ఆపత్కాలములో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 7

అఖిల మానవాళికి ఆపత్కాలములో ప్రాణాలతో బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము చేయు ఏకైక పరాత్పర గురువు డా. జయంత్‌ బాళాజి ఆఠవలె !

ఇప్పటివరకు ప్రచురించబడిన ఈ లేఖమాలలో వచ్చిన లేఖనాలలో మనము మన కుటుంబమునకు నిత్య జీవితములో వుపయోగించే వస్తువుల గురించి తెలుసుకున్నాము. ఈ లేఖనములో రోజువారీ ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయంగా వాడగలిగే వస్తువుల గురించి క్రింద ఇవ్వబడింది.

3. ఆపత్కాలమును ఎదుర్కొనుటకు ప్రతి దినము  తీసుకోవలసిన చర్యలు

3 ఊ. రోజువారీ ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయ ప్రణాళిక

ఆపత్కాలంలో అంగడిలో(మార్కెట్లో) అనేకమైన నిత్య ఉపయోగ వస్తువుల యొక్క కొరత రావచ్చు. స్వల్ప సరఫరా వల్ల వాటి ధర పెరగవచ్చు లేదా అవి లభించకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులలో, క్రింద పేర్కొన్న ప్రత్యామ్నాయాలు ఉపయోగపడతాయి. ఇప్పటినుండే ఈ ప్రత్యేమ్నాయ వస్తువులను ఉపయోగించడం అలవాటు చేసుకోగలరు.

3 ఊ 1. బజారులో లభించే  పళ్ళ పొడి మరియు దంత లేపనంకు  ప్రత్యామ్నాయాలు
వేపపుల్ల

అ. ‘వేప చెట్టు యొక్క లేత కొమ్మలను సాధారణంగా 15 సెం.మీ పొడవాటి ముక్కలుగా కోసి, ఆ పుల్లలతో పళ్ళు తోముకోవచ్చు.

ఆ. వంట కోసం ఉపయోగించే ఉప్పుతో పళ్ళు తోముకోవచ్చు.’

– శ్రీ అవినాష్‌  జాదవ్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (21 -5 -2020)

ఇ. ‘పది భాగాల సహజమైన ఎర్ర మన్ను(జాజు) మరియు ఒక భాగం ఉప్పు( సైంధవ లవణం ఉత్తమం; లేకపోతే  మెత్తగా నూరిన గల్లు ఉప్పును ఉపయోగించవచ్చు). ఈ మిశ్రమాన్ని పళ్ళపొడిగా ఉపయోగించవచ్చు.

ఈ. మామిడి, జామ, వేప, జిల్లేడు, రావి, ఖదిరము, కానుగ మరియు తెల్ల మద్ది చెట్ల యొక్క ఎండిన ఆకులు లేదా అందుబాటులో ఉన్న చెట్ల చిన్న కొమ్మలను కాల్చినప్పుడు వచ్చిన బూడిదను సన్నపు వస్త్రం దాళితం చేసి పళ్ళపొడిగా ఉపయోగించవచ్చు.’

– పూజ్యులు. వైద్య వినయ్‌ భావే, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా.(10.12.2019)

ఉ.’ఎండిన తుమ్మ చెట్టు కాయలను కాల్చి తరువాత బూడిదను వస్త్ర దాళితం చేసి పళ్ళపొడిగా ఉపయోగించవచ్చు.

ఊ. ఆవు పేడ పిడకల నుండి తయారైన పళ్ళపొడి

ఆవు పేడ నుండి తయారైన పళ్ళపొడి

పళ్ళపొడి తయారుచేయడానికి ఉపయోగించే ఆవుపేడ మీద ఈగలు లేదా కీటకాలు వాలకూడదు. అందువల్ల, తాజా వేప ఆకులు మరియు ఊకను ఆవు పేడలో కలిపి సన్నని పిడకలను చేయాలి. వేప ఆకులు ఈగలను దగ్గరకు చేరనివ్వవు. ఆవు పిడకలు వేగంగా కాలడానికి ఊక సహాయపడుతుంది. సన్నని పిడకలు వేగంగా ఎండిపోతాయి. ఈ ఆవు పిడకలను చిన్న కుప్పగా పేర్చాలి. కుప్పను పేర్చేటప్పుడు, ఒక దీపం వెలిగించటానికి కుప్ప లోపల తగినంత స్థలాన్ని ఉంచాలి. కుప్ప లోపల నెయ్యి దీపం వెలిగించినప్పుడు, ఆవు పిడకలు మండుతాయి. పిడకలకు కొంచెం మంటలు రగులుకున్న వెంటనే, నెయ్యి దీపాన్ని బయటకు తీసేయాలి. ఆవు పిడకల యొక్క కుప్ప పూర్తిగా కాలిపోయినప్పుడు, అది ఎర్రగా మారుతుంది. కుప్ప పూర్తిగా కాలిపోయిందని నిశ్చయమైనప్పుడు, దానిపై ఒక పెద్ద కుండ లేదా పాత్రను బోర్లించాలి. కప్పబడిన కుండ యొక్క అంచులను మట్టితో మూసివేయాలి. (కొన్నిచోట్ల ఆవు పిడకలను కాల్చడానికి ఒక చిన్న గుంట తవ్వి అందులో ఉంచుతారు. అవి బాగా కాలి ఎర్రగా మారినప్పుడు, ఆకులతో పూర్తిగా కప్పి, ఆకుల అంచులను మట్టితో కప్పుతారు.) అందువల్ల, కుండ లోపల ఆక్సిజన్‌ లేక, కాలుతున్న ఆవు పిడకలు ఆరిపోతాయి.

మరుసటి రోజు, కుండ ప్రక్కన పెట్టి, బూడిదను సేకరించి, వస్త్ర దాళితం చేయాలి. వస్త్ర దాళితం చేసిన ఆవు పిడకల బూడిద పొడి పది గిన్నెలు అయితే, ఐదు చెంచాల సైంధవ లవణం మరియు అర టీచెంచా పటిక పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్ళపొడిగా ఉపయోగించవచ్చు.’

– శ్రీ అవినాష్‌  జాదవ్‌, (21.5.2020)

ఎ. ‘బియ్యం ఉనుకను కుప్పగా వేసి దానిపై కాల్చిన బొగ్గులు ఉంచండి. బియ్యం ఊక త్వరగా మంటలను రగిలిస్తుంది. ఈ కుప్ప పూర్తిగా కాలిపోయినప్పుడు, అది బూడిదగా మారుతుంది. చల్లారిన బూడిదను సేకరించి, వస్త్ర దాళితం చేయాలి. (ఈ కుప్ప యొక్క పై భాగం బాగా కాలడం వల్ల నల్లగా మారుతుంది, కానీ బూడిదగా మారదు. ఈ నల్ల భాగాన్ని వేరు చేసి మంచి బూడిదను జాగ్రత్తగా సేకరించాలి.) దీన్ని పళ్ళ పొడిగా ఉపయోగించవచ్చు.’ – పూజ్యులు వైద్య వినయ్‌ భావే, (10.12.2019)

ఏ. ‘కొబ్బరి చిప్పలు లేదా బాదం పెచ్చులు కాల్చి, ఏర్పడిన బొగ్గును మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని వస్త్ర దాళితం చేసి పళ్ళపొడిగా ఉపయోగించవచ్చు.’ – శ్రీ అవినాష్‌  జాదవ్‌, (21.5.2020)

పైన ‘ఇ’ అంశం నుండి పేర్కొన్న అన్ని పళ్ళపొడులు సాధారణంగా గాలి చొరబడని ప్లాస్టిక్‌ సంచులలో లేదా చిన్న డబ్బాలో ఉంచినట్లయితే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.

3 ఊ 2. గడ్డం చేసుకోవడానికి సబ్బు మరియు లేపనకు (షేవింగ్‌ క్రీమ్‌) ప్రత్యామ్నాయాలు

అ. ‘బుగ్గలపై గోరువెచ్చని నీటితో రుద్దడం ద్వారా లేదా వేడి నీటితో స్నానం చేసిన వెంటనే గడ్డం చేసుకోవచ్చు.

ఆ. గడ్డానికి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పూసిన తరువాత గడ్డం చేసుకోవచ్చు.

పైన పేర్కొన్న విధంగా గడ్డం చేసుకున్నప్పుడు సాధారణంగా (మృదువైనది కాదు) మరియు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.’

– పూజ్యులు. వైద్య వినయ్‌ భావే, (10.12.2019)

3 ఊ 3. శరీరానికి వాడే సబ్బుకు ప్రత్యామ్నాయాలు
ముల్తానీ మట్టి

‘స్నానపు సబ్బు అందుబాటులో లేకపోతే, శనగ పిండి లేదా పప్పుల పిండి, ముల్తానీమట్టి , పుట్ట మన్ను లేదా ఏదైనా మంచి ప్రదేశంలో ఉన్న శుభ్రమైన మట్టిని (ఉదాహరణకు, నల్ల మట్టి, ఎర్ర మట్టి) వాడాలి. ఈ వస్తువులను మొదట కొద్దిగా నీటిలో నానబెట్టి తరువాత నలుగు పిండి లాగా వాడాలి. [కొన్నిసార్లు పుట్టలో స్థానదేవత నివసిస్తుంది. కాబట్టి  మీ చుట్టుప్రక్కల ప్రజలను అడగడం ద్వారా మరియు ‘ స్థానదేవతకు చెందిన పుట్ట కాదు’ అని నిర్ధారించుకొన్న తరువాత, పొడవైన కర్రతో పుట్టను విచ్ఛిన్నం చేసి, మట్టి ముద్దలను (బంకమట్టి ముక్కలు) సేకరించండి. అప్పుడు ఈ మట్టి ముద్దలను చూర్ణం చేసి,  మరియు చక్కటి జల్లెడ ద్వారా మెత్తగా జల్లించు కోవాలి. ]

పై వస్తువులు ఏవీ అందుబాటులో లేకపోతే, స్నానం చేసేటప్పుడు మీ శరీరాన్ని చేతితో రుద్దుకుంటే మంచిది.’

– వైద్య మేఘరాజ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా (13.3.2019)

3 ఊ 4. కేశాలు( తల వెంట్రుకలు) శుభ్రపరచడానికి బజారులో లభించే ద్రవ్యస్వరూపములోని సబ్బులకు(షాంపూ) ప్రత్యామ్నాయాలు
3 ఊ 4 అ. ఇంట్లో శీకాకాయ పొడి తయారుచేయడము

‘ఉసిరికాయ పొడి రెండు భాగాలు, శీకాకాయ పొడి ఒక భాగం మరియు  కుంకుడుకాయ పొడి ఒక భాగం తీసుకొని  అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 2 నుండి 4 టీస్పూన్లు ఇనుప పాత్ర లో వేసి రాత్రిపూట నానబెట్టండి. (ఇనుప పాత్ర లేకపోతే, ఈ మిశ్రమాన్ని స్టీల్‌ పాత్రలో  ఉంచి ఇనుప ముక్కలను వేయండి, ఉదాహరణకు, 4 – 5 ఇనుప మేకులు. ఈ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు మేకులు తొలగించాలి. – సంగ్రాహకుడు) ఉసిరి మరియు ఇనుము కలయిక వల్ల నలుపు రంగు ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు నల్లగా మారడానికి సహాయపడుతుంది. నానబెట్టిన పొడి యొక్క ముద్దను ఉదయం స్నానం చేయడానికి ఒక గంట ముందు జుట్టు మీద పూసుకొని మరియు స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది మరియు నల్లగా, మృదువుగా మారుతుంది.’ – వైద్య (శ్రీమతి) గాయత్రి సందేష్‌ చవాన్‌, కుర్లా, ముంబై. (20.6.2020)

’పైన పేర్కొన్న పొడిలో రెండు భాగాలు మెంతులు, ఒక భాగం తుంగముస్తలు, ఒక భాగం జఠామాంసి అలాగే మనకు అందుబాటులో వుండే మందార పువ్వులు, సాంబ్రాణి ఆకు మరియు గుంటగలగర ఆకులను ఎండబెట్టి పొడి చేసి  కలుపుకోవచ్చును.  ఉసిరికాయ, శీకాకాయ, తుంగముస్తలు మొదలైనవి బజారులో లభిస్తాయి.ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో సుమారు ఒక సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు. ఈ పొడులు ఎండలో ఎండబెట్టి, గాలి చొరబడని డబ్బాలో వుంచితే సుమారు 3 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. గాలిలోని తేమ కారణంగా ఈ పదార్ధాలు గడ్డగా మారితే, వాటిని మళ్లీ ఎండలో ఆరబెట్టవచ్చు.’ – వైద్య మేఘరాజ్‌ పరాడ్కర్‌ (20.6.2020)

3 ఊ 4 ఆ. కుంకుడు కాయ(రిటా)

కుంకుడు కాయలను  ఎండబెట్టి నిల్వ చేయాలి. 5 – 6 కుంకుడు కాయలను రాత్రిపూట వేడి నీటిలో నానబెట్టి, ఉదయం స్నానం చేసేటప్పుడు, ఆ నీటితో జుట్టును కడుక్కోవాలి.

3 ఊ 5. బట్టల ఉతకడానికి సబ్బు లేదా సబ్బు పొడికి ప్రత్యామ్నాయం
కుంకుడు కాయ పొడి
3 ఊ 5 అ. కుంకుడు కాయ

‘కుంకుడు కాయలను ఎండలో ఎండబెట్టాలి. ఎండినప్పుడు కొన్నిసార్లు అవి పగిలిపోయి వాటిలో విత్తనాలు బయటకు వస్తాయి. విత్తనాలు వాటికవే బయటకు రాకపోతే, ఎండిన కుంకుడు కాయలను గుండ్రటి రాయితో పగలకొట్టి, విత్తనాలను తొలగించండి. కుంకుడు కాయ యొక్క తొక్కలను ఒక రోట్లో వేసి దంచి లేదా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయండి. ఈ పొడిని సబ్బుగా ఉపయోగించినప్పుడు, తేమగా ఉండటానికి తగినంత నీరు కలపి 20 నుండి 25 నిమిషాలు ఉంచండి. తరువాత సబ్బు వలె తడి బట్టలపై రుద్ది, ఉతకడానికి వాడండి.

3 ఊ 5 ఆ. నల్ల మట్టి

ఈ మట్టితో బట్టలు ఉతకేటప్పుడు, సబ్బు వలె తడి బట్టలపై రుద్ది, ప్రవాహించే నీటిలో ఉతకాలి. (బట్టలు ఉతకడానికి ఎర్రమట్టిని ఉపయోగించకూడదు; ఎందుకంటే బట్టలపై మరకలు పడతాయి.) ’

– శ్రీ. అవినాష్‌ జాదవ్‌ (మే 2020)

3 ఊ 5 ఇ. అరటి బోదె(అరటాకు మధ్యలో వుండే నార) యొక్క బూడిద

అరటి బోదెలను ఎండబెట్టి, కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదలో లవణాలు ఉంటాయి. కాబట్టి, దీనిని సబ్బు వలే తడి బట్టలపై రుద్దడం ద్వారా బట్టలు ఉతకవచ్చు. [సేకరణ : ‘ వ్యాపారోపయోగమైన వనస్పతుల వర్ణన (భాగము 1)’, రచయిత – గణేష్‌ రంగనాథ్‌ దిఘే, సంవత్సరం 1993]

3 ఊ 6. పాత్రలను కడిగే సబ్బు, సబ్బుపొడి మొదలైన వాటికి ప్రత్యామ్నాయాలు.
3 ఊ 6 అ. కట్టెల పొయ్యి నుండి సేకరించిన బూడిద

‘కట్టెల పొయ్యి నుండి  వచ్చే బూడిదను, చల్లబడిన తరువాత పాత్రలను కడగడానికి ఉపయోగించవచ్చు.

3 ఊ 6 ఆ. మట్టి

బూడిద అందుబాటులో లేకపోతే, పాత్రలను ఏదైనా మట్టితో (ఉదా: నల్ల మట్టి, ఎర్ర మట్టి) శుభ్రం చేయవచ్చు. మట్టిలో రాళ్ళు ఉంటే పాత్రలకు గీతలు పడవచ్చు. అందువల్ల, పాత్రలను కడగడానికి మట్టిని జల్లించాలి.

3 ఊ 7. చేతులు కడుక్కోవడానికి సబ్బు లేదా ద్రవ్య సబ్బుకు ప్రత్యామ్నాయాలు
3 ఊ 7 అ. కట్టెల పొయ్యి నుండి సేకరించిన బూడిద

కట్టెల పొయ్యి నుండి వచ్చిన బూడిదను, చల్లబడిన తరువాత చేతులకు పూసుకొని కడుక్కోవచ్చు.

3 ఊ 7 ఆ. మట్టి

ఏ రకమైన మట్టితోనైనా మీ చేతులను శుభ్రం చేసుకోవచ్చు.’

– శ్రీ. అవినాష్‌ జాదవ్‌ (మే 2020)

3 ఊ 8. అగ్గిపెట్ట లేదా నిప్పు రగిలించడానికి(లైటరు) ప్రత్యామ్నాయాలు
3 ఊ 8 అ. సూర్యరశ్మితో అగ్నిని ప్రజ్వలింపచేయడానికి భూతద్దము ఉపయోగించడం
భూతద్దము

సూర్యరశ్మితో అగ్నిని ప్రజ్వలింపచేయడానికి భూతద్దము  (Convex lens లేదా Magnifying lens) ఉపయోగించవచ్చు. ఈ అద్దము ప్రయోగశాల వస్తువులు ఎక్కడ లభిస్తాయో, ఆ దుకాణాలలో దొరుకుతుంది. భూతద్దము ద్వారా కేంద్రీకృతమై ఉన్న సూర్య కిరణాలు పత్తి, కొబ్బరి పీచు, ఎండు గడ్డి, ఎండిన ఆకులు లేదా కాగితాలపై సుమారు 1 నుండి 5 నిమిషాలు స్థిరీకరించబడినప్పుడు  (ఈ కాలం సూర్యకిరణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది) మొదట పొగ వస్తుంది తరువాత మంటలు రగులుకుంటాయి.

3 ఊ 8 ఆ. కట్టెల పొయ్యిలో నిప్పు కాలుతూ వుండేలా ఉంచండం

1. ‘కట్టెల పొయ్యి మొదలైన వాటిపై వంట చేసిన తరువాత, పొయ్యిలో కట్టెనిప్పుపై కొద్దిగా బూడిద చల్లాలి. అందువల్ల, పొయ్యిలోని నిప్పు పూర్తిగా ఆరిపోకుండా ఉంటుంది.  3 – 4 గంటల తరువాత,  కాగితం లేదా ఎండిన ఆకులను అదే నిప్పుపై ఉంచి గొట్టముతో ఊదడం ద్వారా మంటలను తిరిగి మండించవచ్చు.’ – శ్రీ. అవినాష్‌ జాదవ్‌ (మే 2020)

2.  తాజా ఆవు పేడ ప్రతిరోజూ లభిస్తే, రెండు పొయ్యిలు తయారు చేయడం ద్వారా కట్టెనిప్పులు కాలుతూ వుండేలా చేసే పద్ధతి : ‘రెండు పొయ్యిలను ప్రక్కప్రక్కనే ఉంచాలి. పొయ్యి క్రింద భూమిలో ఒక చిన్న గొయ్యి తవ్వండి. (పొయ్యి వెలిగించే పద్ధతిని సులభంగా అర్థం చేసుకోవడానికి  మొదటిపొయ్యిను ’1’ మరియు రెండవ పొయ్యిను ’2’ అని పిలుద్దాం).

1 వ రోజు : పొయ్యి ‘1’ వెలిగించండి. పొయ్యి ’2’ గొయ్యిలో పేడ సుద్ధను వుంచి  దానిపై కొంత బూడిద వేయండి.

(పొయ్యిలోని మట్టి, పేడపై బూడిద, మరియు పక్క పొయ్యిలోని అగ్ని నుండి వచ్చే వేడి, పేడ సుద్ధలోని నీటిని గ్రహిస్తుంది).

2 వ రోజు : పొయ్యి ’2’  వెలిగించండి. పొయ్యి ‘1’ నుండి బూడిదను బయటకు తీసివేసి పొయ్యి గొయ్యిలో పేడ సుద్ధను వేసి దానిపై కొంత బూడిద వేయండి. (ముందు రోజు పొయ్యి ’2’ లో వుంచిన పేడ సుద్ధ ఎక్కువ భాగము ఎండిపోతోంది. రోజంతా పొయ్యిలో మంటలు కారణంగా, ఇది ఎండిన పేడ సుద్ధను బొగ్గుగా చేస్తుంది).

3 వ రోజు : పొయ్యి ‘2’ యొక్క గొయ్యిలో పేడ బొగ్గు సహాయంతో పొయ్యి ‘1’ ను వెలిగించి, మరియు పొయ్యి ’2’ యొక్క గొయ్యిలో పేడ సుద్ధను ఉంచండి.

4 వ రోజు : పొయ్యి ‘1’ యొక్క గొయ్యిలో పేడ బొగ్గు సహాయంతో పొయ్యి ‘2’ ను వెలిగించి, మరియు పొయ్యి ’1’ యొక్క గొయ్యిలో పేడ సుద్ధను ఉంచండి.

ఈ విధంగా పొయ్యిలు రెండూ ప్రత్యామ్నాయంగా వాడాలి మరియు మీరు పొయ్యిని ఉపయోగించకపోతే, పొయ్యిలో పేడ సుద్ధను ఉంచండి.’

– శ్రీ. వివేక్‌ నాఫడే, సనాతన ఆశ్రమం, దేవద్‌, పన్వెల్‌, మహారాష్ట్ర. (మే 2020)

3 ఊ 8 ఇ. గులకరాళ్ల  సహాయంతో అగ్నిని ప్రజ్వలింపచేయడం
గులకరాళ్లు

‘నిమ్మకాయ గాత్రంలోని రెండు గులకరాళ్లు తీసుకోని ఒకదానికొకటి రుద్దడం వల్ల వచ్చే నిప్పురవ్వను పత్తిపై పడేలా చేయాలి. ఇది పత్తిని ప్రజ్వలింపచేస్తుంది.’

– శ్రీ. కొండిబా జాదవ్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (7.1.2019)

3 ఊ 9 : ఉప్పుకు ప్రత్యామ్నాయం

‘ఎండిన అరటి బోదెను కాల్చినప్పుడు వచ్చే బూడిదలో ఉప్పు ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని చాలా మంది పేదలు ఈ బూడిదను ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.’

[సేకరణ :‘ వ్యాపారోపయోగమైన వనస్పతుల వర్ణన (భాగము 1)’, రచయిత – గణేష్‌ రంగనాథ్‌ దిఘే, సంవత్సరం 1993]

3 ఊ 10 : భోజన పళ్ళెం మరియు గిన్నెలకు ప్రత్యామ్నాయాలు
అరటి ఆకుల పళ్ళెం మరియు గిన్నెలు

భోజనము కోసం అరటి లేదా అడవి అరటి ఆకుల నుండి తయారుచేసిన పళ్ళెమును ఉపయోగించవచ్చు. మర్రి చెట్టు ఆకుల నుండి తయారుచేసిన పళ్ళెం మరియు గిన్నెను కూడా ఉపయోగించవచ్చు.

3 ఊ 11 : దోమల నివారణలకు మార్కెట్లో లభించే ధూపం మరియు ద్రవము (లిక్విడ మొదలైన వాటికి ప్రత్యామ్నాయాలు
3 ఊ 11 అ. దోమల నివారణకు ధూపమును ఇంట్లో తయారు చేయడం
ధూపం

ఒక కిలో తాజా ఆవు పేడ తీసుకోవాలి. సుమారుగా ఒక గుప్పెడు బిరియాని ఆకులు, రెండు గుప్పెళ్ళ వేప ఆకులు, సగం గుప్పెడు పుదీనా ఆకులు, సగం గుప్పెడు తులసి ఆకులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి రెండు చెంచాల వేపనూనె, అర చెంచా కర్పూరం పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆవు పేడలో వేసి బాగా కలపి, చేతితో ధూపపు కడ్డీల ఆకృతిలో చేసి బాగా ఆరబెట్టాలి. అవసరమైన విధంగా, ఈ ధూపపు కడ్డీలను వెలిగించి గదిలో ఉంచాలి. దీని నుండి వచ్చే పొగ దోమలను చంపుతుంది.

3 ఊ 11 ఆ. ఇతర ప్రత్యామ్నాయాలు

1. గదిలో దోమలను  తరమేయుటకు

అ. ‘మాట్‌(దోమ వికర్షక కాగితం అట్ట)’ కు బదులుగా వెల్లుల్లిని వుంచి యంత్రాన్ని స్విచ్‌ఆన్‌ చేయండి. ఒక వెల్లుల్లి రెబ్బను 1 – 2 రోజులు ఉపయోగించవచ్చు.

ఆ. వేప మరియు కొబ్బరి నూనెను సమాన నిష్పత్తిలో కలపి  మరియు ఈ నూనెతో గదిలో ఒక దీపం వెలిగించండి.

ఇ. నిప్పులపై వేప ఆకులను వేసి పొగ వచ్చేటట్లు చేయండి. ఆకులు ఎండినట్లయితే, వాటిపై కొద్దిగా నీళ్లు చిలకరించి, నిప్పుల మీద ఉంచండి, తద్వారా అవి త్వరగా కాలిపోకుండా ఉంటాయి.

ఈ. బొగ్గులపై కొన్ని ఎండిన నారింజ తొక్కలను వేసి పొగ వచ్చేటట్లు చేయండి.

2. వేప ఆకు రసం మరియు పుదీన నూనెను సమాన నిష్పత్తిలో తీసుకొని, ఈ మిశ్రమాన్ని శరీరం యొక్క బహిర్గత భాగంలో పూయాలి. ఇలా చేయడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి.

3. దోమల సంఖ్యను తగ్గించడానికి బంతి పువ్వు మొక్కలను ఇంటి వాకిట్లోపెరట్లో నాటాలి.’

– శ్రీ. అవినాష్‌ జాదవ్‌ (16.6.2020)

To read Part 8, click here Preparation required to survive during the adverse times Part 8

సంగ్రహకర్తలు : పరాత్పర గురువులు డా.జయంత్‌ బాలాజీ ఆఠవలె

సేకరణ : సనాతన గ్రంథమాల‘ఆపత్కాలంలో ప్రాణ రక్షణకొరకు చేయబడే సంసిద్ధత’

(ప్రస్తుత లేఖనము యొక్క సర్వహక్కులు సనాతన భారతీయ సంస్కృతి సంస్థ వద్ద సురక్షితముగా వున్నాయి)

Leave a Comment