హిందువుల సంవత్సరారంభము అనగా సంవత్సర పాడ్యమి అనగా ఉగాది. ఈ రోజున సూర్యుడు ఉదయించిన వెంటనే బ్రహ్మధ్వజము యొక్క పూజ చేసి బ్రహ్మధ్వజమును నిలబెట్టాలి, అని శాస్త్రములో చెప్పబడినది. బ్రహ్మధ్వజము యొక్క పూజ శాస్త్రానుసారంగా ఎలా చెయ్యాలి, ఇది మంత్ర పఠనతో పాటు ఇక్కడ ఇవ్వబడినది. ప్రత్యక్షంగా బ్రహ్మధ్వజము ఏ చోట నిలబెట్టుతామో ఆ చోట బ్రహ్మధ్వజమును నిలబెట్టి పూజించవలెను.
ప్రత్యక్ష పూజావిధీ
సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణోభ్యో నమో నమః
1. ఆచమానము చేయుట :
‘ఎడమ చేతిలో ఉద్ధరణి (చెంచా) తీసుకోవాలి. ఆ ఉద్ధరణితో (చెంచాతో) కుడిచేతిపై నీళ్ళు పోసుకోవాలి. ఈ క్రింద ఇవ్వబడిన పేర్లను పలుకుతు కృతి చేయాలి.
శ్రీ కేశవాయ నమః
(కుడి అరచేతిలో నీరు తీసుకొని త్రాగాలి)
శ్రీ నారాయణాయ నమః
(కుడి అరచేతిలో నీరు తీసుకొని త్రాగాలి)
శ్రీ మాధవాయ నమః
(కుడి అరచేతిలో నీరు తీసుకొని త్రాగాలి)
శ్రీ గోవిందాయ నమః
(ఇలా పలుకుతు చేతిపై నుండి పూజపళ్ళెములో నీళ్ళను వదలేయాలి.)
(చేతులను తూడ్చుకొని తరువాత చేతులను జోడించి నమస్కరించాలి.)
‘శ్రీ విష్ణవే నమః’ నుండి ‘శ్రీ కష్ణాయ నమః’ వరకు గల శ్రీ విష్ణు యొక్క 20 నామములను పలకాలి.
‘శ్రీ విష్ణవే నమః శ్రీ మధుసూదనాయ నమః శ్రీ త్రివిక్రమాయ నమః శ్రీ వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీహ్రుషికేశాయ నమః శ్రీ పద్మనాభాయ నమః శ్రీ దామోదరాయ నమః శ్రీ సంకర్షణాయ నమః శ్రీ వాసుదేవాయ నమః శ్రీప్రద్యుమ్నాయ నమః శ్రీ అనిరుద్ధాయ నమః శ్రీ పురుషోత్తమాయ నమః శ్రీ అధ్యోక్షజాయ నమః శ్రీ నారసింహాయ నమః శ్రీ అచ్యుతాయ నమః శ్రీ జనార్ధనాయ నమః శ్రీ ఉపేంద్రాయ నమః శ్రీ హరయే నమః శ్రీ కష్ణాయ నమః ’
2. పునరాచమ్య
పునరాచమ్య అనగా ముందు పేర్కొన్న విధంగా మళ్ళీ ఒకసారి ఆచమనము చేయ్యాలి.
3. చేతులను జోడించి బ్రహ్మధ్వజానికి నమస్కారం చేస్తు పలుకుట
బ్రహ్మధ్వజానికి నమస్కారం చేయడం
ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః.
4. దేశ-కాల కథనం
కళ్ళకు నీటిని అద్దుకోవాలి. (భారత దేశంలో ప్రజలు చెప్పవలసిన దేశ కాలం)
శ్రీమద్భాగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అధ్య బ్రహ్మణో ద్వీతీయే పరార్ధే విష్ణుపదే శ్రీశ్వేత-వారాహకల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే యుగే యుగేచతుష్కే కలియుగే కలి ప్రథమ చరణే జంబుద్ధిపే భరతవర్షే భరతకాండే దక్షిణాపథే రామక్షేత్రే బౌద్ధావతారే దండకారణ్యే దేశే గోదావర్యాః దక్షిణతిరే శాలివహాన శకే అస్మిన్ వర్తమానే వ్యవాహారికే శార్వరీ నామ సంవత్సరే, ఉత్తరాయణే, వసంత ఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, ప్రతిపద తిథౌ, మంద వాసరే, రేవతీ దివస నక్షత్రే యోగే, బవ కరణే, మీన స్థితే వర్తమానే శ్రీచంద్రే, మీన స్థితే వర్తమానే సూర్యే, ధను స్థితే వర్తమానే శ్రీదేవగురౌ, ధను స్థితే వర్తమానే శ్రీశనైశ్చరౌ ఎవం గ్రహగుణవిశేషణవిశిష్టాం శుభపుణ్యతిథౌ
5. సంకల్పం చేయుట
పాత్రలో వున్న అక్షింతలను కుడిచేతి వ్రేళుతో తీసుకొని అరచేతిని పై దిశకు చేయాలి. తరువాత బొటనవ్రేళు వదిలితే మిగిలిన నాలుగువ్రేళ్ళపై నుండి అక్షింతలను నిధానంగా అరచేతిపైకి జారిపించాలి. స్వంత గోత్రము మరియు పేరును ఉచ్చరించవలెను, ఉదా. ‘కాశ్యప గోత్రము మరియు బాలకష్ణుడి పేరు’ వున్నచో ‘కాశ్యప గోత్రే ఉత్పన్నః బాలకష్ణ శర్మా అహం’, అని చెప్పాలి మరియు తరువాత సంకల్పము చేయాలి.
‘అస్మాంకం సర్వేషాం, సహా కుటుంబానాం, సహాపరివారాణాం, క్షేమ, స్థైర్య, అభయ, విజయ, ఆయుఃఆరోగ్య ప్రాప్తర్థ అస్మిన్ ప్రాప్త నూతన వత్సరే, అస్మద్ గహే, అబ్దాంత్‌ః నిత్య మంగళ అవాప్తయే ధ్వజారోపణ పూర్వకం పూజనం తథా ఆరోగ్య అవాప్తయే నింబపత్రం భక్షణం చ కరిష్యే నిర్విఘ్నతా సిద్ధార్థ మహాగణపతి పూజనం/స్మరణం కరిష్యే కలశ, ఘంటా, దీప పూజాం కరిష్యే’.
(అర్థము : మేము మా కుటుంబంతో పాటు, విస్తరించిన కుటుంబంతో కలిపి అందరికి సంక్షేమం, స్థిరత్వం, నిర్భయత్వం, విజయం, దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ పొందాలని కోరుకుంటూ మేము ఈ పూజను చేస్తున్నాము, మరియు మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మేము ఈ నిమ్మ ఆకును తింటున్నాము. వేడుకను నిర్విఘ్నంగా జరుగుటకు మహాగణపతిని ఆరాధిస్తున్నాము. కలశం, గంట మరియు వెలిగించిన దీపాన్ని ఆరాధిస్తున్నాము.)
(‘కరిష్యే’ అంటూ కుడి చేతులోని అక్షింతలపై నీళ్ళు పోసి పూజాపళ్ళెములో వదలేయాలి మరియు చేతులను తూడ్చుకోవాలి. ఎవరికైతే గణపతి పూజ చేయుట తెలుసో వారు ‘పూజన్ కరిష్యే’,అని చెప్పాలి మరియు పోకకు లేదా టెంకాయకు గణపతి పూజ చేయాలి. ఎవరికైతే గణపతి పూజ చేయుట రాదో వారు ‘స్మరణం కరిష్యే’, అని చెప్పాలి మరియు క్రింద చెప్పిన విధంగా స్మరణ చేయాలి.)
6. శ్రీ గణపతి స్మరణ
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
మహాగణపతిమ్ చిన్తయామి నమః
అర్థము : ఓ మహాగణపతి, నేను నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను మరియు నమస్కరిస్తున్నాను! దయచేసి నా పనులన్నీ చిక్కులు మరియు అడ్డంకులు లేకుండా పూర్తి చేయండి.
7. కలశము, గంట, దీపమును పూజించుట
గంధము, పువ్వులు మరియు అక్షతలను అర్పించడం ద్వారా కలశం, గంట, దీపం పూజించవలెను.
1. కలశాయ నమః సకల పూజార్థే గంధాక్షత పుష్పమ్ సమర్పయామి
ఓ కలశమా : నేను మీకు నమస్కరిస్తున్నాను. నేను మీ పూజకు గంధము, అక్షతలు, పువ్వులు సమర్పిస్తున్నాను.
2. ఘంటికాయై నమః సకల పూజార్థే గాంధక్షత పుష్పమ్ సమర్పయామి
గంటకు : నేను మీకు నమస్కరిస్తున్నాను. నేను మీ పూజకు గంధము, అక్షతలు, పువ్వులు సమర్పిస్తున్నాను.
3. దీపదేవతాభ్యో నమః సకల పూజార్థే గాంధక్షత పుష్పమ్ సమర్పయామి
ఓ దీపదేవతా : నేను మీకు నమస్కరిస్తున్నాను. నేను మీ పూజకు గంధము, అక్షతలు, పువ్వులు సమర్పిస్తున్నాను.
8. బ్రహ్మధ్వజ పూజ
బ్రహ్మధ్వజ పూజ
ఓం బ్రహ్మధ్వజాయ నమః । ధ్యాయామి ।
(నమస్కారము చేయాలి)
ఓం బ్రహ్మధ్వజాయ నమః । విలేపనార్థే చందనం సమర్పయామి ।
(గంధం సమర్పించాలి.)
ఓం బ్రహ్మధ్వజాయ నమః । మంగళార్తే హరిద్రం సమర్పయామి ।
(పసుపు సమర్పించాలి)
ఓం బ్రహ్మధ్వజాయ నమః । మంగళార్తే కుంకుమమ్ సమర్పయామి ।
(కుంకుమ సమర్పించాలి)
ఓం బ్రహ్మధ్వజాయ నమః । మంగళర్తే అక్షతాం సమర్పయామి ।
(అక్షతలు సమర్పించాలి)
ఓం బ్రహ్మధ్వజాయ నమః । పూజార్తే పుష్పం, తులసీపత్రమ్, దూర్వాంకురన్, పుష్పమాలాంచ సమర్పయామి ।
(పువ్వులు, తులసి ఆకులు, దుర్వ మరియు పూల దండను సమర్పించాలి)
ఓం బ్రహ్మధ్వజాయ నమః । ధూపం సమర్పయామి ।
(అగరుబత్తి వెలిగించి, దేవత ముందు వృత్తాకారంలో త్రిప్పాలి.)
ఓం బ్రహ్మధ్వజాయ నమః । దీపం సమర్పయామి ।
(నేను వెలిగించిన దీపమును సమర్పిస్తున్నాను. వెలిగించిన నూనె దీపాన్ని దేవుని ముందు వృత్తాకారంగా త్రిప్పాలి.)
9. నైవేద్యం (దేవునికి నైవేద్యము సమర్పించుట)
కుడిచేతితో 2 తులసి ఆకులతో నీటిని తీసుకొని, దేవుని నైవేద్యం పళ్ళెం చుట్టూ సవ్యదిశలో (వృత్తాకారంలో) త్రిప్పుతూ చల్లాలి. ఈ 2 తులసి ఆకులతో నీటిని నైవేద్యంపైన చల్లి, ఒక తులసి ఆకును నైవేద్యంపైన ఉంచాలి. మరొక తులసి ఆకును బ్రహ్మధ్వజం చరణాల్లో సమర్పించాలి.
ఓం బ్రహ్మధ్వజాయ నమః । నైవేద్యార్థే పురస్థాపిత (ప్రసాదంగా సమర్పిస్తున్న ఆహారపదార్ధం పేరు చెప్పాలి) నైవేద్యం నివేదయామి । ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా ఈ మంత్రాలను జపించడంతో పాటు, కుడి చేతి యొక్క ఐదు వేళ్ళను కలిపి, నైవేద్యంనుండి దేవుని వైపుకు నైవేద్యం యొక్క సువాసనను నివేదన చేస్తున్నట్లుగా చూపించాలి, లేదా చేతులను జోడించి నమస్కారం చేస్తూ మంత్రాలు చెప్పాలి.
తరువాత మీ కుడి అరచేతిలో కొద్దిగా నీరు తీసుకొని సమర్పయామి అని చెప్పి, రాగి పళ్ళెంలో వదిలేయాలి.
బ్రహ్మధ్వజాయ నమః । నైవేద్యం సమర్పయామి । మద్యే పానీయం సమర్పయామి । ఉత్తరాపోషణం సమర్పయామి। హస్త ప్రక్షాళనం సమర్పయామి । ముఖ ప్రక్షాళనం సమర్పయామి । కుడి చేతిలో గంధం, పువ్వులు తీసుకొని పవిత్ర బ్రహ్మధ్వజం వద్ద అర్పించండి.(కరోద్వర్తనార్థే చందనం సమర్పయామి । ఓం బ్రహ్మధ్వజాయ నమః । ముఖవాసార్థే పూగిఫల తాంబూలం సమర్పయామి । ఆకు మీద నీరు వదలాలి. ఓం బ్రహ్మధ్వజాయ నమః । ఫలార్థే నారీకేళ ఫలం సమర్పయామి । కొబ్బరికాయ మీద నీరు వదలాలి.
10. హారతి చేయడం
మంగళ హారతి పడుతూ వెలిగించిన దీపాన్ని దేవుని ముందు వృత్తాకారంలో త్రిప్పాలి. గణపతి యొక్క హారతి చేయాలి.
ఓం బ్రహ్మధ్వజాయ నమః । మంగళార్థీక్య దీపం సమర్పయామి ।
(నేను హారతిని సమర్పిస్తున్నాను.)
11. కర్పూరం సమర్పించుట
కర్పూరం బిళ్ళను వెలిగించి వృత్తాకారంలో త్రిప్పాలి
ఓం బ్రహ్మధ్వజాయ నమః | కర్పూర దీపం సమర్పాయమి (నేను కర్పూర హారతిని సమర్పిస్తున్నాను.)
12. ప్రదక్షిణ
ఓం బ్రహ్మధ్వజాయ నమః । (నేను బ్రహ్మధ్వజంకు నమస్కరిస్తున్నాను) ప్రదక్షిణ సమర్పయామి ।
(నేను మీకు ప్రదక్షిణ సమర్పిస్తున్నాను) (వీలైతే బ్రహ్మధ్వజంకు ప్రదక్షిణ చేయండి, లేకపోతే మీరు మీ చుట్టు ప్రదక్షిణ చేయండి.)
13. నమస్కారం చేయుట
రెండు చేతులూ జోడించి దేవుని ముందు నమస్కరించడం.
‘ఓం బ్రహ్మధ్వజాయ నమః నమస్కారం సమర్పయామి ’ (నేను నమస్కారం చేస్తున్నాను.)
14. ప్రార్థన
‘బ్రహ్మధ్వజ నమస్తేస్తు సర్వాభీష్ట ఫలప్రదం ।
ప్రాప్తేస్మిన్ వత్సరే నిత్యమ్ మద్గహే మంగళం కురు ॥’
అర్థం : అన్ని ఇష్టమైన ఫలములను ప్రసాదించే ఓ బ్రహ్మధ్వజ దేవా, మీకు నేను నమస్కరిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో, ప్రతిరోజూ మా ఇంటిలో ఎల్లప్పుడు మంగలమైన అనగా మంచి విషయాలు జరుగునట్లు అనుగ్రహించండి.
అనేన కృత పూజనీన్ బ్రహ్మధ్వజః ప్రియతామ్. (కుడి అరచేతిలో అక్షతలు తీసుకొని దానిపై నీళ్ళు వేసి, ‘విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః ’- అని 3 సార్లు జపిస్తూ పళ్ళెంలోకి వదిలేయాలి, మరియు ముందు చెప్పినట్లుగా నీరు 2 సార్లు అరచేతిలో తీసుకొని త్రాగాలి.
15. ప్రసాదము తీసుకొనుట
వేపాకు తినడము.’
దయచేసి అగ్నిహోత్రం గురించి పూర్తిగా తెలుగులో మేటర్ ఇవ్వగలరు.
Namaskar R. Uma mahesh ji,
Please visit https://www.sanatan.org/telugu/category/survive-during-the-adverse-times/agnihotra to know about agnihotra.