కార్యము మరియు వైశిష్ట్యములు
1. విఘ్నహర్త
గణేశుడు విఘ్నహర్త అయినందున నాటకము మొదలుకొని వివాహము వరకు, అలాగే ‘గృహ ప్రవేశము’ మొదలగు అన్ని విధుల ప్రారంభములో శ్రీ గణేశుని పూజ చేస్తారు.
2. ప్రాణశక్తిని పెంచేవాడు
మానవుని శరీరములోని వేరే వేరే కార్యములు వేరే వేరే శక్తుల నుండి జరుగుతుంటాయి. ఆ వివిధ శక్తుల మూలభూత శక్తినే ‘ప్రాణశక్తి’ అంటారు. శ్రీ గణపతి నామజపము ప్రాణశక్తిని వృద్ధి చేస్తుంది.
3. మహాగణపతి
ఋద్ధి-సిద్ధి (శక్తి) సమేతంగా ఉన్న శ్రీ గణపతిని మహాగణపతి అంటారు. పార్వతిదేవి తయారు చేసిన గణేశుడు మహాగణపతి అవతారం. ఆమె మృతికతో (మట్టి) ఆకారం చేసి అందులో శ్రీ గణపతిని ఆహ్వానించెను. జగద్‌సృష్టికి పూర్వం ‘మహాతత్వ’ము నిర్గుణ-నిరాకారమై ఉండెను, అందువల్ల ‘మహాగణపతి’ అని అంటారు.
4 . నాదభాషా మరియు ప్రకాశభాషలను ఒకదాని నుండి మరొకదానిలోకి అనువాదము చేయువాడు
మనము మాట్లాడే నాదభాష శ్రీ గణపతి అర్థం చేసుకోగలడు, అందుకే ఆయన త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు. శ్రీ గణపతి నాదభాషను ప్రకాశభాషకు మరియు ప్రకాశభాషను నాదాభాషలోనికి అనువాదము చేసే దేవుడు. వేరే దేవతలు చాలా వరకు ప్రకాశభాషను మాత్రమే తెలుసుకొనగలరు. వీటికి కొన్ని ఉదాహరణలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడినవి.
5. ఎర్రని వస్తువులు
శ్రీ గణపతి రంగు ఎర్రగా ఉంటుంది. ఆయన పూజలో ఎర్రని వస్త్రము ఎర్రని పువ్వులు మరియు రక్తచందనాన్ని ఉపయోగిస్తారు. వాటి ఎర్రని రంగు ద్వారా వాతావరణములోని శ్రీ గణపతి పవిత్రకాలు మూర్తివైపు ఎక్కువ ప్రమాణములో ఆకర్షితమై మూర్తిని జాగృత పరచడములో సహాయపడతాయి.
6. ఎలుక
ఎలుక రజోగుణానికి ప్రతీక. అంటే రజో గుణము శ్రీ గణపతి ఆధీనములో ఉంటుంది.
వృ-వహ అంటే ప్రవహించేది, దీని నుండి ‘వాహన’ శబ్దము నిర్మాణమైనది. దేవతల వాహనము వాళ్ల కార్యానికి అనుగుణంగా ఆయా వేళలలో మారుతూ ఉంటుంది. మూషకము (ఎలుక) శ్రీ గణపతికి నిత్యవాహనము.
7. అన్ని సంప్రదాయాలకు పూజనీయుడు
తమ ఉపాస్య దేవతే శ్రేష్టమైనది మరియు ఆమెయే విశ్వము యొక్క సృష్టి, స్థితి మరియు లయలకు కారణము, ఇతర దేవతలు లేరు, అని భావించెడి అనేక సంప్రదాయాలు ఉన్ననూ ప్రతి యొక్క సాంప్రదాయములోనూ
శ్రీ గణపతి పూజ ఉన్నది, జైన మతములోనూ ఉన్నది.
8. వాగ్దేవత
గణేశుడు ప్రసన్నుడైతే వాక్ సిద్ధి ప్రాప్తమవుతుంది.
9. మంగళమూర్తి
మంగం సుఖం లాతి ఇతి మంగలం ‘మంగ’ అంటే సుఖ ప్రాప్తి చేయును, అది మంగళం. ఇలా మంగళం చేయు మూర్తి అనగా ‘మంగళమూర్తి’.
మహారాష్ట్రలో ‘మంగళమూర్తి మోరియా’ అని శ్రీ గణపతి జయఘోష చేస్తారు; దీనిలో మోరియా ఈ పదము ‘మోరయా గోసావి’ అనే ప్రసిద్ధ గణేశ భక్తుని పేరు నుండి వచ్చినది. ఇతను పదునాల్గవ శతాబ్దములో పూణే దగ్గర ఉన్నట్టువంటి చించవాడ ఊరిలో ఉండేవారు. దీనిని బట్టి భగవంతునికి భక్తుని మధ్య ఉండే శాశ్వత సంబంధము తెలిసివస్తుంది.