ఆపత్కాలంలో తరించుటకు సాధన నేర్పించే సనాతన సంస్థ !
భాగము8 చదువుటకు సంప్రదించండి. ‘ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత’ భాగము -8
అఖిల మానవాళికి ఆపత్కాలములో
బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము
చేయు ఏకైక పరాత్పర గురువులు డా. జయంత్ బాలాజీ ఆఠవలె !
ఇప్పటివరకు ప్రచురించబడిన ఈ లేఖమాలలో వచ్చిన లేఖనాలలో మనము మన కుటుంబమునకు నిత్య జీవితములో వుపయోగించే వస్తువుల సమాచారం గురించి తెలుసుకున్నాము. దీనికి ముందు లేఖనములో రోజువారీ ఆహారధాన్యములను నిల్వచేసేదాని గురించి తెలుసుకున్నాము. ఈ లేఖనములో ఆరోగ్య పరంగా చేయవలసిన సంసిద్ధతల గురించి తెలుసుకోబోవుచున్నాము.
3. ఆపత్కాలంలో భౌతిక స్థాయిలో చేసుకోవాల్సిన సన్నాహక చర్యలు
3.ఏ. వైద్యులకు ఆసుపత్రులకు కలిగే కొరత
దృష్ట్యా చేసుకోవాల్సిన ఆరోగ్య సంబంధిత సన్నాహాలు(సంసిద్ధత)
3 ఏ.1. ఆపత్కాలానికి ముందే కుటుంబానికి కావలసిన మందులు నిల్వ చేసుకుని పెట్టుకోవడం
వరదలు భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో మందులు మరియు అత్యవసర వస్తువుల సేకరణ కష్టతరమవుతుంది యుద్ధకాలంలో మందులు సైన్యానికి వినియోగించుట కు ప్రాధాన్యత ఇస్తారు దీని వల్ల మందుల కొరత వస్తుంది. అందువల్ల ఆపత్కాలం రాకుండానే అవసరమైన మందులు కుటుంబం కోసం సేకరించడం కీలకం. సాధారణ ఆరోగ్య సమస్యలకు కావలసిన మందులను ఏ పరిమాణం లో కొనాలి అన్న విషయం వైద్యులను అడిగి సంప్రదించండి సాధారణ వ్యాధుల కు కావలసిన ఆయుర్వేదం హోమియోపతి మందుల గురించిన సమాచారం సనాతన టెకస్ట్ సిరీస్ ప్రతికూల సమయాల్లో లైఫ్ లైన్ లో సులభంగా అందుబాటులో ఉన్నాయి. సనాతన సంస్థ ఆయుర్వేద మందుల తయారీ మొదలు పెట్టింది త్వరలో అందుబాటులోకి రాగలవు
3 ఏ 2. ఔషధీకృత మొక్కలను పెంచడం
ఆపత్కాలంలో రాబోయే మందుల కొరత దృష్ట్యా ఔషధీ కృతమైన మొక్కలని మన డాబా లో లేదా పెరడులో పెంచుకుంటే ఎన్నో వ్యాధులను నయం చేసుకొనేందుకు ఉపకరిస్తాయి ఎన్నో వ్యాధులను వీటివల్ల నిరోధించవచ్చు దీని వల్ల మందుల కొరత వల్ల కలిగే బాధను తప్పించుకోవచ్చు.( స్థలం లభ్యత ప్రకారం ఔషధీ కృతమైన మొక్కలు పెంచడం ఎలాగో సనాతన సంస్థ టెకస్ట్ లోస్థలానికి తగినట్టు ఔషధీకృతమైన మొక్కలు పెంచడం ఎలా? ఔషదీకృత మొక్కలు పెంచడం ఎలా చర్చించబడింది.)
3ఏ3. స్థానికంగా లభించే ఔషధీకృత మొక్కల ఉపయోగాలను నిపుణుల నుండి తెలుసుకోండి మరియు వాటిని ఉపయోగించుటకు ప్రయత్నించండి
వాచకం ( అదుల్సా )అనే మొక్క అనగా మలబార్ నట్ తులసి బిల్వం రావి చెట్టు మర్రి చెట్టు వేప పుష్కలంగా ప్రతి చోట ఉంటాయి. పునర్నవ మార్వా గరిక అపామార్గ మొక్క గలగరాకు మొదలైన ఔషధీకృత మొక్కలు సహజంగా పెరుగుతాయి వీటి ఉపయోగాలు సనాతన టెకస్ట్ ఔషధ గుణాలు కలిగినా మొక్కలు వాటి ఉపయోగాలు నుండి తెలుసుకోండి. గృహ వైద్యం గురించిన సమాచారం కూడా ఇందులో అందించబడింది
3 ఏ 4. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మందులు లేకుండానే వైద్యం చేసే పద్ధతులు అనగా
ఉపవాసం సూర్యరశ్మిలో నిలిచి ఉండడం మొదలు పెట్టండి ఇది సనాతన టెకస్ట్ సిరీస్ ఆపత్కాలం లో లైఫ్ లైన్ లో ఇవ్వబడింది
3 ఏ 5. మందుల అవసరం లేకుండా ఆక్యూప్రెజర్, ఎంప్టీ బాక్స్ పరిహారాలు, నామజపం మరియు లేదా ప్రాణశక్తి ప్రవాహం వంటివి నేర్చుకోండి
సనాతన సంస్థ ఈ పద్ధతులన్నీ ప్రచురించింది ఇంకా సమాచారం sanatan.org లో దొరుకుతుంది( మందులు లేకుండా వైద్యం ఉదాహరణకి యోగా వ్యాయామం ప్రాణాయామం, మర్మచికిత్స ( ఆయుర్వేద ఎనర్జీ చికిత్స ) న్యూరో థెరపీ కలర్ థెరపీ మొదలైనవి నేర్చుకొని వాడుకోండి.
3 ఏ 6. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మందులు తీసుకునే బదులు అవి రాకుండా వుండుటకు ఇప్పటినుండే నివారణ చేసుకోండి
దీని వివరాలు సనాతన టెకస్ట్ ‘ఆయుర్వేదాన్ని ఆచరించి ఔషధాలు వాడకుండా నిరోగిగా ఉండండి !’ లో ఇవ్వబడినది
కుటుంబంలో కనీసం ఒక్కరైనా ఫస్ట్ ఎయి్‌డ లేదా ప్రాథమిక చికిత్స లో శిక్షణ పొందండి
గుండెపోటు ప్రమాదాల్లో గాయపడటం రక్తస్రావం జరగడం శరీరం కాలడం స్పృహ తప్పిపోవడంఇలాంటి ప్రమాదాలు ఎవరికైనా జరగవచ్చు.
ఆపత్కాలంలో వైద్యులు లభ్యం కాకపోవచ్చు కాని తాత్కాలిక వైద్య సదుపాయాలను అందించడానికి ప్రాథమిక చికిత్స లేదా ఫస్ట్ ఎయి్‌డ శిక్షణ చాలా ముఖ్యం.
హిందూ జనజాగృతి సమితి ఉచితంగా వివిధమైన ప్రాంతాలలో ప్రాథమిక చికిత్స శిక్షణ ఇస్తోంది ఈ శిక్షణ తరగతులు తీసుకోండి సనాతనః టెకస్ట్ ప్రాథమిక శిక్షణ 3 వాల్యూమ్ లు లో లభ్యమవుతుంది.
కుటుంబంలో కనీసం ఒక్కరైనా ఫైర్ ఫైట్ లేదా అగ్ని మాపకం శిక్షణ పొంది ఉండాలి
ఆపత్కాలంలో బాంబులు లేదా వేరే కారణాల వల్ల అగ్ని చుట్టుముట్టే పరిస్థితులు రావచ్చు. ప్రభుత్వ అగ్నిమాపక దళ సహాయం వెంటనే అందకపోవచ్చు ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవాలంటే అగ్నిమాపక శిక్షణ చాలా ముఖ్యం.
సనాతన టెకస్ట్ అగ్నిమాపక శిక్షణ తరగతులు లభ్యంగా ఉన్నాయి ఉపయోగించుకోండి ఎక్కడైనా శిక్షణా తరగతులు తీసుకోవచ్చు.
స్వీయ రక్షణ లేదా ఆత్మ రక్షణ కోసం మరియు కుటుంబాన్ని
గుండాలు అల్లరి మూకలు నుంచి కాపాడుకోవడానికి ఆత్మరక్షణ టెక్నిక్స్ శిక్షణ
ఇప్పుడు కూడా సగటు మనుషులు అల్లరి మూకలు గుండాలు వంటి సంఘ విద్రోహ శక్తుల వేధింపులకు గురవుతున్నారు. చాలాసార్లు అనర్చె ఇలాంటి పరిస్థితి ఆపత్కాలంలో ఎదురవ్వచ్చు సంఘవిద్రోహ సంఘ వ్యతిరేక శక్తుల వల్ల వచ్చే ముప్పు ఎక్కువ కావచ్చు.
దీనికి పరిహారం గా ఆత్మ సంరక్షణ శిక్షణ పొందడం అవసరం.
ఆత్మ సంరక్షణ శిక్షణా తరగతులను ఉచితంగా హిందూ జనజాగృతి సమితి వారిచే నిర్వహించ బడుతున్నాయి. ఈ తరగతులు నుండి మరియు సనాతన టెకస్ట్ ఆత్మ సంరక్షణ శిక్షణ నుండి ఉపయోగం పొందండి.
ఆపత్కాలంలో తీసుకోవలసిన మరి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు
1. ఆధునిక వైద్య పరికరాలు అవసరంతో కూడిన పనులు లేదా పంటి సమస్యలు వైద్యం ఆపత్కాలం రాకుండానే పూర్తి చేసుకోండి.
2. ఆహారము నీరు విద్యుత్తు వంటగ్యాస్ వేరుశెనగ నూనె అలాంటివి జాగ్రత్తగా పొదుపుగా వాడటం అలవాటు చేసుకోండి.
3. ఆరోగ్యమైన జీవితం గడపడానికి కావలసిన ఆహారము గురించి తెలుసుకొని నిర్దిష్టమైన దినచర్య అలవాటు చేసుకోండి.
4.ఆపత్కాలంలో మీరు చాలా ఇష్టపడే పదార్థాలు మీకు దొరకకపోవచ్చు. ఇప్పటి నుండే మీ ఇష్టాయిష్టాలను పరిమితం చేసుకోవడం ప్రారంభించండి.
5. పట్టణంలో మీకు దుంపకూరలు మాత్రమే లభ్యం కావచ్చు లేదా ఆకలితో ఉండే పరిస్థితి కూడా రావచ్చు అన్ని పర్యవసనాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.
6. ఇప్పటి నుండే వేసవి శీతాకాలం వర్షా కాలానికి తగ్గట్టుగా దుస్తులు ఉపయోగించే అలవాటు చేసుకోండి వేడినీటి స్నానం ఫ్యానులు ఏసీ లేకుండా నిద్ర పో లేకపోవడం ఇలాంటి సౌఖ్యాలను నెమ్మదిగా వదిలి పెట్టడం నేర్చుకోండి.
7. ఆపత్కాలంలో పనికొచ్చే పనులు ఉదాహరణకి బావి నుండి నీళ్ళు తోడడం చేతితో బట్టలు ఉతుక్కోవడం పైకి కిందకి మెట్లు ఎక్కడం దిగడం తక్కువ దూరానికి కార్లకు బదులు సైకిలుమీద వెళ్ళడం లాంటి అలవాటు చేసుకోండి.
8. ప్రతి రోజూ వ్యాయామం చేయండి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కిలోమీటర్లు నడవడం లేదా సూర్యనమస్కారాలు వంటి వ్యాయామం యోగా ప్రాణాయామం చేయండి తద్వారా ఆపత్కాలంలో భౌతిక స్థాయిలో చురుకుగా ఉండండి.
సేకరణ : సనాతన గ్రంథమాలలో ‘ ఆపత్కాలంలో ప్రాణ రక్షణకొరకు చేయబడే సంసిద్ధత’
(ప్రస్తుత లేఖనములో సర్వహక్కులు సనాతన భారతీయ సంస్కృతి సంస్థ వద్ద సురక్షితంగా వున్నాయి)