అఖిల మానవాళికి ఆపత్కాలములో ప్రాణాలతో బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము చేయు ఏకైక పరాత్పర గురువులు డా. జయంత్ బాళాజి ఆఠవలె !
3. ఆపత్కాలమును ఎదుర్కొనుటకు భౌతిక స్థాయిలో తీసుకోవలసిన చర్యలు
3 ఉ. కుటుంబంలో నిత్యము వుపయోగించే వస్తువులను మరియు అప్పుడప్పుడు అవసరమైన వస్తువులను ఇప్పటినుంచే కొనుగోలు చేసుకోవాలి !
ఆపత్కాలంలో, ఒక వ్యక్తి నిత్యం అవసరమయ్యే వస్తువులు ఏమి కావాలో స్పష్టంగా ఆలోచించలేకపోవచ్చు. పాఠకులకు సులభంగా కొనుగోలు చేసుకోవడానికి కావలసిన వస్తువుల జాబితా క్రింద ఇవ్వబడింది. కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వయస్సు మరియు ఇంట్లో గదుల సంఖ్యను బట్టి అవసరమైన వస్తువులను సరైన పరిమాణంలో కొనుగోలు చేయాలి. మేము ఏదైనా కొన్ని వస్తువులను మరచిపోయివుంటే మీరు గుర్తుంచుకొని, వాటిని కూడా కొనుక్కోగలరు.
3 ఉ 1. రోజువారీ ఉపయోగించే వస్తువులు
పళ్ళ పొడి లేదా పేస్ట్, క్షౌరము చేసుకొనే వస్తువులు, తల వెంట్రలుకలు కత్తిరించుకొనే వస్తువులు, స్నానం మరియు బట్టల సబ్బులు, దుస్తులు, తల నూనె, కుంకుమ, అద్దం, దువ్వెనలు, గోళ్ళు కత్తిరించుకొనేవి, అదనపు కళ్ళజోడు (వాడకంలో ఒకటి విరిగిపోయినప్పుడు మరొకటి ప్రత్యామ్నాయంగా), ఇస్త్రీ పెట్టె (బొగ్గులపై పనిచేసేది), బొంతలు మరియు దుప్పట్లు, చీపురు, పాయకానా, స్నానాల గది శుభ్రపరిచే ద్రవం, కలం మరియు పెన్సిల్, పాదరక్షలు మొదలైనవి.
(వీటిలో, పళ్ళ పొడి, స్నానపు సబ్బులు (7 సుగంధాలు), తల నూనె మరియు కుంకుమ సనాతన సాత్విక ఉత్పత్తులు అందుబాటులో వున్నాయి – సంగ్రహాకర్తలు)
3 ఉ 2. వంటగది సంబంధిత పరికరాలు
పట్టకార, రోలు మరియు రోకలి , కత్తిపీట, కత్తి పదునుపెట్టేవి మొదలైనవి.
3 ఉ 3. ఋతువు అనుగుణముగా ఉపయోగపడే వస్తువులు
అ. వేసవికాలములో ఉపయోగపడే వస్తువులు
విసనకర్ర, నల్ల కళ్ళజోడు, భుజములపై వేసుకొనే రుమాలు(స్కార్ఫ్), టోపీ మొదలైనవి.
ఆ. వర్షాకాలములో ఉపయోగపడే వస్తువులు
గొడుగు, రెయిన్ కోట్స్, రెయిన్ బూట్లు మొదలైనవి.
ఇ. శీతకాలములో ఉపయోగపడే వస్తువులు
చలి కోటు, చేతి మేజోళ్ళు, కాలి మేజోళ్ళు, చెవులను కప్పే టోపీలు, శాలువ, మఫ్లర్, దుప్పట్లు మొదలైనవి.
3 ఉ 4. ఇంట్లో మీకు కావలసిన ముఖ్యమైన వస్తువులు
అ. ఇంట్లో చిన్న మరమ్మత్తులకు ఉపయోగకరమైన వస్తువులు
మేకులు, సుత్తి, రెంచీలు , పట్టకారు, స్క్రూ డ్రైవర్, కట్టర్, చిన్న పలకలను కోయడానికి రంపము, పలకల అంచులు సున్నితంగా చేయడానికి పాలిషింగ్ కాగితం, కత్తెర, మీటరు టేపు మొదలైనవి.
ఆ. కుట్టడానికి అవసరమైన వస్తువులు
సూది-దారం, గుండీలు, కత్తెర, కొలిచే టేపు (వస్త్రం కొలవడానికి), బట్టలు కుట్టు యంత్రం మొదలైనవి.
ఇ. కొన్ని కీటకాల నుండి రక్షణ కొరకు వాడే కీటక నాశిని వస్తువులు
దోమలు, ఎలుకలు, బొద్దింకలు, చీమలు, పేలు, ఈడిది (పేను గుడ్లు) మొదలైన వాటిని నియంత్రించే మందులు; ఎలుకల బోను, దోమతెరలు మొదలైనవి.
ఈ. ఇంట్లో అధనంగా ఉంచుకోవలసిన వస్తువులు
స్నానం చేయడానికి బక్కెట్టు మరియు చెంబు , బట్టలు నానబెట్టడానికి తొట్టి, బట్టల మీద మురికిపై రుద్దడానికి బ్రష్, అధనపు విద్యుత్ ఉపకరణాలు (బల్బులు, ట్యూబ్ లైట్లు, రెండు-పిన్ మరియు మూడు-పిన్ ప్లగ్‌లు మరియు ప్లగ్ హోల్డరు), పాదాలకు ధరించాల్సిన రబ్బరు చెప్పులు మొదలైనవి.
ఉ. ఇతర వస్తువులు
ప్రభుత్వ సూచనలను వినడానికి చిన్న రేడియో (ట్రాన్సిస్టర్), కీ ఇచ్చే గడియారం, తయారీ తేదీ నుండి 10 సంవత్సరాలు పనిచేసే ఆటోమేటిక్ క్లాక్, మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి పోర్టబుల్ సోలార్ ఛార్జర్, గ్యాస్ లైటర్, విండ్‌ప్రూఫ్ లైటర్, కొవ్వొత్తులు, పురికొస, కుంభం, బట్టలు ఆరవేసుకోవడానికి తాడు, సైకిల్ ట్యూబ్ లో గాలి నింపడానికి పంప్, విద్యుత్ సరఫరా తనిఖీ చేయడానికి టెస్టర్ మొదలైనవి.
3 ఉ 5. రోగులకు ఉపయోగకరమైన వస్తువులు
థర్మామీటర్, శరీరానికి కాపడం పెట్టుకోవడానికి వేడి నీటి సంచి, ఆయుర్వేద మాత్రలు చూర్ణం చేసేందుకు చిన్న రోలు మరియు బండ, చెక్క కమో్‌డచెక్క పాయకానా కుర్చీ) కుర్చీ, డైపర్స్ (మల-మూత్రాదులకు వాడు వస్త్రము)మొదలైనవి.
3 ఉ 6. ఆత్మరక్షణ కోసం ఉపయోగకరమైన వస్తువులు
ఆపత్కాలములో గందరగోళం లేదా అల్లర్లు వంటి సమస్యలు ఉద్భవిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో, సామాజిక ఉపద్రవాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి వుపయోగపడే వస్తువులు – ‘పెప్పర్ స్ప్రే(మిరపకాయ సారంతో నింపిన చిన్న పిచికారీ)’, కర్రలు, ఇనుప రాడ్లు, కొరడా మొదలైనవి.
3 ఉ 7. ఆధ్యాత్మిక నివారణల కోసం సాత్విక ఉత్పత్తులు
సనాతన సంస్థ యొక్క కుంకుమ, అత్తరు, గో మూత్రం, ధూపం, అగరుబత్తి , కర్పూరం, దేవతల చిత్రాలు, దేవతల నామజపం పట్టీలు మొదలైనవి.
ఆధ్యాత్మిక ఉపాయముల గురించి సవివరమైన సమాచారం కోసం – www.sanatan.org/mr/spiritual-remedies ని సందర్శించండి లేదా సనాతన సంస్థ యొక్క సాధకుల నుండి తెలుసుకోగలరు.
3 ఉ 8. మీరు కొంతకాలం ఇంటిని వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళవలసిన సమయంలో ఉపయోగపడే వస్తువులు
వరదలు సంభవించిన సమయంలో, ప్రజలు ప్రభుత్వ హెచ్చరిక అందుకున్న వెంటనే ఇంటిని వదిలి వెళ్ళ వలసి వస్తుంది. అటువంటి సమయాల్లో మనతో తీసుకెళ్ళ వలసిన సర్వసాధారణ వస్తువుల జాబితా క్రింద ఇవ్వబడింది. ఈ ముఖ్యమైన వస్తువులు మన దగ్గర సిద్ధంగా పెట్టుకోవడం వల్ల చివరి నిమిషంలో కంగారు వుండదు.
అ. అన్ని వస్తువులను నిండుగా నింపడానికి ఒక పెద్ద బలమైన మరియు సులభంగా వీపున వేసుకొని వెళ్ళే సంచి.
ఆ. పళ్ళ పొడి లేదా పేస్ట్, క్షౌరం చేసుకొనేవి , సబ్బు, చిన్న అద్దం, దువ్వెన, రోజువారీ ధరించే దుస్తులు, దుప్పట్లు మరియు ఔషధములు.
ఇ. సుమారు 3 రోజులకు సరిపోవు పొడి ఆహారం మరియు త్రాగునీరు. నీటిని శుద్ధి చేయడానికి క్లోరిన్.
ఈ. మొబైల్ మరియు దాని ఛార్జర్, పవర్ బ్యాంక్ మరియు మొబైల్ నంబర్ల పుస్తకం.
ఉ. బ్యాటరీలపై పనిచేసే టార్చ్ మరియు విద్యుత్ ఛార్జ్ తో పనిచేసే పెద్ద టార్చ్.
ఊ. తేమతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ వెలిగించగల కొవ్వొత్తులు మరియు అగ్గి పెట్టె.
ఋ. ముఖ్యమైన మూల పత్రాలు (రేషన్ కార్డ్ అధార్ కార్డ్ బ్యాంక్ పాస్ బుక్ వంటివి) వాటి ఛాయా పత్రాలు(ఫొటోకాపీలు) మరియు ఎటిఎం కార్డు.
ౠ. ప్రథమ చికిత్స యొక్క వస్తు సామగ్రి, ముక్కు మరియు నోటిని కప్పుకోవడానికి మాస్క్.
ఎ. మందపాటి త్రాడు, దిక్సూచి మరియు ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయడానికి ఒక విజిల్(ఈల).
ఏ. ఆకాశవాణి నుండి ప్రసారమయ్యే ప్రభుత్వ సూచనలు, వార్తలు మొదలైనవి వినడానికి ఒక చిన్న రేడియో (ట్రాన్సిస్టర్).
ఐ. ఆధ్యాత్మిక నివారణలకు సాత్విక ఉత్పత్తులు.
3 ఉ 9. భూకంపాలు, వరదలు మొదలైనవి ఆపత్కాలంలో జరిగినప్పుడు ఉపయోగపడే వస్తువులు.
అ. డేరా, పెద్ద తారు గుడ్డ మరియు మందపాటి ప్లాస్టిక్ షీట్
కొన్నిసార్లు డేరా తాత్కాలిక నివాసానికి ఉపయోగపడుతుంది. బహిరంగంగా ఉంచాల్సిన వస్తువులు తడవకుండా రక్షించడానికి, తారు గుడ్డ మరియు మందపాటి ప్లాస్టిక్ షీట్లు ఉపయోగపడతాయి.
ఆ. జీవ రక్షక కవచము (లైఫ్-జాకెట్) మరియు డింగీ
వరద పీడిత ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు ఇవి ఉపయోగపడతాయి. వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మీరు డింగీ పడవను కొనుగోలు చేసినట్లైతే, నడపడం కూడా నేర్చుకోవాలి.
ఇ. గ్యాస్ మాస్క్ (GasMask) మరియు పోర్టబుల్ ఆక్సిజన్ మాస్క్ ట్యాంక్ (Portable Oxygen Mask Tank)
విష వాయువు బయటకు విడుదలైనప్పుడు గ్యాస్ మాస్క్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. పోర్టబుల్ ఆక్సిజన్ మాస్క్ ట్యాంక్ ద్వారా రోగికి వెంటనే ప్రాణవాయువు అందిచడంవల్ల, ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. గ్యాస్ మాస్క్ మరియు పోర్టబుల్ ఆక్సిజన్ మాస్క్ ట్యాంక్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ. వాకీ-టాకీ (Walkie Talkie) మరియు హమ్ రేడియో(Ham Radio)
ఇవి సమాచార సంగ్రాహకం కోసం ఉపయోగపడే వైర్‌లెస్ పరికరాలు. టెలిఫోన్లు మరియు మొబైల్ ఫోన్లు పనిచేయడం ఆగిపోయినప్పుడు, ప్రభుత్వ అనుమతితో, వాకీ-టాకీ మరియు హమ్ రేడియోలను ఉపయోగించవచ్చు. ఈ పరికరాల గురించి మరింత సమాచారం నిపుణుల నుండి తెలుసుకోగలరు.
ఉ. ఇతర వస్తువులు
నుదిటిపై పెట్టుకొనే టార్చ్ (రెండు చేతులు ఖాళీగా ఉంటాయి), చిన్న బైనాక్యులర్, సంకేతాన్ని ఇచ్చే అద్దం(సిగ్నలింగ్ మిర్రర్) (దీని మినుకుమినుకుమనే కాంతి చాలా దూరంలో ఉన్న వ్యక్తుల దృష్టిని, మనం చిక్కుకున్న ప్రదేశానికి ఆకర్షించగలదు), పారా కార్డ్ (Para Cord – భారీ బరువులను మోయగల తాడు), రెయిన్ పోంచో (Rain Poncho – టోపీతో పాటు పెద్ద రెయిన్ కోట్), వ్యక్తి ఆపదలో వున్నప్పుడు (ఉదాహరణకు భూకంపము వచ్చి కుప్పకూలి క్రింద ఇరుక్కుపోయినప్పుడు) ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి పెద్దగా శబ్ధం చేసే యంత్రము (Emergency Personal alarm) మరియు థర్మల్ బ్లాంకెట్ (తీవ్రమైన చలి వున్న ప్రాంతంలో ఉపయోగపడుతుంది).
3 ఉ 10. ప్రస్తుత లేఖనములో మరెక్కడా సూచించని విషయాలు
ఆపత్కాలన్నీ ఎదుర్కోడానికి సంసిద్ధతలో భాగంగా, ఆహార ధాన్యాలు, నీరు, విద్యుత్, ప్రయాణానికి మొదలైన వాటికి సంబంధించిన వస్తువులను కొనిపెట్టుకోండి (ఉదాహరణకు: ధాన్యం ఎక్కువ కాలం నిలువచేయడానికి, నీటి ట్యాంక్). ఇలాంటి వస్తువుల పేర్లు 5వ లేఖలో ఇవ్వబడినది. ఆపత్కాలములో ప్రాణరక్షణకై చేయబడే సంసిద్ధత భాగము – 5
3 ఉ 11. గృహోపకరణాల కోసం అధనంగా విడిభాగాలను కొనండి మరియు ఆ ఉపకరణాలను బాగుచేయడాన్ని నిపుణుడి నుండి నేర్చుకోండి
ఫ్యాన్, నీటి కుళాయి, మిక్సర్ వంటి ఉపకరణాలు ప్రతికూల సమయాల్లో చెడిపోవచ్చు మరియు వాటి విడి భాగాలు సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు; అంతేకాకుండా, వాటిని మరమ్మత్తు చేసే వ్యక్తి దొరకడం కూడా కష్టమౌతుంది. అందువల్ల, ఈ ఉపకరణాల కోసం విడిభాగాలను కొనిపెట్టుకోండి, మరియు సాధ్యమైనంత వరకు వాటిని బాగుచేయడం కూడా నేర్చుకోండి.
గృహోపకరణాల కొరకు ఏ విడిభాగాలను కొనుగోలు చేయాలి, మరియు వాటి మరమ్మత్తు గురించి ఏమి నేర్చుకోవాలి, వంటి విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.
3 ఉ 11 అ. వంటగదికి సంబంధిచిన వస్తువుల యొక్క విడి భాగాలు
ప్రెజర్ కుక్కర్ యొక్క విజిల్ మరియు గ్యాస్కెట్, మిక్సర్ కోసం కార్బన్ బ్రష్‌లు (మిక్సర్ యొక్క మోటారులో విద్యుత్ ప్రవాహం యొక్క కండక్టర్), వంట గ్యాస్ పైపు మొదలైనవి.
3 ఉ 11 ఆ. సాంప్రదాయ దీపాల విడిభాగాలు
చిన్న దీపం మరియు లాంతరు, ఒత్తులు, ఒత్తి సర్దుబాటు చేసేవి మొదలైనవి.
3 ఉ 11 ఇ. విద్యుత్ వైరింగ్ కు సంబంధిచిన వస్తువుల యొక్క విడి భాగాలు
ట్యూబ్-లైట్ స్టార్టర్, ఇన్సులేషన్ టేప్, ఫ్యూజ్ వైర్ మరియు ఫ్యూజులు, విద్యుత్ స్విచ్‌లు, ఎక్స్‌టెన్షన్ వైరు, సాధారణ వైరు, సీలింగ్ ఫ్యాన్ యొక్క రెగ్యులేటర్ మొదలైనవి.
ట్యూబ్-లైట్ స్టార్టర్, విద్యుత్ స్విచ్‌లు మొదలైన వాటిని మార్చడం నేర్చుకోండి, ఫ్యూజ్ వైర్‌ను ఎలా మార్చాలి మొదలైనవి నేర్చుకోండి.
3 ఉ 11 ఈ. నీటి పైపులకు సంబంధిచిన వస్తువుల విడి భాగాలు
నీటి కుళాయి, వాషర్, టెఫ్లాన్ టేప్, అవసరమైన స్పేనర్లు(రెంచీలు), ఎం-సీల్ (M-seal), గ్లు స్టిక్(ఈ ప్లాస్టిక్ స్టిక్ కరిగించినట్లయితే, పివిసి పైపులలో లీకేజీని మూసివేయగలదు), సైకిల్ ట్యూబ్ యొక్క పొడవాటి ముక్కలు (ఇవి నీటి లీకేజ్ ని ఆపడానికి ఉపయోగిస్తారు ), నీటి-పైపులు మొదలైనవి.
3 ఉ 11 ఉ. వాహనాలకు సంబంధిచిన విడి భాగాలు
సైకిల్, సైకిల్-రిక్షా, ద్విచక్ర, నాలుగు చక్రాల, ఎద్దుల బండి, గుర్రపు బండి మొదలైన వాహనాలకు వినియోగించే కొన్ని విడి భాగాలను మనము కొనిపెట్టుకోవచ్చు. ఉదాహరణకు, మీకు సైకిల్ వుంటే, ట్యూబ్, టైర్, పంక్చర్ మరమ్మత్తు చేయడానికి వుపయోగపడే పరికరాలు మొదలైనవి.
మీకు వున్న వాహనాలను నడపడం మరియు మరమ్మత్తు చేయడం నేర్చుకోండి. ఉదాహరణకు, మీకు సైకిల్ వుంటే, పంక్చర్ బాగుచేయడం నేర్చుకోండి.
సంగ్రహకర్తలు : పరాత్పర గురువులు డా.జయంత్ బాళాజీ ఆఠవలె
సేకరణ : సనాతన గ్రంథమాలలో ‘ ఆపత్కాలంలో ప్రాణ రక్షణకొరకు చేయబడే సంసిద్ధత’
(ప్రస్తుత లేఖనములో సర్వహక్కులు సనాతన భారతీయ సంస్కృతి సంస్థ వద్ద సురక్షితంగా వున్నాయి)