ఆవ్హానే, బుదృక్ (నగర్ జిల్లా) లోని గణపతి ఆలయం
నిద్రా భంగిమ లో ఉండే శ్రీ గణేశ విగ్రహం
నిద్రా భంగిమ లో ఉండే శ్రీ గణేశ విగ్రహం నగర్ జిల్లాలోని ఆవ్హానే, బుదృక్ గ్రామంలో, పతర్ది గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆవని నదీ తీరంలో కల ఈ గ్రామంలోని గణేశ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని గణేశ విగ్రహం దక్షిణ ముఖంగా నిద్రిస్తున్న భంగిమలో ఉంటుంది. ఇటువంటి అరుదైన విగ్రహం మహారాష్ట్రలో ఇంకెక్కడా లేదు. ఈ గణపతి, అష్ట వినాయకులలో ఒకటైన మీరేగావ్ గణపతి యొక్క పాక్షిక పీఠముగా నమ్మబడుతున్నది.