ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వచ్చే శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మరియు కార్తీక మాసముల 4 నెలల కాలవ్యవధిని చాతుర్మాసం అంటారు. మనిషి యొక్క ఒక్క సంవత్సర కాలం దేవుడి ఒక పగలు రాత్రికి సమానం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘శయనీ ఏకాదశి’ అంటారు. అప్పుడు దేవుడు నిద్రిస్తాడనే నమ్మకం ఉంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు దేవుడు నిద్ర నుండి లేస్తాడు. దానిని ‘ప్రబోధినీ ఏకాదశి’ అంటారు.
దేవతల నిద్రాకాలంలో అసురులు ప్రబలురౌతారు మరియు మానవులకు ఇబ్బందులను కలిగిస్తారు. ఆ అసురుల నుండి మనల్ని రక్షించుకోవడానికి ప్రతి మనిషి ఏదైనా వ్రతాన్ని చేయాలి, అని ధర్మశాస్త్రం చెపుతుంది. కాబట్టే ఈ కావ్యవధిలో వివాహం వంటి శుభకార్యములను నిషేధించారు. పరమార్థానికి సంబంధించిన విష యాలున్న విధులను మరియు ప్రపంచానికి హాని కలిగించే సంగతుల నిషేధమే చాతుర్మాసపు వైశిష్ట్యం.
చాతుర్మాసపు వ్రతాల భోజన నియమాలు
భౌగోళికంగా చాతుర్మాసపు కాల వ్యవధి ఆనందమయ కాలం. ఎందు కంటే వర్షా కాలం కాబట్టి భూమి యొక్క రూపం లాగానే మనిషి యొక్క మానసిక రూపం కూడా మార్పు చెందియుంటుంది. కాబట్టి చాతుర్మాసంలో ఈ క్రింది విధంగా భోజనపు అలవాట్లను మార్చు కుంటారు. ఈ భోజన నియమాలు కూడా ఒక రకమైన వ్రత నియమాలే.
పర్ణ భోజనం (ఆకులో భుజించడం), ఏక భోజనం (ఒక పూట భుజించడం) అయాచిత (అడగకుండా దొరికినంత భుజించడం) ఏకవాడి (ఒకే సారి అన్ని పదార్థాలను వడ్డించుకుని తినడం) మిశ్ర భోజనం (అన్ని పదార్థాలను వడ్డించుకుని అన్నిటినీ కలిపి తినడం).
అనేక స్త్రీలు చాతుర్మాసంలో ధారణ ‘పారణ (ఒక రోజు భుజించడం మరో రోజు ఉపవాసం. ఇలా నాలుగు నెలలు చేయడం) అనే వ్రతాన్ని చేస్తారు. కొందరు ఒకటి లేదా రెండు ధాన్యాల ఆహారాన్ని మాత్రమే సేవిస్తారు. కొందరు పంచామృతాన్ని తీసుకోరు.
చాతుర్మాసంలో వర్జ్యం మరియు అవర్జ్యం విషయాలు
వర్జ్యాలు : లెంటిల్స్, మాంసం, చిక్కుడు కాయలు, అలసందులు, పచ్చళ్ళు, వంకాయ, పుచ్చకాయ, ఎక్కువ విత్తనాలున్న లేదా అసలు విత్తనాలు లేని పళ్ళు, ముల్లంగి, గుమ్మడి కాయ, రేగు పళ్ళు, ఉసిరి కాయ, చింత పండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మంచం పైన పడుకోవడం, ఋతుకాలం కాకుండా స్త్రీ సంగం మరియు పరాన్నం మొ..
అవర్జ్యాలు : బియ్యం, బార్లీ, పెసలు, నువ్వులు, బఠానీలు, గోధుమలు, సముద్రం ఉప్పు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పనస, మామిడి, కొబ్బరికాయ, అరటి పండు మొ.. వీటిని హవిష్యాన్నం అని పిలవవచ్చు. ఇవన్నీ సత్వ గుణ ప్రధానంగా ఉండడం వలన మనకు ప్రయోజనం చేకూరుతుంది.
మంగళ గౌరీ వ్రతం : (శ్రావణ కృష్ణ త్రయోదశి) మంగళ గౌరి సౌభాగ్య దేవత. నవ వివాహిత వధువులు ఈ వ్రతాన్ని చేయాలి. వివాహానంతరం 5 నుండి 7 సంవత్సరాల వరకు శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇందులో శివుడు మరియు గణపతితో పాటు గౌరీ వ్రతాన్ని చేస్తారు.
‘చికాగో మెడికల్ స్కూల్’ యొక్క డా॥ W.S. కోగర్ గారు చేసిన పరిశోధనలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మరియు అక్టోబర్ ఈ 4 నెలలలో భారతీయ స్త్రీలకు గర్భకోశానికి సంబంధించిన వికారాలు పెరుగుతాయి అని తెలిసింది. ఈ 4 నెలల కాలావధి చాతుర్మాసంలోని 4 మాసాలకు అన్వయిస్తుంది. చాతుర్మాసంలో కలిగే 70% వ్యాధులు దుష్ట శక్తుల వలన కలుగుతాయి. చాతుర్మాసంలో వ్రత నియమాలు పాటించడం ఒకరకమైన హఠయోగం సాధించినట్టవుతుంది. దీని నుండి తేజ తత్వపు ప్రయోజనం కలుగుతుంది మరియు ఈ తేజ తత్త్వం వలన అసురీ శక్తుల నుండి మనిషికి రక్షణ కలుగుతుంది.
చాతుర్మాసం అవధిలో సత్వ ప్రధానమైన పదార్థాలు అనగా యజ్ఞాలలో ఆహుతినివ్వదగిన పదార్థాలు సేవించడం శ్రేయస్కరం. ఎందుకంటే వర్జ్య పదార్థాలు రజ-తమతో కూడి ఉంటాయి.