‘గురు-శిష్య పరంపర’ గొప్పతనము !

గురుపౌర్ణమి మహత్యము

గురుపౌర్ణమి రోజున గురుతత్వము మిగతా రోజులతో పోలిస్తే వెయ్యి రెట్లు అధికంగా కార్యారతమై ఉంటుంది. కావున గురుపూర్ణిమ సందర్భంలో చేసిన సేవ మరియు త్యాగము యొక్క ఫలితం కూడా ఇతర రోజుల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది; అందుచేత గురుపౌర్ణమి అనేది భగవద్‌కృపను పొందే అతి విలువైన అవకాశం. భక్తవత్సల, దయాసింధు మరియు కామదేను స్వరూపమైన గురువు యొక్క కృపాదృష్టి మనకు దక్కేది ఎప్పుడు ? దీనికి గురుపౌర్ణమియే సరైన సుయోగ దినము. గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే రోజనగా గురుపౌర్ణమి ! ఇటువంటి గురు జనుల పట్ల మన కృతజ్ఞతలు మరియు భక్తిభావం సమర్పించుటకే గురుపూర్ణిమ మహోత్సవము. ఈ రోజు శ్రీ గురువుల దర్శనం, పూజ, సేవతో పాటు గురుకార్యం కొరకు అర్పణను (త్యాగము) మనస్ఫూర్తిగా చేస్తే గురుకృప అధికంగా లభ్యమవుతుంది. ఇలాంటి మంచి ఫలితం పొందే సువర్ణ అవకాశం భావం కలిగిన భక్తులకు గురుపూర్ణిమ మహోత్సవం నుండియే దక్కుతుంది.

 

ఆదర్శ గురు-శిష్య ఉదాహరణ !

హైందవ సంస్కృతి సౌందర్య కిరీటంలో ‘గురు-శిష్య’ పరంపర అనేది రత్నము ! ‘వశిష్టఋషి-శ్రీరాములవారు’, ‘సాందీపనిఋషి-శ్రీకృష్ణ’, ‘ఆర్య చాణక్య-చంద్రగుప్త’, లాంటి అనేక ఆదర్శమైన ఉదాహరణలున్నాయి. గురువు మరియు శిష్యుడు ఇద్దరూ 2 దీపాల మాదిరిగా ఉంటాయి. నూనె-ఒత్తిలేని దీపం వందసార్లైనా వెలుగుతున్న దీపం వద్ద పెట్టినప్పటికీ అది వెలుగదు ! శిష్యుడి దీపంలోని ఈ నూనె-ఒత్తి అనగా అతడి నిష్ఠ, శ్రద్ధ మరియు భక్తి !

సందర్భము : సనాతన గ్రంథం ‘గురువుల మహత్యము, ప్రకారాలు మరియు గురుమంత్రము’

 

కాలానుసారంగా సర్వోత్తమమైన సాధన : గురుకపాయోగం !

భగవత్‌ప్రాప్తి కొరకు నిత్యం చేసే ప్రయత్నమే సాధన. శిష్యుడి పరమమంగళం అనగా మోక్షప్రాప్తి కేవలం గురుకప వల్లనే సాధ్యమవుతుంది. గురుకృప ద్వారా భగవత్‌ప్రాప్తి వైపు ప్రయాణం కొనసాగించడమే గురుకృపాయోగం. గురుప్రాప్తి, గురుకృప అయ్యేందుకు చేయవలసిన సాధనయే గురుకృపాయోగానుసార సాధన. ఇందులో జ్ఞానయోగం, భక్తియోగం మరియు కర్మయోగం వీటి త్రివేణి సంగమం. కావున సాధకుల ఆధ్యాత్మిక ఉన్నతి త్వరగా అవుతుంది. నామం, సేవ, సత్సంగం, స్వభావదోష నిర్మూలన, అహం నిర్మూలన, భావజాగృతి కోసం ప్రయత్నాలు, త్యాగం, ప్రీతి మరియు సాక్షీభావము ఇవి గురుకృపాయోగానుసార సాధన యొక్క స్థాయి. ఇందులో వ్యక్తిగత సాధనకు 30 శాతం విలువ ఐతే, సేవకు సంబంధించిన అధ్యాత్మ ప్రసారం, దేశం మరియు ధర్మజాగృతితో పాటు హిందువులను సంఘటిత పరచడం లాంటి సమష్టి సేవకు 70 శాతం మహత్యము ఉన్నది.

 

అర్పణ యొక్క మహత్యం !

దానం విలువ

గురుకార్యం కోసం దానమును ఇచ్చి కూడా మనము ఈ కార్యంలో సహభాగులు కావచ్చు. సమాజం, దేశం, ధర్మం వీటి హితం కొరకు కార్యాన్నీ నిర్వహించే సంస్థలకు అర్పణ ఇస్తే, అది సత్‌పాత్ర దానం (సార్థకం) అవుతుంది. గురుపౌర్ణమి రోజున చేసిన దానం యొక్క ఫలితం 1000 రేట్లు అధికంగా ఉంటుంది.

అర్పణ

భగవంతుడి చరణాలలో కనీసం పావలా (నేటి 1రూపాయి) అయినా సమర్పించాలి. నిజానికి చూస్తే భగవంతుడు ధనప్రియుడు కాదు; ‘భావ’ ప్రియుడు. కాకపోతే మనకు ధన సంపద పై ఉన్న వ్యామోహం కాస్తయినా తగ్గాలనే ఉద్దేశ్యముతో దేవుడి చరణంలో మరియు ఈశ్వరీ కార్యములో కార్యరతమైన సంస్థలకు ధనాన్ని అర్పించాలి. సత్యయుగంలో తపము, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, కలియుగంలో దానము శ్రేయస్కరము. (మహాభారతం 12.232.28)

Leave a Comment