Contents
- 1. కుదృష్టిని తీసివేసే పద్దతి
- 2. కుదృష్టిని తొలగించడంలో ఎర్ర ఎండు మిరపకాయల ప్రాముఖ్యత
- 3. ఇతర అంశాలు
- 4. బాధ యొక్క తీవ్రతను బట్టి కుదృష్టిని తీసివేసేటప్పుడు ఉపయోగించాల్సిన ఎర్ర ఎండు మిరపకాయల సంఖ్య
- 5. కుదృష్టి వల్ల కలుగుతున్న బాధ యొక్క తీవ్రతను ఎలా గుర్తించాలి?
- 6. గల్లు ఉప్పు, ఆవాలు, ఎర్ర ఎండు మిరపకాయలు కలిపి తీసుకొనుట
ఎర్ర ఎండు మిరపకాయలు రజ – తమ ప్రధానమైన తరంగాలను వేగంగా ఆకర్షించి, సమీకరించి వాతావరణంలోకి విడుదల చేసే గుణాన్ని కలిగివుంటాయి. అప్పుడు వాతావరణంలోకి రజ – తమ ప్రధానమైన తరంగాలు విచ్చిన్నమువుతాయి. అందువల్ల, మిరపకాయలను ఉపయోగించి కుదృష్టిని తీసివేస్తున్నప్పుడు ముందుగా అగ్నిని రగిల్చి సమీపంలో ఉంచాలి అని నియమం. మిరపకాయలలో రజ – తమ ప్రధానమైన తరంగాలను వేగంగా ఆకర్షించే గుణం ఆవాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని స్థూల శరీరం మరియు మనోమయ శరీరం పైన వున్న కుదృష్టిని తీసివేయడానికి ఉపయోగిస్తారు. గల్లు ఉప్పు చుట్టూ వుండే తేమ మిరపకాయలకు తగిలినప్పుడు అది మిరపకాయల పనితీరును పెంచుతుంది.
మనోమయ శరీరంలో రజ – తమ ప్రధానమైన తరంగాలు తొలగడం వల్ల ఆ వ్యక్తి మానసిక సందేహాలు తొలగి ఉద్రిక్తతకు లోనవకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆందోళన రుగ్మతల(మితిమీరిన ఆలోచనలు) ద్వారా బాధపడే వ్యక్తులకు ఈ విధంగా కుదృష్టిని తీసివేయడం వల్ల చాల ప్రయోజనాన్ని పొందుతారు.
1. కుదృష్టిని తీసివేసే పద్దతి
విధానం
- గల్లు ఉప్పు మరియు ఎర్ర ఎండు మిరపకాయలు బేసి సంఖ్యలో, ఒక గుప్పిటలోకి తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగానే తీసుకోవాలి.
- మూసిన గుప్పిటను క్రిందికి (భూమికి ఎదురుగా) తిప్పాలి. ముంజేతులను ఒకదానిపైన ఒకటి ఉంచి కుదృష్టి వల్ల బాధపడుతున్న వ్యక్తి ముందుకు వచ్చి నిలబడాలి.
- అప్పుడు కుదృష్టిని తీసివేసే వ్యక్తి చేతులను క్రింది నుంచి పైకి మరియు లోపలి నుండి బయటకు వృత్తాకార పద్దతిలో తిప్పాలి.
- తరువాత వాటిని ముందుగా రగిల్చి పెట్టుకున్న బొగ్గులపై వేసి కాల్చాలి.
2. కుదృష్టిని తొలగించడంలో ఎర్ర ఎండు మిరపకాయల ప్రాముఖ్యత
ఎర్ర ఎండు మిరపకాయలను ఉపయోగించి కుదృష్టిని తీసివేసేటప్పుడు జరుగు సూక్ష్మ ప్రక్రియ ఈ క్రింది చిత్రంలో చూపించబడింది.
గమనికలు:
1. సూక్ష్మ జ్ఞానం ఆధారంగా చిత్రంలో ఇబ్బంది కలిగించే కంపనాలు:2%
2. సూక్ష్మ జ్ఞానం ఆధారంగా చిత్రంలోని ప్రకంపనాల నిష్పత్తి: కుదృష్టిని నాశనం చేసే శక్తి 2%, కుదృష్టిని ఆకర్షించే శక్తి 2.25%, దుష్ట శక్తి 2% మరియు కుదృష్టిని విచ్చిన్నం చేసే శక్తి 2.25%.
3. ఇతర అంశాలు
- తామసిక ఆహారాలు చాలావున్నప్పటికీ, ఎర్ర ఎండు మిరపకాయలు రజ – తమ తత్వాన్ని కలిగివుండటం వల్ల వాతావరణం నుండి తామసికతను అయస్కాంతంలాగా ఆకర్షించే సామర్ధ్యం ఎక్కువ.
- ఎర్ర ఎండు మిరపకాయలకు తామసికతను ఆకర్షించే సామర్థ్యం ఎలా అయితేవుందో అలాగే కుదృష్టిని తీసిన తరువాత వాటిని కాల్చినప్పుడు ఆకర్షించిన దుష్ట శక్తిని విచ్చిన్నం చేసే సామర్ధ్యం కూడా ఎక్కువ.
- ఎర్ర ఎండు మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తారు. కానీ అప్పుడు వాటిలో వున్నా రజ – తమ తత్వాలు ప్రకృతి ప్రసాదించిందినట్లు చెక్కుచెదరకుండా ఉండి శరీరానికి శక్తిని ఇచ్చేదిగా ఉంటుంది.
4. బాధ యొక్క తీవ్రతను బట్టి కుదృష్టిని తీసివేసేటప్పుడు ఉపయోగించాల్సిన ఎర్ర ఎండు మిరపకాయల సంఖ్య
బాధ యొక్క తీవ్రతను బట్టి ఎర్ర ఎండు మిరపకాయలను బేసి సంఖ్యలో తీసుకోవాలి.
కుదృష్టితో బాధ పడుతున్నప్పుడు వుండు లక్షణాలు మరియు లక్షణాలకు అనుగుణంగా కుదృష్టి తీసివేసేటప్పుడు ఎర్ర ఎండు మిరపకాయలను తీసుకోవలసిన సంఖ్య క్రింది పట్టికలో ఇవ్వబడినవి.
బాధ యొక్క స్వభావం | ఎర్ర ఎండు మిరపకాయల సంఖ్య |
---|---|
1. శరీరం యొక్క భారము, చేతులు మరియు కాళ్ళ తిమ్మిరి, వికారం | 3 |
2. చంచలత్వం, ఆకస్మిక చెమట, ప్రతికూల ఆలోచనలు పెరగడం | 5 |
3. నోటి మాటపై నియంత్రణ లేకపోవడం, దృష్టి మసకబారడం, నోటి నుండి లాలాజలం కారడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు | 7 |
4. మూర్ఛ, దుష్ట శక్తి యొక్క ప్రభావం వల్ల విచిత్రంగా ప్రవర్తించడం, ఒకరిని చంపడం గురించిన ఆలోచనలు | 9 |
గమనిక: పైన పేర్కొన్న లక్షణాలు గమనించకపోతే, మీకు అనుగుణంగా మూడు నుండి ప్రారంభించి బేసి సంఖ్యలలో మిరపకాయలను వాడాలి.
5. కుదృష్టి వల్ల కలుగుతున్న బాధ యొక్క తీవ్రతను ఎలా గుర్తించాలి?
కుదృష్టి తీసిన తరువాత ఉపయోగించిన గల్లు ఉప్పు మరియు ఎర్ర ఎండు మిరపకాయలు మంటల్లోవేసి కాల్చినప్పుడు ఆ వ్యక్తికి వచ్చిన దగ్గు లేదా దుర్వాసనను ఆధారంగా చేసుకొని బాధ యొక్క తీవ్రతను అంచనా వేస్తారు.
అ. దగ్గు వచ్చినట్లయితే ఆ వ్యక్తికి కుదృష్టి లేదని అర్థం. ఎందుకంటే మనకు వంట చేసేటప్పుడు ఎండు మిరపకాయలను వేయించినా కూడా దగ్గు వస్తుంది. దగ్గు రాలేదు అంటే ఆ వ్యక్తి కుదృష్టితో బాధ పడుతున్నాడు అని అర్థం. దగ్గు రాకపోవడానికి కారణం మిరపకాయలలోని తీవ్రమయిన స్వభావం దుష్ట శక్తి యొక్క ప్రకంపనలను నాశనం చేయడానికి ఉపయోగపుడుతుంది అని అర్థం. అందువల్ల బాధ యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ దగ్గు వస్తుంది.
ఆ. దుర్వాసన లేకపోతే ఆ వ్యక్తి కుదృష్టితో బాధపడటంలేదు అని, ఒకవేళ దుర్వాసన ఉంటే ఆ వ్యక్తి కుదృష్టితో బాధపడుతున్నాడు అని అర్థం.
6. గల్లు ఉప్పు, ఆవాలు, ఎర్ర ఎండు మిరపకాయలు కలిపి తీసుకొనుట
కుదృష్టిని తీసివేసే పద్ధతిలో అంతర్లీనంగా దాగివున్న శాస్త్రం ప్రకారం గల్లు ఉప్పు, ఆవాలు, ఎర్ర ఎండు మిరపకాయలు కలిపి తీసుకొని కుదృష్టిని తీసివేసేయడం మరియు గల్లు ఉప్పు, ఎర్ర ఎండు మిరపకాయలు వుపయోగించి కుదృష్టిని తీసివేయడం వంటి రెండు పద్ధతులు ఒక్కటే, కానీ ఇక్కడ ఆవాలు మాత్రమే అదనపు పదార్థం. సాధారణంగా రెండు చెంచాల గల్లు ఉప్పు, అర చెంచా ఆవాలు మరియు బేసి సంఖ్యలో ఎర్ర ఎండు మిరపకాయలు తీసుకొని కుదృష్టిని తీసివేస్తాము.