డాక్టర్‌ ప్రమోద్‌ మోఘే చేసిన అగ్నిహోత్ర ప్రయోగము యొక్క ప్రభావాలు

డాక్టర్‌ ప్రమోద్‌ మోఘే పూణేలోని నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీస్‌లో రిటైర్డ్‌ సీనియర్‌ శాస్త్రవేత్త. అతను పూణేలో అగ్నిహోత్రముపై ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగము యొక్క పరిణామాలు మరియు ప్రభావాలు అతని స్వంత మాటలలో క్రింద చెప్పబడ్డాయి.

 

1. అగ్నిహోత్రము యొక్క ప్రభావాలు

అగ్నిహోత్రము యొక్క ప్రభావాలను అధ్యయనం చేయడానికి మేము ఉద్దేశపూర్వకంగా అధిక పర్యావరణ కాలుష్యం ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాము, అది రమన్‌ బాగ్‌ హైస్కూల్‌, శనివార్‌ పేట్‌. అగ్నిహోత్రము యొక్క ప్రభావాలను అధ్యయనం చేయడానికి ముందుగా ఈ క్రింది విషయాలను పరిగణలోనికి తీసుకోని నిర్ణయించబడింది. అవి

అ. అగ్నిహోత్రము కారణంగా కాంతి మరియు ఊష్ణగ్రతలో మార్పులు

ఆ. పర్యావరణంలోని సూక్ష్మజీవుల(క్రీముల)పై అగ్నిహోత్రము పొగ యొక్క ప్రభావాలు

ఇ. పర్యావరణంలో వాయు కాలుష్యంపై అగ్నిహోత్రము పొగ యొక్క ప్రభావాలు

ఈ. చెట్లు / లేత మొక్కలు పెరుగుదలపై అగ్నిహోత్రము పొగ మరియు విభూతి యొక్క ప్రభావాలు

ఉ. అగ్నిహోత్రము విభూతి యొక్క ఔషధ లక్షణాలు

ఊ. అగ్నిహోత్రము యొక్క విభూతి, నీటిని స్వచ్ఛంగా ఉంచడము

ఈ ప్రయోగాలు పాఠశాల తరగతి గదుల్లో జరిగాయి. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రధానో పాధ్యాయు – లు ఇందులో హృదయపూర్వకంగా పాల్గొని తమ మద్దతును అందించారు. ఫెర్గూసన్‌ కాలేజీకి చెందిన బయోటెక్నాలజీ ప్రొఫెసరుతో పాటు పూణేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం యొక్క ప్రయోగశాల నుండి కొంతమంది ప్రొఫెసర్లు ఈ ప్రయోగానికి సహకరించారు. ప్రగ్యా వికాస్‌ మంచ్‌ యొక్క ‘FROST’ సంస్థ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది. అన్ని ఆధునిక శాస్త్రీయ పరికరాలను ఉపయోగించి, విజయవంతంగా అగ్నిహోత్రము యొక్క ఈ క్రింది ప్రయోజనాలను ప్రపంచానికి అందించింది.

1 అ. 90% సూక్ష్మజీవుల(క్రీములు) పెరుగుదల ఆగిపోయింది !

అగ్నిహోత్రము నుండి వెలువడే కాంతి శక్తిని లక్స్‌ మీటర్‌ సహాయంతో కొలుస్తారు. చుట్టుప్రక్కల ఉన్న సూక్ష్మజీవులపై అగ్నిహోత్రము యొక్క పొగ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి, యజ్ఞానికి ముందు మరియు తరువాత సూక్ష్మక్రిముల సంఖ్యను లెక్కించారు. ఈ పొగ దాదాపు 90% సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపివేసింది. ప్రయోగం కోసం ఎంచుకున్న ప్రాంతం వాయు కాలుష్యంతో భారీగా కలుషితమైనది. ఏదేమైనా, మంటలు ఆరిపోయిన తరువాత, గాలిలో ప్రమాదకరమైన సల్ఫర్‌ డయాక్స్‌డ స్థాయి పది రెట్లు తగ్గింది. కాలుష్యాన్ని అరికట్టడానికి అగ్నిహోత్రము సహాయపడుతుందని ఇది రుజువు చేసింది.

1 ఆ. లేత మొక్కలు వేగంగా మరియు పెద్ద పరిమాణంలో పెరగడం

మొక్కల పెరుగుదలపై అగ్నిహోత్రము యొక్క ప్రభావాలను అధ్యయనం చేయడానికి కొన్ని మొలకెత్తిన విత్తనాలను అగ్నిహోత్రమును చేయు గదిలో మరియు కొన్ని పాఠశాల వెలుపల ఉంచారు. అగ్నిహోత్రము ప్రభావము లేని ప్రదేశంలో ఉంచిన విత్తనాలతో పోల్చితే అగ్నిహోత్రము నుండి వెలువడిన విభూతి పూసిన విత్తనాలు అగ్నిహోత్ర పరిసరాల్లో ఉంచడము వల్ల మొలకలు వేగంగా మరియు ఎక్కువ సంఖ్యలో పెరిగాయి. అగ్నిహోత్ర కర్మ వ్యవసాయంలో ఎలా ఉపయోగపడుతుందో ఇది రుజువైంది.

1 ఇ. నీటిలో సూక్ష్మక్రిములు మరియు లవణాలు (ఉప్పు)80% నుండి 90% శాతం వరకు తగ్గుట

ప్రయోగం ద్వారా, అగ్నిహోత్రము విభూతి క్రిమినాశక మందు అని గుర్తించబడింది, గాయాలు మరియు చర్మ వ్యాధుల చికిత్సలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అగ్నిహోత్ర విభూతిని నీటిలో కలపడం వల్ల సూక్ష్మక్రిములు మరియు లవణాలను 80 నుండి 90 శాతం వరకు తగ్గించవచ్చు, అందువల్ల ఇది నీటి శుద్దీకరణకు కూడా ఉపయోగపడుతుంది.

అగ్నిహోత్ర కర్మ చేయడం వల్ల, పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను కేవలం 10 నిమిషాల్లోనే పొందవచ్చు. కాబట్టి, రోజు ఈ కర్మ కోసం కేవలం 3 నుండి 5 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా, ప్రతి ఇంటిని కాలుష్య రహితంగా ,సూక్ష్మక్రిములు లేకుండా మరియు స్వచ్ఛమైన త్రాగునీటిని కూడా అందించవచ్చు. ఆ విభూతిని వ్యవసాయంలో కూడా ఉపయోగించవచ్చు. ప్రపంచ శాస్త్రీయ పత్రికలో సాక్ష్యాలు మరియు ఆధారాలతో పాటు మేము దీనిని ప్రపంచానికి నిరూపించగలిగాము. ఈవిధంగా, మన పూర్వ-సాంప్రదాయక శాస్త్రానికి ప్రపంచంలో గౌరవ స్థానాన్ని ఇవ్వగలిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాము.

 

2. ప్రపంచంలోని 70 దేశాలు భారతీయ సిద్ధాంతమైన అగ్నిహోత్రమును అంగీకరించాయి

ఇంతకుముందు నీటి శుద్దీకరణ కోసం వేదాలు సూచించిన 15 మొక్కలను ఉపయోగించడం వల్ల నేను నీటిని మినరల్‌ వాటర్‌ లాగా స్వచ్ఛంగా చేశాను మరియు దాని కోసం ప్రపంచ అధికార పత్రం కూడా సంపాదించాను. కానీ దాని కోసం మనం మన జ్ఞానానికి బానిసలుగా కాకుండా మన స్వంత సంస్కృతిని విశ్వసించడం చాలా ముఖ్యం. ఈ అధ్యయనం సమయంలో జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్‌ఎ, యునైటె్‌డ కింగ్‌ డమ్‌, ఫ్రాన్స్‌, పోలా్‌ండ జెకోస్లావాకియా, జపాన్‌, సింగపూర్‌, పెరూ, ఈక్వెడార్‌, స్విట్జర్లాండ స్పెయిన్‌ మరియు కెనడాతో పాటు 70 దేశాలు భారతీయ సిద్ధాంతమైన అగ్నిహోత్రమును అంగీకరించాయి. వాస్తవానికి, వారు ఈ ఆధారాలను వేర్వేరు నెలవారీ సైన్స్‌ పత్రికలలో ప్రచురించడం ప్రారంభించారు మరియు దాని ఆధారంగా వ్యవసాయానికి ‘హోమా ఫార్మింగ్‌ టెక్నిక్‌’ అని కొత్త పేరును కూడా ఇచ్చారు.

 

3. భారతీయులు తమ సంస్కృతి యొక్క విలువను తెలుసుకోలేక పోయారు

భారతీయ పురాతన శాస్త్రాలైన భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం, విమానశాస్త్రం, లోహశాస్త్రం, నాగరిక కట్టడాల శాస్త్రం, శిల్పశాస్త్రం యొక్క విలువను ఇతర దేశాల శాస్త్రవేత్తలు పూర్తిగా ఉపయోగించుకున్నారు మరియు ప్రపంచ అధికార పత్రాలను పొందారు, దురదృష్టవశాత్తు భారతీయులు ఈ శాస్త్రల యొక్క విలువను తెలుసుకోలేక పోయారు. ఉల్లాసవంతమైన మన భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుంటున్నారు !
మన పురాతన శాస్త్రాలను గురించి పడమటి దేశాల వారు గొప్పగా చెప్పే వరకు భారతీయ శాస్త్రవేత్తలు నమ్మరు. మన సాంస్కృతిక వారసత్వాల విలువను వారు గ్రహించలేక పోవడం నిజంగా దుఃఖకరమైనది.

సేకరణ : hindi.indiawaterportal.org

Leave a Comment