వికార (రుగ్మత) నిర్మూలన కొరకు ఖాళీ పెట్టెల ఉపచారము – భాగము 2

రాబోయే ప్రపంచ యుద్ధంలో, అణు వికిరణం కారణంగా లక్షలాది మంది చనిపోతారని సాధుమహాత్ములు/మహాత్ములు, జ్యోతిష్కులు భవిష్యవాణి తెలియ చేశారు. భవిష్యత్తులో, ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి మరియు ఈ కాలంలో సమాజం అనేక విపత్తులను ఎదుర్కొంటుంది. ఆపత్కాలంలో, సమాచార మాధ్యమాలు విచ్ఛిన్నమవుతాయి. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్ళడం, వైద్యుడిని సంప్రదించడం మరియు మందులు కొనడం కష్టంగా మారవచ్చు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఉపయోగపడే గ్రంథాలను సనాతన సంస్థ సిద్ధం చేసింది. ఈ గ్రంథాల నుండి నేర్చుకున్న చికిత్సా విధానం అత్యవసర సమయాల్లో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా సహాయపడుతుంది; ఎందుకంటే, ప్రతి ఒక్కరినీ స్వయం సమృద్ధిగా మరియు ఆత్మ విశ్వాసంతో వుండేటట్లు చేయటం వారి ధ్యేయం. ప్రస్తుతానికి, ఈ శ్రేణిలో 13 పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. ‘వ్యాధులను నయం చేయడానికి ఖాళీ పెట్టెల యొక్క ఆధ్యాత్మిక వైద్య నివారణలు’ అనే పవిత్రమై గ్రంథాలు రెండు భాగాలుగా పరిచయం చేస్తున్నారు. ఈ పవిత్ర గ్రంథాలలో వివరంగా సమాచారం అందించబడింది.

’వ్యాధులను నయం చేయడానికి ఖాళీ పెట్టెల యొక్క ఆధ్యాత్మిక వైద్య నివారణలు’ అనే పవిత్రమైన గ్రంథములు ప్రతికూల సమయాల్లో కూడా ఉపయోగపడతాయి.

ఒక సాధారణ ఖాళీ పెట్టె ఆధ్యాత్మిక వైద్యం నివారణకు అవకాశం లేని సాధనముగా అనిపించవచ్చు; ఏది ఏమయినప్పటికీ, ఖాళీ పెట్టె యొక్క శూన్యత నేరుగా ఆకాశాతత్వం (సంపూర్ణ ఈథర్‌/ఆకాశ సూత్రం) కు సంబంధించినది. అన్ని పంచతత్వాలలో (సంపూర్ణ విశ్వ సూత్రాలు), ఆకాశాతత్వం అత్యంత సూక్ష్మమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఆధ్యాత్మిక వైద్యనివారణ కోసం ఖాళీ పెట్టె యొక్క ఆకాశతత్వం మాధ్యమంగా మన శరీరం, మనస్సు మరియు బుద్ధి పై ఉన్న నల్లటి వలయం తొలగించబడుతుంది, అదే విధంగా దుష్ట శక్తి బాధను కూడా తొలగిస్తుంది. ఆధ్యాత్మిక వైద్యనివారణ మాధ్యమంగా వ్యాధి యొక్క మూలకారణమును నిర్మూలించబడుతున్నందున, ఎవరైనా ఆకాశాతత్వం కు కేంద్రీకృతమైతే వైద్యం మెరుగుపడుతుంది.

భాగం – 1 వ్యాసంలో 1. ఖాళీ పెట్టెల గురించి, వాటి ఆకారం, కొలతలు, పరిమాణం, రంగు మరియు సాధారణ సమాచారం ప్రస్తావించబడింది. 2. శరీరంలో ఆధ్యాత్మిక నివారణలు చేయాల్సిన స్థానాలు/ కేంద్రలను గురించి ప్రస్తావించబడింది. ప్రస్తుతం ఈ సంచికలో 2 అ.

2 అ. శరీరంలో ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న కేంద్రలను ఖాళీ పెట్టెలను ఉపయోగించి ఎలా నివారణలు చేయ్యాలి మరియు కుండలిని – చక్రాలు, రుగ్మతలతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాయి అనే విషయాన్ని ప్రస్తావించాము

రుగ్మత

సంబంధిత కుండలిని చక్రము
(గమనిక 1)

1. శారీరక రుగ్మతలు
అ. తల మరియు కళ్ళకు సంబంధించిన రుగ్మతలు ఆజ్ఞాచక్రము (భ్రూమద్యము)
ఆ. ముక్కు, నోరు, చెవులు మరియు గొంతుకు సంబంధించిన వ్యాధులు విశుద్ధ చక్రము (గొంతు అంటే, స్వరం యొక్క భాగం).
ఇ. ఛాతీకి సంబంధించిన వ్యాధులు అనాహత చక్రము (ఛాతీ మధ్యలో)
ఈ. కడుపుకు సంబంధించిన వ్యాధులు మణిపూర చక్రము (నాభి)
ఉ. పొత్తికడుపు లోపాలు స్వాదిష్టానచక్రము [జననేంద్రియాలకు 1 నుండి 2 సెం.మీ. పైన (లింగం/ మర్మాంగం)]
ఊ. భుజాల లోపాలు మరియు తల నుంచి ఛాతీ పై భాగం వరకు లోపాలు (’అ ’ నుండి ’ఇ ’ సూత్రాలలో పేర్కొన్నవి కాకుండా ఇతర రుగ్మతలు). అనాహతచక్రము
ఋ. కాళ్ళు మరియు ఛాతీ క్రింద భాగంలో లోపాలు (‘ఈ’ నుండి ‘ఉ’ సూత్రాలలో పేర్కొన్నవి కాకుండా ఇతర రుగ్మతలు). మణిపూర చక్రము
ౠ. మొత్తం శరీర రుగ్మత (అలసట, జ్వరం, ఊబకాయం, శరీరంలో ఎక్కడైనా చర్మ వ్యాధులు) 1. సహస్రార చక్రము (తల కేంద్రం, తలపైన) (గమనిక 2)
2. అనాహత చక్రము మరియు మణిపూర చక్రము
2. మానసిక రుగ్మతలు 1. సహస్రార చక్రము (గమనిక 2)
2. అనాహత చక్రము

గమనిక 1 – ములాధార – చక్రము వద్ద ముద్ర చేయటం కష్టం కనుక సలహా ఇవ్వబడదు.

గమనిక 2 – సహస్రార చక్రము : ఇది కుండలిని యొక్క ఆరు చక్రాలలో లెక్కించకుండా ప్రత్యేక చక్రంగా లెక్కించబడుతుంది. విశ్వం యొక్క ప్రాణశక్తి ఈ చక్రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ చక్రాన్ని ’బ్రహ్మరంధ్రము’ అని కూడా అంటారు. సాధారణ వ్యక్తిలో, సహస్రార చక్రము చురుకుగా వుండదు, మూసివేయబడుతుంది. ఒకరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పుడే, అది జాగృతమౌతుంది. అందుకని, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన వ్యక్తి, సహస్రార-చక్రంలో న్యాసము చేసినప్పుడు, సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతాడు.

(వివరణాత్మక సమాచారం కోసం: సనాతన ప్రచురణ ‘ఖాళీ పెట్టెల వుపచార పద్ధతులు’ (2 భాగాలు)’)

 

3. ఖాళీ పెట్టెలను ఉపయోగించి వివిధ పద్ధతులలో ఆధ్యాత్మిక నివారణలు

ఖాళీ పెట్టెలతో నివారణ చేయడానికి శరీరంలో కుండలిని – చక్రాలు, అనారోగ్య అవయవాలు లేదా నవ రంధ్రాలు* పైన పట్టికలో చెప్పబడిన నివారణా పద్ధతులను కుండలిని-చక్రాలపై చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి (దీని గురించి పవిత్ర గ్రంథంలో 8 వ అంశంలో వివరంగా చర్చించబడింది). (* రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు (ముక్కు యొక్క రెండు నాసికాలు , నోరు, మూత్ర మార్గము మరియు పాయువు శరీరంలోని నవ రంధ్రాలు (ద్వారాలు).

3 అ. పెద్ద పెట్టెలను ఉపయోగించి కుండలిని – చక్రాలు, అనారోగ్య అవయవాలు లేదా నవ రంధ్రాలపై నివారణా పద్ధతులు చేయుట

3 అ 1. ఆధ్యాత్మిక నివారణలకు సంబంధించిన కొన్ని సూచనలు

అ. సాధారణంగా వ్యక్తి నుండి ఖాళీ పెట్టెను 30 సెం.మీ. (1 అడుగు) దూరంలో వుంచాలి. వీలుకాని పక్షములో ఖాళీ పెట్టెలను ఒక 10 సెం.మీ. ఇంచుమించుగా ఉన్నా పర్వాలేదు. ఆధ్యాత్మిక నివారణ చేస్తున్నప్పుడు ఒకే చోట కూర్చుని, క్రింద చిత్రంలో చూపిన విధంగా ఖాళీ పెట్టెలను నిలువుగా వుంచాలి.

ఆ. వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక నివారణకు, పెట్టెలను అనారోగ్య అవయవాల స్థాయిలో వుంచాలి. దీనికి కారణం ఏమిటంటే, పెట్టెను కుండలిని చక్రం ముందు లేదా అనారోగ్య అవయవాల వైపు వుంచినప్పుడు, అక్కడ ఉన్న దుష్ట శక్తి పెట్టెలోకి సమర్థవంతంగా లాగబడుతుంది. దీనివల్ల వ్యక్తిలోని అనారోగ్యం వేగంగా నయం కాబడి, వ్యక్తి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. వ్యక్తి ఆధ్యాత్మిక నివారణ కోసం కుర్చీలో లేదా నేలపైన కూర్చొనే దానిబట్టి పెట్టెలను ఎంత ఎత్తులో పెట్టాలి అనేది నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు, తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఆధ్యాత్మిక చికిత్స కోసం కుర్చీలో కూర్చుని వుంటే, ఒక పెట్టెను అతని అనాహత చక్రము (ఛాతీ మధ్యలో) స్థాయిలో వుంచాలి, మరియు మరొక పెట్టెను ఆజ్ఞాచక్రము (రెండు కనుబొమ్మల మధ్యలో) స్థాయిలో, ఒక బల్లపై, ఒకదాని పై ఒకటి వుంచాలి. (పెట్టెలతో ఆధ్యాత్మిక నివారణ చేసేటప్పుడు జపించడం మరియు ముద్ర లేదా న్యాసము చేయడం ప్రయోజనకరంగా వుంటుంది. అందువల్ల, పై చిత్రంలో వ్యక్తి ఒక చేతితో ముద్రను, మరొక చేతితో న్యాసము చేస్తున్నట్లు చూపబడుతుంది.)

ఆధ్యాత్మిక నివారణ చేయు శరీర భాగం స్థాయిలో పెట్టెలను వుంచడం సాధ్యం కాకపోతే, వాటిని తక్కువ ఎత్తులో లేదా నేలమీద వుంచాలి. పెట్టెలను ఇతర స్థానములలో వుంచడం ద్వారా 10 నుండి 20% మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ఆధ్యాత్మిక చికిత్స చేయు శరీర స్థాయిలో పెట్టెలను వుంచినప్పుడు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది, అందువల్ల పెట్టెలను అవసరమైన స్థాయిలో వుంచడానికి ప్రయత్నించండి.

అవసరమైన స్థాయిలో పెట్టెలను వుంచడం సాధ్యం కాకపోతే, వాటిని అనుకూల కోణంలో వుంచండి, తద్వారా పెట్టె తెరచిన వైపు వ్యక్తి దిశలో వుంటుంది. పెట్టెను ఏట వాలుగా వుంచడానికి మీరు చెక్క ముక్కను పెట్టె క్రింద వుంచవచ్చు.

ఇ. ఆధ్యాత్మిక చికిత్స చేయాల్సిన శరీర ప్రధాన భాగం ముందు, పెట్టె తెరచిన వైపు వుంచి, పెట్టెను ఖచ్చితంగా మధ్యలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఈ. రోగి కావాలనుకుంటే ఆధ్యాత్మిక నివారణల సమయంలో పడుకోవచ్చు. ఏదేమైనా, ఆధ్యాత్మిక నివారణలు చేయవలసిన ప్రదేశంలో పెట్టెలు వుండేటట్లు చూసుకోవాలి. పడుకునే స్థితిలో ఆధ్యాత్మిక నివారణలు చేస్తున్నప్పుడు, అంశం ‘3 ఈ 2 అ.’ (వ్యాసం మూడోభాగంలో) చిత్రంలో చూపిన విధంగా పెట్టెలను అడ్డంగా వుంచాలి.

(ఖాళీ పెట్టె మూసి ఉన్న వైపు)

3 ఆ. పెట్టెలు శరీరం నుండి 1 – 2 సెం. మీ. దూరం చేతిలో పట్టుకొని కుండలిని – చక్రాలు, అనారోగ్య అవయవాలు లేదా శరీరంలో నవరంధ్రాలు పై ఆధ్యాత్మిక నివారణలు చేయుట

ప్రయాణ సమయంలో, ఉద్యోగ కార్యాలయంలో, సమావేశ సమయంలో పెద్ద పెట్టెలతో ఆధ్యాత్మిక నివారణలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో, చిన్న పెట్టెల ద్వారా ఆధ్యాత్మిక నివారణ చేయవచ్చు. (పైన చిత్రంలో చిన్న పెట్టెల ద్వారా ఆజ్ఞాచక్రము మరియు అనాహత- చక్రాలపై ఆధ్యాత్మిక నివారణ చూపబడింది.)

3 ఆ 1. పెట్టె యొక్క కొలతలు

పెట్టె పరిమాణం చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా వుండాలి. దీని పొడవు, వెడల్పు మరియు లోతు 10: 7: 6 నిష్పత్తిలో వుండాలి.

3 ఆ 2. ఆధ్యాత్మిక నివారణలకు సంబంధించిన కొన్ని మార్గదర్శక అంశాలు

అ. ఆధ్యాత్మిక చికిత్స చేయాల్సిన శరీర ప్రధాన భాగం ముందు, పెట్టె తెరచిన వైపు మధ్యలో వుండేటట్లు పట్టుకోవాలి.

ఆ. పెట్టెలను పట్టుకున్నప్పుడు చేతులు నొప్పి వుంటే, చేతులు మార్చుకోవచ్చు.

ఇ. ఆధ్యాత్మిక చికిత్స చేసేటప్పుడు, చేతిని శరీరానికి దూరంగా ఉంచటం వల్ల, కొంత సమయం తరువాత నొప్పి కలగవచ్చు. నొప్పి లేకుండా, కుర్చీపై కూర్చున్న వ్యక్తి తన మోచేతులను కుర్చీ చేతులపై వుంచవచ్చు. అదేవిధంగా, శక్తిలేనివారు లేదా వృద్దులు అలసట కారణంగా, చేతిలో పెట్టెలను లోపం వున్న అవయవాల ముందు 1-2 సెం.మీ. దూరం పట్టుకోవడం సాధ్యం కాకపోతే, పెట్టెలను ఆనించి పెట్టుకోవచ్చు.

3 ఇ. రోజువారీ కార్యకలాపాలు, చదువుకునేటప్పుడు, సత్‌ సేవలు మొదలైనవి చేసేటప్పుడు పెట్టెల – నివారణలు సులభంగా చేసుకోవచ్చు.

పెట్టెలను శరీరానికి 30 సెం.మీ. (1 అడుగు) దూరంగా వుంచడం మరియు పెట్టెలను చేతిలో పట్టుకోవడం ద్వారా ఆధ్యాత్మిక నివారణలు ప్రతి రోజు సులభంగా చేయవచ్చు. కొన్ని ఉదాహరణలు క్రింద ప్రస్తావించబడ్డాయి.

1. చదువుకునేటప్పుడు, ధాన్యములు శుభ్రపరిచేటప్పుడు, సత్సేవా చేసేటప్పుడు ఆధ్యాత్మిక నివారణ కోసం పెట్టెలను వుంచు విధానం. ఒక పెట్టెను బోర్లించి మీ కుర్చీ క్రింద పెట్టె వుంచవచ్చు. పాతాళము నుండి వచ్చే దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పించడంలో ఇది సహాయపడుతుంది. మీరు మీ తొడల మధ్య రెండు పెట్టెలను ఒకదానిపై ఒకటి పెట్టి తెరిచిన ముఖ భాగం మనవైపు వుండేటట్లు వుంచవచ్చు. ఇది స్వాధిష్టాన-చక్రం (జననేంద్రియాల పైన 1 నుండి 2 సెం.మీ.) మరియు మణిపూర-చక్రం (నాభి వద్ద) లేదా ఉదరం మరియు పొత్తికడుపు ప్రాంతంలో ఉన్న సమస్యలను అధిగమించడంలో సహాయపడుతుంది.

2. ఎవరితోనైనా సంభాషించేటప్పుడు లేదా సమావేశంలో వున్నప్పుడు, ఆధ్యాత్మిక నివారణ స్థానంలో మీరు మీ చేతిలో ఒక చిన్న పెట్టెను పట్టుకొని వుంచవచ్చు.

3. మీరు కూర్చున్న చోట పెట్టెను పైకప్పు నుండి వేలాడదీయండి, పెట్టె తెరచివున్నవైపు భాగం తలపైకి వస్తుంది. లేదా రోజంతా పెట్టెలను హెల్మెట్‌లా ధరించడం; నివారణ స్థానంలో చిన్న పెట్టెను అతికించుకోవడం వంటి పద్ధతులను ఉపయోగించి కూడా పెట్టెలతో నివారణ సులభంగా పొందవచ్చు.

Leave a Comment