శీఘ్ర భగవత్ ప్రాప్తికై ‘గురుకృపాయోగం’ అనుసారంగా సాధన చేయండి ! మానవజన్మ యొక్క సార్థకత భగవత్‌ప్రాప్తిలో ఉంది’, అని హిందూ ధర్మం చెబుతుంది. భగవత్‌ప్రాప్తి కొరకు రోజూ చేసే ప్రయత్నమును ఆధ్యాత్మిక సాధన అంటారు. సాధన చేయడం వలన మనిషి ధర్మ పరాయణుడౌతాడు. శీఘ్ర భగవత్ ప్రాప్తి కొరకు సనాతన సంస్థ సత్సంగాలలో ‘గురుకృపాయోగము’ అనుసారంగా సాధన చేయడంను నేర్పించబడుతుంది.
నామసాధన ఎలా చేయవలెను ?
- శీఘ్ర ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు కులదేవత (ఇంటిదేవత) నామజపమును (ఉదా : శ్రీ దుర్గాదేవ్యై నమః) ప్రతి రోజూ చేయాలి.
- అసంతృప్త పూర్వీకుల వలన కలిగే ఇబ్బందుల నుండి రక్షణ పొందుటకు ‘శ్రీ గురుదేవ దత్త’నామజపమును ఇబ్బందుల తీవ్రతకు అనుగుణంగా 2-6 గంటల సమయం చేయాలి.
గురుకృపాయోగానుసార సాధన !
- వ్యష్టి సాధన : స్వభావదోష-అహం నిర్మూలన, నామజపం, సత్సంగం, సత్సేవ, సత్ కొరకు త్యాగం, భావజాగృతి, ప్రీతి కొరకు ప్రయత్నం !
- సమష్టి సాధన : హిందూ ధర్మప్రచారం, దేశ-ధర్మజాగృతి మరియు హిందువులను సంఘటితం చేయడం ద్వారా ‘హిందూ దేశ స్థాపన’ కై ప్రయత్నం !
(చదవండి : సనాతన ప్రచురించిన ‘భగవద్‌ప్రాప్తి కొరకు సాధన’ గ్రంథమాలిక)
Please publish more articles in Telugu, thank you