1. సాధారణ విగ్రహం
గణేశ విగ్రహ తయారీ శాస్త్రం “శ్రీ గణపత్యధర్వశీర్షము” లో ఇలా ఇవ్వబడింది, ‘ఏకదంతం, చతుర్హస్తం……’, అంటే ఒకే దంతం కలవాడు, నాలుగు చేతులు కలవాడు, పాశమును మరియు అంకుశమును ధరించేవాడు, విరిగిన దంతమును ఒక చేతితో పట్టుకుని మరొక చేతిని వరాలను ఒసగే ముద్రలో (వరద ముద్ర) పెట్టువాడు, ధ్వజం పై మూషిక చిహ్నం కలవాడు, ఎర్రని కాంతి కలవాడు, పెద్ద ఉదరం కలవాడు (లంబోదరుడు), చేటల వంటి చెవులు కలవాడు, ఎర్రని వస్త్రములు ధరించేవాడు, దేహమునకు ఎర్రని గంధము (రక్తచందనము) పూయబడువాడు, ఎర్రని పువ్వులతో పూజింపబడువాడు.
సూచన – శ్రీ గణేశుడు ఒక్క చేతిలో (విరిగిన) దంతమును ధరించినవాడు అని అథర్వశీర్షములో అతని రూపము గురించి చెప్పారు. శ్రీ గణేశుడు ముఖ్యంగా జ్ఞాన దేవత. ‘మోదకము’ జ్ఞానమునకు ప్రతీకమైనది. అందువలన శ్రీ గణేశుని చేతిలో విరిగిన దంతము బదలుగా మోదకమును చూపించే పద్ధతి ఆరంభము అయ్యి ఉండవచ్చును.
2. కొన్ని వైవిధ్యాలు
1. కొన్నిసార్లు పద్మాసనం పై ఆసీనుడై ఉన్న గణపతి విగ్రహమును, మరి కొన్ని సార్లు నృత్య ముద్ర లో ఉన్న గణపతి విగ్రహమును కూడా చూస్తుంటాము.
2. హిమాలయంలో తల లేని (ముండ్ కటా) గణేశ విగ్రహము ఉంది. పేరులోనే ఇది తల లేని విగ్రహము అని సుచింపబడుతోంది. ఇది పార్వతీ దేవిచే తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో సృష్టించబడిన కుమారుని విగ్రహమనీ, తరువాత శ్రీ శంకరునిచే తల తృంచబడినదనీ చెప్పబడుతోంది.
3. ఇతర వర్ణములు : హరిద్రా గణపతి మరియు ఊర్థ్వ గణపతుల విగ్రహాలు పసుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. పింగళ గణపతి కపిల వర్ణములో, లక్ష్మీ గణపతి శ్వేత వర్ణములో ఉంటారు.
4. దివ్య లింగము : ఈశ్వరుని దివ్య లింగము వలే గణపతిది కూడా ఉంటుంది. దానిని గాణపత్య లింగము అంటారు. అది దానిమ్మ, నిమ్మ, బూడిద గుమ్మడికాయ లేదా నేరేడు ఆకారంలో ఉంటుంది.
5. దిగంబర : తంత్ర పూజలలో గణేశ విగ్రహము సామాన్యంగా దిగంబరంగా ఉంటుంది. గణేశుని శక్తి కూడా విగ్రహంతో కలిసి ఉంటుంది.
6. స్త్రీస్వరూపం :
శాక్త తెగలో విఘ్నేశ్వరుడిని స్త్రీస్వరూపంలో కొలుస్తారు. అటువంటి కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి:
అ . గణేశ్వరి : ఎంతో ఆకర్షణీయంగా చెక్కబడ్డ గణేశ్వరి విగ్రహం తమిళనాడు లోని సుచింద్రం గుడిలో ఉంది.
ఆ . అర్థ గణేశ్వరి : తాంత్రిక సాధనలో దీనికి ఎంతో అర్థవంతమైన రూపం ఉన్నది.
ఇ . గణేశాని : ఈ స్త్రీ దేవత తాంత్రికులు, మాంత్రికులు (తంత్ర, మంత్ర ఆరాధకులు) చేసే చాలా అరుదైన పూజలలో కనబడుతుంది.
7. గణపతి విగ్రహాలలో రకాలు :
సౌమ్య గణపతి, బాల గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, హరిద్రా గణపతి, ఉఛ్చిష్ట గణపతి, సూర్య గణపతి, వరద గణపతి, ద్విభుజ గణపతి, దశ భుజ గణపతి, నర్తన గణపతి, ఉత్తిష్టిత గణపతి, తొండము కుడి వైపు తిరిగి ఉన్న గణపతి మొదలైన చాలా రకాల గణపతి విగ్రహాలు ఉన్నాయి.