నరకచతుర్దశి ఆచరించే పద్దతి !
- ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తములో అభ్యంగన స్నానం చేస్తారు. ఓకే వనస్పతితో తల నుండి కాళ్ళ వరకు మరియు మళ్ళి కాళ్ళ నుండి తల వరకు నీళ్ళు ప్రోక్షణ చేసుకుంటారు.
- యమతర్పణ : అభ్యంగన స్నానం తరువాత అకాలమృత్యు నివారణ కొరకు యమతర్పణ చేయమని చెప్పబడినది. ఈ తర్పణ యొక్క విధి పంచాంగంలో ఇచ్చి ఉంటుంది. దాని ప్రకారంగా విధిని చేయాలి. తరువాత తల్లి పిల్లలకు హారతినివ్వాలి. కొంత మంది అభ్యంగన స్నానం తరువాత నరకాసురుడి వధకు ప్రతీకగా ఒక రకమైన చేదు కాయిని కాళ్ళతో తొక్కి దాని రసమును నాలికకు తాకిస్తారు.
- మధ్యానం బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేస్తారు.
- ప్రదోషకాలంలో దీపదానం చేస్తారు. ఎవరైతే ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారు ప్రదోష పూజ మరియు శివపూజ చేస్తారు.
(మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘దీపావళి శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)