ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 3

ఆపత్కాలంలో తరించుటకు సాధన నేర్పించే సనాతన సంస్థ !

అఖిల మానవాళికి ఆపత్కాలములో బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము చేయు ఏకైక పరాత్పర గురువులు డా. జయంత్‌ బాలాజీ ఆఠవలె !

భాగము 2 చదువుటకు సంప్రదించండి. ‘ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత’ భాగము – 2

వరదలు, భూకంపాలు, మూడవ ప్రపంచ మహాయుద్ధం, కొరోన మహమ్మారి వంటి ఆపత్కాలములో స్థిరంగా వుండుటకు(ఎదుర్కొనుటకు) తీసుకోవలసిన చర్యల గురించి ఈ  లేఖనములలోని ముందు భాగములో వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి, బయోగ్యాస్‌ మొదలగు వివరాలను తెలుసుకున్నాము. తరువాయి లేఖనములో  పండించదగిన కూరగాయలు, పండ్లు గురించి నేర్చుకున్నాము. ప్రస్తుత లేఖనములో నిల్వ వుండే పదార్థముల గురించి వివరించబడినది. ఆపత్కాలములో నిత్యము అల్పహారం లేదా భోజనము తయారు చేయలేక పోయినప్పుడు మనము ఉపాసంగా(ఆకలితో) చావడమనే పరిస్థితి ఏర్పడకుండ ముందుగానే ఇంట్లో నిల్వ వుండే పదార్థములను తయారు చేసి పెట్టుకున్నచో ప్రయోజనకరంగా వుంటుంది.

3. ఆపత్కాలాన్ని తట్టుకోవడానికి భౌతిక (శారిరక) స్థాయిలో వివిధ సంసిద్ధత !

3 అ 5. దీర్ఘకాలం నిలువవుండే వివిధ ఆహార పదార్థాలను బజారు నుండి కొని పెట్టుకోవడం లేదా ఇంట్లో తయారు చేసుకోవడం

ఆపత్కాలంలో, వంట కోసము గ్యాస్‌ కొరత, కుటుంబ సభ్యుల అనారోగ్యం, అకస్మాత్తుగా మరొక ప్రదేశానికి వెళ్ళిపోవలసిరావడం, మార్కెట్లో కూరగాయలు లభించకపోవడం మొదలగు సమస్యలు ఎదురౌతాయి. ఇలాంటి సమయాల్లో, ఎప్పటిలాగే అల్పాహారం లేదా భోజనం తయారు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులలో, దీర్ఘకాలం నిల్వ చేయదగిన వివిధములైన ఆహార పదార్థాలను సిద్ధంగా పెట్టుకోవడం వుపయోగకరంగా వుంటుంది.

అ. ఇక్కడ పేర్కొన్న కొన్ని ఆహార పదార్థాలను (ఉదా. ఖాక్ర, ఊరగాయ, అంబలి) బజారు నుండి కొనుగోలు చేసి నిలువ చేసుకోవచ్చు. ఇకపై ఇంట్లో ఇలాంటి ఆహార పదార్థాలను తయారుచేసుకోవడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే ఆపత్కాలము తీవ్రమైనప్పుడు వీటిని బజారు నుండి తీసుకురావడం కష్టతరమగును.

ఆ. ఇక్కడ పేర్కొన్న ఆహార పదార్థాల ఉదాహరణలన్నీ ఎక్కువగా మహారాష్ట్రకు సంబంధించినవి. పాఠకులు వారి వారి రాజ్యాలనుసారంగా మరియు ప్రదేశాలనుసారంగా దీర్ఘకాలం నిలువ వుండే ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

ఇ. దీర్ఘకాలం నిలువ వుండే ఆహార పదార్థాల తయారు చేయు దాని గురించి మేము ఇవ్వలేదు. ఇక్కడ ప్రస్తావించిన వంటకాల గురించి చాలా మందికి తెలుసు. ఏదేమైనా, ఆపత్కాలన్నీ దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలం నిలువ వుండు ఆహార పదార్థాలను తయారు చేయడానికి వుపయోగకరమైన చిట్కాలను కొంతవరకు అందించాము.

పాఠకులకు అలాంటి ఆహారపదార్థాలను ఎలా తయారు చేయాలో తెలియకపోతే, కుటుంబంలోని పెద్దల సహాయం తీసుకోగలరు లేదా వంటల పుస్తకాలు చదవి తెలుసుకోగలరు లేదా ఈ వంటకాలు ఎలా తయారు చేయాలో యూట్యూబ్‌లో చూడగలరు.

ఈ. గ్రంథములో సాధ్యమైనంతవరకు, ఈ ఆహార పదార్థాల సగటు నిలువ సమయం కూడా తెలుపబడింది. ఈ ఆహార పదార్థాల నిలువ సమయం ప్రాంతం యొక్క వాతావరణం మరియు వాటిని తయారుచేసేటప్పుడు అనుసరించ వలసిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

3 అ 5 అ. బియ్యం మరియు రాగి పిండి, పాలపొడి మొదలగు పదార్థాలు

3 అ 5 అ 1. బియ్యం మరియు రాగి పిండి 

రాగి పిండి

ఈ రెండు పిండిలలో, రాగి పిండి మరింత పోషకమైనది.

బియ్యమును 3 – 4 గంటలు నీటిలో నానబెట్టి, తరువాత వడబోయాలి. సుమారు గంటకి బియ్యం ఆరిన తరువాత, బియ్యాన్ని కొంచెం కొంచెం మద్యమమైన సెగపై వేయించుకోవాలి. ఒక్కోక్కసారి కొంచెం కొంచెం బియ్యం వేయించడం వల్ల ధాన్యాలు, పేలాలు లాగా పేలుతాయి. చివరగా, వేయించిన బియ్యం అంతా పిండి చేసి పొడి కూజాలో నింపుకోవాలి. ఈ పిండి దాదాపు 3 నెలలు వుంటుంది. దీనిని పాలు, పెరుగు, మజ్జిగ లేదా కూరతో తినవచ్చు. పాలతో కలిపి తీసుకుంటున్నప్పుడు చక్కెర లేదా బెల్లం రుచికి తగినంత కలుపుకోవచ్చు.

బియ్యపు పిండిని తయారు చేసే పద్ధతిలోనే రాగి పిండిని కూడా తయారు చేయవచ్చు. ఈ పిండి కూడ దాదాపు 3 నెలలు నిల్వ వుంటుంది.

3 అ 5 అ 2. గోధుమ / బార్లీబియ్యము పిండి

గోధుమ పిండి

గోధుమలను కడిగి మరియు నీటిని వడకట్టి ఆరబెట్టాలి. సుమారు ఒక గంటకి, ధాన్యాలు బాగా పొడిగా అయిన తరువాత, మద్యమమైన సెగపై వేయించుకోవాలి. వీటికి వేయించిన శనగలు, జీలకర్ర వేసి కలపండి. అన్ని పదార్థాలను కలిపి మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పిండిని గాలి చొరబడని మరియు పొడి కూజాలో నింపుకోవాలి. ఈ పిండిని రుచికి అనుగుణంగా చక్కెర లేదా బెల్లం వేసి నీరు లేదా పాలతో తినవచ్చు. ఈ పిండి దాదాపు 6 నెలలు వుంటుంది.

ఇటువంటి పిండిని తయారుచేయడానికి చాలా విధానాలు వున్నాయి. కొన్నిచోట్ల గోధుమలకు బదులుగా బార్లీ(యవలు)ని వుపయోగిస్తారు, మరికొన్ని చోట్ల అన్ని రకాల పప్పులను (సెనగ పప్పు) వేయించి, పిండిని తయారు చేస్తారు. ఐదు నుండి ఏడు రకాల ధాన్యాలు వేయించి అన్నింటిని కలిపి కూడా పైన చెప్పిన విధంగా పిండిని తయారుచేయవచ్చును.

– సౌ. క్షమా రాణే, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (ఫిబ్రవరి 2020)

3 అ 5 అ 3. గోధుమ లేదా రాగులతో తయారైన ‘సత్వ’

రాగుల సత్వ

‘గోధుమ లేదా రాగులను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి, తరువాత చాలా తక్కువ నీటిని పోసి రుబ్బాలి. ఈ పిండిని వడకట్టాలి. ‘సత్వ’ పొడి తయారవడానికి దీన్ని పూర్తిగా ఎండబెట్టడం అవసరం. ఈ పొడి పోషకమైనది మరియు దీనిని నీరు లేదా పాలతో ఉడికించి, రుచికి చక్కెర లేదా బెల్లం కలిపిన తరువాత తినవచ్చు. ఈ పొడి సాధారణంగా 3 నెలలు వుంటుంది.’ – సౌ. అర్పితా దేశ్‌పాండే, సనాతన ఆశ్రమం, మీరజ్‌, మహారాష్ట్ర. (ఫిబ్రవరి 2019)

3 అ 5 అ 4. యంత్రాలను వుపయోగించి చేయబడిన పోషకమైన ఆహార పదార్థాలు

పాల పొడి, చిన్న పిల్లల కొరకు పౌష్టికమైన ఇతర పొడులను సేకరించి పెట్టుకోవచ్చు. జర్సీ లాంటి విదేశీ ఆవు పాలు మన శరీరానికి హానికారకం అని పరిశోధనలో నిరూపించబడింది. అందువల్ల దేశీ ఆవు పాల పొడి దొరికితే దానినే సేకరించి పెట్టుకోవచ్చు.

3 అ 5 ఆ. ఎండలో ఎండబెట్టిన రొట్టెలు మరియు గోధుమలతో తయారు చేసిన బొబ్బట్లు.

3 అ 5 ఆ 1. జొన్న మరియు సజ్జలు రొట్టెలు

జొన్న రొట్టెలు

ఈ రొట్టెలను తయారుచేసే ముందు, మీరు రుచి కోసం పిండిలో కారం, ఉప్పు మరియు హింగువ కలుపవచ్చు.

అ. జొన్న పిండితో చాలా సన్నని రొట్టెలను తయారు చేసి ఎండలో బాగా ఆరబెట్టండి. ఈ రొట్టెలు దాదాపు ఒక నెల పాటు నిలువ వుంటాయి.

ఆ. సజ్జల పిండితో చాలా సన్నని రొట్టెలను తయారు చేసి ఎండలో బాగా ఆరబెట్టండి. ఈ రొట్టెలు జొన్న పిండితో చేసిన వాటి కంటే రుచిగా వుంటాయి. ఇవి దాదాపు 2 నెలలు వుంటాయి.

ఎండబెట్టిన రొట్టెలను గాలి చొరబడని గాజు సీసాలలో భద్రపరచాలి. ఈ మొక్కజొన్న రొట్టెలను ముక్కలుగా చేసి, వేడి కూరతో తినవచ్చు.

3 అ 5 ఆ 2. బెల్లపు బొబ్బట్లు

బెల్లపు బొబ్బట్లు

బెల్లంతో నింపిన రొట్టెలను బాగా వేయించుకోండి. రొట్టెను కాల్చిన తరువాత, పూర్తిగా చల్లబరచండి. రొట్టెలు వేడిగా ఉన్నప్పుడు ఒకదానిపై మరొకటి వుంచవద్దు. రొట్టెలు చల్లబడిన తర్వాత, వాటిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచండి. ఇటువంటి రొట్టెలు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం వుంటాయి.

3 అ 5 ఆ 3. ఖాక్రా

Khakra -ఖాక్రా

ఎండబెట్టిన మెంతి ఆకు పొడి (కసూరి మేతి), జీలకర్ర, పులుపు రుచి(ఎండబెట్టిన మామిడికాయ పొడి) కలిగివున్న పొడులు మరియు మసాలా మిశ్రమాలను (ఉదాహరణకు, చాట్‌ మసాలా, గరం మసాలా మొదలైనవి) జోడించడం ద్వారా ఖాక్రా తయారు చేయవచ్చు. గోధుమ పిండిలో కావలసిన మసాలా దినుసులు వేసి గట్టి పిండి ముద్దను తయారు చేయవలెను. ఈ పిండితో చాలా సన్నని రొట్టెలు చేయవలెను. పేనం మీద వేయించుకునేటప్పుడు, పొంగకుండా శుభ్రమైన వస్త్రంతో నొక్కుతూ తక్కువ మంట మీద వేయించుకోవలెను. తరువాత రొట్టెను పూర్తిగా చల్లారనివ్వాలి.దీనిని ఖాక్రా అంటారు. ఖాక్రాలు పూర్తిగా చల్లబడిన తరువాత, వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచవలెను. ఈ ఖాక్రాలు దాదాపు 3 నెలలు వరకు నిలువ వుంటాయి.

3 అ 5 ఇ. గోధుమ పిండి మరియు ఇతర చిరుధాన్యాలనుండి తయారు చేయబడిన తీపి లడ్డూలు

గోధుమ పిండి లడ్డూలు

గోధుమ పిండి మరియు చక్కెర పొడి లేదా బెల్లం నుండి తయారైన లడ్డూలు, 1-2 నెలల పాటు నిలువ వుంటాయి. రాగి పిండి, సెనగ పిండి, పెసర పిండి మొదలైన వాటితో తయారు చేసిన లడ్డూలు కూడా 1-2 నెలల పాటు వుంటాయి.

3 అ 5 ఈ. మామిడి మరియు పణస రొట్టె

పణస రొట్టె

వీటిని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండిన మామిడికి వేడి నీటిని కలిపినప్పుడు, దానిని సాధారణ రొట్టెతో పాటు తినవచ్చు. మామిడి మరియు పనస రొట్టె దాదాపు ఒక సంవత్సరం పాటు నిల్వ వుంటాయి.

– (పూజ్యులు.) వైద్యులు వినయ్‌ భావే, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (జనవరి 2020)

3 అ 5 ఉ. మామిడి పండు గుజ్జు (రసము)

మామిడిపండు గుజ్జు

1. చక్కెర మరియు మామిడి గుజ్జును సమానమైన కొలతలో కలపి, మిశ్రమాన్ని పూర్తిగా ఎండే వరకు ఎండలో ఎండబెట్టండి. అటువంటి ఎండిన గుజ్జును ఫ్రిజ్‌లో వుంచితే, ఇది దాదాపు ఒక సంవత్సరము నర లేదా రెండు  సంవత్సరాలు వుంటుంది మరియు గాలి చొరబడని డబ్బాలో ఇది దాదాపు 1 సంవత్సరం వుంటుంది.

2. చక్కెర మరియు మామిడి గుజ్జును సమాన మొత్తంలో కలపి, మిశ్రమాన్ని గ్యాస్‌ లేదా మట్టి పొయ్యి మీద చిక్కగా అయ్యే వరకు వుడికించాలి. ఈ చిక్కగా ఉన్న గుజ్జు ఫ్రిజ్‌లో దాదాపు ఏడాది పాటు వుంటుంది. (ఫ్రిజ్‌లో వుంచకపోతే దీనిలో బూజు అభివృద్ధి చెందుతుంది.)

3 అ 5 ఊ. నిలువచేయదగిన మామిడి, మామిడికాయ తురుము (మామిడికాయ నుండి తయారైన తీపి మరియు కారం పచ్చడి) మొదలైనవి.

3 అ 5 ఊ 1. మామిడికాయ తురుము

ఇది మామిడికాయ లేదా మామిడి పండ్ల ద్వారా తయారు చేస్తారు. ఇది దాదాపు ఒక సంవత్సరం పాటు నిల్వ వుంటుంది.

3 అ 5 ఊ 2. మామిడికాయ తురుము (మామిడికాయ తురుములో తగినంత పదార్థాలు వేసి తయారు చేసిన మిశ్రణము) 

మామిడికాయ తురుము 15 నుండి 20 రోజులు ఎర్రటి ఎండలో పెట్టాలి. మామిడికాయ తురుము చాలా సంవత్సరాలు నిల్వ వుంటుంది.

3 అ 5 ఊ 3. ఉసిరి కాయ, మామిడికాయ, స్ట్రాబరి, కమలపండు(నారింజ) మొదలగు జెలి మరియు జామ్‌

 జెలి మరియు జామ్‌

ఇది దాదాపు ఒక సంవత్సరం పాటు నిల్వ వుంటుంది.

– సౌ. అర్పితా దేస్‌పాండే, సనాతన ఆశ్రమము, మిరజ్‌. (ఫిబ్రవరి 2019)

3 అ 5 ఎ. ఊరగాయలు మరియు ‘టమోటా సాస్‌”

3 అ 5 ఎ 1. ఊరగాయలు

అ. ఇంట్లో పెట్టిన ఊరగాయలు బాగుగా నిలువవుండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు : ఉసిరికాయ, పండు మిరపకాయ,  పచ్చి పసుపు కొమ్ములు మొదలైన ఊరగాయలను ఇంట్లో తయారు చేస్తే 1-2 సంవత్సరాలు నిల్వ వుంటాయి. ఉడికించిన నిమ్మకాయలతో చేసిన ఊరగాయ దాదాపు 4-5 సంవత్సరాలు ఉంటుంది. నిమ్మ ఊరగాయ అనారోగ్య వ్యక్తి యొక్క నాలుక రుచిని సక్రియం చేస్తుంది; అలాగే ఊరగాయ పాతగా అయినకొద్దీ, అది  ఎక్కువ రుచిగా  వుంటుంది.

అ 1. ఊరగాయ పెట్టుటకు ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కొని బాగా ఆరబెట్టవలెను. మామిడికాయ, నిమ్మకాయలు, ఉసిరికాయ, పచ్చి పసుపు కొమ్ములు, మిరపకాయలు మొదలగు వాటిని  కడిగి, శుభ్రంగా తుడిచి, ఆరబెట్టాలి. ఊరగాయకు అవసరమైన కారం పొడి, గల్లు ఉప్పు మొదలైన వాటిని వేయించవలెను, తద్వారా వాటిలోని తడిగా వున్నదంతా తొలగిపోతుంది. (అయోడైజ్డ్‌ ఉప్పు దాని తేమ కారణంగా ఊరగాయను త్వరగా పాడు చేస్తుంది. కాబట్టి ఊరగాయ తయారీలో అయోడైజ్డ్‌ ఉప్పు కంటే గల్లు ఉప్పుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది). ఊరగాయలో చక్కెర జోడించాలంటే, అది పొడిగా వుండాలి. అవసరమైతే ఊరగాయ చెడిపోకుండా ఆహార పరిరక్షణ పదార్థమును  వుపయోగించవచ్చును.

అ 2. ఊరగాయను పింగాణీ జాడి లేదా మందపాటి గాజు కూజాలలో నిల్వ చేయవలెను.

అ 3. ఊరగాయను ఒక జాడీలోకి నింపిన తర్వాత, ఊరగాయ ఉపరితలముపై గల్లు ఉప్పును చల్లవలెను.

అ 4. ఊరగాయ ఉపరితలముపై బూజు లాంటివి ఏర్పడకుండా నూనెతో తాలింపు సిద్ధం చేసుకొనవలెను. తాలింపు వేసిన నూనెను చల్లబడిన తరువాత ఊరగాయపై పోయాలి, ఊరగాయపై నూనె రెండు వేళ్ళ వెడల్పు లోతు ఉండవలెను.

అ 5. జాడీ యొక్క మూత బాగాన్ని శుభ్రమైన పొడి వస్త్రంతో తుడిచి, జాడీ యొక్క మూతను బిగించవలెను. జాడీ యొక్క మూతపై శుభ్రమైన పత్తి వస్త్రాన్ని కప్పి, దానిపై జాడీ మూతిని తాడుతో కట్టవలెను.

అ 6. ఊరగాయల జాడీని పొడి ప్రదేశంలో పెట్టవలెను. (పూర్వం, ఊరగాయలను ఎత్తున అలమరాల్లో లేదా ఇంట్లో దేవుని గదిలో వుంచేవారు.)

అ 7. భోజనము కొరకు ఊరగాయను మరల – మరల ప్రధాన జాడీలో నుండి తీసుకోకూడదు, మరియు ఒక వారానికి సరిపడునంత ఊరగాయను వేరే పాత్రలో తీసుకోవలెను. వీలైతే, స్నానం చేసిన తర్వాత మాత్రమే ప్రధాన జాడీ నుండి ఊరగాయను తీసుకొనవలెను. ప్రధాన కూజా నుండి ఊరగాయను తీసుకోవడానికి ఉపయోగించే పెద్ద గరిట, రోజువారీ ఉపయోగం కోసం ఊరగాయను నింపడానికి ఉపయోగించే చిన్న జాడీ మరియు వ్యక్తి చేతులు పొడిగా వుండవలెను. జాడీ నుండి ఊరగాయ తీసిన తరువాత, జాడీ వెలుపల శుభ్రమైన పొడి వస్త్రంతో తూడ్చి, ముందటిలా కట్టిపెట్టవలెను.

అ 8. రుతుస్రావం వున్న స్త్రీ ఊరగాయ గల ప్రధాన జాడీని స్పర్ష చేయరాదు(ముట్టుకోకూడదు). గ్రహణ సమయంలో కూడా ప్రధాన జాడీను స్పర్ష చేయరాదు.(ముట్టుకోకూడదు) మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతం లేదా ఇతర సముద్ర తీర ప్రాంతాలలో తేమతో కూడిన వాతావరణం కారణంగా, జాడీలో ఊరగాయ ఉపరితలంపై బూజు ఏర్పడే అవకాశాలు కొంచెం ఎక్కువగా వుంటుంది. అందువల్ల, వేడి మరియు పొడి వాతావరణాలతో పోల్చినప్పుడు అటువంటి ప్రదేశాలలో ఊరగాయ నిలువ(బాగుగా) వుండే కాలం తక్కువగా వుంటుంది.

– సౌ. అర్పితా దేశ్‌పాండే, సనాతన ఆశ్రమం, మీరజ్‌, మహారాష్ట్ర. (ఫిబ్రవరి 2019) మరియు శ్రీ ప్రసాద్‌ మైస్కర్‌, రత్నగిరి, మహారాష్ట్ర. (8.8.2019)

3 అ 5 ఎ 2. ‘టమోటా సాస్‌”

టమోటా సాస్‌

వినెగర్‌ (పదార్థాలు ఎక్కువ కాలము నిల్వ వుండుటకు కలిపే పుల్లటి ద్రవ్యము) ఉపయోగించకుండా తయారుచేసిన టమోటా సాస్‌ ఒక సంవత్సరం వరకు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చు. వినెగర్‌ తో తయారుచేసిన టమోటా సాస్‌ సాధారణ ఉష్ణోగ్రత వద్ద 6 నెలలు వుంటుంది మరియు రిఫ్రిజిరేటర్‌లో ఒక సంవత్సరము నర లేదా రెండు సంవత్సరాలు బాగుగా వుంటుంది.

3 అ 5 ఏ. పచ్చళ్ళు, మేత్కుట్‌ (పప్పుల కారం పొడి, కమ్మని పొడి) మొదలగు పదార్థాలు.

3 అ 5 ఏ 1. మామిడికాయ, ఉసిరికాయ మరియు చింతపండుతో తయారు చేసిన రోటి పచ్చళ్ళు

మామిడికాయ పచ్చడి

అ. మామిడికాయ పచ్చడి : చక్కెరతో చిక్కటి పాకం తయారు చేయండి. పాకంలో అవసరమైన మసాలా దినుసులు, వుడకబెట్టిన మామిడికాయ తురుము వేసి పచ్చడి తయారు చేసుకోవలెను. ఈ పచ్చడిని సగం మధ్యమ మక్కిన మామిడితో కూడా తయారు చేయవచ్చు. చక్కెరకు బదులుగా బెల్లం పాకంతో కూడా దీన్ని తయారు చేయవచ్చు.

ఆ. ఉసిరికాయ పచ్చడి : మామిడికాయ పచ్చడి మాదిరిగానే ఉసిరికాయ పచ్చడిని  కూడ తయారు చేయవచ్చు.

ఇ. చింతపండు పచ్చడి : చింతపండును అరగంట నీటిలో నానబెట్టి, దాని నుండి రసాన్ని పిసికి తీయవలెను. చక్కెర లేదా బెల్లంతో చిక్కటి పాకం తయారు చేసి దానికి చింతపండు రసం, కారం, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ధనియాలు – జీలకర్ర పొడి వేసి మిశ్రమాన్ని మరిగించాలి. అన్ని పదార్థాలు ఏకజీవమైన మరియు చక్కగా మరిగిన తరువాత గ్యాస్‌ను ఆపివేయండి.

ఈ పచ్చడి చల్లబడిన తరువాత, వాటిని గాజు పాత్రలో నిల్వ చేయవలెను. రిఫ్రిజిరేటర్లో వుంచితే అవి సంవత్సరం నర వుంటుంది; లేదా రిఫ్రిజిరేటర్ లేకుండ సుమారు 1 సంవత్సరం నిలువ వుంటుంది.

– సౌ. అర్పితా దేశ్‌పాండే, సనాతన ఆశ్రమం, మీరజ్‌, మహారాష్ట్ర. (ఫిబ్రవరి 2019)

3 అ 5 ఏ 2. వివిధ ప్రకారాల పొడులు మరియు మెంతుల పొడి (మేత్కుట్‌)

వేరుసెనగా, నువ్వులు, కారళే (నువ్వులలాంటి విత్తనాలలాగ వుండేవి, వాటికంటే కొద్దిగా పెద్దగా వుండేవి), జవస్‌, పొట్టు తీసిన సెనగలు(వీటిని ‘పుట్నాలు, పుటానీలు’ అని కూడ అంటారు.), కొబ్బరి మొదలగు పచ్చళ్ళు తయారు చేయవచ్చు. కమ్మని పొడి(మేత్కుట్‌) అన్నముపై వేసుకొని తినవచ్చు. ఈ పదార్థము పొడిగా(ఎండినట్టు) వుండటమువలన సాధారణంగా 3 మాసములు నిల్వ వుండును.’

– శ్రీమతి క్షమా రాణే, సనాతన ఆశ్రమము, రామనాథి, గోవా. (జనవరి 2020)

3 అ 5 ఐ. వడియాలు, పాపడాలు మొదలగు పదార్థాలు

వడియాలు

ఈ పదార్థాలు సాధారణంగా సంవత్సరమంత నిల్వ వుంటాయి.

1. వడియాలు : వడియాలను కొన్ని ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుస్తారు.

అ. వడియాలు పుచ్చకాయ (కలింగడ్‌) యొక్క తెలుపు మరియు ఆకుపచ్చ భాగము, పాల సోరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బొప్పాయి, క్యాబేజీ, ఇలాంటి రకరకాల కూరగాయలు, అలాగే సోయా బీన్‌ గింజల వంటి కూరగాయల వడియాలు కూడా తయారు చేస్తారు.

ఆ. చిలగడదుంప (రత్నపురపు గడ్డ) మరియు జొన్న వడియాలు నుండి ఖారవడియాలు (జొన్నపేలాల వడియాలు)

ఇ. పెసర పప్పు, మినప పప్పు, సెనగ పప్పు, మాత్‌ బీన్స్‌ (కుంకుమ పెసలు) మొదలైన పప్పులతో వడియాలను తయారు చేయవచ్చు. ఈ పప్పులన్నిటిని కూడ ఏకంగా కలిపి వడియాలను తయారు చేయవచ్చు.

వడియాలను కూరగా కూడా వండుకోవచ్చును. సొరకాయ, గుమ్మడికాయ మొదలైన వాటితో వడియాలు తయారు చేసేటప్పుడు అందులో ఉప్పు వేయకూడదు; ఎందుకంటే ఉప్పువలన కూరగాయ ఉడికించడం కష్టమవుతుంది. భోజనంతో పాటు తినాలనుకుంటే, మీరు వాటిలో ఉప్పు వేసుకోవచ్చును.

– సౌ. ఛాయ వివేక్‌ నాఫడే, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (మే 2020)

2. తురుము : చిలగడదుంప (రత్నపురపు గడ్డ) మరియు బంగాళదుంప తురుము

3. అప్పడాలు : మినుములు, పెసళ్ళు, బియ్యం, రాగులు మరియు అటుకుల  అప్పడాలు లేదా పనస గుజ్జు యొక్క అప్పడాలు

అప్పడాలు

4. జొన్నలు, బియ్యం, సగ్గుబియ్యం లేదా బంగాళదుంపల నుండి తయారు చేసిన అపడాలు, మీరు గోధుమ వడియాలు  కూడా తయారు చేసుకోవచ్చు.

5. వడియాల మిరపకాయలు మరియు పెరుగులోని మిరపకాయలు’

– సౌ. అర్పితా దేశ్‌పాండే, సనాతన ఆశ్రమము, మిరజ్‌. (పిబ్రవరి 2019)

3 అ 5 ఔ. దాహం మరియు కొంతవరకు ఆకలిని తగ్గించే పానీయాలు

3 అ 5 ఔ 1. నిమ్మకాయ, కమలపండు మరియు బత్తాయి (నారింజ) పానీయాలు

నిమ్మరసానికి సమాన కొలతలో చక్కెర వేసి ఒక గాజు కూజాలో నింపి చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు ఎండలో ఉంచండి. వేడి యొక్క తీవ్రతను బట్టి, చక్కెర కరిగిపోవడానికి సాధారణంగా 15 నుండి 30 రోజులు పడుతుంది.
నిమ్మకాయ మాదిరిగానే నారింజ మరియు తీపి నిమ్మ యొక్క సాంద్రతలు తయారు చేయవచ్చు. ఇవి శీతలీకరణ లేకుండా 2-3 సంవత్సరాలు ఉంటాయి. శీతలీకరణ వాటి రుచిని మారుస్తుంది, అందువల్ల ఇది శీతలీకరణమునకు పెట్టకూడదు.

3 అ 5 ఔ 2. మామిడికాయ చిక్కటి సాంద్రత

మామిడికాయను వుడకబెట్టి, గుజ్జును తీయవలెను, పన్నా చేయడానికి చక్కెర లేదా బెల్లం కలుపవలెను. ఈ పానీయాన్ని ఒక గాజు కూజాలో నింపి రిఫ్రిజిరేటర్‌లో పెట్టవలెను. ఇది ఒక సంవత్సరము లేదా సంవత్సరము నర వరకు వుంటుంది.

ఇలా ప్రాంతమనుసారంగా (ఉదా. కొంకణా ప్రాంతంలో ‘కోకం సాంద్రత’) మరియు కాలానుగుణ పండ్లను బట్టి, వివిధ రకాల పండ్ల గుజ్జులను దీర్ఘకాలిక సాంద్రతగా తయారు చేయవచ్చును.

– సౌ. అర్పితా దేశ్‌పాండే, సనాతన ఆశ్రమం, మీరజ్‌, మహారాష్ట్ర. (ఫిబ్రవరి 2019)

3 అ 5 ఐ. ఎక్కువ పోషకాలతో కూడిన బిస్కిట్లు, 5 సంవత్సరాల పాటు నిలువ వుండే చాక్లెట్లు, ఎండు ఫలములు మొదలైనవి.

Shelf Life Chocolates – షెల్ఫ్ లైఫ్ చాక్లెట్లు

ఆపత్కాలములో  ఆకస్మిత్తుగా వున్నా ప్రదేశం నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం రావచ్చు. కొన్ని కారణాల వల్ల క్రొత్త ప్రదేశంలో చిక్కుకుపోయే పరిస్థితి రావచ్చు. ఇటువంటి పరిస్థితులలో అప్పుడప్పుడు, ఆహారం అందుబాటులో వుండకపోవచ్చు. ఈ పరిస్థితులలో, పైన పేర్కొన్న ఆహార పదార్థాలు చాలా ఉపయోగకరంగా వుంటాయి.

సేకరణ : సనాతన గ్రంథమాల  ‘ ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత’

భాగము 4 చదవండి ‘ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 4

(ప్రస్తుత లేఖనములో సర్వహక్కులు (Copyright) Sanatan Bharathiya Sanskruti Sanstha వద్ద సురక్షితంగా వున్నవి.)

సంగ్రహకర్తలు : పరాత్పర గురువులు డా. జయంత్‌ బాళాజీ ఆఠవలె

Leave a Comment