నాగపంచమి

నాగపంచమి సందర్భంగా నాగుపాముల ప్రాముఖ్యత !

  1. ‘శేషనాగు తన పడగ పై పృథ్విని ధరించి ఉంటుంది. అది పాతాళంలో ఉంటుంది. దానికి వెయ్యి పడగలుంటాయి. ప్రతి పడగ పై ఒక వజ్రం ఉంటుంది. ఈ వజ్రం శ్రీవిష్ణు యొక్క తమోగుణం నుండి ఉత్పన్నమైనది. ప్రతి కల్పం చివరిలో శ్రీవిష్ణువు మహాసాగరంలో శేషాసనం పై శయనిస్తాడు. త్రేతాయుగంలో శ్రీవిష్ణువు రాముడి అవతారం తీసుకున్నాడు. అప్పుడు శేషుడు లక్ష్మనుడి అవతారం తీసుకున్నాడు. ద్వాపర మరియు కలి ఈ యుగాల సంధికాలంలో కృష్ణుడి అవతారం తీసుకున్నాడు. అప్పుడు శేషుడు బలరాముడయ్యాడు.
  2. శ్రీకృష్ణుడు యమునా నదిలో కాళింగ మర్దనం చేసిన రోజే శ్రావణ శుక్ల పంచమి.
  3. ‘నాగులలో శ్రేష్టమైన ‘అనంత’ నేనే’, అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు.
    అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం l
    శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం, కాలియం తథా ll

అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక మరియు కాలియా ఇలా తొమ్మిది జాతికి చెందిన నాగులను ఆరాధిస్తారు. దీని నుండి సర్పభయం ఉండదు మరియు విషబాధ ఉండదు.’

(మరిన్ని వివరాల కొరకు చదవండి వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment