రాఖీ పండుగ మరియు శాస్త్రము
సోదరుడు కూర్చొవడానికి పెట్టిన పీట చుట్టూ ముగ్గు వేయవలెను. దీనివలన భగవంతుని చైతన్యము ఆకర్షితమై సోదరీ-సోదరులకు దీని ప్రయోజనం కలుగుతుంది. నూనె దీపముతో సోదరునికి హారతినిచ్చి రాఖీ కట్టవలెను. హారతి వలన భగవంతుని శక్తి ఆకర్షితమై సోదరుని బుద్ధి సాత్త్వికమగుటకు సహాయమవుతుంది. సోదరునికి శుభం కలగాలనీ సోదరి, సోదరి సంరక్షణ అవ్వాలని సోదరుడు ప్రార్థించవలెను. తమ నుండి దేశ-ధర్మ రక్షణ కొరకు ప్రయత్నం జరగాలని ఇద్దరూ ప్రార్థన చేయవలెను.
(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘పండుగలను ఆచరించే సరైన పద్ధతి, శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)