భగవంతుడి ఆధ్యాత్మిక స్థాయి 100 శాతంగా పరిగణించినచో, ఈ ఆధ్యాత్మిక స్థాయిని 1 నుండి 100% మధ్యగా అంచనా వేసినట్లు అయితే, సూక్ష్మాజ్ఞానేంద్రీయాన్ని ఉపయోగించి చేసిన ఆధ్యాత్మిక పరిశోధన ద్వారా నేటి ప్రపంచంలో ఒక సామాన్య మానవుడి ఆధ్యాత్మిక స్థాయి 20% వుంటోందని తెలిసింది.
ఆధ్యాత్మిక శాస్రానుసారం, ఏ మతం వారైనా, ఏ సాధనా పద్ధతిని అవలంబించినా, 70% ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న తరువాతే వారు సంతుమహాత్ములుగా పరిగణింపబడటానికి అర్హులు అవుతారు.
ఒక సంతుమహాత్ముని గుర్తించడానికి కావలిసిన ప్రమాణాలు అతడు అవలంబించిన సాధనా మార్గము మీద ఆధారపడి ఉంటాయి – ధ్యాన యోగ, కర్మ యోగ (కర్మ యొక్క మార్గము), భక్తి యోగ (భక్తి యొక్క మార్గము) మొదలగునవి. ఆధ్యాత్మిక స్థాయిని బట్టి కూడా ప్రమాణాలు మారవచ్చు.
శారీరకంగా కొన్ని గుర్తులు ఏమనగా ముఖంలో తేజస్సు కనపడుట, చేతి లోని గీతలు క్షీణమగుట, అస్పష్టంగా మారుట, చేతి వేళ్ళు, అర చెయ్యి మెత్తగా మరియు మదువుగా మారుట.
మానసిక స్థాయిలో, ఆ వ్యక్తి ఆనందాన్ని అనుభవించగలుగుట, అతని ఆలోచనలు మరియు ప్రవర్తన అతని సాత్విక తత్వమును తెలియపరచుట. సంతుమహాత్ముల దగ్గర ఉన్నప్పుడు సాధకులు, ఆనందాన్ని, ఆలోచనా రహిత స్థితిని అనుభవిస్తారు. కాకపోతే, ఒక సామాన్య మానవునికి ఇది గ్రహించటం చాలా కష్టం.
ఒక సామాన్య వ్యక్తి, లేదా ఒక భక్తుడు, ఒక పరిపక్వం చెందిన సాధకుడు కూడా ఒక సంతుమహాత్మును తమకు తాము గుర్తించలేరు.
ఏ సాధకుడు కూడా తన ఆధ్యాత్మిక స్థాయి కన్నా గరిష్ఠంగా 20% ఆధ్యాత్మిక ప్రకంపనలనే గుర్తించగలడు. ఎందుకంటే 20% కన్నా ఎక్కువ తేడా ఉన్నప్పుడు ఆ ప్రకంపనలు చాలా సూక్ష్మంగా ఉంటాయి.
ఆధ్యాత్మిక శాస్త్రానుసారం సాధకుడు ఇతర సంత్‌మహాత్ముల అంగీకారం తరువాతనే సంతుమహాత్ములుగా పరిగణింపబడతాడు. ఇది ఒక సంతుమహాత్ములు మాత్రమే కశ్చితంగా మరొక సంతుమహాత్ములను గుర్తించగలరు అనే విషయాన్ని తెలుపుతుంది. ఇది ఒక వైద్యుడు మాత్రమే మరొక వైద్యుడి, ఒక ఇంజనీర్ మాత్రమే మరొక ఇంజనీర్ యొక్క నైపుణ్యాన్ని గుర్తించగలరనటం వంటిది.
సంతుమహాత్ముల స్థాయిలో లేని వ్యక్తి మరొకరిని సంతుమహాత్ములుగా ప్రకటించలేరు.