శివుని రూపాలు

ఈ లేఖలో రుద్ర, కాలభైరవ, వీరభద్ర, నటరాజ, భూతనాథ మొదలగు శివుడి వివిధ రూపములు మరియు వారి కార్యముల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

 

1. రుద్రుడు

‘రుద్ర’ ఈ పదమునకు కొన్ని అర్థాలు కింద ఇవ్వబడినవి.

1అ. రు అనగా ఏడవడం మరియు ద్ర అనగా పరుగెత్తడం. రుద్ర అనగా ఏడ్చేవాడు, ఏడిపించువాడు, ఏడుస్తూ ఏడుస్తూ పరుగెత్తువాడు. దేవుడు దర్శనమివ్వాలని ఏడ్చువాడు.

1ఆ. రుత్ అనగా సంసారము యొక్క దుఃఖం. ఏది దీనిని దూరము చేయునో, నష్టం చేయునో అది రుద్ర.

 

2. అర్ధనారీనటేశ్వరుడు (అర్ధనారీశ్వరుడు)

ఎప్పుడైతే శివుడు శక్తియుక్తుడవుతాడో (శక్తిని కలిగియుంటాడో) అప్పుడే కార్యనిరతుడవుతాడు. శివాగమంలోని అదె్వైతములో, శక్తి అనగా, మాయను విడవకుండనే బ్రహ్మ శక్తిగా ఆమెను సంగ్రహించెను. శివ-శక్తిల నిత్య సామరస్యమే అదె్వైతము.

 

3. బేతాళుడు

బేతాళ్ (వేతాళ) పదము ‘వైతాల’ పదము నుండి వచ్చినది. వైతాల అంటే వికృతులను తన ఇష్టప్రకారంగా ఆడించువాడు. ఆహత మరియు అనాహత నాదములు ఎక్కడైతే కలుస్తాయో, ఆ స్థానంలో ‘వై’ అను స్పందనలు నిర్మాణమవుతాయి. ఈ స్పందనలు వికృతులను సరియైన మార్గములోనికి తెచ్చును.

 

4. నటరాజు

శివునికి రెండుస్థితులు వుంటాయి. ఇందులో ఒకటి సమాధి స్థితి, రెండవది తాండవ స్థితి లేక లాస్యనృత్యావస్థ. సమాధి స్థితి అంటే నిర్గుణ స్థితి మరియు నృత్య స్థితి అంటే సగుణస్థితి. ఏదైనా నిశ్చిత ఘటనను లేక విషయమును వ్యక్త పరచుటకు శరీర అవయవాలను హావ-భావముల సహితంగా కదిలించుటను నటన లేక నాట్యము అంటారు. ఇలా నటించు వాడిని నటుడు అంటారు. శివుడు నాట్యకళను ప్రారంభించినందున అతడు ఆద్యనటుడని, తరతరాలుగా నమ్మతున్నందున అతనికి ‘నటరాజు’ అనే బిరుదు వచ్చినది. బ్రహ్మాండము నటరాజుని నృత్యశాల. అతడు ఏ విధంగా నర్తకుడో, అలాగే దానికి సాక్షికూడా (చూసేవాడు) అతడే. ఎప్పుడు ‘అతని నృత్యము ప్రారంభమగునో, ఆ నృత్యము యొక్క ఝూంకారము నుండి ఈ సంపూర్ణ విశ్వము నడుచుటకు కావలసిన చలనము దొరుకును. నృత్యము సమాప్తమైనప్పుడు ఈ చరాచర విశ్వమును తనలో విలీనము చేసుకొని అతడొక్కడే ఆనందములో నిమగ్నమౌతాడు’, ఇదే నటరాజు వెనుకటి భూమిక. నటరాజు నృత్యము సృష్టి, స్థితి, లయ, తిరోభావము (మాయలో చిక్కుకోవడం), లేక అనుగ్రహము (మాయ నుండి బయట పడుటకు కృప) ఈ ఐదు ఈశ్వరీ క్రియలకు ప్రతీకం.

శివుడు స్వతఃగా తను చేసిన నృత్యమును ‘తండూ’ (ఒకముఖ్య శివగణము) అనే ద్వారా భరతమునికి చేసి చూపించాడు. తండూకుడు ప్రదర్శించిన నృత్యమును ‘తాండవ’ నృత్యమని భరతాది మునులు మానవులకు నేర్పించారు.

తాండవనృత్యము

ఏ నృత్యము చేయునప్పుడు శరీరములోని ప్రతి ఒక్క కణములో శివకార నాదము ఉద్భవించునో, ఆ నృత్యమును తాండవ నృత్యము అంటారు. ఇది పురుష నృత్యముగా ముద్రాంకితమైనది. ఉదా : జ్ఞానముద్ర – బొటనవేలు, చూపుడువేలు యొక్క కొనలను ఒకదానినొకటి కలుపుట. దీని నుండి గురు మరియు శుక్ర ఉబ్బులు జోడించబడతాయి. అంటే పురుషూడు మరియు స్త్రీ కలుస్తారు. ఈ విధంగా శివుడు లాస్యనృత్య మును చాలా ఆసక్తిగా పార్వతి ద్వారా భరతముని ముందు చేసి చూపించాడు. లాస్య స్త్రీ నృత్యము, దీనిలో చేతులు ఖాళీగా వుంటాయి.

కొన్ని ఇతర రూపాలు

కాలభైరవుడు, వీరభద్రుడు, భైరవ (భైరవనాథుడు), భూతనాథుడు, స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, మంగేష్, వైజనాత్, జ్యోతిబా, రవళనాథ్, ఖండోబా, భూతనాథ్, మ్హసోబా, శివధూత, జ్యోతిర్లింగము, బాణ (లింగము).

సందర్భము : సనాతన ప్రచురణ ‘శివుడు – భాగము 1’

1 thought on “శివుని రూపాలు”

Leave a Comment