అగ్నిహోత్రము : అణువిధ్వంసం నుండి రక్షణ

రాబోయే దశాబ్దంలో 3 వ ప్రపంచ యుద్ధం ఉంటుంది, ప్రపంచలో 1/3 వ వంతు జనాభా నశించిపోతుంది. అణు పతనం వల్ల కలిగే కాలుష్యం వల్ల లక్షలాది మంది చనిపోతారు. – పరమ పూజ్యులు డాక్టర్‌ ఆఠవలే (30.9.2007)

అణు వికిరణం యొక్క ప్రభావాన్ని అగ్నిహోత్రా నిరోధించగలదా?

 

1. పరిచయం

అంతర్జాలంలో అనేక వ్యాసాలలో, అగ్నిహోత్రమును అణు వికిరణం యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి, సులభంగా ఆచరించదగిన కర్మగా ప్రచారం చేయబడింది. ఈ వార్త మాకు ఆసక్తిని కలిగించింది, ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన – సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వద్ద ఈ కర్మతో పాటు ఒక మంత్రాన్ని పఠించడం వాస్తవానికి అణు విధ్వంసము యొక్క హానికరమైన ప్రభావాలను అరికట్టగలదు. రాబోయే కాలాల గురించి ఆధ్యాత్మిక పరిశోధనల ద్వారా మాకు లభించిన సమాచారాన్ని బట్టి ఈ కర్మకు కూడా సంబంధము ఉంది.

అణు విధ్వంసము నుండి రక్షించడానికి మానసిక మరియు శారీరక స్థాయిలో ప్రయత్నాలతో పాటు ఆధ్యాత్మిక స్థాయిలో తీసుకోవలసిన చర్యలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అణు విధ్వంసము ప్రభావాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మరియు దాని నివారణకు ఆధ్యాత్మిక స్థాయిలో మనం తీసుకోగల చర్యలను ఈ లేఖనం వివరిస్తుంది.

 

2. అణు విధ్వంసము నుండి అగ్నిహోత్రము చేస్తున్న వ్యక్తికి రక్షణ

అణు బాంబు పేలుళ్ళు, తక్షణమే మరియు ఆలస్యంగా కూడా విధ్వంసాన్ని సృష్టిస్తాయి.

  • తక్షణ ప్రభావాలు (పేలుడు, ఉష్ణ వికిరణం, చురుకుగా అయొనీకరణం ద్వారా వ్యాపించడం) ఉత్పత్తి చేయబడుతాయి మరియు అణు విస్ఫోటనం జరిగిన కొన్ని సెకండ్లు లేదా నిమిషాల్లో గణనీయమైన విధ్వంసమును సృష్టిస్తాయి.
  • ఆలస్యముగా కలుగు ప్రభావాలు (రేడియోధార్మికత వ్యాప్తి మరియు ఇతర పర్యావరణ ప్రభావాలు) గంటల నుండి శతాబ్దాల వరకు నష్టాన్ని కలిగిస్తాయి మరియు పేలుడు జరిగిన ప్రదేశము నుండి చాలా దూరంలో ఉన్న ప్రదేశాలలో కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.

ఆయుధాల నుండి విడుదలయ్యే శక్తి (కిలోటన్లు లేదా మెగాటాన్లలో కొలుస్తారు), ఉపయోగించిన అణు ఇంధనం రకం, పరికరం యొక్క రూపకల్పన, గాలిలో లేదా భూమి యొక్క ఉపరితలం మీద పేలడం, లక్ష్యంగా ఎంచుకోబడిన భౌగోళిక స్థలం మరియు అది శీతాకాలం లేదా వేసవికాలం, మబ్బుగా లేదా స్పష్టంగా, రాత్రి లేదా పగలు, గాలులతో లేదా ప్రశాంతంగా ఉందా అనేదాన్ని బట్టి అణు పేలుళ్ళ వల్ల కలిగే నష్టం ఆధారపడి ఉంటుంది. కారకాలు ఏమైనప్పటికీ, పేలుడు వల్ల తక్షణమే మరియు ఆలస్యముగా కలుగు ప్రభావాలు పైన చెప్పిన విధంగా అనేక విభిన్న రకాల శక్తిని విడుదల చేస్తాయి. ఇది 50% ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న వ్యక్తి అగ్నిహోత్రమును క్రమం తప్పకుండా అభ్యసిస్తున్న సందర్భంలో కలుగు విధ్వంసం లేదా రక్షణ స్థాయిని కూడా చూపిస్తుంది.

అ. పేలుడు

అణు పేలుడు వల్ల కలిగే నష్టం చాలా వరకు (సుమారు 50%) వేగముతో తాకు తరంగాల ఫలితంగా ఉంటుంది. పేలుడు తరంగ పీడనం అది ప్రయాణించే పదార్థంతో పాటు గాలితో సహా శక్తిని నిక్షిప్తం చేస్తుంది. పేలుడు తరంగం ఘన పదార్థం గుండా వెళుతున్నప్పుడు, మిగిలిపోయిన శక్తిదెబ్బతీస్తుంది.

ఆ. ఉష్ణ వికిరణప్రసారణము

పేలుడుతో పాటు విధ్వంసం యొక్క శక్తిలో సుమారు 30-50% ఉష్ణ వికిరణం వల్ల వస్తుంది. పేలుడు నుండి చాలా మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ, పేలుతున్న బాంబు సృష్టించిన ప్రకాశవంతమైన వెలుగును చూడగలుగుతారు. ఈ రేడియేషన్‌ తీవ్రంగా, ప్రకాశవంతంగా ఉండటంతో పాటు, తీవ్రమైన వేడిని కలిగి ఉంటుంది. పేలుడు మూలం నుండి 7 కి.మీ. దూరంగా ఉన్నప్పుడు కూడా, మూడవ డిగ్రీ కాలిన గాయాలు ఏర్పడతాయి. ఇది చర్మ కణజాలాన్ని పునరుత్పత్తి చేయడానికి అవసరమైన మూల కణాలతో సహా, కణజాల మరణానికి కారణమవుతుంది. శరీరంలో మూడవ డిగ్రీ గాయాలు 25% (లేదా అంతకంటే ఎక్కువ) కాలడం వల్ల, సాధారణంగా నిమిషాల్లో దిగ్బ్రాంతికి గురిచేస్తుంది మరియు తక్షణ వైద్య సహాయం అవసరం.

ఇ. అయొనీకరణం వికిరణము (రేడియేషన్‌)

అణు విస్ఫోటనం అనేక రకాల అణు లేదా అయొనీకరణం రేడియేషన్లను సృష్టిస్తుంది. పేలుడు సంభవించినప్పుడు అణు విభజన మరియు అణు కలయిక జరిగినప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా న్యూట్రాన్లు, గామా కిరణాలు, బీటా మరియు ఆల్ఫా అణువులు ఉత్పత్తి చేయబడతాయి.(1 మెగాటన్‌ పేలుడు విషయంలో, అయొనీకరణం రేడియేషన్‌ ప్రభావం (500 రెమ్స్‌ వద్ద కొలుస్తారు) 3.1 కిలోమీటర్లు ఉంటుందని అంచనా).

1. న్యూట్రాన్లు, పరమాణువుల నుండి విడుదలయ్యే భారీ కణాలు. ఈ చిన్న ‘క్షిపణులు’ ఘన వస్తువుల నుండి సులభంగా చొచ్చుకుపోతాయి.

2. గామా కిరణాలు రేడియేషన్‌ యొక్క చొచ్చుకుపోయే రూపం కలిగిన మరొక శక్తివంతమైన ఫోటాన్లు. ఈ రెండు రకాల రేడియేషన్‌ ప్రాణాంతకం.

3. ఆల్ఫా కణాలు సెంటీమీటర్లు మరియు బీటా కణాలు మీటర్ల పరిధిలో తక్కువ ప్రమాదకరంగా ఉంటాయి.

4. ఆల్ఫా కణాలు జీర్ణాశయములో చేరినప్పుడు హాని కలుగుతుంది.

ఈ. రేడియోధార్మికత సంభవం

భూమి యొక్క ఉపరితలంపై లేదా సమీపంలో పేలిన అణ్వాయుధాల యొక్క ప్రభావం వల్ల రేడియోధార్మికత సంభవిస్తుంది. పేలుడు సంభవించిన వెంటనే, పేలుడు ద్వారా భూమి మరియు శిధిలాల నుండి రేడియోధార్మికత తయారై వాతావరణంలోకి ఒక పుట్టగొడుగు ఆకారంలో మేఘాన్ని ఏర్పరుస్తాయి. ఈ శిధిలాలు వేగంగా క్రిందకి జారి భూమిపై పడి, వేలాది చదరపు మైళ్ళను కలుషితం చేస్తాయి. పేలుడు పెద్దగా సంభవించినప్పుడు, ఎక్కువ ఎత్తుకు, వేగంగా దూసుకొని వెళ్తుంది, మరియు క్రింది వాతావరణంలో తక్కువ నిష్పత్తిలో కూడుకుంటుంది. ఈ ప్రభావం చాలా సంవత్సరాలు ఆ ప్రాంతంలో మరియు దూర ప్రాంతాలలో నివసించేవారిపై ఉంటుంది.

 

3. ఆధ్యాత్మిక పరిశోధన ద్వారా అగ్నిహోత్రము యొక్క క్రియావిధానం

భూమిపై జరిగే అన్ని సంఘటనలు సృష్టిని నిర్మించడానికి ఉపయోగపడిన ప్రాధమిక సూత్రాలైన పంచతత్వాలపై (పంచ భూతాలు) ఆధారపడి ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పంచతత్వాల ద్వారా మాత్రమే విశ్వంలో ఏదైనా సంఘటన సాధ్యమౌతుంది. అణు పరికరం పేలిన సందర్భంలో తేజ తత్వము ప్రధానమైనది.

ఒక అణు పరికరం విస్ఫోటనం అయినప్పుడు, తేజ తత్వము యొక్క రజ-తమ-ప్రధాన ప్రకంపనలకు దారితీస్తుంది. ప్రతికూల సూక్ష్మ శబ్దాలు ఈ ప్రకంపనలతో పాటు ఉంటాయి. ఈ సూక్ష్మ శబ్దాలు అణు దాడి పరిసరాల్లోని ప్రజల మనస్సు మరియు తెలివిపై సూక్ష్మ హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది నిరాశ లేదా ప్రతికూల ఆలోచనల నుండి అస్పష్టమైన బుద్ధిని కలిగి ఉంటారు.

అగ్నిహోత్ర కర్మ చేసినప్పుడు, తేజ తత్వము యొక్క సత్వ-ప్రాబల్య ప్రకంపనలను వృద్ధి చేస్తుంది. అగ్నిహోత్రము నుండి సృష్టించబడిన అగ్ని రజ-తమ కణాలను విచ్ఛిన్నం చేస్తుంది మరియు పర్యావరణాన్ని ఆధ్యాత్మిక స్థాయిలో శుద్ధి చేస్తుంది. ఇది కర్మ చేసే వ్యక్తి చుట్టూ సూక్ష్మ రక్షణ కవచాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ కవచం ప్రకాశవంతమైన వస్తువుల స్పర్శకు చాలా సున్నితంగా ఉంటుంది. సూక్ష్మ స్థాయిలో, ఈ కవచం ఎర్రటి రంగులో ఉంటుంది.

రజ-తమ ప్రధానమైన కణాలు చాలా కఠినమైన ప్రాబల్యాన్ని కలిగివుంటాయి. వ్యక్తి చుట్టూ రక్షణ కవచంగా ఏర్పడిన సాత్వికమైన తేజ కణాలు దీనిని ముందుగానే గ్రహించి, ప్రతి చర్యగా లోపల నుండి తేజ తత్వానికి సంబంధించిన కణాలను రజ-తమ ప్రాబల్య కణాల వైపు అత్యధిక శక్తితో విడుదల చేస్తాయి. ధ్వనిని కలిగించే రజ-తమ ప్రధానమైన తేజతత్వ కణాలను కూడా నాశనం చేస్తాయి. తత్ఫలితంగా అణ్వస్త్రం పేలుడు నుండి విడుదలైన వినాశనాన్ని కలిగించే తేజతత్వ తరంగాల శక్తి బలహీనమౌతుంది.

 

4. ఆధ్యాత్మిక సాధన యొక్క పాత్ర మరియు ఆధ్యాత్మిక స్థాయిలో రక్షణ

ఒక వ్యక్తి జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు ప్రధానంగా వారి ప్రారబ్ధకర్మ ప్రకారం ఉంటాయి. ప్రతికూల ప్రారబ్ధ కర్మను (ఆధ్యాత్మిక సమస్య) అధిగమించడానికి ఉత్తమ మార్గం ఆధ్యాత్మిక సాధన. తగిన స్థాయిలో ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా, ప్రారబ్ధ కర్మను అధిగమించవచ్చు. ఉదాహరణకు, ఒకరికి ప్రారబ్ధ కర్మ మధ్యమంగా ఉంటే, తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన (రోజుకు సుమారు 10-12 గంటలు) మాత్రమే దానిని అధిగమించడంలో సహాయపడుతుంది. ఒకరికి తీవ్రమైన ప్రారబ్ధ కర్మ ఉంటే, గురువు యొక్క దయ మాత్రమే దానిని అధిగమించడంలో సహాయపడుతుంది. ప్రారబ్ధ కర్మ ప్రకారం రాబోయే కాలంలో ఒకరు చనిపోవలసి వచ్చినప్పటికీ, ఆధ్యాత్మిక సాధన కారణంగా కనీసం అతడు / ఆమె మరణానంతర జీవితానికి వెళ్ళేటప్పుడు భయం యొక్క ప్రతికూల అభిప్రాయం సాధకుని మనస్సులో సృష్టించబడదు. ఏ వ్యక్తి ఆధ్యాత్మిక సాధన చేయకపోయినా, అణు ఆయుధం వల్ల జరిగే సామూహిక విధ్వంసం తరువాత బాధపడటం మరియు మరణించడం అతని / ఆమె ఉపచేతన మనస్సుపై భయం అనే గుణాన్ని ముద్రిస్తుంది , దీనిని అధిగమించడానికి కొన్నిసార్లు జీవితకాలాలు పడుతుంది.

 

5. సారాంశం

వివిధ దేశాల్లోని ప్రజలు తమ ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించడంలో సంబంధిత అధికారులు సహాయపడాలని మేము కోరుతున్నాము మరియు దానితో పాటు, అణు మారణహోమం నుండి నష్టాన్ని తగ్గించడానికి అగ్నిహోత్రమును చేయించాలి.

Leave a Comment