సాధకులకు ముఖ్య సూచన
(శ్రీ సత్శక్తి) శ్రీమతి బిందా సింగ్బాల్
నామజపం కేవలం ఆధ్యాత్మిక ఉన్నతికే కాకుండా, వివిధ రుగ్మతల నిర్మూలనకు కూడా ఉపయోగ పడుతుంది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో, సమాజంలోని ప్రజలు రోగనిరోధక శక్తి, పెంచుకోవడానికి యోగాసన, ప్రాణాయామం, ఆయుర్వేద చికిత్సను ఉపయోగించడం మొదలైన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో పాటు, రోగనిరోధక శక్తి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సరైన ఆధ్యాత్మిక సాధన కూడా చేయాలి.
కరోనా సమయంలో రోగులలో సాధన ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడానికి, అనగా కరోనా వైరస్ యొక్క ప్రభావం మనపై రాకుండా ఒకవేళ వచ్చినా దానిని నాశనం చేయడానికి ఆధ్యాత్మిక కోణం నుండి దేవీ తత్వము, దత్త తత్వము, శివ తత్వము అవసరం. అందువల్ల కరోనా వైరస్ తో పోరాడడానికి మీలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వైద్య చికిత్సలతో పాటు ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి క్రింది నామజపం చేయండి
‘శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ గురుదేవ దత్త – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – ఓం నమః శివాయ.’
ఈ నామజపం 108 సార్లు (1 మాల) చేయడానికి 40 నిమిషాలు పడుతుంది. ‘ఎప్పటివరకు కరోనా వైరస్ ప్రపంచమంతటా దాని ప్రభావాన్ని చూపుతుందో, అప్పటి వరకు వైద్య చికిత్సలతో పాటు మీలో ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడానికి రోజూ 1 మాల చేయండి. ఎవరికైతే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో, వారు మరింత ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి రోజూ 3 గంటలు (6 మాలలు) చేయాలి.
సనాతన సంస్థ యొక్క సాధకులు, శ్రేయోభిలాషులు, ధర్మ ప్రేమికులు, హిందుత్వ వాదులు, ‘సనాతన్ ప్రభాత్’ పాఠకులు గత ఒక సంవత్సరం నుండి ఈ నామజపాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నారు. నామజపం చేయడం ద్వారా ఆత్మబలం పెరిగిన అనుభూతిని వారు పొందుతున్నారు.
నామజపం చేయడం ద్వారా సకారాత్మక శక్తి లభిస్తుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 31 మే 2021 వరకు, పశ్చిమ మహారాష్ట్రలోని పూణేలో 112, సాతారాలో 42, సోలాపూర్‌లో 42, కొల్లాపూర్‌లో 42, సాంగ్లీ లో 32 మరియు గోవా రాష్ట్రంలో 11 ఇలా మొత్తం 279 స్థానాల్లో నామాజపాన్ని స్పీకర్లలో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ జిల్లా లోని కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రులు, చికిత్సాలయాలు, ఔషధ ఆలయాలు (మెడికల్ స్టోర్స్), ల్యాబ్స్ వంటి ప్రదేశాలలో, అలాగే మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రంలోని కొన్ని దేవాలయాలలో కూడా ఈ నామజపం పెట్టడం జరుగుతోంది.
శ్రద్ధ ఉన్న సమాజానికి ఆహ్వానం !
వైద్య చికిత్సలతో పాటు ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల కరోనా మహమ్మారి సమయంలో, భారతదేశంలోని సమాజం ఈ నామజపం చేయండి – ‘శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ గురుదేవ దత్త – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – శ్రీ దుర్గాదేవ్యై నమః – ఓం నమః శివాయ ఈ నామాజపాన్ని మీ ఇల్లు, కార్యాలయం, దుకాణం, ఆసుపత్రి, చికిత్సాలయం, కోవిడ్ కేర్ సెంటర్, ఔషధ ఆలయం, ల్యాబ్ మరియు దేవాలయాలలో స్పీకర్ల లో పెట్టి ఆధ్యాత్మిక సేవలో మీ సహకారం అందించండి.
ఈ నామజపాన్ని సనాతన సంస్థ చేసింది. మీకు ఈ నామజపం మీ దగ్గరలో ఉన్న సనాతన సాధకుల నుండి పొందవచ్చు. మీకు ఈ నామజపం లభించకపోతే, కింది చిరునామా లేక మొబైల్ నంబర్ తో సంప్రదించండి.
సంప్రదింపు కొరకు చిరునామ – శ్రీమతి భాగ్యశ్రీ సావంత్, సనాతన ఆశ్రమ, 24/B రామనాతి, బందోడా, పోండా, గోవా -౪౦౩౪౦౧
చరవాని – 7058885610
అలాగే, స్పీకర్లలో నామజపం పెట్టే ప్రయత్నం జరుగుతుంటే, దాని గురించి సమాచారం మీ సమీప సనాతన సాధకులకు లేక శ్రీమతి భాగ్యశ్రీ సావంత్‌కు తెలియజేయండి.
– (శ్రీసత్ శక్తి) శ్రీమతి బిందా సింగ్బాల్, సనాతన ఆశ్రమ, రామనాతి, గోవా. (1.6.2021)