నరక చతుర్దశి

నరకాసుర రాక్షసుడి వధ సందర్భంలో నిర్వహించే దీపావళి లో గల ఈ పండుగ నిమిత్తంగా తెల్లవారుజామున సూర్యోదయం ముందు నిద్ర లేచి అభ్యంగన స్నానం చేస్తారు. ఇదే రోజున యమ దీపదానం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్ర దానం కూడా సమర్పిస్తారు. ఈ రోజూ ఆచరించే కృతుల శాస్త్రాన్ని ఈ లేఖ ద్వారా తెలుసుకుందాం.

 

నరకాసుర వధ

1. తిధి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి

2. చరిత్ర (ఇతిహాసము)

‘భాగవత పురాణంలో కథ ఈ విధంగా ఉంది – పూర్వకాలంలో ప్రాగ్ జ్యోతిష పూరం అని నగరంలో భౌమాసుర లేక నరకాసుర అనే పేరు కలిగిన అసుర గల రాజ్యం ఉండేది. వాడు దేవతలు మరియు మానవులకు బాగా ఇబ్బందిలు పెట్టేవాడు. ఈ క్రూరమైన రాక్షసుడు మహిళలుకు కూడా చాలా కష్టాలు కలిగించేవాడు. వాడు గెలుచుకున్న ప్రాంతం నుండి పదహారు వేల మంది వివాహం కాలేని రాజకన్యలను అపహరించి కారాగృహంలో బంధించాడు మరియు వారితో వివాహం చేసుకుందామని నిశ్చయం చేసుకున్నాడు. దీని మూలంగా ఎక్కడ చూసినా గోల గోల మొదలైంది. భగవాన్ శ్రీ కృష్ణునికి ఈ విషయం తెలిసిన తర్వాత సత్యభామ సహాయంతో వారు నరకాసురుడితో యుద్ధాన్ని ప్రారంభించి వాడిని హతమార్చి రాజ కన్నెలు అందరికి విముక్తిని ఇచ్చాడు. చచ్చిపోయే ముందు నరకాసురుడు శ్రీకృష్ణుని వద్ద ఒక కోరికను కోరాడు. అది ఏమనగా ఈ రోజు తిథి నాడు ఎవరైతే మంగళ స్నానం (అభ్యంగన స్నానం) చేస్తారు; వారికి నరక యాతన నుండి విముక్తి కలగాలి ! ఇది విన్నాక శ్రీ కృష్ణులవారు ‘తథాస్తు’ అనడంతో ఆ రోజు నుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి అనేది నరకచతుర్దశి గా నిర్వహించడం మొదలైంది. ఆ రోజే ఉదయం ప్రజలందరూ సూర్యోదయం ముందే అభ్యంగన స్నానం చేయడం ప్రారంభించారు. చతుర్దశి రోజున తెల్లవారు జామున నరకాసుర వధ ను పూర్తి చేసుకుని వాడి రక్తంతో సుజుకి పై తిలకాన్ని ధరించి శ్రీకృష్ణ వారు ఇంటికి చేరేసరికి మాతృమూర్తులు అందరూ ప్రేమతో కౌగిలించుకున్నారు మరియు స్త్రీ మూర్తులు అందరూ హారతి పళ్లెం తీసుకొని హారతి ఇచ్చి ఆత్యానందంతో స్వాగతం పలికారు.

3. మహత్యము

ముందు రోజు రాత్రి 12 గంటల నుండి వాతావరణం అంతా కూడా దూషితమైన లహరీలతో నిండి ఉంటుంది. ఎందుకంటే ఆ తిథి నాడే బ్రహ్మాండంలో గల చంద్రనాడి యొక్క స్థిత్యంతరము సూర్యనాడిలో జరుగుతుంది. ఆ స్థిత్యంతరము యొక్క లాభం పాతాళంలోగల చెడు శక్తిల ద్వారా పొందడం వలన పాతాళం నుండి ప్రసారమయ్యే నాదయుక్తమైన కంపన తరంగాలు వాతావరణంలో ఇబ్బందికరమైనటువంటి ధ్వనిని నిర్మాణం చేస్తుంటాయి. ఈ ధ్వని యొక్క నిర్మాణ తరంగాలలోని రజతమాత్మకమైన కణాల యొక్క కదలిక వలన ఉత్పన్నమయ్యే శక్తి నుండి జరుగుతూ ఉంటుంది. ఆ తరంగాలు విస్పోటక్ స్థితికి సంబంధించినదై ఉంటుంది. ఈ తరంగాల యొక్క ధ్వని కంపనాలపై నియంత్రణ చేయుట కొరకు తెల్లవారి జామున అభ్యంగన స్నానం చేసి నేతి దీపాలు పెట్టి వాటిని పూజిస్తారు. ఎందుకంటే దీపం ద్వారా వెలువడే తేజ తత్వానికి సంబంధించిన తరంగాల యొక్క మాధ్యమం ద్వారా వాతావరణంలో గల ఇబ్బందికరమైన తరంగాలలో గల రజతమాత్మకమైన కణాలు కరిగిపోతాయి. ఈ కరిగే ప్రక్రియ వలన అనేక సూక్ష్మ శక్తిలలో గల కోషంలోని రజ-తమ కణాలు కూడా కరిగిపోతాయి మరియు చెడు శక్తిల చుట్టూ ఉన్నా రక్షణ కవచం కూడా నశించిపోతుంది. దీనిని వాతావరణంలో దీపం సాయంతో జరిగినటువంటి అసుర శక్తి యొక్క సంహరం అని అంటారు. అందువలన ఈ రోజున చెడు శక్తిలయొక్క నాశనం చేసి దీపావళి మరియు ఇతర రోజులలో జీవుల ద్వారా శుభకార్యానికి ప్రారంభం చేయాలి. అసురులను అంతం చేసే రోజు అనగా ఒక రకమైన నరకం నుండి పృద్వి పై వచ్చినటువంటి చెడు శక్తిలు విఘటించే రోజు. అందువలన నరక చతుర్దశి రోజుకు ప్రత్యేకమైన మహిమ ఉన్నది. -సూక్ష్మ జగత్తు నుండి ఒక విద్వాంసుడు (శ్రీమతి అంజలి గాడ్గిల్ గారి ద్వారా 17. 5. 2005 రాత్రి 08:59

4. పండుగ జరుపుకునే విధానం

అ . ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే అనగా బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానము చేస్తారు. ఉత్తరేణి మొక్క కొమ్మతో తల నుండి పాదాల వరకు అలాగే పాదాలు నుండి తల వరకు నీరును జల్లుకుంటారు. దీని కొరకు ఉత్తరేణి మొక్క వేరుతో సహా ఉండాలి.

ఆ . యమతర్పణం – అభ్యంగన స్నానం అయిన తర్వాత అపమృత్యు నివారణార్థం యమతర్పణ విధిని చేయడం ఆనవాయితి. యమతర్పణం విధి యొక్క వివరణ పంచాంగంలో ఇస్తూంటారు. ఆ విధంగా చేయాలి. దాని తర్వాత తల్లి పిల్లలకు హారతిని ఇస్తుంది. కొన్ని ప్రాంతాలలో కొందరు అభ్యంగన స్నానం అయిన తర్వాత నరకాసుర వధకు ప్రతీకంగా చేదు రుచి కలిగిన ఒక రకమైన కాయను కాలుతో చిట్లు కొడతారు, మరి కొందరు వాటి రసం (రక్తంగా )నాలికపై పెడతారు.

ఇ . మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం పెట్టి వస్త్ర దాన సమర్పిస్తారు.

ఈ . ప్రదోషకాలంలో దీప దానాన్ని నిర్వహిస్తారు. ఎవరైతే ప్రదోషపూజ వ్రతాన్ని నిర్వహిస్తారు వారు ప్రదోష పూజ మరియు శివపూజను నిర్వహిస్తుంటారు.

5. నరక చతుర్దశి రోజున చేసే విధి వెనక ఉన్న శాస్త్రము

అ . బ్రాహ్మణ భోజనం

‘నరక చతుర్దశి రోజున బ్రాహ్మణలకు భోజనం పెట్టడం, అంటే ధర్మ స్వరూపములో అవతరించి కార్యం చేయుటకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం. ఈ మాధ్యమంగా బ్రహ్మాండంలో సంచరిస్తున్న ధర్మలహరీలకు పుష్టిని అందించి, అవతార కార్యమును ముందుకు కొనసాగించేందుకు అనగా భూతలంపై వచ్చే చెడు మరియు అధోగామీ తరంగాలను నష్ట పరిచేందుకు సమష్టి యొక్క ఇచ్చా శక్తిని అందిస్తూ ప్రత్యక్ష స్వరూపంలో కార్యాన్ని ప్రారంభించమని ఆహ్వానం పలకడం. ఈ మాధ్యమంగా స్వతహాగా ధర్మ కర్తవ్యాన్ని పాటిస్తూ భగవంతుడి కృప ఆశీర్వాదాలతో కూడిన తరంగాలను గ్రహించుకోవచ్చు.

ఆ . వస్త్రదానము

వస్త్రదానం చేయడం అనగా దేవతల యొక్క స్పందనలను భూతలంపై రావడం కోసం దానం స్వరూపంలో, అంటే ధర్మసంవర్ధన కార్యం చేయుటకు ఆహ్వానించడమే. ఈ మాధ్యమం నుండి మనం పోగుచేసిన ధన సంచయమును ధర్మకార్యం కోసం అర్పించడం మూలంగా మనకు ఆధ్యాత్మిక ఉన్నతీ కలుగుతుంది.

ఇ . యమదీపదానం

యమదీపదానం చేయడం, అంటే లయం యొక్క శక్తి మరియు చలన శక్తి స్వరూపంలో జరిగే యుద్ధంలో స్వరక్షణ కొరకు మృత్యు దేవత అయిన యముడికి వారి పాలును ఇచ్చి అపమృత్యు నుండి రక్షణ పొందడమే. ఈ మాధ్యమం నుండి ధర్మానికి వాటి భాగం ఇచ్చి తృప్తిపరచి మనం సమష్టి కార్యాన్ని సహజంగా చేసుకోవచ్చు.

ఈ . ప్రదోష పూజ

‘కాలాయ తస్మై నమః’ ఇలా కాలమహిమను వర్ణించి కాలం యొక్క మాధ్యమంగా కార్యన్వితమయ్యే స్థిరమైన మరియు పురుషదర్శకమైన క్రియాశక్తి యొక్క కొంత భాగమును పూజించి వాటి సంర్థన చేయడం, అనగా కార్యాన్ని దర్శించే స్వరూపాన్ని అందించడమే. ఈ మాధ్యమంగా కాలమహిమను చిత్తముపై ధృడ పరిచి దానికనుసారంగా ఆచరణను మొదలు పెట్టి ఉచ్చస్థాయి అవస్థను పొంది ధర్మాచరణ చక్కగా చేసుకోవచ్చు.

ఉ . శివపూజ

సమష్టికు ఇబ్బంది కలిగించే అధోగామీ తరంగాల యొక్క నాశనం కొరకు జాగ్రత్త అయిన భగవంతుడి మారక స్వరూప సగుణత్వానికి పూజ ద్వారా కృతజ్ఞత వ్యక్తం చేయడం. ఈ పూజ ద్వారా భగవంతుడి కృతిలో ఆప్యాయత నిర్మాణం అయ్యి భావ వృద్ధి జరిగి భగవంతుడితో ఏకరూపం సాధించే దిశగా ముందుకు సాగుతాము.

 

Deepavali Video (Telugu)

Leave a Comment