ఋతువు ప్రకారం ఆయుర్వేద జీవన విధానం

1. ఆరోగ్యకరమైన శీతాకాలం

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా, చర్మ రంధ్రాలు కుంచించుకు పోతాయి. శరీరంలో ఉన్న అగ్ని లోపల మూసివేయబడి జీర్ణాశయాంతర ప్రేగులకు తరలించబడుతుంది. వ్యాధిని ఎదుర్కోవటానికి శరీర సామర్థ్యం మరియు బలం శరీరంలోని వేడి (అగ్ని) పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి జటరాగ్ని పెరగడం ఈ ఋతువులో మంచిది. అందువల్ల శీతాకాలం, సుమారు నాలుగు నెలల కాలం ప్రాథమిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

 

2. ఋతువు ప్రకారం పాటించవలసిన ఆహారపు అలవాట్లు

2అ. శీతాకాలంలో తినదగిన మరియు తినకూడని ఆహారపదార్ధాలు?

జటరాగ్ని చాలా అద్భుతంగా ఉండటం వల్ల, శీతాకాలంలో ఏ రకమైన ఆహార పదార్థం అయినా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల ఈ ఋతువులో ఎక్కువ ఆహార పరిమితులు పాటించాల్సిన అవసరం లేదు. రాత్రులు ఎక్కువ కాలం ఉన్నందున, ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. అందువల్ల ఆయుర్వేదం ఉదయాన్నే స్నానం అయిన వెంటనే కడుపునిండా పూర్తిగా తినాలని సూచించింది. శీతాకాలంలో పొడి పెరుగుతుంది, అందువల్ల నువ్వులు, వేరుశనగ, కొబ్బరి వంటి కొవ్వుశాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మంచి పరిమాణంలో తీసుకోవాలి. అందుకే శీతాకాలంలో నువ్వుల లడ్డు పంచిపెట్టే ఆచారం మనకుంది. ఈ ఋతువులో పోషకమైన ఆహారాన్ని తినాలి మరియు ఆరోగ్యాన్ని దృఢపరచుకోవాలి. రోజంతా అడపాదడపా తినడం ఆరోగ్యానికి హానికరం, అందువల్ల ఎప్పుడుపడితే అప్పుడు ఆకలితో బాధపడకుండా ఉండటానికి ముందుగా అనుకున్న సమయం ప్రకారం రోజుకు రెండుసార్లు కడుపు నిండా తినాలి. మంచి జీర్ణక్రియ కోసం తమలపాకును భోజనం తరువాత నమలవచ్చు. మరమరాలు వంటి ఆహార పదార్థాలను తినడం మానేయాలి, ఇది త్వరగా జీర్ణం అవడం వల్ల మరల ఆకలి అనిపిస్తుంది.

2ఆ. నీరు

ఈ ఋతువులో, సహజమైన వనరులలో ఉదా. బావులు, చెరువులు మొదలైన వాటిలో నీరు స్వచ్ఛముగా ఉంటుంది. ఈ వనరుల నుండి నీరు వడకట్టకుండా త్రాగటం వల్ల ఎటువంటి హాని జరగదు. చల్లటి నీటిని జీర్ణించుకోలేని వారు మాత్రమే వేడినీరు త్రాగాలి. నగరాల్లో లభించే నీరు కాలుష్యం వల్ల కలుషితమవుతుంది మరియు అందువల్ల త్రాగడానికి ముందు వడకట్టి కాచి చల్లార్చాలి.

2ఇ. కూలర్ నీరు ఆరోగ్యానికి హానికరం

రిఫ్రిజిరేటర్ లేదా వాటర్ కూలర్ నుండి నీరు త్రాగటం ఏ ఋతువులోనైనా ఆరోగ్యానికి హానికరం. అలాంటి నీరు త్రాగటం వల్ల మీ జీర్ణ శక్తి తగ్గిపోతుంది మరియు దగ్గు, జలుబు, కీళ్ళ నొప్పులు మరియు సోమరితనం వస్తుంది.

 

3. శీతాకాలంలో ఇతర ప్రవర్తనలు

3అ. ఉదయాన్నే నిద్ర లేవడం

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా ఎక్కువసేపు నిద్రపోవాలనిపించినప్పటికీ, సూర్యోదయానికి 1.5 గంటల ముందు ఉదయాన్నే లేవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే లేవడం ఈ అలవాటు వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది.

3ఆ. ఔషధ పొగను పీల్చడం

ఉదయం పళ్ళు తోముకున్న తరువాత ఔషధ పొగను పీల్చుకోవాలి. ఇది దగ్గు మరియు జలుబు రాకుండా చేస్తుంది. కాగితాన్ని బీడీల చుట్టి వాము పొడిని నింపి ఒక చివర వెలిగించి, ఇంకొక చివర నుండి 3 సార్లు పీల్చుకోవాలి. ముక్కు నుండి పొగను పీల్చుకునే బదులు, దాన్ని నోటి నుండి పీల్చుకోవాలి. వాము విత్తనాలకు బదులుగా తులసి ఆకుల పొడి కూడా ఉపయోగించవచ్చు.

3ఇ. స్నానం చేసే ముందు శరీరానికి క్రమం తప్పకుండా నూనె పూయాలి

శీతాకాలంలో, స్నానం చేసే ముందు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వేరుశనగ నూనె లేదా ఆవ నూనెను క్రమం తప్పకుండా శరీరానికి పూయాలి. ఇది చల్లని వాతావరణం కారణంగా చర్మం పొడిబారకుండా మరియు దురద రాకుండా నిరోధిస్తుంది. ఇది చర్మం, పెదవులు మరియు మడమల పగుళ్ళను కూడా నివారిస్తుంది. కొబ్బరి నూనె చల్లదనాన్ని కలిగిస్తుంది, అయితే ఆవ నూనె వెచ్చదానాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ, శీతాకాలంలో కొబ్బరి నూనె వాడటం వల్ల ఎటువంటి హాని జరగదు. కొబ్బరి నూనె వేడి సంబంధిత రుగ్మతలతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్రోలియం జెల్లీ మరియు కోల్డ్ క్రీమ్స్ వంటి కృత్రిమ మరియు ఖరీదైన సౌందర్య సాధనాలను ఉపయోగించకుండా, ఆర్థిక మరియు సహజ నూనెను ఉపయోగించడం మన చర్మ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

3ఈ. వ్యాయామం

శీతాకాలంలో కఠినమైన వ్యాయామం మరియు శారీరక శ్రమ చేయాలి. ఉదయాన్నే శరీరానికి నూనెను మర్దన చేసి, వ్యాయామం చేసిన అరగంట తర్వాత స్నానం చేయడం అనువైనది, అయితే ఎవరి  సౌలభ్యం ఆధారంగా వారి సమయాన్ని మార్చవచ్చు. వ్యాయామం చేసిన అరగంట తరువాత స్నానం చేయాలి.

3ఉ. స్నానము

శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయాలి, అయితే చల్లటి నీటితో అలవాటుపడిన వారు శరీరానికి ఎటువంటి హాని కలిగించనందున చల్లటి నీటితో స్నానం చేయడం కొనసాగించవచ్చు.

3ఊ. దుస్తులు

చల్లని వాతావరణం నుండి మనల్ని రక్షించుకోవడానికి వెచ్చదనాన్ని కలిగించు బట్టలు ధరించాలి.

 

4. శీతాకాలంలో సంభవించే సాధారణ వ్యాధులకు ఆయుర్వేద నివారణలు

4అ. దగ్గు, జలుబు మరియు జ్వరం

2 గ్లాసుల నీరు తీసుకొని దానికి ఒక గుప్పెడు తులసి ఆకులు కలపి, 1 గ్లాసు నీరు మిగిలే వరకు నీటిని మరిగించాలి. ఈ నీటిలో సగ భాగం ఉదయం మరియు సగ భాగం సాయంత్రం రోగం తగ్గే వరకు త్రాగాలి.

4ఆ. కీళ్ళ నొప్పులు

పైన పేర్కొన్న విధంగా పరిజాత పువ్వులు మరియు ఆకులు ఒక గుప్పెడు నీటిలో వేసి మరిగించి, ఉదయం మరియు సాయంత్రం త్రాగాలి. నొప్పి కలిగించే కీళ్ళకు ఏ రకమైన నూనెను అయినా ఉపయోగించి మర్దన చేయండి. ఆహారంలో తినే నూనె మరియు నెయ్యి పరిమాణాన్ని పెంచండి.

4ఇ. మలబద్ధకం

ఒక చెంచా హిద్ర పౌడర్‌ను 1 చిటికెడు పింప్లి పౌడర్‌తో కలపి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి. మార్చి చివరి వరకు దీన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తే, మంచి ఆరోగ్యం లభిస్తుంది.

 

5. ఈ చర్యలను ఖచ్చితంగా మానుకోండి

మంచులో లేదా రాత్రి నడవడం, చల్లని వాతావరణంలో రక్షణ లేకుండా ఉండటం, నీటి జల్లులో ఎక్కువసేపు తడవడం, నిరంతరం ఫ్యాన్ గాలిలో ఉండటం నివారించాలి, పగటిపూట నిద్రపోవడాన్ని ఖచ్చితంగా నివారించాలి. దీనివల్ల శరీరంలో కఫం పెరుగుతుంది.

శీతాకాలానికి సూచించిన కాలానుగుణ నియమాలను పాటించడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరియు ఆయుర్వేదంపై ప్రతి ఒక్కరూ విశ్వాసం పెంపొందించుకోవాలని నేను దేవత ధన్వంతరి పవిత్ర పాదాలకు ప్రార్థిస్తున్నాను.

– వైద్యులు మేఘరాజ్ పరాడ్కర్, సనాతన ఆశ్రమం, రామనాతి, గోవా

 

6. సాధారణ జలుబుకు కారణాలు మరియు దాని చికిత్స

జలుబుకు ప్రధాన కారణం సూక్ష్మక్రిములు. క్రిముల వల్ల జలుబు సంభవిస్తున్నప్పటికీ, శరీరం యొక్క మొత్తం రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు (ముక్కు లోపలి చర్మం) ఇది బహిర్గతమౌతుంది.

అధిక శ్రమ, కండరాలు మరియు స్నాయువులలో బలహీనత, అజీర్ణం, తరచుగా వర్షంలో తడవడం, ఎక్కువగా చల్లటి నీటిలో తడవడం, ఈత కొట్టడం, ఎయిర్ కండిషన్డ్ గదిలో నిద్రించడం, ఐస్‌క్రీమ్‌లు లేదా శీతల పానీయాలు అధికంగా తీసుకోవడం, వాతావరణ పరిస్థితిలో ఆకస్మిక మార్పు , తేమ లేదా మురికి వాతావరణంలో పనిచేయడం మొదలైనవి మన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణాలు.

జలుబు యొక్క లక్షణాలు

జలుబుకు రెండు దశలు ఉన్నాయి

ద్రవ లాంటి, జలుబు సాధారణ  (తుమ్ము, ముక్కు మూసుకుపోవడం, రుచి తెలియకపోవడం, ఆకలి తగ్గడం, ముక్కు కారుట మొదలైనవి), ముదిరిన జలుబు (దట్టమైన కఫం ముక్కు నుండి తరచూ బయటకు వస్తుంది, కొంతకాలం తర్వాత దాని పరిమాణం తగ్గుతుంది, తరువాత తలనొప్పి తగ్గుతుంది మరియు శరీరంలో బరువు కూడా తగ్గుతుంది).

సాధారణ చికిత్స

ముక్కు చుట్టూ మరియు నుదిటిపై కుంకుమ పువ్వు మరియు ఫ్లాగ్‌రూట్ ముద్దను పూయండి.
నిద్రపోయేటప్పుడు ముక్కు మరియు తల కప్పుకోవాలి మరియు పగటిపూట పాదరక్షలు ధరించాలి.
బాణలిపై ఆవాలు, వాము విత్తనాలు లేదా ఫ్లాగ్‌రూట్ పౌడర్‌ను వేడి చేసి, రుమాలులో కట్టి ముక్కుకు దగ్గరగా ఉంచాలి.
ఒక నీటిని కాచు పాత్ర నుండి ఆవిరిని పీల్చుకోవాలి. జమాయిలు నూనె లేదా వెల్లుల్లిని అడపాదడపా పీల్చుకోవాలి.
పసుపు పొడిని, 1-2 టీచెంచా తులసి ఆకుల రసంలో కలపి తరచుగా సేవించాలి.
శొంఠి పొడి, నల్ల మిరియాలు, పిప్పళ్ళ, తులసి ఆకులు, దాల్చినచెక్క, నిమ్మ గడ్డితో తయారుచేసిన సారం తీసుకోవాలి.
జ్వరం లేదా ఒంటి నొప్పులు వచ్చినప్పుడు త్రిభువన్‌కీర్తి రసం లేదా ఆనందభైరవ్ రసం మాత్రలు తీసుకోవాలి.
తేలికపాటి ఆహారం తీసుకోవాలి లేదా వీలైతే లంకణం చేయాలి. అన్నం నుండి వార్చిన గంజిలో శొంఠి పొడి, నల్ల మిరియాలు, పిప్పళ్ళ కలిపి తీసుకోవాలి లేదా పెసర పప్పు చారు లేదా ముల్లంగి రసం తీసుకోవాలి.

రెండవ దశలో ఉన్న సాధారణ జలుబుకు చికిత్స

పాలలో శొంఠి పొడి వేసి, కాచి త్రాగాలి.
శనగలు మరియు బార్లీ వంటి పొడి వస్తువులను తీసుకోండి.
సుగంధి అల్లం, ఉసిరిక పొడి, పిప్పళ్ళ, పింప్లిముల్, శొంఠి పొడి, నల్ల మిరియాల మిశ్రమాన్ని నెయ్యి, తేనె కలిపి తినాలి.
1 నెలపాటు రోజుకు రెండుసార్లు 1 టీస్పూన్ చిత్రక్ హరితాకి అవ్లెహా తీసుకోవాలి.
ఆయుర్వేదం ప్రకారం, సాధారణంగా 4 రకాల జలుబులు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు రకాల జలుబులకు, మొదటి మరియు రెండవ దశలకు సంబంధించిన లక్షణాలు మరియు చికిత్స ఆయుర్వేదం సూచించింది.
అలెర్జీ లేదా సైనస్ కారణంగా జలుబు సంభవించినట్లయితే, దానికి అనుగుణంగా చికిత్స ఇవ్వాలి. అయితే యాంటీబయాటిక్స్ వ్యాధిపై ఎలాంటి ప్రభావం చూపవు. జలుబు తరువాతి దశకు చేరుకుంటే మరియు జ్వరం నిరంతరం పునరావృత్తమౌతుంటే , అప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.

సూచన : శ్వాసకోశ వ్యాధులు, రచయిత – డా. వి. బి. ఆఠవలే మరియు డాక్టర్. కమలేష్ వి. ఆఠవలే

 

వ్యాధులకు మూడు కారణాలు

1. అసత్మేంద్రియ సంయోగము

అసత్మ్యా అంటే అంగీకరించకపోవడం, అసహనం, అలవాటు లేకపోవడం. సత్మ్య అంటే అంగీకరించుట మరియు సహించుట, ఇది అందరికి వర్తిస్తుంది. సత్మెంద్రియ సంయోగము అంటే జీవన విధానము నిలకడగా ఉంటుంది. అసత్మెంద్రియ అంటే దీనికి విరుద్ధంగా  ఉంటుంది. బాహ్య ప్రపంచం యొక్క జ్ఞానం స్పర్శ ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది అంటే అన్ని ఇంద్రియ అవయవాల ప్రభావం స్పర్శ ద్వారా ప్రభావితమవుతుంది. ఈ సూత్రం చాలా ముఖ్యమైనది. స్పర్శ ద్వారా జ్ఞానానికి దారితీస్తుంది.  జ్ఞానం శరీరంలోని అన్ని చిన్న చిన్న పరమాణువులను  కూడా ప్రభావితం చేస్తుంది.  ఇంద్రియాలు అధికముగా లేదా తక్కువగా మరియు ఏమీ గ్రహించ  లేకపోవడం వల్ల జీవన వ్యాపారం అంటే జీవించి ఉండే మానవ దేహము నందలి మూడు దోషముల (వాత, పిత్త మరియు కఫముల) స్థానాలలో  మరియు మనోస్థితిలో కూడా వైషమ్యాలు జరుగుతాయి. ఈ వైషమ్యాల వల్ల రోగాలు వస్తాయి.  అసత్మెంద్రియ సంయోగము యొక్క పరిణామాలు శరీర వైకల్యము నుండి, మనో వైకల్యమునకు దారితీస్తుంది.

2. ప్రజ్ఞాపరాధ

ఈ నేరం మనస్సు యొక్క మాధ్యమం ద్వారానే మనస్సులో జరుగుతుంది. అందువల్ల దాని ప్రభావం మనస్సుపై ఉంటుంది. ‘प्रज्ञापराध’ అంటే, ఇష్టపూర్వకంగా, తలబిరుసుతనంతో, భావోద్వేగ అంశాలకు లేదా మానవ వైఖరికి మరియు ఏదైనా నైతిక విలువలకు విరుద్ధంగా. నిర్లక్ష్యం, మహిళలతో ఎక్కువ సాన్నిహిత్యం, ఇతరులను అవమానించడం మరియు ఎప్పుడైనా మరియు  ఏ ప్రదేశంలోనైనా ఎవరితోనైనా చెడు మాటలు చెప్పడం, అనాలోచిత పదార్ధాలను తినడం మరియు మద్య పానీయాలు తీసుకోవడం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. ఈ విషయాలు మొదట మనస్సును, తరువాత మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ‘प्रज्ञापराध’ త్రి దోషాల (వాత, పిత్త మరియు కఫం) యొక్క అసమతుల్యతను కలిగిస్తుంది. ‘प्रज्ञापराध’ వల్ల మానసిక రుగ్మతలు (రజ మరియు తమ) అలాగే శారీరక రుగ్మతలు ఏర్పడతాయి.

3. పాపపు ఆలోచనలు

ఈ అపరాధం మనస్సులోనే సంభవిస్తుంది కాబట్టి ప్రభావం కూడా మనసుపై ఉంటుంది. ఇది ఒక పనిని ఉద్దేశపూర్వకంగా మొండితనంతో, మానసిక భావోద్వేగానికి లోనై సంఘ విద్రోహ వైఖరితో, నైతిక విలువలు లేకుండా చేయడం. బిడియములేకుండా, మహిళలతో మితిమీరిన సాంగత్యం, సమయం మరియు ప్రదేశంతో సంబంధం లేకుండా ఎవరినైనా బాధపెట్టడం లేదా అవమానించడం, నిషేధిత ఆహారం మరియు పానీయాలు తీసుకోవడం, హానికరమైన ఆహారం తినడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇలాంటి పాపాలు మొదట మనస్సును, తరువాత శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ పాపాలు అన్ని దోషాలను(వాత, పిత్త, కఫ) తీవ్రతరం చేస్తాయి (మూడు దోషాలూ సమానంగా ఉన్నప్పుడు ఆరోగ్య స్థితి మంచిగా ఉంటుంది మరియు వాటిలో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం అనారోగ్యంగా మారుతుంది). పాపపు ఆలోచనల యొక్క ప్రభావం మానసిక (రజ మరియు తమ) మరియు శారీరక (వాత, పిత్త, కఫ) స్థాయిలలో ఉంటుంది.

4. సమయం యొక్క ప్రభావం

సమయం అంటే ప్రభావం. వర్షం, చలి, వేడి, రోజు, ఋతువు మొదలైనవి రుగ్మతలకు కారణమవుతాయి.

‘परिणामः काल अण्यते ।’

అర్థం: సమయం పురోగమిస్తే, దాని ప్రభావం పరిపక్వం చెందుతుంది.

గురుదేవులు డాక్టర్ కాటేస్వామిజీ
సూచన : దైనిక సనాతన ప్రభాత్

5. సమయ స్వభావం యొక్క పరిణామాలు (కాలము)

కాలానుగుణంగా పరిణామాలు ఉంటాయి. వర్షం, చలి, వేడి, వంటి అన్ని లక్షణాలు కనిపించినప్పుడు అనారోగ్యం యొక్క చివరి దశ అది, రాత్రిపూట మాత్రమే తినటం, పగటిపూట మాత్రమే తినటం, ఋతువును బట్టికాక అసాధారణమైన ఆహారపు అలవాట్ల వల్ల, దోషాలు తగ్గుతాయి, తీవ్రతరం అవుతాయి లేదా స్థిరీకరించబడతాయి. అనారోగ్యం వల్ల దోషాలు తలెత్తినప్పుడు వాటి అసంతృప్తత ఏర్పడుతుంది. సమయం యొక్క స్వభావం, శరీరం మరియు మనస్సు రెండింటినీ ఒకేసారి ప్రభావితం చేస్తుంది.

‘परिणामः काल अण्यते ।’

అర్థం: సమయం (కాలం) ప్రభావం ముగిసిన తరువాత, ప్రభావాలు దృడంగా మారుతాయి. ’

గురుదేవులు డాక్టర్ కాటేస్వామిజీ (ధనగర్జిత్, జూన్ 2006)
సూచన : దైనిక సనాతన ప్రభాత్

Leave a Comment