తోలి ఏకాదశి విష్ణు భక్తులకు చాలా మహాత్వమైన రోజు. ఈ రోజు స్వామి దర్శనంతో పాటు ఉపవాసం కుడా చేస్తారు. చాతుర్మాస వ్రాతలను కుడా ప్రారంభిస్తారు. స్వామి గురించి ఒక విషయం తెలుసుకుందాం.
శ్రీవేంకటేశ్వర స్వామి నేత్రములు సగం ఎందుకు మూసి ఉంచుతారు ?
శ్రీవిష్ణువు యొక్క ఇతర రూపములతో పోలిస్తే వెంకటేశ్వర స్వామి నేత్రముల నుండి ప్రక్షేపితమగు శక్తి (తేజస్సు) ఎక్కువగా ఉండును. కలియుగములోని ప్రజల ఆధ్యాత్మిక స్థాయి తక్కువ ఉండుటవలన, ఈ శక్తిని సహించుట సామాన్య భక్తులకు కఠినముగా అనిపించును. ఈ శక్తి తట్టుకోలేనప్పుడు తల భారమగుట, శరీరము వేడి అగుట మొ॥ ఇబ్బందులు కలుగవచ్చును. ఈ శక్తిని సహించుటకు వీలుగా ఉండవలెనని స్వామి నేత్రములు సగం మూసి (అర్ధోన్మీలిత) ఉంటాయి.
(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘శ్రీవిష్ణు, శ్రీరామ మరియు శ్రీకృష్ణ’ (హిందీ) మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)