శ్రీ సరస్వతిదేవి విశిష్ఠతలు

1. శ్రీ సరస్వతిదేవి విశిష్ఠతలు

1 అ. ఈ దేవి యొక్క శక్తి గణపతికి సంబంధించినది.

1 ఆ. ఈ దేవికి ఎరుపు, గులాబి రంగులో చీర ఉంటుంది.

1 ఇ. వాక్, వాగ్దేవి, వాగీశ్వరి, వాణి, భారతి, వీణాపాణి మొదలగునవి.

2. నివాసము

బ్రహ్మలోకంలో శక్తి రూపంగా ఉండే ఉపభాగము సరస్వతిలోకం. సర్వదేవతల లోకం సగుణలోకం అనే సంజ్ఞతో గుర్తింపబడింది. ఈ లోకం నుంచి ఆయా స్ధాయిలో దేవతలు ప్రత్యక్ష సగుణ రూపధారణలో కార్యనిర్వహణ చేస్తారు. ఉన్నత స్ధాయికి చెందిన నిర్గుణ లోకము ప్రకాశమయంగా అనగా తత్వరూపములో ఉంటుంది. సగుణ లోకం కన్నా నిర్గుణ లోకం సూక్ష్మమైనది. సరస్వతీ యొక్క తారక-మారక తత్వముల (అనగా మహాసరస్వతీ) కార్యం ఆవశ్యకతానుసారంగా సరస్వతీలోకం నుంచి ప్రకటించి వ్యష్ఠి మరియు సమష్ఠి స్ధాయిలో కార్యము చేయును.

3. ఆధ్యాత్మిక వైశిష్ఠాలు

3 అ.

‘సరస్వతి దేవి మోహమయమైన అశాశ్వత ప్రపంచము యొక్క స్ఫురణమైతే శాశ్వతమైన స్వరమయ మరియు జ్ఞానమయ విశ్వము యొక్క స్ఫుల్లింగమైనది. స్ఫుల్లింగము ఈ పదము శివవాచకమైతే స్ఫురణ ఈ పదము ప్రకృతివాచకమైనది.

3 ఆ.

సరస్వతి తత్వము నుండి నిర్మాణమయ్యే ‘మాయావి మరియు మోహక’ సిద్ధి ఆమె యొక్క కళావిశ్వములోని సమ్రాజ్ఞిపదమును నిరూపిస్తుంది. సరస్వతిదేవి హాస్యము నుండి ఆదిశక్తి యొక్క మోహిని రూపము మరియు వీణ స్వరము నుండి మాయావి రూపము నిర్మాణమైతుంది.

3 ఇ. చేతిలోని వస్తువుల వైశిష్టాలు

3 ఇ 1. వేదము : ఆమె చేతిలోని వేదము బ్రహ్మవిద్యతో ఆమెకున్న దఢమైన సంబంధమును స్పష్టపరుస్తుంది.

3 ఇ 2. చేతిలోని జపమాల : ఇది కళా ప్రపంచములోని వైవిధ్యతతో సంపూర్ణమైన శబ్దలీల పై ఆమెకు ఉన్న నేతత్వమును దర్శిస్తుంది. – ఒక విద్వాంసుడు (పూ.) శ్రీమతి అంజలీ గాడ్గీళ్ గారి ద్వారా, 16.6.2006, మ. 4.55)

3 ఉ. ‘విద్య యొక్క నిర్మాణం :

ఆకాశము నుండి నాదము విస్ఫోటము జరిగి ఆ ధ్వనిస్పందనలో నుండి అనేక చిన్న శబ్దబ్రహ్మతో కూడిన వలయాలు నిర్మాణమై, ఈ వలయముల ద్వారా సరస్వతి దేవి ఈ క్రియ సహాయంతో విద్య అనగా ప్రగల్భమైన సాహిత్యమును నిర్మిస్తుంది, అందువలన ఆమెను ‘విద్యాదాయిని’, అని కూడా అంటారు.

(సందర్భము : ‘శ్రీ సరస్వతి దేవి’ లఘు గ్రంథం)

Leave a Comment