హిందువులలో దేశం మరియు ధర్మం పట్ల అభిమానం నిర్మాణం అవ్వాలి మరియు హిందువులను ఐక్య పరచడం సులభమవ్వాలనే గొప్ప ఆలోచనతో లోకమాన్య తిలక్ గారు ఈ సార్వజనిక గణేశోత్సవమును ప్రారంభించారు; కానీ ప్రస్తుతం సార్వజనిక గణేశోత్సవములో జరుగుతున్నా తప్పుడు ఆచరణలు మరియు అశాస్త్రీయ పద్ధతుల మూలంగా ఉత్సవం యొక్క మూల ఉద్దేశం విఫలమవడంతో పాటు ఉత్సవం యొక్క పవిత్రత కూడా నష్టమైంది. ‘సార్వజనిక శ్రీ గణేశోత్సవము ఎలా ఉండకూడదు మరియు ఎలా ఉండవలెను’, అని క్రింది విషయాల ద్వారా తెలుసుకోవచ్చు.
1. ఉత్సవములో ఏ విషయాలు ఉండరాదు ?
అ . బలవంతముగా నిధిని (చందా) వసూలు చేయడం
ఆ . శాస్త్ర ప్రకారంగా తయారు చేయని విగ్రహాలు
ఆ 1. మట్టితో తయారుచేసే విగ్రహం కాకుండా దానికి వ్యతిరేకంగా ఇతర విగ్రహాలు
ఆ 2. చిత్రవిచిత్ర రూపముల విగ్రహాలు
ఆ 3. చాలాపెద్ద పరిమాణంలో (గాత్రంలో) చేసిన విగ్రహాలు
2. మంటపము మరియు ఉత్సవ కార్యక్రమాలలోని తప్పులు
అ. దుబార (వ్యర్థ) అలంకారము
ఆ. మండపమును తయారు చేయునప్పుడు నిప్పు అంటేందుకు అవకాశమున్న వస్తువుల ఉపయోగము
ఇ. మంటపములో జూదము ఆడడం మరియు మధ్యపానము సేవించడం
ఈ. మత్తు మరియు మాంస పదార్థముల ప్రకటనలు
ఉ. ధర్మము మరియు దేశానికి సంబంధం లేనట్టువంటి కార్యక్రమాలు
ఊ. అభిరుచిహీనమైనట్టు వంటి పాటలు
ఋ. ధ్వని కాలుష్యము
3. ఊరేగింపు సమయములో తప్పులు
అ. మెల్లగా సాగే (మందగతితో) ఊరేగింపు
ఆ. ఊరేగింపులో రంగులు చల్లడం మరియు బలవంతంగా అంటించడం
ఇ. అశ్లీలంగా తైతక్కలాడడము
ఈ. మహిళలతో అసభ్యంగా వ్రవర్తించడం
ఉ. ఊరేగింపులో తాగుబోతులు
ఊ. బాణాలు మరియు విస్పోటకాలు
ఋ. రాత్రి 10 గం. తర్వాత విగ్రహ నిమజ్జనం చేయడం
4. ఇతర అయోగ్య విషయాలు
అ. గుండాల సహభాగము
ఆ. రాజకీయ నాయకుల ప్రమేయం
5. ఉత్సవములో ఏ విషయాలు ఉండాలి ?
అ. శాస్త్రానికి అనుగుణంగా మూర్తిస్థాపన.
ఆ. పూజాస్థలములో మరియు ఉత్సవ మంటపములో క్రమశిక్షణ మరియు పావిత్య్రము.
ఇ. ధార్మిక విధిని మరియు దేవతల అధ్యాత్మికశాస్త్రము యొక్క అర్థమును తెలుసుకొని ఉత్సవములోని అన్ని కార్యములను సేవాభావముతో చేసే కార్యకర్తలు.
ఈ. సమాజసహాయము, దేశరక్షణ, మరియు ధర్మ జాగృతి చేయు కార్యక్రమాలు.
ఉ. అధ్యాత్మికప్రచారము, ధార్మిక, సామాజిక, మరియు దేశమునకు సంబంధించిన కార్యక్రమాలకు ఎక్కువ నిధిని ఉపయోగించాలి.
ఊ. ధర్మప్రచారము మరియు ధార్మిక కార్యక్రమాలలో కార్యకర్తల పూర్తి సంవత్సరమంతా సహభాగము.
‘హిందూ జనజాగృతి సమితి’ మరియు ‘సనాతన సంస్థ’ ఈ సంస్థలు ఇతర సమ ఆలోచనా ధోరణి గల సంస్థల సహాయంతో గత కొన్ని సంవత్సరాల నుండి దేవతలు మరియు సంత మహనీయులకు జరుగుతున్న అవమానం; గణేశోత్సవం, నవరాత్రోత్సవం మొదలైన ఉత్సవాలలో జరిగే తప్పుడు ఆచారాలు; దేవాలయ ప్రభుత్వీకరణ; గోహత్య మొదలైన విషయాల విరుద్ధంగా చట్ట ప్రకారంగా Twitter, Facebook, Email or Fax మాధ్యమాల ద్వారా వ్యాపకమైన జనజాగృతి ఉద్యమాన్ని చేస్తున్నది.
గణేశభక్తుల్లారా, మీరు కూడా ధర్మరక్షణకు సంబంధించిన ఈ ఉద్యమాలలో పాల్గొని ధర్మం పట్ల మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి మరియు దేవతల కృపను అత్యధికంగా సంపాదించండి ! మనము ధర్మాన్ని రక్షిస్తే, ధర్మము (భగవంతుడు) మనల్ని రక్షిస్తుంది !
ధర్మరక్షణ కొరకు ‘హిందూ జనజాగృతి సమితి’ మరియు ‘సనాతన సంస్థ’ వీటి కార్యములో పాల్గొనండి !