ధనత్రయోదశి రోజున బంగారమును కొనే పద్ధతి ఉన్నది. దీని వల్ల సంవత్సరమంతా ఇంటిలో ధనలక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి పూజ సమయంలో సంవత్సరంలో చేసిన జమా-ఖర్చుల లెక్కలను పెట్టవలసి ఉంటుంది. అప్పుడు ధనత్రయోదశి వరకు మిగిలిన సంపదను భగవత్ కార్యం కొరకు వినియోగిస్తే సత్ కార్యం కొరకు ధనము ఖర్చైనందు వల్ల ధనలక్ష్మి చివరి వరకు లక్ష్మి స్వరూపంలో ఉంటుంది. ధనము అనగా డబ్బులు. ఈ డబ్బు సంవత్సరమంతా కష్టపడి సంపాదించి ఉండాలి. ఈ డబ్బులోని కనీసం 1/6 వ భాగం భగవత్ కార్యం కొరకు ఖర్చు పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది.