దేవాలయములోకి ప్రవేశించేటప్పుడు మెట్లకు ఏ విధంగా నమస్కరించవలెను ?

దేవాలయములోకి ప్రవేశించేటప్పుడు మెట్లకు నమస్కరించి లోనికి వెళ్ళవలసి వుంటుంది, ఇది అందరికి తెలిసిన విషయమే; కాని ఈ నమస్కారము ఎందుకు మరియు ఎలా చేయాలో ఈ జ్ఞానము దర్శనార్థులకు తెలియకపోవచ్చు. ఈ లేఖనమును చదివి మనము కూడ సరియైన పద్ధతిలో నమస్కరిద్దాం మరియు దీనిని అందరికి తెలియపరచగలరని విన్నపము !

 

1. కృతి

కుడి చేతి వేళ్లతో మెట్లను తాకి అదే చెయ్యితో తలపై నిమరవలెను.

దేవాలయము యొక్క మెట్లకు నమస్కరించుట

 

2. శాస్త్రము

దేవునితరంగాల సంచారమునుండి దేవస్థాన ప్రాంగణములో సాత్వికత పెరిగి ఉంటుంది. పరిసరాలలో ఉండే చైతన్యం నుండి మెట్లకు కూడా దైవత్వం ప్రాప్తిస్తుంది. కావున దేవస్థాన మెట్లను కుడిచేతి వేళ్లతో తాకి అదే చెయ్యితో తలపై నిమిరే పద్ధతి ఉంది. దేవస్థాన మెట్లపై ఉండే దూళి కూడా చైతన్యమయమై ఉంటుంది మేము దాని గౌరవమును కాపాడవలెనని మరియు దానిలోని చైతన్య లాభమును పొందవలెనని దీనినుండి తెలుస్తుంది. నమస్కరించునప్పుడు మెట్లలోని ‘దేవుని చైతన్యము చెయ్యి ద్వారా పూర్తి శరీరములో సంక్రమిస్తున్నది’ అనే భావముంటే జీవమునకు ఎక్కువ లాభమవుతుంది. జీవుని అహంభావము తక్కువగా ఉంటే నమస్కారము నుండి ఇంకా ఎక్కువ ఫలము దొరుకుతుంది. ఏ కృతినైనా చేయునప్పుడు ‘అహంభావము’ త్యాగము చేస్తే అది అకర్మకర్మ అవుతుంది.

పరత్పర గురువులు డా. ఆఠవలె : ఒక చెయ్యితో నమస్కారము చేయకూడదని శాస్త్రములలో చెప్పబడినది. అయితే మీరిచ్చిన వివరణలో దేవాలయ మెట్లకు ఒక చేతితో నమస్కరించాలని ఉంది. ఎందుకిలా ? (పెద్దవారికి నమస్కరిస్తున్నప్పుడు ఒక చేతితో నమస్కరించడము అయోగ్యము, అయితే దేవాలయ మెట్లు ఎక్కేటప్పుడు ఒక చెయ్యితో నమస్కరించడము అనుకూలత దృష్టి నుండి యోగ్యము)

సమాధానము : ఇతర స్థలాలతో పోల్చినచో దేవాలయ పరిసరాలయందు అధికంగా సాత్వికత ఉండుట వలన అక్కడ ఏ కర్మనైనను భావరహితంగా చేసినా కూడా కొంతైనా సాత్వికత యొక్క లాభము పొందుతాము. దేవాలయమెట్లు ఎక్కుతూ మెట్లను తాకి నమస్కరించడము; ఇది శరీరము అదుపు తప్పకుండా తక్కువ సమయంలో చేసే ఒక సాత్విక కృతి. మెట్లను ఎక్కడమనే రజోగుణ కృతి వలన జీవుని శరీరములోని రజోగుణము కార్యనిరతమై ఉంటుంది. ఒక చేతితో అంటే కుడిచేతి వేళ్లతో మెట్లను తాకుట వలన చైతన్యవంతమైన భూమిలోని సాత్విక మరియు శాంతి తరంగాలు చేతి వేళ్ల నుండి శరీరంలో సంక్రమిస్తాయి.

ఒక విధంగా దీని నుండి జీవుని శరీరంలోని రజోగుణము పై సూర్యనాడి ద్వారా నియంత్రణ ఎల్లప్పుడూ చేయబడుతుంది, అంటే సూర్యనాడి కార్యమును క్షణికంగా శాంతపరుచుటకు సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ నుండి జీవమునకు రజోగుణము నుండి కూడా సాత్వికతను ఎలా పెంచుకొనుటయో నేర్పబడుతుంది. అందువలన ఆయా సమయాలలో ఆయా కృతులు చేయడము మంచిది. దీనికి విరుద్ధంగా పెద్దలకు నమస్కరిస్తున్నప్పుడు ఒకచెయ్యితో నమస్కరించుట మూర్ఖకత్వము. కావున సందర్బానుసారంగా మంచి కృతిని చేయవలెను. మెట్లను ఎక్కుతున్నప్పుడు ఒకవేళ భావపూర్ణంగా ఎక్కితే అప్పుడు నమస్కారము చేయక పోయిననూ చైతన్యము యొక్క లాభమగును.

– ఒక విద్వాంసుడు శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ గారి ద్వారా 8.7.2005 మ 3.15

 సందర్భము : సనాతన లఘుగ్రంథము ‘నమస్కారముల సరియైన పద్ధతి’

Leave a Comment