ఆహరం మరియు వ్యాధుల యొక్క సంబంధం, జీర్ణవ్యవస్థ ప్రాముఖ్య విశ్లేషణ

మాతృ మరియు శిశువులకు సమతుల్య ఆహారం మరియు పౌష్టికవిలువలు సమకూర్చే ముఖ్య ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం సెప్టెంబర్‌ 2019 ని జాతీయ పౌష్టిక మాసంగా ప్రకటించింది. దీని గురించి ప్రచారం ద్వారా సమాజం లో అవగాహన పెంచింది. దీనిలో భాగంగానే మేము కూడా ‘ఆరోగ్య భారత కోసం పౌష్టిక ఆహారం‘ అనే పేరిట వ్యాసాలు రాయడం ఆరంభిస్తున్నాము. దీని ద్వారా మాత శిశువులే కాకుండా సాధారణ జనాభాను కూడా పౌష్టిక ఆహారం వైపు శాస్త్రీయంగా నడిపించి ప్రభుత్వం వారి పధకం పై పూర్తి అవగాహన కలిపించడం మా ఈ చిన్న ప్రయత్నం యొక్క ప్రముఖ ఉద్దేశం.

 

1. ఆహారం నియంత్రణ లేకపోవటమే వ్యాధులకు అసలైన కారణం

సద్గురువులు వసంత్‌ బాళాజీ ఆఠవలే

జంతువులకి ఏ ఆహారాన్ని తినాలి ఏది తినకూడదు అని నిర్ణయించుకునే వివేకం ఉంటుంది. పశువులు,మేకలు విషపూరిత ఆకులను తినవు. కానీ అత్యంత వివేకేకవంతుడైన మనిషికి మాత్రం ఎలాంటి ఆహారాన్ని తినాలి అనే వివేకం లేదు. ఆధునిక వైద్యశాస్త్రం ఆహారాన్ని ప్రోటీన్‌, కార్బోహైడ్రేట్‌, మినరల్స్‌, లవణాలు మరియు నీరు గా విభజించింది. కానీ వివిధ రకాల పౌష్టిక ఆహారం మన శరీరంలో వాతము, పిత్తము మరియు కఫము, వీర్యం, మలము మరియు అవయవాలపై ఎటువంటి ప్రభావ చూపిస్తుందని ఆయుర్వేదం చాల స్పష్టంగా చెప్పింది. అలాంటి శాస్త్రాన్ని అభ్యసించి శరీరప్రకృతి, వయసు, ఋతువు, జీర్ణ సామర్ధ్యాన్ని బట్టి ఆహారాన్ని సేవించినట్లయితే మనిషి వ్యాధుల రహితం మారవచ్చు. ఇది మనకి తెలిసినప్పటికీ పాటించకపోవటనికి కారణం ఆహారం నియంత్రణ లేకపోవటమే. ఆమ్లపిత్తము(అసిడిటీ)తో ఉన్నపుడు భేల్పూరి తినటం వల్ల కడుపులో నోపి వస్తుందని తెలిసికూడా వినోదం కోసం తింటారు. దీనినే ఆయుర్వేదంలో అవివేక ప్రవర్తనగా పిలవబడుతింది మరియు ఈ ప్రవర్తనే అన్నిరకాల వ్యాధులకు మూలకారణం.

 

2. సహజ సిద్దమైన ఆహారం నుంచి దూరమవ్వటం

ఆది మానవుడు తన ఆహారం కోసం మొక్కల యొక్క వేర్లు మీద, పండ్ల మీద, జంతువులని వేటాడి వాటి మాసం మీద ఆధారపడుతూ జీవించేవాడు. స్వచ్ఛమైన గాలి, తాజా ఆహారం, పారే సెలయేళ్ళ నుంచి నీరు తీసుకోవడం వల్ల ఆదిమానవడు ఆరోగ్యకరమైన జీవనం సాగించేవాడు. కానీ నేటి సమాజంలో జనాభా పెరుగుదల వల్ల చెట్లు, అడవులు తగ్గిపోతున్నాయి. ఈ జనాభా పెరుగుదల, వాహనాలు మరియు కర్మాగారాల నుండి వెలువడే హానికారకమైన రసాయనాలు మరియు శబ్దాలు వాళ్ళ మనం పీల్చుకునే గాలి కాలుష్యంతో పాటు శబ్దకాలుష్యం కలుగుతుంది. వ్యాపారులు ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు, ఎక్కువ సేపు నిల్వ ఉండటానికి పండ్లు, ధాన్యాలు,కూరగాయలమీద పురుగుమందులను వాడుతున్నారు. ఇలాంటి విషపూరిత రసాయనాలు వాడిన పండ్లు,కూరగాయలు కడుకోకుండా తింటే మన జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. కార్టిసోన్‌ వంటి రసాయనాలను జంతువు శరీరంలో కృత్రిమంగా ఎక్కించి, దాని ద్వారా వాటి పెరుగుదలని తక్కువ కాలంలో విశేషంగా పెంచుతున్నారు. ఇలా పెంచిన జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఉప్పును కనుగొనకముందు ఉప్పు లేకుండానే ఆహారాన్ని వండుకుని తినేవారు. ఉప్పు లేకపోవడం వల్ల ఆ కాలంలో రక్తపోటు, గుండె జబ్బులు, శరీరవాపు వంటివి సంభవించేవి కాదు. ఆహరములో రుచి కోసం ఉప్పుని వాడడం మొదలుపెట్టాక రక్తపోటు, గుండెపోటు లాంటివి విపరీతంగా మనుష్యుల్లో పెరగడం మొదలయ్యాయి. చక్కర కనిపెట్టాక దానిని వాడి జిలేబి, బాసుంది, శిరఖ్‌ండ వంటి మిఠాయిలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి మిఠాయిలు తినడం ద్వారా మనుష్యుల్లో డయాబెటిస్‌, అధిక బరువు వంటి లక్షణాలు ఎక్కువయ్యాయి. అలానే టీ, కాఫీ వంటి పానీయాలు, ఆవకాయ మరియు ఘాటు/మసాలా పదార్ధాలను ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఆమ్లత్వం పెరగడం (హైపర్‌ అసిడిటీ), అల్సర్‌ వంటివి కలగడం జరుగుతున్నాయి. నిల్వ చేసిన ఆహార పదార్ధాల ఉదాహరణకి టమాటో కెచప్‌, సిరుప్స్‌ లేదా సేతలపానీయాలు (కూల్డ్రింక్స్‌)వంటివి తినడం మరియు తాగడం వల్ల శరీరంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.

వాయు మార్గాల ద్వారా రాకపోకల విషయంలో ప్రపంచ దేశాలు ఒకటి అవుతున్నాయి. దీని ఫలితంగా వీడి ఆహారం కూడా మనం చేసే భోజనాల్లో పాలు పంచుకుంటున్నాయి. నిజానికి మన దేశములో చైనీస్‌ మరియు మెక్సికన్‌ వంటకాలు చాల సులువుగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ వంటకాలు రుచికరంగానే కాకుండా కనులువిందుగా కూడా ఉండడంతో మన

జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఆధునిక పరిజ్ఞానం బాగా పెరిగాక, జ్యూసర్‌ వంటి
పరికరాలు అందుబాటులోకి వచ్చి ప్రజలు చెరుకు మరియు ఇతరేతర పండ్లరసాల్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసి తాగుతున్నారు. కానీ మన ఆయుర్వేదం ప్రకారం చెరుకు మరియు ఇతర పండ్లని రసం పిండి తాగడం కాకుండా పండ్ల రూపంలోనే తినమని సూచిస్తుంది. ఇల తినటం వల్ల పాడైన పళ్ళ భాగాన్ని తినకుండా ఉండగలం. అదే జ్యూసర్‌ లో ఐతే పాడైన పండ్ల భాగాన్ని కూడా రసం తీయబడుతుంది. ఈరోజుల్ల ప్రజలు రుచికరమైన పండ్లకి ఉప్పు మరియు ఇతర కృత్రిమమైన మసాలాలు అద్ది తినడం అలవాటుగా చేసుకున్నారు. అంతే కాకుండా ప్రతి ఇంట్లో రెఫ్రిజిరేటర్‌ సౌకర్యంగా అందుబాటులో ఉండడం ద్వారా ఆహార పదార్ధాల్ని ఆదివారం నాడు వండుకుని రెఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుని, మిగతా రోజుల్లో ఆ నిల్వ చేసిన పదార్ధాల్ని వేడి చేసుకుని తినడం ఒక అలవాటుగా మారింది. కానీ మన ఆయుర్వేదం ప్రకారం శీతల నిల్వ చేసిన పదార్దాలని వేడి చేసుకుని తినడం మంచిది కాదు అని సూచిస్తుంది. మన శరీరానికి కావాల్సిన ఐరన్‌, విటమిన్ల వంటి పోషకాల్ని సహజమైన ఆహారం ద్వారా కాకుండా కృత్రిమమైన మాత్రల ద్వారా పొందడము ఒక అలవాటుగా మారింది. కానీ ఎక్కువ శాతంలో ఇలాంటి పోషకాలు తీసుకోవడం వల్ల మన శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి.

ఈ దుష్ప్రభావాలు వెంటనే ఒకటి తరువాత ఒకటి కాకుండా కొంత కాలం తర్వాత అన్ని ఒకేసారి చూపి మన శరీరాన్ని అనారోగ్యకరంగా మారుస్తాయి . కాబట్టి సహజ సిద్దమైన కూరగాయలు, లేదా పళ్ళని తాజాగా వండుకుని తినడం వల్ల మనిషి తన జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపగలడు.

 

3. జీర్ణ సామర్థ్యంలో మార్పుకు కారణం ఏమిటి?

యాభై లడ్డులను సులభంగా తినగలిగే వ్యక్తులు మరియు కేవలం ఒక గ్లాసు పాలతో అతిసారం/విరోచనాలు వచ్చే వ్యక్తులు కుడా ఉంటారు. ఈ వ్యత్యాసం జీర్ణ సామర్థ్యం భిన్నంగా ఉండటం వల్ల కలుగుతుంది. జీర్ణక్రియ వివిధ జీర్ణ రసాలు మరియు వాటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీర్ణ సామర్థ్యం వంశపారంపర్యంగా ఉంటుంది.

3 అ. వంశపారంపర్యంగా

మంచి లేదా పేలవమైన జీర్ణ సామర్థ్యం వంశపారంపర్యంగా ఉంటుంది. పాలిచ్చే కొందరు పిల్లలు రోజుకు 8 నుండి 10 సార్లు మలవిసర్జన చేస్తారు, మరికొందరు మూడు రోజులు కూడా మలబద్ధకం కలిగి ఉంటారు.

3 ఆ. ప్రకృతి

సమతుల్య మరియు పిత్త ప్రకృతి కలవారికి మంచి జీర్ణ సామర్థ్యం ఉంటుంది, కాని వాత మరియు కఫా ప్రకృతి కలవారికి జీర్ణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది.

3 ఇ. వయస్సు

పిల్లలు మరియు యువత మంచి జీర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో ఇది తగ్గుతుంది.

3ఈ. ఆహారపు అలవాట్లు

అధికంగా లేదా చాలా తక్కువ ఆహారం తీసుకోవడం, అసమతుల్య ఆహారం మరియు సక్రమంగా తినడం వల్ల జీర్ణ సామర్థ్యం తగ్గుతుంది. భారీ, పులియబెట్టిన, కుళ్ళిన, పాత, అపవిత్రమైన మరియు సగం వండిన ఆహారం కూడా జీర్ణించుకోవడం కష్టం.

3 ఉ. పోషకాల లోపం

ప్రోటీన్‌ లేదా విటమిన్ల లోపం ‘ఎ’ మరియు ‘బి’ జీర్ణ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

3 ఊ. జీర్ణ అవయవాల వ్యాధులు (జీర్ణ వ్యవస్థ అపస్థితులు)

కడుపు, పేగులు, కాలేయం మరియు పిత్తాశయం యొక్క వ్యాధులు జీర్ణ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

3 ఎ. వ్యాధులు

ప్రతి వ్యాధి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది ఏదైనా వ్యాధి యొక్క ప్రాథమిక దశలో, కాలేయం మరియు ప్రేగు యొక్క వ్యాధులు మరియు క్షయవ్యాధి వంటి బలహీనపరిచే వ్యాధులలో ప్రత్యేకంగా తగ్గుతుంది.

3 ఏ. అలవాట్లు

పాలు తాగడం అలవాటు లేనివారు తాగడం ద్వారా అతిసారం కలుగుతుంది, కాని వారు ఇతర ఆహారాలను జీర్ణించుకోగలరు. కేరళలో జన్మించిన వ్యక్తులు బియ్యం మరియు చేపలను సులభంగా జీర్ణం చేసుకోగలరు మరియు పంజాబ్‌ లో జన్మించిన వ్యక్తులు గోధుమలు మరియు మాంసాన్ని సులభంగా జీర్ణం చేస్తారు.

3 ఐ. మానసిక రుగ్మతలు

ఒత్తిడి, కోపం, భయాలు, ఆందోళన, ఆకలి మరియు జీర్ణ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

3 ఒ. వ్యాయామం

వ్యాయామము ఆకలి మరియు జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తికి మంచిగా ఆకలి వేస్తుంది.

సందర్భము : సనాతన ప్రచురణ ‘తగని ఆహారం తీసుకోవడంపై ఆధునిక దృక్పథం (అసమతుల్య ఆహారం వల్ల కలిగే వ్యాధులకు ఆయుర్వేద నివారణలతో సహా); రచయిత : డాక్టర్‌ మరియు వైద్యచార్య సద్గురువులు వసంత బాళాజీ ఆఠవలె మరియు డాక్టర్‌ కమలేష్‌ వసంత్‌ ఆఠవలె.

Leave a Comment