1. దత్త జయంతి
మార్గశిరపౌర్ణిమ రోజున మగ నక్షత్రముపై సాయంత్రము దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకని ఈ రోజున భక్తులు శ్రీ దత్తజయంతి ఉత్సవాన్ని దత్తాత్రేయక్షేత్రములలో ఆచరిస్తారు.
అ. దత్త జయంతి యొక్క మహత్వము
దత్తజయంతి రోజున దత్తతత్వము పథ్విపై ఇతర రోజుల కంటే 1000రెట్లు అధికంగా కార్యనిరతమై వుంటుంది. కాబట్టి ఈ రోజున ‘శ్రీ గురుదేవ దత్త’ నామజపము మనస్సు పూర్తిగా చేసినచో దత్తతత్వము ఎక్కువ శాతములో లభిస్తుంది. మహారాష్ర్టలో ఉండే ఔదుంబర, నర్సోబావాడి, గాణ్‌గాపూర్ మొదలగుు ‘దత్త’ క్షేత్రాలలో ఈ ఉత్సవానికి ప్రత్యేక మహత్వమున్నది. అలాగే ఆంధ్రరాష్ర్టములో పిఠాపురము అను ‘దత్త’ క్షేత్రములో ఈ ఉత్సవాన్ని జరుపుకొనుటకు ప్రత్యేక మహత్వమున్నది.
2. జన్మ ఇతిహాసము
అ. పురాణలనుసారము
ఒకసారి అత్రిఋషి భార్యయైన అనుసూయాదేవి పాతివ్రత్యమును పరిక్షించుటకు బ్రహ్మ, విష్ణూ, మహేశ్వరులు వెళ్లియుండిరి, ఆమె పాతివ్రత్య మహిమచే, వాళ్ల అంశముల నుండి ముగు్గురు పసిపిల్లలు నిర్మాణమైనారు. వారిలో శ్రీవిష్ణూవు అంశనుండి దత్తాత్రేయుని జన్మ జరిగినది. పురాణములోని ఈ కథ చాలామందికి తెలిసియుండును. అధ్యాత్మశాస్త్రాను సారంగా దీని భావార్థము క్రింద ఇవ్వబడినది.
‘అ’ అనగా లేదు (‘అ’ ఇది నకారార్థక అవ్యయము), ‘త్రి’ అనగా త్రిపుటి; అత్రి అనగా జాగుృత-స్వప్న-సుషూప్తి, సత్వ- రజ-తమ మరియు ధ్యాత-ధ్యేయ-ధ్యానము ఇలాంటి త్రిపుటి లేనటువంటివాడు. ఇలాంటి అత్రి బుద్ధి అసూయ రహితమై ఉంటుంది, అనగా కామ, క్రోధ, షట్కర్మల రహితంగా పరిశుద్ధంగా వుండును. ఆమెనే అనసూయా అని అంటారు. ఇలాంటి శుద్ధ బుద్ధి సంకల్పము నుండే దత్తాత్రేయుని జన్మ జరిగినది.
3. ‘శ్రీ గురుదేవ దత్త’ నామజపము ఎందుకు చేయవలెను ?
1.‘శ్రీ గురుదేవ దత్త’ నామజపము చేయుట వలన లింగదేహమునకు మరియు పూర్వీకులకు సద్గతి దొరుకుతుంది.
2. దత్త నామజపము వలన అసంతృప్త పూర్వీకుల ఇబ్బందుల నుండి రక్షణ జరుగుతుంది.
ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు చేయవలసిన నామజపము
దత్తాత్రేయుని నామజపము ఎంత సమయము చేయవలెనో అంత సమయము చేసిన తరువాత మిగిలిన సమయమంత ఆధ్యాత్మిక ప్రగతి కొరకు కులదేవత నామజపము చేయవలెను. ఎందుకంటే కులదేవత యొక్క నామజపము ద్వారా ఆధ్యాత్మిక మరియు వ్యవహారిక ప్రగతి అవుతుంది.
4. కులదేవత నామజపము చేయు పద్ధతి
ఉదా. కులదేవత (ఇలవెల్పు) గణేశుడైనటై ్లతే ‘శ్రీ గణే శాయ నమః’, కులదేవి భవానీ అయితే శ్రీ భవానై ్య నమః అని చెప్పటం కఠినము కాబట్టి ‘దేవైై ్య’ అను ప్రత్యయము పెట్టి ‘శ్రీ భవానిదేవ్యు నమః.’, ఇలవెల్పు వెంకటేశుడైతే ’శ్రీ వెంకటేశాయ నమః’, శ్రీ లక్ష్మీనరసింహుడైతే ‘శ్రీ లక్ష్మీనరసింహాయ నమః’, శ్రీ లక్ష్మీదేవి వుంటే ‘శ్రీ లక్ష్మీదేవ్యు నమః’ అని పలకాలి.
కులదేవత తెలియకున్నచో ‘శ్రీ కులదేవతాయై నమః’ అని నామజపము చేయాలి. అది పూర్తి కాగనే, కులదేవత యొక్క పేరు చెప్పేవారు కలుస్తారు. కులదేవత యొక్క నామజపము పూర్తి కాగనే, గురువులు సాధకుల జీవితములో వచ్చి గురుమంత్రము బోధిస్తారు.- ఈ విషయములో క్లుప్తంగా సనాతన లఘుగ్రంథము ‘నామజపము ఏది మరియు ఎందుకు చేయాలి?’ తప్పకుండచదవండి.)
Supar