వైద్య మేఘరాజ్ పరాద్కర్
ఊబకాయం తగ్గించడానికి ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం, మందులతో శరీర మర్దన చేయడం, తగిన ఆహారం తినడం మరియు అవసరమైన మందులు తీసుకోవడం. ఈ అన్ని స్థాయిలలో ప్రయత్నాలు చేస్తే శరీరంలో నిల్వ చేయబడిన అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. దీనిపై వివరాలు మరింత ఇవ్వబడ్డాయి.
1. వ్యాయామం
1అ. చాప మీద లేదా నేల మీద పొర్లటం
ఉదయం మంచం మీద ఉన్నప్పుడు పరుపు మీద ఇప్పుడు చెప్పబోయే వ్యాయామాలు చేయండి. వీపుమీద పడుకొని రెండు చేతులను చెవులకు దగ్గరగా చేతులు ఉండేటట్లు పైకి చాపి పట్టుకొని వేళ్ళను ముడిచి పరుపు యొక్క ఒక అంచు వరకు ఒక వైపుకు మరియు తరువాత మరొక అంచుకు పొర్లాలి. ఇలా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు చేయాలి. పరుపు చిన్నగా ఉంటే నేలపై ఈ వ్యాయామం చేయండి. లేకపోతే మేల్కొన్న వెంటనే చేయడం కుదరకపోతే తరువాత ఇతర వ్యాయామాలతో కలపి చేయాలి.
ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శరీర శక్తిని బట్టి సాధ్యమైనంత ఎక్కువ వ్యాయామాలు చేయండి. వ్యాయామం చేసేటప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారు అంటే సగం శక్తిని వినియోగించారు అని సూచిస్తుంది. కాబట్టి ఎక్కువ వ్యాయామాలు చేయవలసి వస్తే కొంత సమయం ఆగి, తిరిగి ముక్కు ద్వారా శ్వాస సజావుగా ప్రారంభమైనప్పుడు వ్యాయామాలు పునః ప్రారంభించాలి. 5 నిమిషాల తర్వాత వ్యాయామం ప్రారంభించి మరియు దశలవారీగా పెంచాలి. వ్యాయామానికి అలవాటుపడిన తర్వాత రోజూ 20 నిమిషాలు వ్యాయామం చేయాలి.
1ఆ. ఉదర కండరాలను సంకోచించడం మరియు సడలించడం
నిలబడి లేదా కూర్చున్న భంగిమలోనైనా ఈ చర్యను 15 నుండి 20 సార్లు చేయాలి.
1 ఇ. సూర్య నమస్కారాలు
సూర్య దేవతకు ప్రార్థన చేసిన తరువాత సూర్యనమస్కారం చేయాలి. ప్రతి రోజు నమస్కారాల సంఖ్యను పెంచాలి. క్రమం తప్పకుండా 12 సూర్యనమస్కారాలు చేయాలి. సూర్యనామస్కరాల గురించి వివరాలు సనాతన యొక్క పవిత్ర గ్రంథాలలో ఇవ్వబడ్డాయి.
1 ఈ. భుజంగ బస్కీలు (భుజంగ దండ)
ఈ వ్యాయామం పొట్ట తగ్గించడానికి, ఆకలి తగ్గడానికి, మలాన్ని శరీరం నుండి పూర్తిగా బహిష్కరించడానికి సహాయపడుతుంది.
1 ఈ 1. భుజంగ ఆసనంలో బస్కీలు చేసే విధానం
మోకాళ్ళను నేల తాకించి, పాదాలను ఒకదానికొకటి తాకించి కూర్చోవాలి.
ఒక చేతి అరచేతి అంచున ఉన్న మణికట్టు భాగాన్ని (మోచేయి నుండి మధ్యవేలు వరకు దూరం) మరియు 1 స్పాన్ (గరిష్టంగా సాగదీసిన బొటనవేలు మరియు చిటికెన వేలు మధ్య దూరం) నేలను తాకించన మోకాలికి దూరంగా ఉంచండి.
రెండు అరచేతుల మధ్య 1 చేయి దూరం ఉండాలి.
అసలు భంగిమ: అరికాళ్ళను పూర్తిగా భూమికి తాకించాలి. వీలైనంత వరకు మోచేతులు మరియు మోకాళ్ళు వద్ద చేతులు మరియు కాళ్ళను వంచకుండా వాటిని నిటారుగా ఉంచాలి. తల మరియు వీపును చేతులకు అనుగుణంగా ఉంచండి. ఈ స్థితిలో శరీరం పర్వతంలా కనిపిస్తుంది.(చిత్రం 1 చూడండి)
చిత్రం 1
మోచేయి వద్ద చేతులను వంచాలి. తల మరియు ఛాతీని క్రిందికి వంచి, ఆపై శరీరం మొత్తాన్ని వంచాలి. ఛాతీని ముందుకు మరియు తలని వీలైనంతవరకు వెనుకకు ఆకాశాన్ని చూసేలా వంచాలి. ఇక్కడ శరీరం ఒక పాము పడగ లాగా కనిపిస్తుంది, దీని కారణంగా ఈ భంగిమను భుజంగ బస్కీలు అని పిలుస్తారు (చిత్రం 2 చూడండి).
చిత్రం 2
నడుమును ఎత్తి మళ్ళీ అసలు స్థితికి తిరిగి రావాలి. ఇది 1 బస్కీను పూర్తి చేస్తుంది. అలాంటి 5-10 బస్కీలను చేయండి. మీ సామర్థ్యం ప్రకారం సంఖ్యను పెంచండి.
2. నూనెతో మర్దన
స్నానానికి ముందు ప్రతి రోజు ఎవరికి వారే మర్దన చేసుకోవాలి. మర్దన కోసం ఉపయోగించే పదార్థాల జాబితా మరింత క్రింద ఇవ్వబడింది. సులభంగా లభ్యమయ్యే మరియు సౌకర్యవంతమైన ఏదైనా ఒక ఔషధాన్ని ఉపయోగించాలి. శరీర మర్దన కొవ్వును తగ్గిస్తుంది. శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ కొవ్వు ఉన్నదో ఆ భాగాన్ని100 రోజుల పాటు కనీసం ప్రతిరోజూ 5 నిమిషాలకు తక్కువ కాకుండా, మర్దన చేయాలి. సాధ్యమైనంతవరకు మర్దన చేసిన తరువాత సబ్బు వాడకండి. టవల్ మరియు బట్టలు జిడ్డుగా మారకుండా నిరోధించడానికి క్రింద చెప్పబడిన పొడులను వాడాలి.
2అ. మర్దన చేయడానికి ఉపయోగించే పొడులు
ఇంకా క్రింద ఇవ్వబడిన కొన్ని మందులు కూడా పొడి రూపంలో ఉన్నాయి. పొడిని చర్మంపై రుద్దడానికి ముందు నువ్వులు లేదా కొబ్బరి నూనెతో శరీరాన్ని మర్దన చేయాలి. కానీ రసం లేదా నూనె రూపంలో ఔషధంతో మర్దన చేస్తున్నప్పుడు ఇది అవసరం లేదు. అయితే పొడులు మర్దన తరువాత శరీరంపై ఉన్న అదనపు నూనెను పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి.
1. కమల, నారింజ లేదా తీపి నిమ్మ వంటి పండ్ల తొక్కల యొక్క పొడి
తొక్కలను చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. తరువాత మిక్సీలో చక్కటి పొడి చేయాలి. ఒకసారికి 1 లేదా 2 టీచెంచాల పొడి వాడాలి.
2. ఉపయోగించిన మరియు ఎండిన టీ ఆకుల పొడి
టీ వడకట్టిన తరువాత మిగిలిన అవశేషాలను తీసుకోవాలి. ఇందులో చక్కెర ఉంటుంది. కాబట్టి నీరు పోసి మళ్ళీ వడకట్టాలి. ఇది అవశేషాల నుండి చక్కెరను తొలగిస్తుంది. టీ కోసం నీరు మరిగేటప్పుడు చక్కెర ఉపయోగించకపోతే, వడకట్టిన పదార్థంలో చక్కెర ఉండదు. దీన్ని ఎండలో ఆరబెట్టి, చక్కగా పొడి చేసి, ఒకసారికి 1-2 టీచెంచాలు వాడాలి.
3. శనగ పిండి 4 టీచెంచాలు, 1/2 టీచెంచా పసుపు పొడి మరియు ¼ టీచెంచా కర్పూరం పొడి కలిపిన మిశ్రమం.
4. కంది పొడి 4 టీచెంచాలు లేదా ఉలవల పిండి మరియు 1 టీచెంచా నిమ్మ రసం కలిపిన మిశ్రమం.
5. ముల్లంగి, ఆకుకూరలు, దానిమ్మ ఆకులు లేదా నారింజ పువ్వుల నుండి సేకరించిన తాజా రసం సగం గిన్నె.
6. చిక్కగా ఉన్న కుసుమ ఆకుల రసంతో తయారు చేసిన నూనె
గిన్నెలో సగం కుసుమ నూనెకు, కుసుమ ఆకుల రసాన్ని నూనె మాత్రమే మిగిలి రసం అంతా కలిసిపోయేవరకు కాయాలి. నూనె చల్లబడినప్పుడు ఒక సీసాలో వడపోసి, నిల్వ చేయాలి. ఈ నూనెతో శరీరమంతా మర్దన చేసుకొని వెంటనే స్నానం చేయాలి. ఇది దురదను ప్రేరేపిస్తే, ఉపయోగించడం మానేయండి. ఈ నూనె కళ్ళలో దురద, మంట, నొప్పి, నీరు కారుట వంటివి ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది కళ్ళలో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. నూనె వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకపోతే పై పద్ధతిని ఉపయోగించి తగినంత నూనెను తయారు చేసుకొని వాడుకోవచ్చు.
7. తక్లా నూనె
ఒక లీటరు నువ్వుల నూనెలో తగిన మొత్తంలో నీరు పోసి తయారుచేసిన తక్లా కూరగాయల రసాన్ని సమానంగా వేసి నూనె మాత్రమే మిగిలే వరకు కాయాలి. తరువాత వడపోసి, చల్లార్చి పొడి సీసాలో నింపి భద్రపరుచుకోవాలి.
3. ఔషదాలు
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ క్రింది మందులలో ఏదైనా ఒకదానిని నెలరోజుల పాటు ప్రయత్నించి చూడాలి. తేనెకు బదులుగా డయాబెటిస్ ఉన్న వ్యక్తి గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. ఒక నెలరోజుల పాటు ఒక ఔషధాన్ని ఉపయోగించిన తరువాత ఎటువంటి ప్రభావం ఉండకపోతే, జాబితా నుండి మరొక ఔషధాన్ని ఒక నెల పాటు ప్రయత్నించండి.
1. మెంతి, వాము మరియు సోంపు గింజలను సమాన పరిమాణంలో తీసుకొని తయారుచేసిన పొడిని 1 టీచెంచా ఒక కప్పు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
2. అర కప్పు గో మూత్రంలో లేదా గోరువెచ్చని నీటిలో 4 మాత్రల నావాక్ గుగుల్ లేదా కాంచనార్ గుగుల్ తీసుకోవాలి.
4. ఆహారం
కూరగాయలు మాత్రమే తినడం మరియు బియ్యం, భక్రీ (బజ్రా లేదా జొన్న నుండి తయారైన రోటీ) మొదలైనవి తీసుకోవడం తప్పు. ఆహారం ఆరు రుచుల సమ్మేళనంగా ఉండాలి – తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు మరియు వగరు. వీటిలో తీపి, పులుపు మరియు ఉప్పు తక్కువ మోతాదులో ఉండాలి, కానీ పూర్తిగా ఆపకూడదు.
4అ. ఆహార సూచనలు (ఏమి తినాలి)
జావ (సత్తు), పెసలు, ఉలవలు, మజ్జిగ, తక్లా కూరగాయ, మునగాకు, పొట్లకాయ, బీరకాయ మరియు క్యాప్సికమ్ అనవసరమైన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల వాటిని చాలా వరకు ఆహారంలో చేర్చాలి.
ఊబకాయం ఉన్నవారికి ఎక్కువ ఆకలి ఉంటుంది. వారు ఆకలిని తీర్చగల మరియు కొవ్వు పెరగకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరి ఇష్టప్రకారం వారు ఈ జాబితా నుండి 1-2 ఎంచుకోవచ్చు. నిత్యం ఒకే రకం పదార్ధం తినడం విసుగుగా ఉంటుంది కాబట్టి ఆ జాబితా నుండి వేరొకటి ఎంచుకోవచ్చు.
1. పండిన టమోటాలు
2. బీరకాయ
3. బాగా కాల్చిన తెల్లటి వేరుశనగ (ఎర్రటి వాటిలో పోల్చితే తెల్లటి వాటితో ఎక్కువ కొవ్వు ఉంటుంది)
4. యాపిల్స్
5. ఉడికించిన పెసలు లేదా కొబ్బరితో తయారుచేసిన చారు
6. ఉలవ చారు
7. ఉలవలు మరియు పొట్లకాయతో చేసిన చారు
ప్రెషర్ కుక్కర్లో 1 వంతు ఉలవలు మరియు 10 వంతులు పొట్లకాయ ఉడికించి మిక్సర్‌లో మెత్తటి ముద్ద చేయాలి. ఒక టీచెంచా జీలకర్ర, ¼ టీచెంచా దాల్చినచెక్క, 1 టీచెంచా వాము మరియు గల్లు ఉప్పు రుచికి జోడించాలి.
8. తక్లా లేత ఆకుల నుండి కూరగాయలు మరియు వరి అన్నం లేదా బజ్రీ భక్రీ
9. బజ్రీ భక్రీ, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి
4ఆ. ఆహార వ్యతిరేక సూచనలు (ఏమి తినకూడదు)
కడుపు నిండే వరకు తినడం, నిరంతరం తినడం, నూనెతో తయారుచేసిన ఆహార పదార్ధాలు తినడం, మాంసాహారం తినడం, అదనంగా నీరు త్రాగటం, రిఫ్రిజిరేటర్ నుండి చల్లటి నీరు త్రాగటం, భోజనం తర్వాత నీరు త్రాగటం, మధ్యాహ్నం నిద్రపోవడం, చేతులకుర్చీలో కూర్చోవడం.
– వైద్యులు మేఘరాజ్ మాధవ్ పరద్కర్, మహర్షి విశ్వవిద్యాలయం, గోవా (20.5.2016)