ప్రతిఒక్క దేవునికి విశిష్ట ఉపాసన శాస్త్రముంటుంది. దీని అర్థము ప్రతిఒక్క దేవుని ఉపాసన అంతర్గతంగా ప్రతిఒక్క కృతి విశిష్ట పద్ధతి ప్రకారంగా చేయుట వెనక శాస్త్రమున్నది. ఇలాంటి కృతి చేయుట వలన ఉపాసకునికి ఆ దేవుని తత్వము ఎక్కువగా లభించుటకు సహాయమవుతుంది. ఈ ఉద్దేశంతో శ్రీ గణపతి ఉపాసనకు సంబంధించిన కొన్ని శాస్త్రమును ఈ లేఖన ద్వారా తెలపడమైనది.
కార్యం ప్రారంభంలో గణేశ పూజ చేయుటకు గల ప్రాముఖ్యత !
Ganapati
గణపతి పది దిక్కుల స్వామి. తన అనుమతి లేకుండా ఇతర దేవతలు పూజాస్థలానికి రాలేరు. గణపతి ఒక్క సారి దిక్కులను విముక్తి పరచిన తరువాత ఏ దేవత యొక్క ఉపాసన మనం చేస్తుంటామో ఆ దేవత ఆ స్థలానికి రాగలరు. అందువలనే ఏ ఒక్క శుభ కార్యం చేస్తున్నప్పడు లేదా ఏదైనా ఒక దేవత పూజ చేసే ముందు ప్రథమంగా గణపతి పూజను చేస్తారు.
గణపతి చెడు శక్తులను తన పాశంతో బంధించి ఉంచుతాడు. కాబట్టి తన పూజ వలన శుభకార్యంలో ఏ విఘ్నాలు రావు.
గణపతి నాదభాషా మరియు ప్రకాశభాషలను ఒకదాని నుండి మరొకదానిలోకి అనువాదము చేయువాడు. మనము మాట్లాడే నాదభాష శ్రీ గణపతి అర్థం చేసుకోగులడు, అందుకే ఆయన త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు. శ్రీ గణపతి నాదభాషను ప్రకాశభాషకు మరియు ప్రకాశభాషను నాదాభాషలోనికి అనువాదము చేసే దేవుడు. వేరే దేవతలు చాలా వరకు ప్రకాశభాషను మాత్రమే తెలుసుకొనగలరు.
ఎడమవైపు తొండమున్న గణపతి అధ్యాత్మానికి పూరకం !
పూజలో సాధ్యమైనంత వరకు ఎడమవైపు తొండమున్న గణపతిని పెట్టాలి. కుడివైపు తొండమున్న శ్రీ గుణపతిని అత్యంత శక్తిశాలి మరియు ‘జాగుృత గుణపతి’ అని అంటారు. పూజలో కుడివైపు తొండమున్న గణపతి విగ్రహం ఉంటే కర్మకాండ లోని అన్ని నియమాలను తూచా తప్పకుండా పాలించి పూజావిధిని చేయాలి. ప్రస్తుత ఉరుకు-పరుగుల జీవితంలో కర్మకాండంలోని అన్ని నియమాలను పాటించడం సాధ్యమవ్వదు, దీని వలన మననుండి పూజలో తప్పులు అవుతాయి మరియు దీని ప్రతిఫలంగా మనం ఇబ్బందులకు గురౌతాము. అందుల్ల సాధ్యమైనంత వరకు పూజలో కుడివైపు తొండమున్న శ్రీ గణపతిని పట్టకూడదు. దీనికి వ్యతిరేకంగా ఎడమవైపు తొండమున్న గణపతి అంటే ‘వామముఖి’ మూర్తి. వామ అంటే ఎడమవైపు లేక ఉత్తరదిక్కు, ఎడమవైపు చంద్రనాడి ఉండి అది శీతలమును ఇస్తుంది, ఉత్తరదిక్కు ఆధ్యాత్మికతకు అనుకూలమై మరియు ఆనందకరమై ఉంటుంది, అందుచేత వామముఖి (ఎడమవైపు తొండమున్న) శ్రీ గణపతిని పూజలో పెడతారు.
శ్రీ గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులు ఉండుటకు గల కారణం !
దేవత యొక్క పవిత్రకాలు అనగా దేవతల సూకా్ష్మతిసూక్ష్మ కణాలను ఆకర్షించే స్థొమత ఏ వస్తువులలో అధికంగా ఉంటుందో అటువంటి వస్తువులను దేవతకు సమర్పించడం వల్ల ఆ దేవతా తత్వం సహజంగా ఆ విగ్రహంలో వచ్చి విగ్రహంలోని చైతన్యం యొక్క ప్రయోజనం తొందరగా అవుతుంది.
ఈ తత్వానికనుసారంగా శ్రీ గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులను ఉపయోగిస్తారు. ఎర్ర రంగులో గణపతి తత్వాన్ని ఆకర్షించే క్షమత అధికంగా ఉంటుంది. దీని వల్ల విగ్రహం తక్కువ సమయంలో జాగతమగుటకు సహాయమౌతుంది. అందువల్ల ఆయన పూజలో రక్తచందనాన్ని ఉపయోగిస్తారు.
శ్రీ గణపతికి గంధం, పసుపు-కుంకుమ సమర్పించే పద్ధతి !
పూజ చేసేటప్పుడు శ్రీ గణపతికి కుడి చేతి అనామికతో గంధం సమర్పించాలి. శ్రీ గణపతికి పసుపు-కుంకుమ సమర్పించేటప్పుడు ముందు పసుపు తరువాత కుంకుమను కుడి చేతి బొటనవేలు మరియు అనామిక వేలుతో చిటికెడు తీసుకొని చరణాల పై సమర్పించాలి. బొటనవేలు మరియు అనామిక వేలుతో నిర్మాణమయ్యే ముద్రవలన పూజకుడి దేహంలోని అనాహతచక్రం జాగతమౌతుంది. దీని వల్ల భక్తిభావము నిర్మాణమగుటకు తోడ్పడుతుంది.
శ్రీ గణపతికి ఎర్ర పువ్వులను సమర్పిం
చుటకు గల మహత్యం మరియు ప్రమాణం !
విశిష్ట పువ్వులలో విశిష్ట దేవతల తత్వమును ఆకర్షించే క్షమత ఇతర పువ్వులలో కంటే అధికంగా ఉంటుంది. శ్రీ గణపతికి ఎర్ర మందారం సమర్పించాలి. ఈ పువ్వులో గణపతి తత్వం అధికంగా ఆకర్షితమౌతుంది మరియు ఈ తత్వం యొక్క ప్రయోజనం మనకు కూడా అవుతుంది.
గణపతి చరణాలలో విశిష్ట సంఖ్యలో విశిష్ట ఆకారంలో పువులను సమర్పించడం ద్వారా పువ్వుల వైపు దేవత తత్వం తొందరగా ఆకర్షితమౌతుంది. ఈ తత్వానికనుసారంగా శ్రీ గణపతికి పువ్వులను సమర్పించేటప్పుటు 8 లేదా 8 రట్లలో మరియు శంకరపాళి ఆకారంలో సమర్పించాలి. పువ్వులు సమర్పించేటపుడు పువ్వు యొక్క తొటిమ గణపతి చరణాల దిశగా మరియు పువ్వు యొక్క ముఖం మన వైపు వచ్చేలాగ సమర్పించాలి.
శ్రీ గణపతికి దూర్వ సమర్పించుటకు కారణం మరియు పద్ధతి !
గరిక (దుర్వ) : శ్రీ గణపతి పూజలో దూర్వ మహత్వమైనది. దుర్వ ఈ పదము దూః + అవమ్ ఇలా తయారయినది. ‘దూః’ అంటే దూరములో ఉన్నది మరియు ‘అవమ్’ అంటే ఏది దగ్గరకు తెస్తుందో అది. దూరములో ఉన్న గణేశుని పవిత్రకములను ఏది దగ్గరకు తెస్తుందో, అదే దుర్వము అంటే గురిక. శ్రీ గుణపతికి అర్పించే గురిక లేతగా ఉండాలి. దీనినే ‘బాలతృణమ్’ అని అంటారు. ఎండిన దానిని ఒక విధమైన గుడ్డిగా పరిగుణిస్తారు. గురికలకు 3, 5, 7 ఈ విధంగా బేసిసంఖ్యలో లేతాకులు ఉండాలి. గరిక సమర్పించేటప్పుడు గరిక యొక్క తొటిమ గణపతి వైపు ఉండాలి. దీని వల్ల గణపతి తత్వం మన వైపు ప్రక్షేపితమగుటకు సహాయమౌతుంది.
శ్రీ గణపతి యొక్క తారక మరియు మారక
తత్తానికనుసారంగా ఉపయోగించవలసిన అగర్బత్తీలు !
శ్రీ గణపతి పూజ చేస్తున్నప్పుడు గణపతి యొక్క తారక తత్వాన్ని ఆకర్షించుటకు చందనం, మొగలి, మల్లె మరియు లావంచ వీటిలో ఏదైనా ఒక సుగంధం గల అగర్బత్తిని వెలిగించాలి. శ్రీ గణపతి యొక్క మారక తత్వాన్ని అధికంగా ఆకర్షించుటకు హీనా లేదా దర్బార్ ఈ సుగంధం గల అగర్బత్తిని ఉపయోగించాలి. 2 అగర్బత్తిని వెలిగించాలి. దేవుడికి అగర్బత్తిని చూపించేటప్పుడు కుడిచేతి బొటనవేలు మరియు చూపుడు వేలుతో పట్టుకుని గడియారం దిశలో 3 సార్లు తిప్పవలెను.
సనాతన సంస్థ సాత్విక అగర్బత్తిని తయారు చేసింది. దాని యొక్క లాభం పొందగలరు.
శ్రీ గణపతికి ప్రదక్షిణలు చేయుట !
శ్రీ గణపతి యొక్క దర్శనం పొందిన తరువాత గణపతికి కనీసం 8 ప్రదక్షిణలను చేయాలి. ప్రతి ప్రదక్షిణ తరువాత నమస్కారం చేసి తరువాతనే ముందరి ప్రదక్షిణ వెయ్యాలి. ఎక్కువ ప్రదక్షిణలను వేయదలిస్తే 8 రెట్లలో వేయవలెను. ప్రదక్షిణలను చేయడం వలన దేవత నుండి ప్రక్షేపితమయ్యే చైతన్యం తక్కువ సమయంలో సంపూర్ణ దేహంలో ప్రసరిస్తుంది.
శ్రీ గణేశపూజలో ప్రారంభంలో చేయవలసిన ప్రార్థన
అ. హే శ్రీ గహాననా, ఈ పూజవిధి ద్వారా నా అంతఃకరణలో నీ పట్ల భక్తిభావం నిర్మాణమవ్వనీ.
ఆ. ఈ పూజావిధి ద్వారా ప్రక్షేపితమయ్యే చైతన్యం నీ కపతో నాకు ఎక్కువగా గ్రహించుటకు సాధ్యమవ్వనీ.
గణేశోత్సవ సమయంలో చేయవలసిన ప్రార్థన
హే శ్రీ గణేశా, గణేశోత్సవ సమయంలో ఎప్పటికంటే 1000 రెట్లు ఎక్కువగా కార్యనిరతమై ఉన్న నీ తత్వం నాకు ఎక్కువెక్కువగా లభించనీ.