వసుబారాస్ మరియు గురుద్వాదశి

ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున వసుబారస్‌తో పాటు గురుద్వాదశి పండుగను జరుపుకొంటారు. వసుబారస్ దినము దీపావళికి జోడించి వస్తుంది. కాని ఈ పండుగా దీపావళి పండుగ కంటే వేరుగా వుంటుంది. దీని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం.

 

1. వసుబారాస్ (గోవత్స ద్వాదశి)

శ్రీ విష్ణువు యొక్క ఆపతత్వాత్మక తరంగాలు కార్యనిరతమై బ్రహ్మాండములో ప్రవేశించడమంటెనే వసుబారస్ ! ఈ రోజున విష్ణులోకములోని వాసవదత్త పేరుగల కామదేనువు ఈ తరంగాలను బ్రహ్మాండము వరకు చేర్చుటకు నిరంతరంగా కార్యనిరతరమై వుంటుంది. ఈ దినమున ఈ కామదేనువును కృతజ్ఞతా పూర్వకంగా స్మరించి వాకిట్లో (ప్రాంగణము) వున్న తులసి వృందావనం వద్ద ధేనువు అనగా ఆవును నిలబెట్టి దానిని ప్రతికాత్మక రూపములో పూజిస్తారు.

ఈ రోజున మన ప్రాంగణములో వున్న ఆవుకు వాసవదత్త యొక్క స్వరూపము ప్రాప్తమౌతుంది, అనగా ఒక విధంగా దానికి దైవత్వము ప్రాప్తమౌతుంది. ఇందువలన ఈ దినమునకు వసుబారస్ అని అంటారు. బారస్ అనగా ఏదైన ఒకదానిలో కొత్త చైతన్యబీజము నిర్మాణమగుట. ఆవులోని ఈ దైవత్వమును శాశ్వతంగా విష్ణుస్వరూపములో కొలవాలి మరియు దీని నుండి ప్రక్షేపిత మయ్యే చైతన్యతరంగాల లాభము పొందుతు వుండాలి.

అ. తిథి : ఆశ్వయుజ బహుళ ద్వాదశి

అ. చరిత్ర : సముద్రమంథనము నుండి 5 కామదేనువు ఉత్పన్నమైనదని కథ వున్నది. అందులో నందా అను పేరు గల ధేనువును ఉద్ధేశించి ఈ వ్రతమును ఆచరిస్తారు.

ఆ. ఉద్ధేశము : ఈ జన్మలో మరియు తరువాతి అనేక జన్మల కోరికలు నెరవేరాలి మరియు పూజింపబడే ఆవు శరీరముపై ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గములో వుండుటకు అవకాశము లభించాలని దీని ఉద్ధేశము.

ఇ. పండుగను జరుపుకొనే పద్ధతి : ఈ రోజున సౌభాగ్యవతులు ఒక పూట అన్నము తిని మరుసాటి రోజు ప్రొద్దున లేదా సాయంకాలము దూడతో ఉన్న ఆవు యోక్క పూజ చేస్తారు.

 

2. గురుద్వాదశి

అ. తిథి : ఆశ్వయుజ బహుళ ద్వాదశి

ఆ. మహత్వము : ఈ దినమున శిష్యులు వారి గురువులను పూజిస్తారు.

సందర్భము : సనాతన ప్రచురణ ‘పండుగలు, ధార్మిక ఉత్సవములు మరియు వ్రతాలు’

Leave a Comment