ఆపత్కాలములో ప్రాణరక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 8

ఆపత్కాలంలో తరించుటకు సాధన నేర్పించే సనాతన సంస్థ !

భాగము 7 చదువుటకు సంప్రదించండి. ‘ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత’ భాగము – 7

 

అఖిల మానవాళికి ఆపత్కాలములో
బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము
చేయు ఏకైక పరాత్పర గురువులు డా. జయంత్‌ బాలాజీ ఆఠవలె !

ఇప్పటివరకు ప్రచురించబడిన ఈ లేఖమాలలో వచ్చిన లేఖనాలలో మనము మన కుటుంబమునకు నిత్య జీవితములో వుపయోగించే వస్తువుల సమాచారం గురించి తెలుసుకున్నాము. ఈ లేఖనములో రోజువారీ ఆహారధాన్యములను నిల్వచేసేదాని గురించి తెలుసుకుందాము. వర్షమునకు ప్రారంభమైనచో కొనిపెట్టుకున్న ధాన్యములను ఎండబెట్టుటకు వీలు కాదు, కాబట్టి పదార్థములు చెడిపోకుండ వుండుటకు ఇతర ఉపాయములు క్రింద ఇవ్వబడినాయి.

 

3. ఆపత్కాలంలో భౌతిక స్థాయిలో చేసుకోవలసిన సన్నద్ధాలు

3 ఎ 1. అన్నము లేకపోవడము వలన ఆకలితో
ఉండకుండా ఉండటానికి ఈ విధంగా చేయండి !

3 ఎ1. కొన్ని నెలలు లేదా సంవత్సరాల కి సరిపడా పొడి ఆహార ధాన్యాలు సేకరించి పెట్టుకోండి లేదా నిల్వ చేసుకోండి

ఆపత్కాలంలో పొడి కిరాణా వస్తువులు లేదా ఆహార ధాన్యాలు లభ్యమవుతాయి. కానీ అవి కొనుగోలు చేయడానికి చాలా రద్దీ ఉంటుంది. అందువలన కిరాణా వస్తువులు లేదా ఆహార ధాన్యాలు త్వరగా అయిపోతాయి. అధికారుల నుండి వచ్చే సరఫరా తగుమాత్రంగా ఉంటుంది. దిక్కుతోచని పరిస్థితి నిరోధించాలంటే తగినంత ఆహారం ద్రవ్యాల నిల్వ చేసుకోవడం అవసరం.

3 ఎ 1 అ. ఏది నిల్వచేసుకోవాలి ఏది నిల్వ చేసుకోకూడదు ?

ధాన్యాలు పప్పులు నెయ్యి నూనె మసాలా ద్రవ్యాలు మొదలైనవి నిల్వ చేసుకోండి ఆయా కాలాలలో లభించే పళ్లను కూరగాయలను నిల్వ చేసుకోవద్దు ఎందుకంటే ఆయుర్వేదం తాజా పండ్లను కూరగాయలను మాత్రమే తినమని చెప్తుంది. వేరే కాలంలో పండే పండ్లు కూరగాయలు పెద్ద మొత్తంలో తినడం వల్ల అనారోగ్యం వస్తుంది అని ఆయుర్వేదం చెబుతోంది.

కూరగాయల పెంపకానికి సంబంధించిన సమాచారము సనాతన టెకస్ట్‌ సిరీస్‌ లో ఇవ్వబడింది.

3 ఎ 1 ఆ. పొడిగా ఉండే ఆహార ద్రవ్యాలు ఎందుకు నిల్వ చేసుకోవాలి ?

1. సేంద్రీయ వ్యవసాయంతో లభ్యమైన ఆహార ద్రవ్యాలు ఆరోగ్యానికి మంచివి. క్రిమిసంహారక మందులు వాడిన ధాన్యం కన్నా ఇవి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.

2. ఆహారధాన్యాలను ఎలుకలు పందికొక్కులు వంటి నష్టం కలిగించే జీవుల బారినుండి ఫంగస్‌ నుండి తెగుళ్ల నుండి కాపాడడం అవసరం.

3. వర్షాకాలంలో గాలి తేమగా ఉండి ఆహార ద్రవ్యాల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది

3 ఎ1 ఇ. ఆహార ధాన్యాలను నిల్వ చేయడం ఇలా చేయండి !

సీనియర్‌ ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ అరుణ్‌ రాఠి (అకోలా మహారాష్ట్ర) ఎంతో కాలం నుండి ఆహార ధాన్యాల నిల్వ చేస్తున్నారు వారు చెప్పిన పద్ధతి ఇలా ఉంది.

3ఎ1ఇ1. ఆహార ధాన్యాలను కొని సూర్యరశ్మి లో ఎండబెట్టడం

అ. ఆహారధాన్యాలను ఏప్రిల్‌ మరియు మే నెలలో కొనుగోలు చేయాలి. వ్యవసాయ దారుల నుండి డైరెక్ట్‌ గా కొనుగోలు చేయండి.

ఆ. ఒకసారి కొన్నాక వాటిని త్వరగా ఎండబెట్టాలి బియ్యం తప్పించి. ఎందుకంటే బియ్యాన్ని ఎండబెడితే పెళుసుగా తయారవుతుంది.

ఇ. ఏ డబ్బాలలో ఆహార ధాన్యాలను నిల్వ చేస్తామో ఆ డబ్బాలను శుభ్రంగా తోమి ఎండబెట్టండి. కనీసం ఎండబెట్టండి లేదా కొద్దిగా వేడి చేసి తేమ ఉండకుండా చూసుకోండి.

ఈ. గోనెల లో నిల్వ చేయాల్సి వస్తే ఆ గోనెసంచులు కొత్తవి అయ్యేలా చూసుకోండి. కొత్తవి లభ్యం కాకపోతే కనీసం పాత వాటిని శుభ్రం చేసి ఎండబెట్టి అప్పుడు వాడండి.

3ఎ1ఇ2. తెగులు(పురుగులు) రాకుండా సమర్థవంతమైన పరిహారం – పొగ(దూపము) బెట్టడం

అ. ఎండిన ఆవుపేడతో తయారు చేసిన పిడకలు, వేప ఆకులు, ఆవాలు, కళ్ళు ఉప్పు, పసుపు ఎండుమిరపకాయలు మిశ్రమం చేసి కర్పూరం తో కలిపి మండించి పొగ పెట్టండి. ఏ డబ్బాల్లో ధాన్యం నిల్వ చేస్తాము ఆ డబ్బాని పొగ పై బోర్లించండి. ఆ డబ్బా పొగతో నిండేలా చూసుకోండి.

ఆ. డబ్బా పొగతో నిండగానే మూత బిగించి 15 నుండి20 నిమిషాలు ఉంచండి. ఈ విధంగా డబ్బాల కి పొగ పెట్టడం చాలా ముఖ్యం. వీటన్నిటిలో ఎండుమిరపకాయలు తెగుళ్ళు రాకుండా కాపాడతాయి.

ఇ. వీలైతే గంధకం, రెజిన్‌,, సుగంధ ద్రవ్యాలు, ఏకోరుస్‌ కాలమస్‌ ( వెఖ్‌ండ ) మిశ్రం చేయండి. ఇవన్నీ కూడా ఆయుర్వేద మందుల షాప్‌ లో దొరుకుతాయి.

ఈ. ఆహార ద్రవ్యాలను నిల్వ చేయడానికి ఒకవేళ సంచులు ఉపయోగించినట్లయితే వాటికి కూడా పొగ పెట్టండి

3ఎ1ఇ3. ఆహార ధాన్యాలను నిల్వ చేయడం.

ఒకవేళ ఆహారాన్ని నిల్వ చేసే డబ్బా అవసరాన్ని మించి పెద్దదిగా ఉంటే ఆహారధాన్యాల ని ప్లాస్టిక్‌ సంచిలో వేసి జాగ్రత్తగా మూసి డబ్బా లో సర్దండి .

ముందు చెప్పిన రీతిలోనే ఆహారాన్ని డబ్బాలో నిల్వ చేయండి.

అ . వేప ఆకులను తేమ పోయేలా సూర్యరశ్మిలో బాగా ఎండబెట్టండి. మాడిపోకుండా చూసుకోండి వేప ఆకులు ఒక వేళ లభ్యం కాకపోతే నిర్గుండి ( వి టెక్స్‌ నిర్గున్దో )ఆకులను వాడండి. వేప ఆకులతో ఎలా చేసారో అలాగే ఈ ఆకులను కూడా వాడండి.

ఆ. డబ్బా నింపే ముందు అడుగున ఎండిన వేప ఆకులు ఉంచండి. ఆకుల పైన కాగితం కానీ ఉతికిన బట్టలు గానీ పరవండి ఒకవేళ తేమ చేరితే కాగితం కానీ బట్ట కానీ తేమను పీల్చుకుంటుంది.

ఇ. డబ్బా నింపేటప్పుడు మధ్య మధ్యలో ఒక కిలో కి నాలుగు లేదా ఐదు మార్కింగ్‌ గింజల్ని ఉంచండి. ఈ గింజలు ఆయుర్వేద మందుల దుకాణాలలో దొరుకుతాయి. ఒకవేళ ఇవి లభ్యం కాకపోతే భీమసేన కర్పూరం బిళ్ళలు ఒక పేపర్లో చుట్టి కేజీకి ఒకటి చొప్పున పెట్టండి.( భీమసేన కర్పూరం సనాతన సంస్థ వస్తు సరఫరా కేంద్రములో దొరుకుతుంది)

ఈ. డబ్బా లేదా గోనెసంచి నింపిన తదుపరి ఒక కాగితం కానీ నూలు బట్ట కానీ పైన ఉంచి వాటి పైన వేపాకులు ఉంచండి.

ఉ. డబ్బా మూత లోపలి భాగంలో ఒక కర్పూరపు బిళ్ళను సెలోఫిన్‌ టేపుతో అతికించండి.

ఊ. గాలి చొరబడకుండా మూత గట్టిగా బిగించండి. మూత బిగుతుగా ఉండడానికి కాగితం లేదా ప్లాస్టిక్‌ కాగితం ఉపయోగించండి.

3ఎ1ఇ4. ఆహార ద్రవ్యాలను నిల్వ చేసిన డబ్బాలను సరి అయిన స్థలంలో ఉంచడం.

అ. ఏ గదిలో అయితే ఆహార పదార్థాలు నిల్వ చేస్తారో ఆ గదిలో వర్షాకాలంలో తేమ చొరబడ కూడదు. ఆహార పదార్థాలను నిల్వ చేసే ముందు గదిని శుభ్రం చేయండి ముందు వివరించిన రీతిలో గదికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పొగ పెట్టి తలుపులు వెయ్యండి. ఆ తర్వాత గదిని క్రమబద్ధంగా వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ ఉండండి.

ఆ. డబ్బాలను నేలమీద ఉంచకండి. నేల మీద కాకుండా చెక్క బల్ల మీద కాని ఒక స్టాండ మీద కానీ ఉంచండి.

ఇ. వీలైతే ఆహారం నిల్వ చేసే గదికి ఒక ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ అమర్చండి.

వైద్య మేఘ రాజ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా(17.7.2020)

3ఎ1ఇ 5. బొద్దింకలను నిర్మూలించే పద్ధతి

ఏవైనా ఈ క్రింది నివారణలు పాటించండి

1. మూడు భాగాల బోరిక్‌ పౌడర్‌ తో ఒక భాగం గోధుమ పిండి ని మిశ్రమం చేయండి. దీనికి కొద్దిగా కాఫీ పొడి కండెన్స్డు మిల్క్మరియు నీరు చేర్చండి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టి ఎండబెట్టండి. వీటిని పగుళ్ళ లో ఉంచండి. వీటిని గది మూలల్లో బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచండి. కాఫీ మరియు కండెన్స్డ్‌ మిల్క్‌ యొక్క వాసన వాటిని ఆకర్షించి బొద్దింకలు ఈ పదార్థాన్ని తినేలా చేస్తుంది. దీనివల్ల బొద్దింకల పునరుత్పత్తి తగ్గిపోతుంది. ఈ ఉండలు చాలా కాలం ఉపయోగించ వచ్చు కానీ అవసరాన్ని బట్టి మారుస్తూ ఉండండి.

డాక్టర్‌ అజయ్‌ జోషి సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా

ఆ. కలరా ఉండాలని ప్రతి మూలా ఉంచండి. బొద్దింకలు కలరా ఉండల వాసనను ఇష్టపడవు. కలరా ఉండాలని తెరిచి పెడితే ఆవిరై పోతాయి. అందువలన ఒక పేపర్‌ తో వాటిని చుట్టి పెట్టండి.

3 ఎ1 ఇ 6 నిల్వ చేసిన ధాన్యముల గురించి జాగ్రత్త పడండి.

అ. నెలకొకసారి ఆహారధాన్యాలను పరీక్షిస్తూ ఉండండి.

ఆ. తడి చేత్తో ఆహారధాన్యాలను ముట్టుకోకండి.

ఇ. దీపావళి తర్వాత వానలు ఉండవు సూర్యరశ్మి కూడా బాగా ఉంటుంది అందువలన ఆహారధాన్యాలను మరొకసారి ఎండబెట్టి నిల్వ చేయండి. ముందు చెప్పిన అలాగే పొగ కూడా పెట్టండి.

3 ఎ1ఈ. ఆహారధాన్యాలను తెగుళ్ల బారినుండి కాపాడడానికి మరిన్ని చర్యలు

ముందుగా పేర్కొనబడ్డ విధానాలన్నీ అన్ని రకాల ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు బెల్లము మసాలా ద్రవ్యాలు పంచదార మొదలైనవి నిల్వ చేసుకునేందుకు ఉపయోగించవచ్చు. తగిన విధంగా ఆహార ధాన్యాల నిల్వ చేసుకుంటే తెగుళ్ళ బారినుంచి కాపాడవచ్చు.

కొకణ వంటి కోస్తా ప్రాంతాలలో గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు పేర్కొనబడ్డ విధంగానే కాకుండా క్రింద ఇవ్వబడ్డ విధానాలను కూడా అవలంబించి ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. దేనికైనా ముందు పొగ పెట్టడం అనేది అతి ముఖ్యమైన విషయం.

3 ఎ1ఈ1 నీటితో శుభ్ర పరుచుకొని ఆహారధాన్యాల విరుగుడు చిట్కాలు

నీటితో శుభ్రం చేసుకొని వండుకునే బియ్యం లేదా పప్పు ధాన్యాలు నిల్వ చేసుకునేందుకు పై పేర్కొన్న ఏ పద్ధతిని పాటించవచ్చు. మనము ఆహారాన్ని శుభ్రం చేసే ముందు తెగుళ్ళ కోసం ఉపయోగించే ముందు నీటితో కొట్టుకుపోతుంది.

అ. బోరిక్‌ పౌడర్‌ని ఆహారధాన్యాల తో చక్కగా మిశ్రమం చేయాలి. 10 కిలోల ఆహార ధాన్యాలకు 10 గ్రాముల బోరిక్‌ పౌడర్‌ సరిపోతుంది. ఆహారధాన్యాలను ఒక పేపర్‌ మీద పరిచి కొద్దికొద్దిగా బోరిక్‌ పౌడర్‌ మిశ్రమం చేయండి.

ఆ. శంఖ జీరా( మెగ్నీషియం సిలికేట్‌) మరియు లైము ( కాల్షియం హైడ్రాక్సైడు )యొక్క మిశ్రమము

మూడు భాగాల శంఖాజీర ఒక భాగము లైము తీసుకునే ఆహార ధాన్యాలతో చక్కగా బోరిక్‌ పౌడర్‌ తో చేసిన విధంగానే మిశ్రమం చేయండి.

ఇవన్నీకూడా ఆయుర్వేద మెడికల్‌ షాప్‌ లో దొరుకుతాయి.

ఈ. బూడిద : బూడిద ప్రత్యేకంగా కందుల కు పెసలకు వాడవచ్చును.

10 కిలోల పప్పు ధాన్యాలకు ఒకటి లేదా ఒకటిన్నర కేజీల బూడిద వాడండి. డబ్బాలో పప్పుధాన్యాలు నిల్వ చేసే ముందు పొరగా ముందుగా బూడిద వేయండి.

తదుపరి పప్పుధాన్యాలు మరియు బూడిద పొరలుపొరలుగా వేయండి. ఆఖరి పొరలో బూడిద ఉండాలి.

3 ఎ 1 ఈ 2. నీటితో శుభ్రం చేయలేని ఆహారధాన్యాల తెగుళ్ళు విరుగుడుకు చిట్కాలు

గోధుమలకు చిరుధాన్యాలకు ఆముదం పట్టించండి. 20 కిలోల గోధుమలకి లేదా చిరుధాన్యాల కు 75 మిల్లీ లీటర్ల ఆముదాన్ని పట్టించండి.

– వైద్యా మేఘరాజ్‌ పరాడ్కర్‌ సనాతన ఆశ్రమము, రామనాథి, గోవా(17.7.2020)
3 ఎ1ఉ. సెమోలినా నూనెలు మసాలా ద్రవ్యాలు కూరగాయలు నిల్వ చేసుకునే విధానాలు

పైన పేర్కొన్న ద్రవ్యాల నీ డబ్బాలలో నిలువ చేసుకునే ముందు పొగ పెట్టడం చాలా ముఖ్యం.q

9అ3. పాయింట్‌ లో చెప్పబడ్డ విధానాలు ముందు చెప్పబోయే ఆహార పదార్థాల నిల్వ చేయడానికి వాడండి

1. సెమోలినా. సెమోలినా ను రిఫ్రిజిరేటర్లో భద్రపరచండి. సెమోలినా ను బయట ఉంచాలి అనుకున్న పక్షంలో దానిని దోరగా వేయించండి. వేయించిన సెమోలినా డబ్బాలో పెట్టి మూత గట్టిగా బిగించండి. వేయించిన సెమోలినా ఆరు ఏడు నెలల పాటు నిల్వ ఉంటుంది.

2. అటుకులు. గాలి చొరబడని డబ్బాలో పెట్టి గట్టిగా మూతను బిగించండి.

3. వేరు శనగ కాయలు. వేరుశెనగ కాయలు అన్ని గుల్లల తో సహా నిల్వ చేసుకోండి. అవసరాలను బట్టి ఉంచుకోండి. ఇలా చేస్తే దాదాపు ఒక సంవత్సర కాలం నిల్వ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే వేరుశెనగ గింజలు కేవలం రెండు లేదా మూడు నెలలు మాత్రమే నిల్వ ఉంటాయి.

4. పంచదార బెల్లం మరియు నూనె

వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. చీమలని నివారించడానికి కర్పూర బిళ్ళనిమూత లోపల సెలోఫిన్‌ టేపుతో అతికించండి. నూనె 6 నెలలో వాడండి లేదా దుర్వాసన రావచ్చు. బెల్లాన్ని అచ్చులుగా విభజించండి 1, 5,. 10 లేదా 20 కిలోలు. దీనిని మరాఠీలో దేప్‌ అంటారు. ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కానీ సంచిలో కానీ జాగ్రత్తగా నిల్వ ఉంచితే 4, 5 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. విరిగిపోయిన చిన్న చిన్న బెల్లం ముక్క లు తొందరగా పాడైపోతాయి. అందువల్ల చిన్నచిన్న బెల్లపుఅచ్చులు కొనుక్కోండి. అవసరానికి తగ్గట్టు వాడుకోండి.

5. ఉప్పు. సాధారణ ఉప్పు ను చైనా పింగాణీ జార్లో గాని గ్లాస్‌ జార్లో గా నిల్వ చేసుకోవచ్చు. జాడీలో పెట్టి మూత పెట్టి ఒక గుడ్డతో వాసె న కట్టండి. తాడుతో కట్టి ముడి వేయండి. ఈ విధంగా ఉప్పు ను నాలుగు లేదా ఐదు సంవత్సరాల నిల్వ చేసుకోవచ్చు. ఉప్పు జోడి మూత ఎప్పుడు తెరిచి ఉంచవద్దు. తేమ గిల్లితే ఎండలో ఆర పెట్టండి.

6. చింతపండు : చింతపండు గింజలు తీసి ఎండలో ఎండబెట్టండి. ఉప్పు రాసి నిల్వ చేసుకోండి.

7. మసాలా ద్రవ్యాలు ఎండలో ఎండబెట్టి గాలిచొరబడని డబ్బాలో పెట్టుకుని మూత గట్టిగా బిగించండి.

8. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ బంగాళాదుంపలు. సరి అయిన విధంగా నిల్వ చేసుకుంటే ఈ ఏడాది లేదా ఏడాదిన్నర నిల్వ చేసుకోవచ్చు. పూర్తిగా ముదిరిన బంగాళాదుంపలు ఉల్లిపాయలు మాత్రమే నిల్వ చేసుకోగలం. వెల్లుల్లిని ఎండబెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉల్లిపాయలు విడివిడిగా ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు గుత్తులు గుత్తులుగా ఉంటే వాటిని వేలాడదీయండి

9. కూరగాయలు ఆకుకూరలు.

9అ. కంద దుంప. కందదుంప ఏడాది పాటు నిల్వ ఉంటుంది. అవసరమైనంత ముక్క ఉపయోగించుకొని మిగిలింది నిల్వ చేసుకోండి మిగిలిన ముక్క ఒక బుట్టలో పెట్టుకుని నిల్వ చేసుకుంటే ఏ సంవత్సరం వరకు ఉంటుంది.

9ఆ. గుమ్మడి కాయ. గుమ్మడికాయ నేలమీద పెట్టకుండా వేలాడదీయండి ఇలా చేస్తే సంవత్సరం వరకు నిలవ చేసుకోవచ్చు.

9ఇ. క్యారెట్‌ మరియు దోసకాయలు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు.

9ఈ. ఆకుకూరలు. తోటకూర కొత్తిమీర పుదీనా మరియు మెంతి కూర. వీటిని కడిగి శుభ్రం చేసుకుని ఎండ పెట్టుకోవచ్చు. పప్పు కూరలు ఆకులు కూడా ఎండబెట్టుకుని నిలువ చేసుకోవచ్చు.

వీటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూత బిగిస్తే ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిలవ చేసుకోవచ్చు. ఇవి లేత గానూ చెమ్మగిల్లి కానీ ఉండకూడదు.

9ఉ. టమాటాలు పచ్చిమామిడికాయలు ఎండిన టమోటా మరియు మామిడి కాయ యొక్క పొడుము ఏడాది పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇది వంటకాలకు జోడిస్తే పుల్ల దనం, రుచి ఇస్తుంది.

శ్రీ. అవినాశ్‌ జాదవ్‌ సనాతన ఆశ్రమం రామనాథి, గోవా(26.6.2020)

9 ఊ. పనస గింజలు.

1. సాంప్రదాయకంగా పనసగింజల ని కడిగి శుభ్రం చేసి ఎండబెట్టి మట్టి పోసి చిన్న గోతిలోకి పెడతారు. పూర్వకాలంలో మట్టి నేలలు ఉండేవి. మట్టి నెలలో చిన్న గొయ్యి తీసి పెట్టడం చాలా తేలికగా ఉండేది.

2. ఈ రోజుల్లో గోతి నుంచి తీసిన గింజలు కానీ రిఫ్రిజిరేటర్‌ నుంచి తీసి కడిగి శుభ్రం చేసుకొని ఉడకబెట్టుకుని కానీ వేయించుకుని కానీ తినవచ్చు.

వైద్య మేఘరాజ్‌ మాధవ్‌ పరాడ్కర్‌ సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా(17.7.2020)

(ప్రస్తుత లేఖనములో సర్వహక్కులు సనాతన భారతీయ సంస్కృతి సంస్థ వద్ద సురక్షితంగా వున్నాయి)

Leave a Comment