సమర్థ రామదాస స్వామి గారు స్వధర్మ స్వరాజ్య సంస్తపకులైన ఛత్రపతి శివాజీ మహారాజులకు ‘ధర్మరక్షణ కొరకు స్వరాజ్యాన్ని స్థాపించడమే నిజమైన గురుదక్షిణ !’ అనే మంత్రమును ఇచ్చారు అలాగే వారి చేత హిందవి స్వరాజ్యమును స్థాపించుకున్నారు. ధర్మమును తెలుసుకున్న గురువులే నిజంగా ధర్మాన్ని రక్షించగలరు. ప్రాచీన గురు-శిష్య పరంపర నుండి లభించిన ఈ బోధన మరియు సమర్థులు ఇచ్చిన ఈ మంత్రమును మళ్ళి కృతిలో తీసుకుని వచ్చే సమయం ఆసీనమైనది.
హిందూ ధర్మం యొక్క రక్షణ మరియు ‘హిందూ దేశ స్థాపన’ కొరకు గురువుల కృపాశీర్వాదము లభించాలి మరియు హిందువులలో దీని గురించి జాగృతి అయ్యేందుకు శ్రీ గురువుల ఆశిర్వదముతో తనువు, మనస్సు మరియు ధనం ద్వారా కృతి శీలురుగా అగుటకు ఈ సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా సంకల్పం చేయండి !