గణేష్ విగ్రహం యొక్క విభిన్న వైవిధ్యాలు ఏమిటి ?

1. సాధారణ విగ్రహం

వినాయకుడి విగ్రహం వెనుక గల శాస్త్రంను ‘శ్రీగణపత్యధర్వశిర్ష’ లో ‘ఏకాదంతం, చతుర్ హస్తం’ గా వర్ణించారు.  (एकदन्तं चतुर्हस्तं)’, అంటే ఒకే దంతమ్ (ఏకాదంత), నాలుగు చేతులు (చతుర్భుజ్), ఒక ఉచ్చు (పాశం) మరియు ఒక అంకుశమును అలంకరించి, ఒక చేతిలో (విరిగిన) దంతమ్ పట్టుకుని, మరొక చేతిని ఆశీర్వదించే భంగిమలో (వరద్ముద్ర), జెండా ఎలుక చిహ్నాన్ని కలిగి ఉంటుంది, ఎరుపు రంగు, పెద్ద పొత్తికడుపు (లంబొధర్), చెవులు జల్లెడ చిప్పలు వంటివి, ఎరుపు దుస్తులను అలంకరించి, ఎర్ర గంధపు చెక్క (రక్తచందనమ్) పూతతో పూసి మరియు ఎర్రటి పువ్వులతో పూజింపబడుతాడు.

 

2. కొన్ని వైవిధ్యాలు

1. ముద్ర

కొన్నిసార్లు తామర భంగిమలో (పద్మాసనం) లేదా కొన్ని సమయంలో నాట్య భంగిమలో (నృత్యముద్ర) గణపతి విగ్రహాలను చూడవచ్చు.

2. ముండ్కట గణేష్

హిమాలయంలో శిరచ్ఛేదం (ముండ్కట) గణేష్ విగ్రహం ఉంది. ఈ విగ్రహం తల లేకుండా ఉందని పేరు కూడా సూచిస్తుంది. పార్వతి దేవి శరీరంపై నలుగు పూత నుండి సృష్టించబడిన వినాయకుడు తరువాత శివుడి చెతిలొ శిరచ్ఛేదం చేయబడినది.

3. ఇతర రంగులు

హరిద్రగణపతి మరియు ఉర్ధ్వగణపతి లకు పసుపు రంగు ఉంటుంది. పింగల్ గణపతి

నారింజ-గోధుమ (పింగాట్) కాగా, లక్ష్మీ గణపతి రంగు తెల్లగా ఉంటుంది.

4. లింగ

శివుడిలాగే, గణపతికి కూడా లింగము ఉంది. దీనిని గణపత్యలింగ అంటారు. ఇది దానిమ్మ, నిమ్మ, తెల్ల గుమ్మడికాయ లేదా జామున్ ఆకారంలో ఉంటుంది.

5. దిగంబర

తంత్ర ఆరాధన మార్గంలో, గణపతి విగ్రహంను ఎక్కువగా నగ్నముగా పూజిస్తారు. గణపతి  యొక్క (శక్తి) కూడా విగ్రహంతో పాటు ఉంటుంది.

6. స్త్రీ రూపం

శాక్త సంప్రదాయంలో గణపతిని స్త్రీ రూపంలో పూజిస్తారు. అలాంటి కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.

అ. గణేశ్వరి : తమిళనాడులోని సుచింద్రం ఆలయంలో గణేశ్వరి విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆ. అర్ధ గణేశ్వరి : తంత్ర ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఇది చాలా సార్ధకమైన రూపాన్నికలిగి ఉంది.

ఇ. గణేశని : ఈ స్త్రీ దేవత చాలా అరుదైన ఆరాధనలో తాంత్రికులు మరియు మంత్రికులు (తంత్ర మరియు మంత్రాల అనుచరులు) ఆరాధిస్తారు.’

7. గణపతి విగ్రహాల రకాలు

సౌమ్యగణపతి, బలగణపతి, హెరంబగణపతి, లక్ష్మీగణపతి, హరిద్రాగణపతి, ఉచ్చిష్ఠగణపతి, సూర్యగణపతి, వరదగణపతి, ద్విభుజగణపతి, దశభుజగణపతి, నార్తంగణపతి, ఉత్తీష్టితగణపతి, కుడి వైపున తొండం ఉన్న గణపతి మొదలైనవి వంటి అనేక రకాల గణపతి విగ్రహాలు ఉన్నాయి.

సూచన : సనాతన సంస్థ యొక్క గ్రంథం ‘గణపతి’

Leave a Comment