అగ్నిమాపక చర్యలో ప్రయోగాత్మక శిక్షణ

చివరి లేఖనంలో, అగ్ని యొక్క అంశాలు, అగ్ని యొక్క సామాన్య కారణాలు, మంటల వర్గీకరణ, అగ్నిని చూసినప్పుడు మీరు ఏమి చేస్తారు? ఈ లేఖనంలో అగ్నిమాపక యొక్క కొన్ని పద్ధతులు, అగ్నిమాపక చర్యలో ఉపయోగించే సాధనాలు, పరిస్థితులు మరియు పరిష్కార చర్యల గురించి మనము తెలుసుకున్నాము. దీనిగురించి ఇప్పుడు మరింత తెలుసుకుందాము.

 

ఏ 1. మండే ఇల్లు లేదా ప్రాంగణం నుండి తప్పించుకోవడం

మంటల్లో ఉన్న ఒక గది లేదా భవనం నుండి బయటకు వచ్చేటప్పుడు, చివరిగా వచ్చిన వ్యక్తి తలుపును మాత్రమే మూసివేయాలి, తాళం వేయకూడదు. ఎందుకంటే అది అగ్నిమాపక సిబ్బందికి వెతకడానికి మరియు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుంది.

* అత్యవసర కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న తప్పించుకునే మార్గాన్ని మాత్రమే ఉపయోగించండి.

* అత్యవసర పరిస్థితుల్లో ఎలివేటర్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. పొగ మరియు విష వాయువులను నివారించడానికి క్రిందికి వంగాలి. పరిశుభ్రమైన గాలి నేలకు దగ్గరగా ఉంటుంది. అవసరమైతే, నేలమీద పడుకుని, మీ చేతులతో మరియు కాళ్ళతో ముందుకు పాకండి. మీ పొట్టపై ముందుకు పాకుతూ వెళ్ళవద్దు. వేడి కారణంగా పొగ పెరగుతుంది మరియు కొన్ని భారీ విషపూరిత వాయువులు నేలపై పేరుకుపోతాయి; అందువల్ల, పాకడం చేస్తున్నప్పుడు, మీ తల భూమికి సుమారు అర మీటరు ఎత్తులో ఉంచండి.

* వీలైతే, మీ ముక్కు మరియు నోటిని తడి గుడ్డతో కట్టుకోండి.

* మండుతున్న మెట్లు/గది గుండా వెళ్ళేటప్పుడు, గోడకు దగ్గరగా నడవండి. భవనం యొక్క ప్రధాన RCC నిర్మాణంపై గోడలు నిర్మించబడినందున, గోడల దగ్గర ఉన్న విభాగం సురక్షితమైనది. మిగతా విభాగాలు కూలిపోయే అవకాశం ఉంది. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి మెట్లు ప్రధాన మార్గం. కాబట్టి భయపడకుండా, జాగ్రత్తగా మరియు క్రమశిక్షణతో భవనాన్ని ఖాళీ చేయండి.

* మెట్లు యొక్క ఒక వైపు నుండి మాత్రమే క్రిందికి వెళ్ళండి. మెట్ల యొక్క మరొక వైపు, అగ్నిమాపక మరియు రక్షణ సిబ్బంది కోసం మార్గం వదిలివేయండి. పొరపాటున కూడా మళ్ళీ మెట్లు ఎక్కవద్దు.

* భవనం నుండి బయటకు వచ్చిన, వెంటనే సంఘటన గురించి అగ్నిమాపక దళం మరియు పోలీసు బృందానికి తెలియజేయండి.

 

ఏ 2. మీరు వేసుకున్న దుస్తువులకు మంటలు పట్టుకుంటే ఏమి చేయాలి?

ఆగండి (Stop), వంగండి (Drop), ద్రొల్లండి (Roll)

ఆగండి – మీరు ఉన్నా చోట ఉండండి

వంగండి – నేలమీద పడుకోండి

ద్రొల్లండి – నేలపై ద్రొల్లండి

ఇది మంటలను ఆర్పి, మీ ప్రాణాలను కాపాడుతుంది. బట్టలకు మంటలు అంటుకుంటే, భయపడకండి మరియు పారిపోకండి, పరుగెత్తడం వల్ల గాలి మంటలను మరింత మండించటానికి సహాయపడుతుంది.

 

ఏ 3. మీ సహచరుడికి మంటలు అంటుకుంటే ఏమి చేయాలి?

* మండుతున్న వ్యక్తి చుట్టూ ఒక రగ్గు, దుప్పటి, చాప లేదా ఏదైనా మందపాటి వస్త్రాన్ని కప్పండి.

* మంటలు ఆరిపోయినప్పుడు, అతని శరీరం నుండి కాలిపోయిన బట్టలను తొలగించండి.

* సరైన ప్రథమ చికిత్సను అందించండి.

పొయ్యి మంటల విషయంలో లేదా మూకుట్లో నూనెలో మంటలు సంభవించినప్పుడు మరియు దేశీయ LPG గ్యాస్‌ గొట్టం నుండి లీకైన సందర్భంలో, ఏమి చేయాలో పరిష్కార చర్యల గురించి సనాతన గ్రంథంలో వివరించారు.

 

ఐ (I) . అగ్ని నివారణ పరిష్కార ప్రణాళిక

రోజువారీ జీవితంలో కొన్ని ప్రాతినిధ్య సందర్భాలలో తీసుకోవలసిన నివారణ చర్యలు ముందు ఇవ్వబడ్డాయి.

1. విద్యుత్‌ మరియు విద్యుత్‌ పరికరాల వల్ల సంభవించే మంటలు

పని పూర్తయిన తరువాత, విద్యుత్‌ ఉపకరణాలు ఆపి వేసి, ప్లగ్‌ తీసివేయండి.

* విద్యుత్‌ ఉపకరణాలు మరమ్మత్తు చేసేటప్పుడు, వైర్లు సరిగ్గా కలిపారో లేదో తనిఖీ చేయండి. నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుడి నుండి మాత్రమే పనిని చేయించండి.

* విద్యుత్‌ ఉపకరణాలను, ముఖ్యంగా మోటార్లు, శుభ్రంగా ఉంచండి. దుమ్ము, నూనె లేదా గ్రీజు దానిపై పేరుకుపోకుండా చూడండి. కర్మాగారాల్లో ఉపయోగించే విద్యుత్‌ చేతి దీపాలు సులభంగా కదలిక కోసం పొడవైన వైర్లను కలిగి ఉంటాయి.

* దీపం యొక్క వేడి కారణంగా సమీపంలో ఉన్న జిడ్డుగల పదార్థాలు మండుతాయి కాబట్టి, విద్యుత్‌ చేతి దీపాలు తప్పనిసరిగా గాజుతో కప్పబడి ఉండాలి.

* విద్యుత్‌ ఉపకరణాలు / స్విచ్‌ల దగ్గర మండే పదార్థాలను ఉంచవద్దు / నిల్వ చేయవద్దు. ఫ్యూజ్‌ వైర్‌ కాలిపోయినప్పుడు, సామర్థ్యం కలిగిన వైర్‌ మాత్రమే మార్చండి.

* ఏదైనా విద్యుత్‌ ఉపకరణం నుండి మండుతున్న లేదా అసహజ వాసన ఉంటే, వెంటనే దాన్ని స్విచ్‌ ఆపి, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుడుచే పరీక్షించండి.

* కాలిపోతున్న వాసన, అగ్ని ప్రమాదం యొక్క ప్రాధమిక లక్షణం.

* ఏదైనా విద్యుత్‌ ఉపకరణం లేదా విద్యుత్‌ స్విచ్‌ సామర్థ్యానికి మించి అధిక భారము వేయవద్దు.

* విద్యుత్‌ వైర్లను నీటిలో లేదా వేడి ప్రదేశాలలో ఎప్పుడూ అమర్చవద్దు. వాటిని నేలమీద, తివాచీ క్రింద లేదా తలుపులు / కిటికీలలో నుంచి అమర్చవద్దు.

* తడి చేతులతో విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.

* విద్యుత్‌ వైర్ల కేబుల్స్‌ ఎప్పుడూ బహిర్గతం చేయవద్దు; ఇన్సులేషన్‌ టేప్తో వాటిని చుట్టి ఉంచండి.

2. వంటగదిలో మంటలు

* భద్రత దృష్ట్యా వంటగదిని సురక్షితమైన రీతిలో రూపొందించండి.

* వంట చేసేటప్పుడు వదులుగా మరియు వేలాడే దుస్తులను ధరించవద్దు, చీర కొంగును భద్రంగా దోపుకోండి.

* పొయ్యి నుండి వేడి పాత్రలను తొలగించడానికి(ఎత్తుటకు) ఎల్లప్పుడూ పట్టుకొను సాధనము లేదా పట్టకారు వాడండి. దీని కోసం తుండు, వస్త్రం లేదా చీర కొంగును ఉపయోగించడం చాలా ప్రమాదకరం.

* ఇంటిలో గ్యాస్‌ పొయ్యి , స్టవ్‌ లేదా కొలిమి (ఓవెన్‌) వెలుగుతున్నప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్ళొద్దు.

* ఇంట్లో ఎవరూ లేనప్పుడు లేదా మీరు నిద్రపోతున్నప్పుడు కొవ్వొత్తులు మరియు నూనె దీపాలను ఆపివేయండి. ఇంట్లో ప్రతిరోజూ ఉపయోగించే గ్యాస్‌ పొయ్యి లేదా స్టవ్‌ను ఎల్లప్పుడూ ఎత్తులో ఉంచండి. నేలపై ఎప్పుడూ ఉంచవద్దు.

* పొయ్యి పై ఉంచు పాత్రకు చేతిపిడి ఉంటే, అది లోపలికి ఉండేటట్లు పాత్రను అమర్చండి.

* చెక్క అలమారాలు, పలకలు, తలుపుల తెరలు మరియు ఇతర మండే వస్తువులను పొయ్యి నుండి దూరంగా ఉంచండి.

* పిల్లలను వంటగదిలో ఆడటానికి ఎప్పుడూ అనుమతించవద్దు.

* మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. బాహ్యంగా చల్లగా కనిపించినప్పటికీ, లోపల ఆహారం యొక్క ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ఓవెన్లో ఉంచిన పదార్థం నుండి మంటలు రగులుకుంటే, వెంటనే విద్యుత్‌ ఆపివేసి, మంటలు ఆగే వరకు కొలిమి (ఓవెన్‌) తలుపు తెరవకండి.

* అగ్గిపెట్టె వెలిగించేటప్పుడు, శరీరానికి దూరంగా ఉంచండి. దాన్ని పారవేసే ముందు, అది పూర్తిగా ఆరిపోయేలా చూసుకోండి.

* అగ్నిని నివారించడానికి కీలకమైనది పరిశుభ్రత.

సేకరణ : సనాతన ప్రచురణ ‘అగ్నిమాపక’

Leave a Comment