అ. న్యాసం ఎలా చేయాలి?
ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధాలను గుర్తించిన తరువాత, ప్రయోగం ద్వారా ముద్ర మరియు నామజపములను కనుగొనవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక ఉపాయాలు చేసేటప్పుడు నామజపము చేయాలి. అందువల్ల, న్యాసం ఎలా చేయాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. ముద్రను కనుగొనిన తరువాత, దిగువ పట్టికలో పేర్కొన్న విధంగా న్యాసం చేయాలి.
ముద్ర | న్యాసం |
---|---|
1. బొటనవేలు యొక్క కొనను వేరొక వేలి కొనకు జత పరచడం | ముద్ర కోసం జతచేయబడిన చేతివేళ్ళ కొనలతో న్యాసం చేయడం |
2. బొటనవేలు యొక్క కొనను వేరొక వేలు యొక్క మూలము వద్ద ఉంచడం | అవసరమైన చేతి వేలి కొనతో న్యాసం చేయడం |
3. అరచేతిపై చేతి వేలి కొనను ఉంచడం | అరచేతిని ఉపయోగించి న్యాసం చేయడం |
4. బొటనవేలు మూలము వద్ద చూపుడు వేలు కొనను ఉంచడం | బొటనవేలు కొనతో న్యాసం చేయడం |
ఆ. ఆధ్యాత్మిక ఉపాయాలు చేసే విధానం
1. న్యాసం చేయు స్థానంలో వేళ్ళు కదిలించడం ద్వారా ఉపాయాలు చేయడం
అ. సూత్రం
ఉపాయం చేసే స్థానంలో వేళ్ళను దిగువ నుండి పైకి లేదా పై నుండి క్రిందికి కదిలించడం ద్వారా పరిష్కారం యొక్క దిశను నిర్ణయించి మరియు తదనుగుణంగా ఉపాయం చేయాలి.
ఆ. చర్య
శరీరం నుండి 1-2 సెంటీమీటర్ల దూరములో నాలుగు వేళ్ళను (బొటనవేలు కాకుండా) పై నుండి క్రిందికి లేదా దిగువ నుండి పైకి కదిలించడము ద్వారా ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధాన్ని కనుగొనగలము. ఏ దిశలో మీకు ఊపిరి పీల్చుకోవడం కష్టముగా ఉంటుందో అది ఉపాయం చేయు దిశ. తరువాత ఈ లేఖనంలో, పరిష్కారం యొక్క దిశను నిర్ణయించడానికి వేళ్ళను పైకి క్రిందికి కదిలించాలని ప్రస్తావించబడినప్పుడల్లా, బొటనవేలును వదిలివేయడం ద్వారా మిగిలిన వేళ్ళను కదిలించాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి మరియు ‘నివారణ ప్రయోజనానికి 1-2 సెం.మీ పైకి క్రిందికి చేతి వేళ్ళను కదిలించడం ద్వారా అవరోధం ఉన్న స్థానంలో, న్యాసం కోసం ఉపయోగించాల్సిన వేలు లేదా బొటన వేలితో జతపరచబడిన వేళ్ళ కొనలతో లేదా అరచేతితో ఉపాయం చేయాలి ’. న్యాసం కోసం ఉపయోగించాల్సిన వేళ్ళు గురించి పై పట్టికలో పేర్కొనబడ్డాయి (అ. న్యాసం ఎలా చేయాలి?).
1. న్యాసం చేయు స్థానంలో వేళ్ళను క్రింది నుండి పైకి కదిలించేటప్పుడు ఊపిరి ఆడనట్లు అనిపిస్తే, ఆ స్థానం చుట్టూ వేళ్ళను దిగువ నుండి పైకి 4 నుండి 5 సెం.మీ. వరకు కదిలించాలి.
2. న్యాసం చేయు స్థానంలో వేళ్ళను పైనుంచి క్రిందికి కదిలించేటప్పుడు ఊపిరి ఆడనట్లు అనిపిస్తే, ఆ స్థానం చుట్టూ వేళ్ళను పైనుంచి క్రిందికి 4నుండి 5 సెం.మీ. వరకు కదిలించాలి.
3. కొన్ని సమయాల్లో, న్యాసం చేయు స్థానం గుర్తించినప్పుడు, వేళ్ళను పైకి మరియు క్రిందికి రెండువైపులా కదిలించేటప్పుడు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. అటువంటి సమయాల్లో –
- చేతిని రెండు విధాలుగా కదిలించాలి – పై నుండి క్రిందికి మరియు దిగువ నుండి పైకి.
- ఉపాయాలు చేసేటప్పుడు న్యాసం చేయు స్థానంలో వేళ్ళను 2 నుండి 3 సెం.మీ. రెండు దిశలలో కదిలించాలి.
4. సహస్రార-చక్రం నుండి వెనుకవైపు తలకట్టు వరకు వేళ్ళను సరళ రేఖలో వెనుకకు మరియు తిరిగి సహస్రార-చక్రం వరకు కదిలించాలి. వేళ్ళను రెండు విధాలుగా కదిలించేటప్పుడు, ఏ దిశలో ఎక్కువ బాధ అనిపిస్తే ఆ దిశలో ఆధ్యాత్మిక ఉపాయం చేయాలి.
2. ప్రభావిత అవయవంపై వేళ్ళను కదిలించడం ద్వారా ఉపాయం చేయడం
అ. సూత్రం
అనారోగ్యాన్ని బట్టి, అవయవంపై వేళ్ళను కదిలించే దిశను నిర్ణయించడం మరియు తదనుగుణంగా ఉపాయం చేయడం.
ఆ. చర్య
కొన్నిసార్లు, కుండలిని-చక్రంలో లేదా శరీరంలోని ఇతర భాగాలలో ఉపాయం చేసినప్పుడు, అనారోగ్యం నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది; ఉదాహరణకు, మూత్రం రాకపోవడం, మలబద్దకం, కాళ్ళ వాపు మొదలైనవి. అటువంటి సమయాల్లో, అనారోగ్య సమస్య ఉన్న అవయవంపై వేళ్ళను 1-2 సెం.మీ. దూరంగా కదిలించడం ద్వారా , ఇది వ్యాధిని త్వరగా తొలగించడానికి సహాయపడుతుంది.
నిర్దిష్ట సందర్భాల్లో ఉపాయం ఎలా చేయాలో కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.
1. కాళ్ళ వాపు ఉంటే, దిగువ నుండి పైకి కాళ్ళ మీద వేళ్ళను చాలా నెమ్మదిగా కదిలించాలి.
2. మూత్రవిసర్జన కాకపోతే, వేళ్ళను 2-3 సెం.మీ. దూరంగా ఉంచి, నాభి స్థానం క్రింద ఒక అంగుళం నుండి స్వాదిష్ఠాన-చక్రం వరకు వెంట వెంటనే అనేక మార్లు కదిలించాలి.
3. మలవిసర్జన కాకపోతే, పొత్తికడుపులోని పెద్ద ప్రేగు యొక్క దిశ నుండి ప్రారంభించాలి, అనగా, ఉదరం యొక్క కుడి దిగువ భాగం నుండి వేళ్ళను కదిలించడం ప్రారంభించి వాటిని ప్రక్కటెముక వరకు మరియు నేరుగా ఎడమ వైపుకు తరలించి, అక్కడి నుండి, దానిని నేరుగా పాయువు వైపుకు క్రిందికి తరలించాలి. ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి.
3. కుండలిని-చక్రం లేదా అనారోగ్యంతో సమస్య ఉన్న అవయవం వద్ద న్యాసం చేయడం
కుండలిని-చక్రము స్థానంపై వేళ్ళను పైకి క్రిందికి కదిలించడం ద్వారా న్యాసం చేయు స్థానం కనుగొనలేకపోతే, న్యాసం శరీరానికి 1-2 సెం.మీ. దూరంగా అనారోగ్య సమస్య ఉన్న కుండలిని-చక్రం వద్ద, అలాగే 3-4 సెం.మీ.ల విస్తీర్ణంలో కుండలిని-చక్రానికి పైన మరియు క్రింద. అవసరమైతే, అనారోగ్య అవయవం నుండి 1-2 సెం.మీ శరీరానికి దూరంగా ఉంచి న్యాసం చేయాలి.
4. చేతి యొక్క ఐదు వేళ్ళను కలిపి ఉంచడం ద్వారా లేదా అరచేతిని ఉపయోగించడం ద్వారా సహస్రారచక్ర స్థానంలో న్యాసం చేయడం
అ. దుష్టశక్తుల వల్ల బాధపడేవారు
దుష్టశక్తుల వల్ల బాధపడుతున్నవారు సహస్రారచక్ర స్థానంలో శరీరం నుండి 1-2 సెం.మీ. దూరంగా చేతి యొక్క ఐదు వేళ్ళను కలిపి ఉంచడం ద్వారా లేదా అరచేతిని ఉపయోగించడం ద్వారా న్యాసం నిర్వహిస్తే, వారికి ఉపాయం జరుగుతుంది.
ఆ. దుష్ట శక్తుల వల్ల బాధపడని వారు
దుష్టశక్తుల వల్ల బాధపడని వారు సహస్రారచక్ర స్థానంలో శరీరం నుండి 1-2 సెం.మీ. దూరంగా చేతి యొక్క ఐదు వేళ్ళను కలిపి న్యాసం నిర్వహిస్తే, వారిలో ఆధ్యాత్మిక భావోద్వేగం మేల్కొంటుంది. అరచేతిని సహస్రారచక్ర స్థానంలో ఉంచడం వల్ల, చేతి వేళ్ళ కొనలతో న్యాసం చేసేదానికన్నా ఎక్కువ భావము మేల్కొంటుంది.
ఉపాయం సమయంలో అనుసరించాల్సిన సూచనలు
ఉపాయం చేసేటప్పుడు గమనించవలసిన విషయాలు
1. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా దుష్టశక్తులతో బాధపడుతున్నవారు, నామజపం చేస్తూ ఉపాయం చేయాలి.
అ. దుష్టశక్తులతో బాధపడుతున్న వారి వేళ్ళ ద్వారా బాధను కలిగించే చెడు శక్తి విడుదల అవుతుంది. కాబట్టి, వీరు చేతి వేళ్ళను ఉపాయంకు ఉపయోగిస్తే, బాధను కలిగించే చెడు శక్తి శరీరానికి (ఉపాయం చేయు శరీర భాగంపై) ప్రసారమౌతుంది. అందువల్ల, నామ జపము చేస్తూ ఉపాయం చేయకపోతే, దుష్ట శక్తి వల్ల ఇబ్బంది పెరుగుతుంది. ఒకవేళ దుష్టశక్తి వల్ల బాధ కారణంగా వ్యక్తి నామజపం చేయలేకపోతే, తనకు తాను ఉపాయం ద్వారా పరిష్కరించుకోకూడదు.
బదులుగా ఆయుర్వేద చికిత్స, ఖాళీ పెట్టెల నివారణ వంటి ఇతర నివారణలను అవలంబించాలి. స్వల్ప లేదా మితమైన అసౌకర్యం ఉన్నవారు నామజపం చేయడం సాధ్యము కాబట్టి వారు తమంతట తాముగా నివారణ చేసుకోవచ్చు.
ఆ. ప్రస్తుత కలియుగంలో, దుష్ట శక్తుల ప్రాబల్యం ఎంతగానో పెరిగింది. సాధారణంగా, ప్రతి వ్యక్తి ఎక్కువ లేదా తక్కువ స్థాయి దుష్ట శక్తులతో బాధపడుతున్నారు. అందువల్ల, ప్రతి ఒక్కరూ నామజపం ద్వారా ఉపాయం చేయడం ఉత్తమం.
ఇ. ఉపాయం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన సూచనలు
1. సాధ్యమైనంతవరకు, కుడి చేతిని ఉపాయం కోసం ఉపయోగించాలి
ఉపాయం చేసేటప్పుడు కుడి చేతిని ఉపయోగించడం ఉత్తమం. ఇది సూర్యనాడితో సంబంధం కలిగి ఉండి ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాలను తొలగించడంలో సహాయపడుతుంది. సాధారణంగా, ఉపాయం కొన్ని గంటలు చేయడం వల్ల చేయి నొప్పి వస్తుంది అప్పుడు మరియొక చేతిని మార్చాలి.
2. మీరు రెండు వేర్వేరు స్థానాల వద్ద అవరోధాలను కనుగొంటే, రెండు స్థానాల వద్ద ఒకేసారి రెండు చేతులను వాడాలి. ఒక స్థానం మాత్రమే ఉన్నట్లయితే, ఆ స్థానం వద్ద ఒక చేతిని ఉపయోగించి, మరియొక చేతితో ముద్ర చేయాలి.
3. కుండలిని-చక్రంతో పాటు శరీరంలోని వివిధ భాగాలలో అవరోధాలు ఉంటే, రెండు స్థానాల వద్ద, ఏక్కడ అవరోధాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందో , అక్కడ ఉపాయం చేయాలి.
4. ఉపాయం చేసేటప్పుడు, అవరోధము యొక్క క్రొత్త ప్రదేశాన్ని అప్పుడప్పుడు మద్యలో కనుగొని, ఆ ప్రదేశంలో ఉపాయం చేయాలి.
మొదటిసారి న్యాసం కోసం స్థానం కనుగొని, ఉపాయం ప్రారంభించిన తర్వాత, ప్రతి 20 నుండి 40 నిమిషాలకు, ఇంకా క్రొత్త అవరోధాలు ఏమైనా ఏర్పడ్డాయ లేదా అని కనుగొనాలి; ఎందుకంటే, అవరోధాల స్థానం ఉపాయం కారణంగా లేదా కొన్ని సమయాల్లో దుష్ట శక్తుల ద్వారా మారుతుంది. అప్పుడు ఈ క్రొత్త స్థానాలపై ఉపాయం చేయాలి.
5. మీరు ప్రయోగం ద్వారా ఖచ్చితమైన ముద్ర లేదా నామజపం కనుగొనలేకపోతే అనుసరించాల్సిన నియమాలు
కొన్ని సమయాల్లో, తగిన ముద్రను నిర్ణయించడానికి ప్రయోగం చేసేటప్పుడు, రెండు వేర్వేరు ముద్రలు చేస్తున్న సమయంలో ఉన్న భావన ఒకేలా ఉంటుంది. అలాంటి సమయాల్లో, వ్యత్యాసాన్ని గమనించడానికి రెండు ముద్రలను కొంత సేపు చేసి, ఆపై ఖచ్చితమైన ముద్రపై నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇంకా నిర్ణయించలేకపోతే, పంచతత్వాల నుండి ఉన్నత తత్వము యొక్క ముద్ర చేయాలి. నియమాలను అనుసరించి ప్రయోగం ద్వారా తగిన నామజపమును వెతకడం ‘అంశం ఆ’ లో ‘నామజపము మరియు ముద్ర, ఉన్నత దేవతలు మరియు నిర్గుణ’ ప్రచురణ యొక్క 2వ భాగములో ఉన్నది (1-15 డిసెంబర్)
6. అవరోధము ఉన్న ప్రదేశంలో వేళ్ళను 1-2 సెం.మీ శరీరానికి దూరంగా పెట్టుకొని ఉపాయం చేయడము
ఉపాయం కోసం వేళ్ళను 1-2 సెం.మీ. శరీరం నుండి దూరంగా కదిలించాలి, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి న్యాసం సమయంలో చేతికి మద్దతు అవసరం. ఈ సందర్భంలో, వారు శరీరాన్ని తాకి, న్యాసం చేయవచ్చు.
ఈ. దేవత పేరుకు ముందు ‘ఓం’ లేదా ‘మహా’ చేర్చడము
1. ఉపాయం సమయంలో నామజపముకు ముందు మరియు వెనుక ‘ఓం’ చేర్చడం
అ. సామాన్యులు
ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాలు చిన్నవి అయితే, సాధారణంగా ‘శ్రీ’ తో మొదలవుతున్న నామజపాన్ని వాడండి. (సాధారణంగా ఉపయోగించే నామజపం ‘ఓం నమో భగవతే వాసుదేవయ’కు ముందు ‘శ్రీ’ చేర్చము కాబట్టి, దాన్ని అలానే వాడండి).
ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాలు మితంగా ఉంటే, నామజపం ప్రారంభంలో మరియు చివరిలో ఒక ‘ఓం’ చేర్చండి.
ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాలు తీవ్రంగా ఉంటే, నామజపం ప్రారంభంలో మరియు చివరిలో రెండు ‘ఓం’ లు చేర్చండి.
ఆ. సాధన చేసే వ్యక్తి
సాధన చేయు సమయంలో వ్యక్తికి బాధల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాధన చేయని వ్యక్తి కంటే సాధన చేస్తున్న వ్యక్తిపై దుష్ట శక్తుల దాడి ఎక్కువ. అందువల్ల, సాధన యొక్క మార్గం మరియు మతంతో సంబంధం లేకుండా, సాధన చేసే వ్యక్తులు నామజపం ప్రారంభంలో మరియు చివరిలో రెండు ‘ఓం’ లు చేర్చాలి. ఇలా చేర్చడం ద్వారా నామజపం యొక్క ప్రభావం పెరుగుతుంది.
2. నామజపముకు ముందు ‘మహా’ చేర్చడం
అదేవిధంగా, కొన్ని ప్రసిద్ధ నామజపముల ప్రారంభంలో (ఉదా. గణపతి, లక్ష్మి, విష్ణు, రుద్ర) ‘మహా’ అనే పదాన్ని ఉపయోగించనప్పుడు లేదా ‘ఓం’ ఉపయోగించినప్పుడు కలిగే ప్రయోజనం ఒకలాగే ఉంటుంది. ఇది నిర్గుణతత్వము యొక్క ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది, వీలైనంత త్వరగా బాధను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉ. ఇతర సూచనలు
1. బాధ తొలగిపోయే వరకు వ్యక్తి రోజుకు కనీసం రెండు గంటలు ఉపాయం చేయాలి
కొన్నిసార్లు 2 గంటలు ముగిసేలోపు వ్యక్తి యొక్క బాధ తొలగిపోతుంది. ఇది జరిగితే, ఉపాయం మానేయాలి.
2. ఉపాయం చేసేటప్పుడు (ప్రయోగం ద్వారా నిర్ణయించబడింది) 1 గంట తర్వాత బాధలో కొంత ప్రయోజనం ఉంటే, అదే పరిష్కారం కొనసాగించాలి.
3. ఒక గంట ఉపాయం తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేనట్లయితే, సరైన ఉపాయంను మళ్ళీ కనుగొని దాన్ని నిర్వహించడానికి మరోసారి ప్రయోగం చేయాలి.
ఊ. ఉపాయం పూర్తయిన తర్వాత దేవతకు కృతజ్ఞతలు తెలియజేయాలి
ఋ. నివారణలతో పాటు ఇతర చికిత్సలను కొనసాగించడంలో ఎటువంటి హాని లేదు !
ఈ ఉపాయం కొనసాగేటప్పుడు, ఖాళీ పెట్టెలు, మందులు, మరియు అయస్కాంత చికిత్స వంటి ఇతర చికిత్సలను ఉపయోగించడం ఆపకూడదు.
ఉపాయంను కనుగొనడానికి ఎవరు ప్రయత్నించకూడదు?
దుష్ట శక్తుల కారణంగా తీవ్రమైన బాధతో బాధపడేవారు స్వయంగా పరిష్కారాలను కనుగొనకూడదు; ఎందుకంటే, దుష్ట శక్తులు జోక్యం చేసుకొని ప్రయోగాలలో తప్పు ఫలితాలు ఇస్తాయి. అలాంటి వ్యక్తులు ఈ క్రింది ఎంపికలలో ఒకదాన్ని ఎన్నుకోవాలి.
దుష్టశక్తుల కారణంగా తీవ్రంగా బాధపడేవారికి ఆధ్యాత్మిక భావము ఉంటే తమకు తాముగా ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసుకొని ఇతరుల నుండి ధృవీకరణ పొందాలి. పరిష్కారం వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందో లేదో అధ్యయనం చేయాలి. ఉపాయం వలన ఉపశమనం పొందినట్లు గమనించినట్లైతే, వారు ఆ పరిష్కారంతో కొనసాగండి.
గమనిక : పై విభాగాలలో ఇచ్చినట్లుగా మీరు న్యాసం , ముద్ర మరియు నామజపం కనుగొనలేకపోతే, తీసుకోవలసిన చర్యలను కూడా క్రింద చెప్పబడిన పవిత్ర గ్రంథములో ఇవ్వబడింది.
పాఠకులు వారి సూచన కోసం సనాతన ప్రచురణల యొక్క 3 భాగాలను భద్రపరచుకోవాలి.
ఈ విషయంపై పూర్తి అవగాహన కోసం, సనాతన సంస్థ ప్రచురించిన పవిత్ర గ్రంథం పొందండి.