దత్తత్రేయుడి ఉపాసన

దత్తాత్రేయుని ఉపాసనలో నిత్యము చేయు కొన్ని కృతులు

ప్రతిఒక్క దేవునికి విశిష్టమైన ఉపాసన శాస్త్రము ఉన్నది. అంటే ప్రతిఒక్క దేవుని ఉపాసన అంతర్గ తంగా ప్రతిఒక్క కృతి విశిష్ట మైన పద్ధతిలో చేయుటమనే శాస్త్రమున్నది. ఇలాంటి కృతి వలన ఉపాసకునికి ఆ దేవుని తత్వము ఎక్కువగా లభించుటకు సహాయమవుతుంది. దత్తాత్రేయుని ఉపాసనలో నిత్యం చేయు కృతులు నిర్దిష్టంగా ఎలా చేయవలెనో, దాని గురించి సనాతన సాధకులకు సాక్షాత్తుగా భగవంతుని కృప ద్వారా లభించిన జ్ఞానము పట్టికలో ఇవ్వడమైనది. ఇలాంటి అనేక కృతుల వెనుకటి శాస్త్రమును సనాతన గ్రంథమాలిక ‘ధార్మిక కృతులు’ ఇందులో ఇవ్వబడినది.

ఉపాసన కృతి భగవంతుని కృప ద్వారా లభించిన జ్ఞానము
1. దత్తాత్రేయుని పూజకు పూర్వము ఉపాసకుడు స్వయానికి గంధము ఎలా పెట్టుకోవాలి? అనామిక వ్రేలుతో శ్రీ విష్ణువులాగ నిలువ రెండు రేఖల గంధము పెట్టుకోవాలి.
2. దత్తాత్రేయునికి గంధము ఏ వ్రేలుతో పెట్టాలి? అనామిక వ్రేలుతో(చిటికెన వ్రేలు దగ్గరగా వున్న వ్రేలుతో)
3. పూవ్వులు సమర్పించుట

అ. ఏ పూవ్వులు సమర్పించాలి?

ఆ. సంఖ్య ఎంత ఉండాలి?

ఇ. పువ్వులను ఏ పద్ధతిలో సమర్పించాలి?

ఈ. పువ్వులను ఏ ఆకారములో సమర్పించాలి?

సన్నజాజి మరియు నిశిగంధముఏడు లేదా ఏడింటిలో

పువ్వుల కాడను దేవునివైపు చేసి సమర్పించాలి.

ఖాళీగా వున్న శంకరపాలీలలాగా

4. ఊదుబత్తి తిప్పుట

అ. తారక ఉపాసనకొరకు ఏ గంధము యొక్క ఊదుబత్తి?

ఆ. మారక ఉపాసనకొరకు ఏ గంధము యొక్క ఊదుబత్తి?

ఇ. సంఖ్య ఎంత వుండాలి ?

ఈ. త్రిప్పే పద్ధతి ఎలా వుండాలి ?

చందనము, కేవడా, మల్లే, సన్నజాజి లేదా అంబర్‌

హీన

రెండు

కుడిచేతి యొక్క చూపుడు వ్రేలు మరియు బొటనవ్రేలుతో ఊదుబత్తిలను పట్టుకొని గడియారము కాడ తిరిగే దిశలో పూర్తి వర్తులాకృతి పద్ధతిలో మూడు సార్లు తిప్పాలి.

5. ఏ గంధము గల అత్తరును సమర్పించాలి ? వేర్లు
6. దత్తాత్రేయునికి ఎన్ని ప్రదక్షణాలు వేయాలి ? ఏడు

అ. పాదుక మరియు ఔదుంబర వృక్ష వీటి పూజ : కొన్ని చోట్లలో సగుణ మూర్తి కంటే పాదుకలు మరియు ఔదుంబర వృక్షములు వీటిని పూజిస్తారు.

ఆ. సత్యదత్తపూజ (సత్యనారాయణ పూజలాంటిది).

ఇ. గురుచరిత్ర పారాయణ : దత్తాత్రేయుని భక్తులు గురుచరిత్రను చదువుట, పఠనము, మరియు శ్రవణములను భక్తిభావముతో చేస్తారు.

దేవతా తత్త్వము నిరంతరము లభించుటకు దేవతా ఉపాసన కూడా నిరంతరముగా జరగువలెను మరియు ఇలా ఎల్లప్పుడూ జరిగే ఉపాసన ఒక్కటే అది నామజపం. దత్తాత్రేయునికి అనేక నామములున్నాయి. ‘శ్రీ గురుదేవ దత్త’, అనే దత్త నామజపము విశేషంగా ప్రఖ్యాతమైనది. దత్త ఉపాసన చేయువారు ‘శ్రీ గురదేవ దత్త ’ ఈ నామమును జపించవలెను ఎల్లప్పుడూ చేయవలెను.

దత్తాత్రేయునికి చేయవలసిన కొన్ని ప్రార్థనలు

1. ఓ దత్తాత్రేయ, నీవు ఎలా 24 గుణగురువులను చేసుకున్నావో అలా అందరిలోని మంచి గుణములను నాలో అలవరచుకునే ప్రవృత్తిని కలిగించు, ఇదే ప్రార్థన.

2. ఓ దత్తాత్రేయ, భువర్లోకములో చిక్కుకుని ఉన్న నా అసంతృప్త పూర్వీకులకు గతిని ప్రసాదించు.

3. ఓ దత్తాత్రేయ, అసంతృప్త పూర్వీకుల ఇబ్బందుల నుండి నువ్వే నన్ను రక్షించు. నా చుట్టూ నీ సంరక్షణ కవచము ఎల్లప్పుడూ ఉండనివ్వు, ఇదే నీ చరణాల యందు ప్రార్థన.

కాలానుసారంగా అవసరమైన ఉపాసన

1. దత్తుని ఉపాసన గురించి సమాజానికి ధర్మశిక్షణ ఇవ్వడం

చాలా మంది హిందువులకు తమ దేవతలు, ఆచారము, సంస్కారము, పండుగ మొదలగు వాటి గురించి గౌరవము మరియు శ్రద్ధ ఉంటుంది; కానీ చాలా మందికి ఉపాసన యొక్క ధర్మశాస్త్రము తెలిసియుండదు. శాస్త్రమును తెలుసుకొని సరైన పద్ధతిలో ధర్మాచరణ చేయడం ద్వారా ఎక్కువ ఫలం లభించును. అందువలన దత్తుని ఉపాసనలో అంతర్భూతమైన వివిధ కృతులను చేసే సరైన పద్ధతి మరియు వాటి శాస్త్రము వీటి గురించి సమాజానికి ధర్మశిక్షణ ఇచ్చుటకు యథాశక్తి ప్రయత్నించడం దత్త భక్తులకు కాలానుసారంగా అవసరమైనటువంటి శ్రేష్ఠ స్థాయికి సంబందించిన సమష్టి సాధన.

దత్తుని ఉపాసనలోని కృతుల సరైన పద్ధతి మరియు వాటి శాస్త్రము గురించి సనాతన సంస్థ గ్రంథము, లఘు గ్రంథము, సీడీ మరియు ధర్మశిక్షణ ఫలకములను తయారు చేసింది. వీటి గురించి మీకు తెలిసిన దత్తభక్తులు మరియు దత్తాత్రేయ దేవస్థాన సమితి కార్యకర్తలు మొ.. వారికి సనాతన గ్రంథములు, లఘుగ్రంథములు మరియు సీడీల ద్వారా తెలియ చేయవచ్చును. కేబల్‌ ద్వారా సనాతన నిర్మించిన వీడియో సీడీల ప్రసారణ నుండి కూడా సమాజములో వ్యాపక స్థాయిలో ధర్మశిక్షణ ఇవ్వవచ్చును.

2. దేవస్థానముల పవిత్రతను కాపాడుట మరియు దీని గురించి తెలియజేయుట

దత్తాత్రేయ, అలాగే ఇతర దేవతల దేవస్థానములలో జరిగే అపప్రకారములను ఆపవలెను.

అ. దర్శనం కొరకు హడావిడి చేయకూడదు. వరసులో మరియు శాంతిగా దర్శనము పొందవలెను. శాంతగా, భావపూర్ణంగా దర్శించుకోవడం వలన నిజమైన లాభమగును.

ఆ. దేవస్థానములో లేదా గర్భగుడిలో గట్టిగా మాటలాడ కూడదు. ఇలా చేయడం వలన దేవస్థానములోని సాత్త్వికత తగ్గును, అలాగే అక్కడ దర్శించుకునే, నామజపం చేయు లేదా ధ్యానం చేస్తున్న భక్తులకు కూడా దీని నుండి ఇబ్బంది అగును.

ఇ. కొన్ని సార్లు దేవుని ఎదుట డబ్బులను సమర్పించమని ఒత్తిడి పరుస్తారు. అప్పుడు నమ్రతతో లేదని చెప్పండి.

ఈ. దేవస్థాన పరిసరాలను శుభ్రంగా ఉంచండి. పరిసరాల్లో ప్రసాదము ప్యాకెట్‌, కొబ్బరికాయి చిప్పులు మొ.. కనిపించినట్లైతే వెంటనే తీసి చెత్తకుండీలో వేయండి.

దేవస్థానములో సాత్త్వికత ఉండేటట్లు జాగ్రత్త పడడం ప్రతి భక్తుని కర్తవ్యం; అందువలన పైన చెప్పిన అపప్రకారముల గురించి దేవస్థానమునకు వచ్చే భక్తులు, అలాగే దేవస్థాన పంతులు, విశ్వస్థులు మొ.. వారికి తెలియజేయండి.

సేకరణ : సనాతన ప్రచురణ ‘దత్త’

Leave a Comment