ప్రస్తుతం అనేకమంది నిత్యజీవితం చాలా హడావిడి మరియు రకరకాల సమస్యలతో నిండియున్నది. జీవితంలో మనశ్శాంతి మరియు ఆనందం పొందుట కొరకు ఎటువంటి సాధన ఏ విధంగా చేయాలనే విషయంపై యధార్థ జ్ఞానమును అందించేవారే గురువులు ! గురువుల మహత్యమును అర్థం చేసుకుంటే జిజ్ఞాసువులు మరియు సాధకులకు గురువుల పట్ల శ్రద్ధ పుడుతుంది. శిష్యుడి జీవితంలో గురువుల విలువ అనన్య సాధారణం; ఎందుకంటే గురువు లేకుండా తనకు భగవద్‌ప్రాప్తి అయ్యే ప్రసక్తి లేదు ! గురువుల భక్తవాత్సల్య స్వరూపం, దయను చూపించే దృష్టి, శిష్యులపై కృప ప్రసాదించే అనేక మాధ్యమాలు వంటి అనేక అంశాల ద్వారా శిష్యుడు గురువుల అంతరంగం యొక్క నిజ దర్శనం చేయగలుగుతాడు. దీని వల్ల గురువుల పట్ల శిష్యుడి భక్తి దృఢమౌతుంది. వర్తమాన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న సమస్యలకు అధ్యాపకులు, వైద్యులు, వకీలు లాంటి ఇతరుల సలహా తీసుకుంటారు. మరీ ‘జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదించే గురువుల విలువ ఎంతో గొప్పది’, అన్నది మన ఆలోచనలకు అందని విషయం.
గురువుల ధర్మము
సాధకులకు సాధన నేర్పించడం గురువుల ధర్మం. అదే విధంగా దేశము, ధర్మమును రక్షించేందుకు సమాజాన్ని జాగృతి చేయడం కూడా గురువుల ధర్మమే ! ఆర్య చాణక్యుల వారు, సమర్థ రామదాసు స్వాముల వారు దీనికి ఆదర్శమైన ఉదాహరణాలు. నేటి మన దేశము మరియు సమాజం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కాలం యొక్క అవసరాన్ని కనిపెట్టి దేశం మరియు ధర్మ రక్షణ కొరకు కావలసిన శిక్షణను శిష్యులు మరియు సమాజానికి అందించడమే గురువులు కర్తవ్యము !
సందర్భం : సనాతన గ్రంథం – గురు మహత్యము, ప్రాకారాలు మరియు గురు మంత్రము
సాధన యొక్క మహత్యము
గురుకపాయోగములో ఎక్కువగా తాత్విక జ్ఞానము ఉండదు. ప్రత్యక్షమైన పూర్తిస్థాయిలో సాధన చేసి ఆధ్యాత్మిక అభివృద్ధి ఎలా సాధించాలనే విషయం గురించి బోధపరుస్తుంది. ఇదే గురుకపాయోగానుసార సాధన యొక్క గొప్పతనం. ఇది కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం మొదలైన యోగమార్గాల పై ఆధారితమై ఉన్నది. అనేక యోగమార్గాల విస్తృత తాత్విక జ్ఞానము అన్ని గ్రంథాలలో విపులంగా లభ్యమవుతుంది. గురుకృపాయోగం కేవలం ప్రాయోగిక అనగా సాధన చేయు సందర్భంలోని యోగమైనది. గురుకపాయోగంలోని వ్యక్తిగత సాధన యొక్క అష్టాంగ సాధనలో సత్సంగము తీసుకోవడం, సత్సేవ చేయడం మరియు ప్రీతి ఈ మూడు అంశాలు సమష్టి సాధనకు సంబంధించినవి.
సందర్భము : సనాతన గ్రంథం ‘పరాత్పర గురువులు డా. ఆఠవలె గారి తేజస్వి విచారములు
శిష్యుడి విశ్వాసం
‘గురువులు విశ్వాసం పై ఉంటారు. మన విశ్వాసం పై గురువుల మహత్యం ఆధారపడి ఉంటుంది. గురువులు మీ విశ్వాసం పై కూడా ఉంటారు. మీ విశ్వాసంలోనే గురువులుంటారు.’
భావార్థం : ‘గురువులు విశ్వాసం పై ఉంటారు. మన విశ్వాసం పై గురువుల మహత్యం ఆధారపడి ఉంటుంది’, ఇందులోని ‘గురువులు’ ఈ పదం బాహ్య గురువుల గురించి వాడడం జరిగింది. గురువుల పై విశ్వాసం ఉంటేనే గురువులు ‘గురువులు’ గా కార్యం చేయగలరు. ‘గురువులు మీ విశ్వాసం పై కూడా ఉంటారు. మీ విశ్వాసంలోనే గురువులుంటారు’, ఇందులోని గురువులు అంతరాళంలో ఉన్న గురువుల గురించి చెప్పబడినది.’
సందర్భం : సనాతన గ్రంథం – గురు మహత్యము, ప్రాకారాలు మరియు గురు మంత్రము
ధర్మ ప్రచారమే సర్వోత్తమ గురుసేవ !
ధర్మ ప్రచారం చేయడమే శ్రీ గురువు యొక్క నిజమైన కార్యము. గురువుల కృపాశీర్వాద బల సహాయంతో మనము ధర్మ ప్రచారం చేయడంతో పాటు ధర్మరక్షణ మరియు సంస్కృతిని కాపాడుటకు నిత్య ప్రయత్నం చేయాలి. గురుపూర్ణిమ ఉత్సవ నిమిత్తంగా గురుకార్యంలో మనం పాల్గొనడం మనకు కల్యాణప్రదంగా మరియు భగవంతుని కృపను పొందే సువర్ణ అవకాశం.