వసంత పంచమి
ఋతువులన్నిటికి రాజ వసంత ఋతువు. ఈ ఋతువు యొక్క ఆగమనం వసంతపంచమినాడు ప్రారంభమౌతుంది. అలాగే ఈ రోజుననే శ్రీసరస్వతిదేవి మరియు లక్ష్మీదేవి జన్మదినము అని ఆచరిస్తారు.
1. తిథి
వసంత పంచమి ఉత్సవం ‘మాఘ శుక్ల పంచమి’ తిథికి ఆచరిస్తారు.
2. ఇతిహాసం మరియు ఆచరించే విధానం
అ. కామదేవుడైన మన్మధుడు కూడ ఇదే రోజున జన్మించాడని చెప్పబడినది. దాంపత్యజీవితము సుఖంగా కొనసాగుటకని ప్రజలు రతీమన్మధున్ని పూజించి ప్రార్థన చేస్తారు.
ఆ. వసంత పంచమి రోజున కొత్త పంటను ఇంటిలో దేవతలకు సమర్పించి నవాన్నమును భుజిస్తారు.
ఇ. వసంత పంచమి రోజున సరస్వతీ దేవి యొక్క ఉత్పత్తి జరిగింది; కాబట్టి ఆమెను పూజిస్తారు, అలాగే లక్ష్మీదేవి జన్మదినం కూడా. అందువలన దీనిని ‘శ్రీపంచమి’ అని కూడా అంటారు.
ఈ. ఈ రోజు ప్రొద్దున అభ్యంగనస్నానం చేసి పూజ చేస్తారు. వసంత పంచమి రోజున వాణి యొక్క అధిష్ఠాత్రి దేవి అయిన సరస్వతీ దేవి పూజ మరియు ప్రార్థన చేయుటకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు కళశ స్థాపన చేసి అందులో సరస్వతీ దేవిని ఆహ్వానించి పూజిస్తారు.
3. వసంత పంచమి ఉత్సవము యొక్క ఉద్ధేశము :
ఈ రోజున సృష్టి యొక్క నవచైతన్యం మరియు నవనిర్మాణం ద్వారా ఉత్పన్నమైన ఆనందాన్ని వ్యక్తపరచుట మరియు ఉల్లాసంగా ఉండడం ఈ వసంత పంచమి ఉత్సవము యొక్క ముఖ్య ఉద్ధేశము.