దేవతల పేరును, రూపాన్ని, చిత్రకళ, మూర్తికళ, నాటకాలు, కావ్యాలు మొదలైన వాటి ద్వారా అవమాన పరచడం లేదా మానవీకరణ చెయ్యడం వీటిని అడ్డుకోకపోవడం కూడా మహా పాపమే !
దేవతల అవహేళనలను ఇలా అడ్డుకోండి !
- దేవతలను అవహేళన చేసే చిత్రాల/మూర్తుల ప్రదర్శనలను చట్టరీత్యా అడ్డుకోండి !‘సంతకాల సేకరణ’, ‘నిషేధ సభ’ల ద్వారా దేవతల అవహేళన గురించి జాగృతి పరచండి !దేవతలను అవమానించే వ్యక్తి, సమూహం, సంస్థ మొ॥ వారి విరుద్ధం ‘భారతీయ దండ విధానం’ లోని ‘295 అ’ కనుగుణంగా పోలిసులకు ఫిర్యాదు చేయండి !
- అవహేళన చేసే వారిని బహిష్కరించండి !
- దేవతల వేషాలలో భిక్షాటన చేసేవారికి డబ్బులివ్వకండి, వారి వేషం తీయించండి !
- దేవతలను అవమాన పరిచే చిత్రాలు, దూరదర్శన కార్యక్రమాలు, పాటలు, నాటకాలు మొ॥ వాటిని బహిష్కరించండి !
- దేవతలను అవమానించే వ్యాసాలు మరియు వ్యంగ్య చిత్రములను ప్రచురించే వార్తా పత్రికలను చదవకండి, పిల్లలకు చూపించకండి !