరక్షణ : బాహ్య (ఉగ్రవాదులు), ఆంతరిక (నక్సలైట్లు) శత్రువులను మట్టుపెట్టడంతో ప్రజలు సుఖంగా ఉంటారు !
- దేవస్థానాలు : భక్తులే వీటి ట్రస్టీలుగా (విశ్వస్థలుగా) ఉంటారు !
హిందూ దేశ స్థాపనకు సహాయం అందించండి !
- ‘హిందూ దేశ స్థాపన’ కై పాటు పడుతున్న సంస్థల కార్యక్రమాలలో ప్రతి రోజు ఒక గంటైనా పాల్గొనండి !
- ‘హిందూ దేశ-స్థాపన’ కై పాటు పడుతున్న సంస్థలకు మరియు వ్యక్తులకు యథా శక్తి ఆర్ధిక సహాయం చేయండి !
- ‘హిందూ దేశ-స్థాపన’ ఆలోచనలను వెబ్‌సైట్ (ఈ-మెయిల్, ఫేస్‌బుక్) ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయండి !
- ‘సనాతన సంస్థ’ ప్రచురించిన ‘హిందూ దేశ స్థాపన ?’ అనే గ్రంథాన్ని ప్రచారం చేయండి మరియు దానిని ఇతరులకు కూడా కానుకగా ఇవ్వండి !
చదవండి ‘హిందూ జనజాగృతి సమితి’ ప్రచురించిన గ్రంథం ‘హిందూ దేశం ఎందుకు అవసరం ?’