విషయ సూచిక
భారత దేశంలో ప్రసిద్ధ స్వయంభూ గణపతులు, మరియు మహా గణపతి
1. మహారాష్ట్రలోని మూడున్నర పీఠముల గణపతి
2. మహారాష్ట్రలోని అష్ట గణపతులు
3. పురాణాల ప్రకారం గణపతి యొక్క ఇరవై ఒక్క పీఠములు
4. భారత దేశంలోని పన్నెండు ప్రసిద్ధ గణపతి విగ్రహములు
5. మహా గణపతి
స్వయంభూ గణపతులు, భారత దేశంలోని ప్రసిద్ధ గణపతి విగ్రహములు మరియు మహా గణపతి
1. మహారాష్ట్రలోని మూడున్నర పీఠముల గణపతి
సం . | పేరు | స్థలం | జిల్లా |
1. | మోరేశ్వర్, మయూరేశ్వర్ | మోర్గావ్ | పూణే |
2. | మంగళమూర్తి | చించ్వాడ | పూణే |
3. | మహా గణపతి | రాజూరు | జాలన |
4. | ప్రవాళ గణేష్ (అర్థ పీఠం) | పద్మాలయ | జల్గావ్ |
2. మాహారాష్ట్ర లోని అష్ట వినాయకులు
అష్ట వినాయకులు చాలా ప్రసిద్ధి చెందినవి. అష్ట సిద్ధులూ గణపతిని అనుసరించి ఉంటాయి. అష్ట వినాయకులలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క శక్తికి ప్రతీకలుగా ప్రసిద్ధి చెందారు. అష్ట వినాయకులు ఎనిమిది దిక్కులకూ చెందినవారు.
సం . | పేరు | స్థలం | జిల్లా |
1. | మోరేశ్వర్, మయూరేశ్వర్ | మోర్గావ్ | పూణే |
2. | బల్లాలేశ్వర్ | పాళి | రాయగడ్ |
3. | వరద వినాయక | మహాడ్ | రాయగడ్ |
4. | చింతామణి | తేయూర్ | పూణే |
5. | గిరిజాత్మజ | లెన్యాద్రి | పూణే |
6. | విఘ్నేశ్వర | ఓఝార్ | పూణే |
7. | గణపతి (మహా గణపతి) | రంజన్గావ్ | పూణే |
8. | గజ ముఖ | సిద్ధటేక్ | అహ్మద్ నగర్ |
3. పురాణాల ప్రకారం గణపతి యొక్క ఇరవై ఒక్క పీఠములు
సం . | పేరు | స్థలం | జిల్లా |
1. | మోరేశ్వర్, మయూరేశ్వర్ | మోర్గావ్ | పూణే |
2. | చింతామణి | తేయూర్ | పూణే |
3. | గణపతి (మహా గణపతి) | రంజన్గావ్ | పూణే |
4. | గిరిజాత్మజ | లెన్యాద్రి | పూణే |
5. | బల్లాలేశ్వర్ | పాళి | రాయగడ్ |
6. | గజ ముఖ | సిద్ధటేక్ | అహ్మద్ నగర్ |
7. | చింతామణి | కలంబ | యవత్మాల్ |
8. | శర్మ విఘ్నేశ్ | అడాశ | నాగపూర్ |
9. | విజ్ఞాన్ గణేశ్ | రాక్షస భువన్ | జాలన |
10. | మహా గణపతి | రాజూర్ | జాలన |
11. | బాల్ చంద్ర | గంగామసాలె | పర్భాని |
12. | లక్ష్య వినాయక | వేరూల్ (ఎల్లోరా) | ఔరంగాబాద్ |
13. | ప్రవాళ గణేశ్ | పద్మాలయా | జల్గావ్ |
14. | ఆహుండి వినాయక | కాశీ | బెనారస్ |
15. | ఓంకార | ప్రయాగ | అలహాబాద్ |
16. | భ్రుశుండి గణేశ్ | నామల్గావ్ | బిద్ |
17. | విఘ్నరాజ్ | విజయపూర్ | ఆంధ్ర ప్రదేశ్ |
18. | వినాయక | కస్యపాశ్రమ | కాశీ దగ్గర |
19. | మంగళ మూర్తి | గణేష్పూర్ | బెంగాల్ |
20. | శ్వేత విఘ్నేశ్వర | కుంభకోణం దగ్గర | తమిళనాడు |
21. | మంగళ మూర్తి | పరినర్ | ఉజ్జయిని దగ్గర |
4. భారత దేశంలోని పన్నెండు ప్రసిద్ధ గణపతి విగ్రహములు
సం. | పేరు | స్థలం |
1. | వక్రతుండ | మద్రాసు |
2. | ఏకదంత | బెంగాల్ |
3. | కృష్ణ పింగాక్ష | మద్రాసు |
4. | గజ వక్త్ర | ఒరిస్సా |
5. | లంబోదర | గణపతి పూలే , మహారాష్ట్ర |
6. | వికట | హిమాచాల ప్రదేశ్ |
7. | విఘ్న రాజేంద్ర | కురుక్షేత్ర దగ్గర |
8. | ధూమ్ర వర్ణ | కేరళ |
9. | బాల చంద్ర | రామేశ్వరం దగ్గర |
10. | వినాయక | కాశీ , బెనారస్ |
11. | మహా గణపతి | మహాబాలేశ్వర్ , మహారాష్ట్ర, గోకర్ణ |
12. | శ్రీ గజానన | హిమాలయ |
5. మహా గణపతి
రుద్ది-సిద్ధుల (దైవ శక్తి) తో కూడిన గణపతి. పార్వతీ దేవిచే తయారు చేయబడ్డ గణేశుడు మహా గణపతి యొక్క అవతారము . ఆమె మట్టి ముద్ద నుండి ఒక ఆకారమును తయారు చేసి గణపతిని అందులోకి ఆవాహన చేసింది. ఈ విశ్వము సృష్టించబడక ముందు పరమేశ్వరుని (మహత్) తత్త్వము నిరాకార, శాశ్వత రూపం లో ఉండేది కాబట్టి, దానిని మహా గణపతి అంటారు. మోక్ష ప్రాప్తి కోసం మహా గణపతిని ఆరాధించినప్పుడు, తొండము కుడి వైపు తిరిగి ఉన్న విగ్రహమును ఎంచుకోవడం ఆచారం. అటువంటి పరిస్థితులలో సాధ్యమైనంత వరకు అది మట్టి తో చేయబడి ఉంటుంది. తొండము కుడి వైపునకు తిరిగి ఉన్న బంగారు మరియు వెండి గణపతి విగ్రహములు అరుదుగా కనిపిస్తాయి.
ప్రతి పురుష దేవత కు ప్రత్యేకమైన ఒక శక్తి ఉంటుందని నమ్మబడుతుంది. ఉదాహరణకు , బ్రహ్మ- భారతి, విష్ణు – లక్ష్మి , శివ – పార్వతి. కనుక, గణపతి భక్తులు గణపతి యొక్క ఒక శక్తిని పరబ్రహ్మ రూపంగా నమ్మడం లో ఆశ్చర్యం లేదు. గణపతి తన ఒడిలో కూర్చున్న తన శక్తిని ఆలింగనము చేసుకుని ఉన్నట్లుగా చిత్రీకరించబడిన ఒక శిల్పము ఉన్నది. ఈ రోజులలో కూడా అటువంటి చిత్రములను మనం చూడవచ్చు. అలాగే సిద్ధి బుద్ధులతో కూడిన శిల్పములు మరియు ఆయన ఇద్దరు భార్యలూ చెరొక వైపు కూర్చుని ఉన్న శిల్పములు కూడా కనిపిస్తూ ఉంటాయి. తాంత్రిక శాస్త్రములో తన శక్తి తో కూడిన గణపతిని మహా గణపతి గా అభివర్ణిస్తారు.
Chala upayogamga undhi