తులసి వివాహం

తులసి వివాహము పండుగను జరుపుకునే విధానము, దీని విశిష్టత, తులసి దర్శనం యొక్క మహత్యము, తులసి మొక్కకు గల ఆధ్యాత్మిక మహిమ, తులసి మొక్క యొక్క ఆధ్యాత్మిక విలువ, ప్రతి ఏటా భగవాన్ శ్రీ కృష్ణ తో తులసి మొక్క యొక్క వివాహం చేయుటకు గల కథ మరియు దేవతలకు సమర్పించే నైవేద్యముపై తులసి ఆకును సమర్పించే కారణము వీటన్నిటికి సంబంధించిన వివరణ ఇక్కడ యిస్తున్నాము.

 

1. తిధి

ఈ విధిను కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు ఏదో ఒక రోజు చేసుకుంటారు.

 

2. పూజ విధానం

శ్రీ విష్ణు ( బాలకృష్ణుడు విగ్రహంతో) మరియు తులసి మొక్కకు వివాహం చేయడం అనేది ఈ తులసి వివాహంలో ముఖ్యమైన విధి. పాత కాలంలో బాల వివాహం పద్ధతి ఉండేది. వివాహం జరుపుకునే ముందు రోజు తులసి కోటను చక్కగా రంగులు పూసి సిద్ధం చేసుకుంటారు. తులసి వృందావనంలో చెరుకు కర్ర బంతి పువ్వులు మరియు చింత మరియు ఉసిరికాయలను సమర్పించి ఈ వివాహం కార్యక్రమాన్ని సాయంకాలం నిర్వహిస్తుంటారు.

 

3. విశిష్టత

తులసి వివాహం జరిపిన తర్వాత చాతుర్మాసములో ప్రారంభించిన వ్రతాలన్నిటిని ఈ రోజు విరమిస్తారు. చాతుర్మాసములో వర్జిo చిన పదార్థాలను ముందు బ్రాహ్మణులకు దానం చేసి తర్వాత స్వయంగా స్వీకరిస్తారు.

సందర్భము  : సనాతన గ్రంథం “పండుగలు ధార్మిక ఉత్సవాలు మరియు వ్రతాలు’’

తులసి వివాహం రోజున సాయంకాలం బ్రహ్మాండములో విష్ణు మరియు లక్ష్మి తత్వము గల సూక్ష్మాతి సూక్ష్మమైన తరంగాలు ఆగమిస్తాయి. వాతావరణములోని విష్ణు మరియు లక్ష్మి తత్వము యొక్క కార్యము బాగా అభివృద్ధి చెంది, ఈ తరంగాల సంయోగం ఏర్పడుతుంది. ఈ తరంగాల సంయోగ స్థితిని తులసి వివాహం అని అంటారు. తులసి రూపంలో లక్ష్మీదేవి మరియు శ్రీ కృష్ణుని రూపములో శ్రీ విష్ణుకు పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ రెండు తత్వాల లాభమును అధికంగా పొందుటకు సాయంకాలము తులసి వివాహాన్ని జరుపుకుంటారు. తులసి వివాహం కాలములోనే శ్రీ విష్ణు మరియు లక్ష్మి ఈ రెండు తత్వములు గల తరంగాల ఆగమన మరియు సంయోగం సిద్ధిస్తుంది. వాతావరణములోని సాత్వికత యొక్క లాభము పొందాలనుకుంటే తులసి వివాహం అనేది సుముహూర్త కాలములోనే జరుపుకోవాలి.

– ఒక విద్వాంసుడు (20.11.2004) (సద్గురువులు శ్రీమతి అంజలి గాడ్గీళ్ గారి మాధ్యమంగా)

 

4. తులసి దర్శనం యొక్క మహాత్వము

‘ప్రతి ఒక్క హిందువుల ఇంటి ఎదుట ఒక తులసి మొక్క తప్పనిసరి ఉండాలి’ అని సంకేతంగా ఉన్నది. ‘ఉదయము మరియు సాయంత్రము ప్రతి ఒక్కరూ తులసిని దర్శించుకోవాలి’ అని చెప్పబడింది. ఈ తులసి దర్శనం యొక్క మంత్రము ఈ విధంగా ఉన్నది.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే l
నమస్తే నారదనుతే నారాయణమనఃప్రియె ll – తులసి స్తోత్రం, 15 వ శ్లోకం

అర్థము : ఓ తులసి మాత, నువ్వు లక్ష్మి స్నేహితురాలు, శుభదా, పాప హరిణి మరియు పుణ్య దాయినిగా ఉన్నావు నారదుడు ద్వారా స్తుతింప బడిన మరియు విష్ణుమూర్తికి ప్రియమైన నీకు నా వందనములు.

 

5. తులసి యొక్క ఆధ్యాత్మిక విశిష్టత

5 అ. పాపనాశిని

తులసి దర్శనము, స్పర్శము, ధ్యానము, నమనము, రోపనము, సేవనము లాంటి చేయడము వలన యుగ యుగాల నుండి చేసిన అన్ని పాపాలు నశించిపోతాయి.

5 ఆ. పవిత్రత

తులసి వనం ఉన్న పరిసర ప్రాంతంలో కనీసం రెండు మైళ్లు దూరంలో ఉన్న భూమి గంగాతో సమానంగా పవిత్రంగా ఉంటుంది. ఈ సందర్భంలో వివరణ స్కందపురాణంలో(వైష్ణవ ఖండ, అధ్యాయం 8, 13 వ శ్లోకం లో) చెప్పడం జరిగింది.

తులసికాననం  చైవ గృహే యస్యావతిష్ఠతా l
తద్ గృహం తీర్థభూతం హి నాయంతి యమకింకరహః ll

అర్థము : ఏ ఇంటి ఎదుట తులసి వనము ఉంటుందో ఆ ఇల్లు తీర్థం వలె పవిత్రంగా ఉండి ఆ ఇంట్లో యమదూతలు కూడా ప్రవేశించడం జరగదు.

5 ఇ. సర్వ దేవతల నివాసం ఉండుట

తులసి మొక్కల వేర్లు లగాయితు ఆకులు దాకా కూడా సర్వాంగములో అన్ని దేవతల యొక్క నివాసం ఉంటుంది అని చెప్పడము జరిగింది .

5 ఈ . శ్రీ విష్ణువుకు పరమ ప్రియమైనది

1. బృందావనములో ఉండే తులసి మొక్క శ్రీ విష్ణు మూర్తికి అతి ప్రియమైనది.

2. తులసి దళం లేకుండా శ్రీ విష్ణువు యొక్క పూజ అపూర్ణమే, దీని సందర్భములో పద్మపురాణంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. సువర్ణాలు, రత్నాలు మరియు ముత్యాలతో కలిగిన పుష్పాలు శ్రీ విష్ణుకు సమర్పించిన సరే అవి ఒక తులసి దలము యొక్క 16వ భాగంలో ఉన్న కళకు సమానం కావు.

3. తులసీదలము పెట్టకపోతే లేదా తులసి దలముతో ప్రోక్షణ చేయకపోతే శ్రీవిష్ణు నైవేద్యాన్ని స్వీకరించడం జరగదు.

4. కార్తీక మాసంలో తులసి దలముతో చేసే శ్రీవిష్ణు పూజకు విశేషమైన మహత్యము ఉన్నది.

5. శ్రీవిష్ణు, శ్రీకృష్ణుడు అలాగే శ్రీ పాండురంగడి మెడలో తులసీ పత్రాలతో ఒత్తుగా కుచ్చిన దండలను అలంకరణ చేస్తారు.

సందర్భం : భారతీయ సంస్కృతి కోశం, 4వ ఖండం, 155 వ పేజీ

 

6. తులసి వివాహం ప్రతి ఏటా శ్రీకృష్ణునితోనే జరుపుటకు గల కథ !

జలంధర అని రాక్షసుడితో దేవతల యుద్ధము కొనసాగుతుండగా, జలంధర భార్య బృందా గొప్ప పతివ్రత స్త్రీ, ఆమె పతివ్రత బలము వలన దేవతల నుండి జలంధర వధింపబడలేదు. అప్పుడు శ్రీవిష్ణువు జలంధర రూపాన్ని ధరించి బృంద యొక్క పతివ్రతను బ్రష్ట పరచడము జరిగింది. ఆమె పతివ్రతతో ప్రసన్నుడై శ్రీవిష్ణు ఆమెకు ఒక వరం ఇచ్చాడు ‘బృందా ! నువ్వు తులసి మొక్కగా అందరకు పూజనీయగా ఉంటావు. నీ తులసీపత్రముతో నన్ను పూజిస్తారు మరియు ప్రతి సంవత్సరము కార్తీక మాసములో నీతో నా వివాహాన్ని జరుపుకుంటారు’. అందువలన విష్ణుమూర్తి పూర్ణ అవతారమైన భగవాన్ శ్రీ కృష్ణుడితో ప్రతి ఏటా కార్తీక శుక్లపక్ష ద్వాదశి నుండి పౌర్ణమి మధ్యలో ఒక రోజు శ్రీకృష్ణ మరియు తులసి వివాహం జరుపుకుంటారు.

 

7. దేవతలకు నైవేద్యము సమర్పించినప్పుడు తులసి దలమును ఎందుకు ఉపయోగించాలి ?

దేవతలకు నైవేద్యాన్ని సమర్పించినప్పుడు తులసి దలమును ఉపయోగిస్తే నైవేద్యము దేవత వద్దకు సహజంగా చేరుతుంది, అది సాత్వికంగా మారి వాటిపై చెడు శక్తుల ఆక్రమణమయ్యే తీవ్రత తగ్గుముఖం పడుతుంది.

7 అ. తులసి యొక్క విశిష్టత

తులసి మొక్క వాయుమండలములోని సాత్వికతను ఆకర్షింప చేసి జీవుడు వైపు ప్రసారింప చేసే కార్యమును చాలా గొప్పగా చేస్తుంటుంది. బ్రహ్మాండములో గల శ్రీకృష్ణ తత్వమును కూడా ఆకర్షింప చేస్తుంది.

7 ఆ. లాభము

1. తులసి దళాలతో నైవేద్యం సమర్పిస్తే సాత్వికమైన పదార్థముల నుండి ప్రసారించే సూక్ష్మ తరంగాలు తులసీదళము ద్వారా ఆకర్షింపబడుతాయి. ఇలా ఆకర్షింపబడే సూక్ష్మ తరంగాలతో నిండిన తులసి ఆకు నైవేద్యముతో సమర్పిస్తే దైవ తత్వము ద్వారా ఆ తరంగాలు తక్షణముగా గ్రహింపబడతాయి. ఎటువంటి నైవేద్య పదార్ధములను సమర్పించిన నైవేద్యము తులసిదలము మాధ్యమంగా దేవతలకు సహజంగా చేరి దేవతలు త్వరగా సంతోషించుటకు సహాయము అవుతుంది.

2. తులసీదళము ‘పదార్థములపై పెట్టడం వలన పదార్థములోని రజ-తమ కణాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. తులసిదళము ద్వారా ప్రసరించే సాత్విక తరంగాల ద్వారా నైవేద్యము చుట్టుప్రక్కల వాయు మండలము శుద్ధమై నైవేద్యము పై చెడు శక్తుల ప్రభావం అత్యల్పముగా ఉంటుంది.

3. బావపూర్ణంగా నైవేద్యము పై తులసి దళాన్ని ఉంచితే సునాయాసంగా దేవత నుండి వచ్చే చైతన్యమును బాగా ఆకర్షింప చేసి నైవేద్యములోకి చేరుటకు సహాయపడుతుంది మరియు ఆ ప్రసాదాన్ని సేవించే భక్తుడి దేహములో ఆ చైతన్యము సహజంగా చేరేందుకు ఈ తులసి ఆకు మంచి ఉపయోగకరము.

సందర్భం : సనాతన గ్రంథం ‘పంచోపచార మరియు షోడశోపచార పూజ యొక్క శాస్త్రము ‘

Leave a Comment