- గంధం : అనామిక వ్రేలితో (చిటికిన వ్రేలు ప్రక్క వ్రేలు) దేవుడికి గంధమును సమర్పించవలెను.
- పువ్వులు : ఆయా దేవతల తత్త్వాన్ని అధికంగా ఆకర్షించే పువ్వులు, పత్రిని ఆయా దేవతలకు సమర్పించవలెను.
- అగర్బత్తీలు : ఆయా దేవతల ఉపాసనకు పూరకమైన సుగంధము కలిగిన 2 అగర్బత్తీలను ఆయా దేవతల ఎదుట వెలిగించవలెను.
- దీపం : దేవుడికి నెయ్యి దీపముతో మూడు సార్లు హారతి ఇవ్వవలెను.
- నైవేద్యం : దేవుడికి అరటి ఆకు పై నైవేద్యమును సమర్పించవలెను.
(ఆధారం : సనాతన గ్రంథం ‘పంచోపచార-షోడశోపచార పూజా శాస్త్రం’)