చాలా మంది ప్రజలు అల్యూమినియం లేదా హిండాలియం (అల్యూమినియం, మెగ్నీషియం, మాంగనీస్, క్రోమియం మరియు సిలికాన్ మొదలైన వాటి మిశ్రమం)తో తయారు చేసిన వంట పాత్రలను ఆహారం వండటం కోసం ఉపయోగిస్తున్నారు. అలాంటి పాత్రలలో ఆహారం వండటం ఆరోగ్యానికి హానికరం. అటువంటి పాత్రలు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు, హానికరమైన ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ విషయంలో ముఖ్యమైన అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి.
1. అల్యూమినియం ఆరోగ్యానికి ప్రమాదకరం
పూర్వం భారతదేశంలో, టిన్ పూతతో కప్పబడిన మట్టి లేదా ఇత్తడి / కాంస్య పాత్రలలో ఆహారం తయారు చేయబడేది. జైలులో వంట చేయడానికి బ్రిటిష్ వారు అల్యూమినియం పాత్రలను ఉపయోగించడం వల్ల ఖైదీలు త్వరగా ఎలా మరణించేవారో, దివంగత శ్రీ రాజీవ్ దీక్షిత్ పదేపదే నొక్కిచెప్పారు. నేడు ఇవి ప్రతి ఇంటికి చేరుకున్నాయి. అల్యూమినియం లేదా హిండాలియం (అల్యూమినియం యొక్క మిశ్రమం) వల్ల ఆరోగ్యానికి కలిగే హానికి గల కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి.
అ. ఆహార కణాలతో పాటు లోహం శరీరంలోకి ప్రవేశించడం వల్ల వ్యాధులు తలెత్తుతాయి
స్టీల్ చెంచాతో అల్యూమినియం పాత్రను గీకినప్పుడు కూడా లోహం యొక్క కణాలు పాత్రనుండి విడిపడి వండిన ఆహారంలో కలుస్తాయి మరియు తరువాత ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. రోజువారీ సుమారు 5 మిల్లీగ్రాముల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఆ. ఆమ్ల పదార్థాలు అల్యూమినియం అయాన్లు వేగంగా ఆహారంలో కరగడానికి సహాయపడతాయి
నిమ్మకాయ, టమోట మరియు ఇతర ఆహార పదార్ధాలు అటువంటి పాత్రలలో వండినప్పుడు ఆమ్ల పదార్థాలతో లోహంలోని అయాన్లు ఆహారంలో వేగంగా కరగడానికి సహాయపడతాయి మరియు అలాంటి ఆహారం శరీరానికి హానికరం.
ఇ. పేరుకుపోయిన అల్యూమినియం
శరీరంలో నెమ్మదిగా విషంగా మారుతుంది
అటువంటి లోహాలను విసర్జించడంలో మానవ శరీరం యొక్క సామర్థ్యం పరిమితమైనది. ఇది శరీర పరిమితిని మించినప్పుడు అవి క్రమంగా కండరాలు, మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు మొదలైన కణాలలో పేరుకుపోతాయి. అల్యూమినియం మెదడు కణాలపై కూడా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో పేరుకుపోయిన లోహం నెమ్మదిగా విషంగా మారుతుంది.
ఈ. అల్యూమినియం పాత్రలలో వండిన
ఆహారం వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధులు
దీనివల్ల కలిగే వ్యాధులు మానసిక విచారం, ఆందోళన, చిత్తవైకల్యం (మతిమరుపు), ఎముకల వ్యాధులు (బోలు ఎముకల వ్యాధి వంటివి), కళ్ళ వ్యాధులు, మూత్రపిండాల పనితీరు తగ్గడం, విరేచనాలు, పొట్టలో ఆమ్లత పెరగటం, అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, పెద్దప్రేగు నొప్పి (పేగు సంక్రమణ), నోటిలో పూత మరియు చర్మ వ్యాధులు.
ఉ. అల్యూమినియం మెదడు కణాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.
2. అల్యూమినియం మరియు హిండాలియం బదులుగా ప్రత్యామ్నాయాలు
అ. మట్టి వంటసామాను ఉత్తమ ప్రత్యామ్నాయం. స్థానిక మార్కెట్లో అందుబాటులో లేకపోతే ఈ కుండలను స్థానిక కుమ్మరి నుండి తయారు చేయించుకోండి. వీటిని వంటలో ఉపయోగిస్తే శరీరానికి అవసరమైన ఖనిజాలను ఆహారం ద్వారా పొందుతారు. మట్టి పాత్రలలో వండిన ఆహారాన్ని రుచి చూసినవారు మరలా ఇతర పాత్రలను ఉపయోగించరు.
ఆ. మట్టి పాత్రలను ఉపయోగించడం సాధ్యం కాకపోతే, టిన్ పూతతో రాగి లేదా ఇత్తడి (రాగి మరియు జింక్ మిశ్రమం) పాత్రలను వాడండి. అయినప్పటికీ, పుల్లని వస్తువులను వండడానికి వాటిని ఉపయోగించకూడదు.
ఇ. సులభమైన ప్రత్యామ్నాయం స్టెయిన్లెస్ స్టీల్ వంటసామాను ఉపయోగించడం, ఇప్పటి వరకు స్టెయిన్లెస్ స్టీల్ యొక్క చెడు ప్రభావాలు తెలియవు.
3. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
‘शरीरमाद्यं खलु धर्मसाधनम्,’, అనేది ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఒక సూక్తి. అంటే ఆధ్యాత్మిక సాధన చేయడానికి మొదటి సాధనం ఆరోగ్యకరమైన శరీరం. దేవుడు ఇచ్చిన ఈ బహుమతిని డబ్బుతో తూకం వేయడం అసాధ్యం. అన్ని అల్యూమినియం పాత్రలను మార్చలేని వారు దశలవారీగా చేయవచ్చు.
మొబైల్ ఫోన్లు, సౌందర్య సాధనాలు, డిటర్జెంట్లు, శరీరానికి హానికరమైన టూత్‌పేస్టులు, నూడుల్స్, చిప్స్ వంటి పోషకాహార విలువలు లేని ఆహారాన్ని తినడం, పనికిరాని ఇబ్బంది పెట్టే టెలివిజన్ సెట్, డిష్ యాంటెన్నా మొదలైనటువంటి అనవసరమైన వస్తువులపై డబ్బు వృధా చేయకుండా ఆరోగ్యకరమైన జీవనం కోసం మట్టి లేదా ప్రత్యామ్నాయ పాత్రలను కొనడం మనకు సాధ్యం కాదా?
– వైద్యులు మేఘరాజ్ మాధవ్ పరాడ్కర్, సనాతన ఆశ్రమం, గోవా (23.1.2015)