1. సంకటకాలము (అత్యవసర పరిస్థితులు) సందర్భంలో హిందూ ధర్మశాస్త్రంలో పేర్కొన్న ప్రత్యామ్నాయం ‘ఆపద్ధర్మము’ !
‘ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా, ప్రతిచోటా ప్రజలకు బయటకు వెళ్ళుటకు అనేక బంధనాలున్నాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ మూసివేత (లాక్డౌన్) కూడా అమలు చేసారు. కరోనా వంటి సంక్షోభం నేపథ్యంలో, హిందూ ధర్మాచరణ యొక్క శాస్త్రములో కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవ్వబడ్డాయి, దీనిని ‘ఆపద్ధర్మము’ అని పిలుస్తారు. ‘ఆపద్ధర్మము’ అంటే ‘ఆపది కర్తవ్యో ధర్మః’, అంటే ‘సంకటకాలములో ధర్మశాస్త్ర సమ్మతమైన కృత్యము’.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, హిందూ ధర్మములో మానవుడి గురించి ఏ స్థాయిలో ఆలోచింపబడిందో’ ఇది తెలుస్తుంది మరియు హిందూ ధర్మము యొక్క వ్యాపకత్వమును గ్రహించవచ్చు.
2. గణేశ చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ?
గణేశోత్సవం హిందువుల పెద్ద పండుగ. శ్రీ గణేశ చతుర్థి రోజున, అలాగే గణేశోత్సవ రోజులలో, పృథ్విపై శ్రీ గణపతి తత్వము ఇతర రోజులతో పోలిస్తే వెయ్యి రేట్లు సక్రియం అవుతుంది. నేడు కరోనా మహమ్మారి ప్రకోపము రోజురోజుకు పెరుగుచున్నది; ఈ కారణంగా, కొన్ని చోట్ల ఇంటి నుండి బయటకు వెళ్లడానికి బంధనాలున్నాయి. ఈ దృక్కోణంలో, ‘ఆపద్ధర్మము’ మరియు ధర్మశాస్త్రాలను కలిపి ప్రత్యక్ష దృశ్యాలు, అలంకరణలు మొదలైనవి చేయకుండా, సాధారణ పద్ధతిలో పార్థివ్ సిద్ధివినాయక వ్రతాన్ని ఆచరించవచ్చు.
కొన్ని కారణాల వల్ల ఇంటి నుండి బయటపడటం సాధ్యం కాని వ్యక్తులు, ఉదా. కరోనా వ్యాప్తి కారణంగా, చుట్టుపక్కల ప్రాంగణం లేదా భవనం ‘పరిమితం చేయబడిన జోన్’గా ప్రకటించబడింది, అక్కడి ప్రజలు’ గణేశ తత్వము ప్రయోజనం పొందటానికి ’ ఇంట్లో ఉన్న గణేశ విగ్రహా పూజ లేదా శ్రీ గణేశ చిత్రాన్ని షోడోశోపాచార పూజ చేయవలెను. ఈ ఆరాధన చేస్తున్నప్పుడు, ’ప్రాణప్రతిష్ఠ’ విధిని చేయకూడదు, ఇది గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన సూత్రం.
ప్రత్యేక హెచ్చరిక : గణేశ విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు, అలాగే నిమజ్జనం చేసేటప్పుడు, ఇంటిలో కొంతమంది మాత్రమే వెళ్లాలి. విగ్రహ నిమ్మజనము మీ ఇంటి దగ్గర ఉన్న చెరువులో లేదా బావిలో చేయాలి. ఈ కాలంలో జనం వచ్చే అవకాశం ఉన్నందున, కరోనాకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక నియమాలను ఖచ్చితంగా పాటించడం మనందరి కర్తవ్యం.
– శ్రీ. దామోదర్ వాజే, సనాతన పురోహిత పాఠశాల, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (13.7.2020)